Sunday, March 24, 2013

లంబాడీ సంస్కృతి-విశిష్టత ---పొఫెసర్ సీతారాం నాయక్,కాకతీయ యూనివర్సి



రాష్ట్రంలోని గిరిజన తెగల్లో ముఖ్యమైన లంబాడీలపై దుష్ప్రచారం జరుగుతున్నది. కొన్ని పత్రికలు అభూత కల్పనలతో విష ప్రచారం చేస్తున్నాయి. లంబాడీ తెగ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. సమాజానికి చేరువ కావాలని ఆశిస్తున్న గిరిజనులను ఈ ఆధునిక యుగం అందనంత దూరానికి నెట్టివేస్తున్నది. రాష్ట్రంలో గిరిజన తెగల్లో అధికశాతంగా ఉన్న వీరికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయం, కుల ఆచారాలు ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి, పండుగలు(తీజ్,హోలీ) భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కానీ వీరి ఆచారానికి ఉండే పవివూతతను మరిచిపోయి, వారి సంస్కృతిలో భాగమైన వేషధారణ, నృతాలు, పాటలను విభిన్న రీతులలో చిత్రీకరిస్తున్నారు. లంబాడీల సంస్కృతినీ కించపరుస్తూ, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా రకరకాలుగా పాటలు, నృత్యాలు చేస్తున్నారు. 

‘గుడుంబ కుండ పెట్టకే లంబడోలక్క..., పోలీసులొచ్చి వీపు పలుగకొడతరే అంబడోల్ల అక్క’, ‘లస్కు పాపా... లస్కు పాపా...లంబాడీ’ అంటూ అనేక రకాలుగా పచ్చి వ్యాపార సంస్కృతితో, అశ్లీలంగా పాటలు రాస్తూ, పాడుతున్నారు. ఇలాంటి వాటికి వ్యతి రేకంగా లంబాడీలు పోరాడి, తమ సంస్కృతి ఔన్నత్యాన్ని నిలుపుకోవాలి. లంబాడీల పెళ్లి సంప్రదాయం కింది విధంగా ఉంటుంది.
లంబాడీల ఆచారం ప్రకారంగా పెళ్ళి సంబంధం కుదిరిన వెంటనే(గోళ్ ఖాయే రో) సగాయి (వివాహ నిశ్చయం) అనుకున్న ప్రకారంగా అమ్మాయి లేకా అబ్బాయి ఇంటి వద్ద సాయంత్రం జరుగుతుంది. ఈ కార్యవూకమంలో ఒక రూపాయి నాణాన్ని పంచులకు (పెద్దమనుషులు) చూపించి ఇరు ప్రాంతాల కులపెద్ద నాయక్‌కు ఇస్తారు. దీనిని సాక్యా అంటారు. అంటే సూర్యుని సాక్షిగా సగాయి కుదిరిందని, ఈ రూపాయి సాక్ష్యంగా నిలుస్తుందని అంటారు.

అనంతరం బెల్లం, కుడకలతో నోటిని తీపి చేసుకోవడంతో సగాయి కార్యవూకమం ముగుస్తుంది. పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు ఇంటి వద్ద భండారో, భవానీ పూజ, సాడి కార్యవూకమాలు చేసుకుని పెళ్ళికూతురు ఇంటికి పెళ్ళికొడుకు వెళతాడు. వీరికి తోడుగా లార్యా (తోడు పెళ్ళికొడుకు) సహాయకుడిగా వెళ్తాడు. పెళ్ళికొడుకును వ్యాత్డు అని పిలుస్తారు. పెళ్ళికొడుకు నెత్తికి పాక్డి(వూపత్యేకించి తయారు చేసిన ఎర్ర రుమాలు), రాత్రో పంచేడ(ఎర్ర దుప్పటి), బర్చీ(బల్లెం) ధరించి సైనికుడిగా కనిపిస్తాడు. 

పెళ్ళికూతు రు తల్లిదంవూడుల స్థోమతనుబట్టి పెళ్లి కొడుకు ఒక నెల మొదలుకుని మూడు నెలలు అంతకంటే ఎక్కువ కాలం పెళ్ళికూతురు ఇంటివద్దనే ఉండి ఘోఠా, వాయ, గోట్ అనే(లగ్నం, నాగ వలె)మూడు పవివూతమైన కార్యవూకమాలు వేరు వేరు రోజులలో నిర్వహిస్తా రు. పెళ్ళి తంతు ఇంతకాలం జరగడానికి కారణం కష్టజీవులైన ఈ సంచార యువకులకు విశ్రాంతి, కుల ఆచారాలతో పాటు సత్‌వూపవర్తన, గౌరవ మర్యాదలు ఇవ్వడంతో పాటు నేర్చుకోవ డం జరుగుతుంది.అతనికి అమ్మాయిని పోషించే శక్తి సామర్థ్యం తెలుస్తుంది. గోట్ అనంతరం పెళ్ళి కుమార్తె ధరించే వస్త్రాలు, ఆభరణాలను పేట్‌వా, టుక్రి, కాంచ్లి, మెడ కు హాస్లో, పేటి, చేతికి భాజోబంద్, ముక్కుకు భూరియా, కాళ్ళకు వాంక్డి, కస్ ధరించి కులదేవతలను పోలినట్టుగా ఉంటారు. అత్తవారింటికి పంపించే రోజు ఎద్దుపైన నిలబెట్టి ఇంటివైపు చూస్తూ పుట్టింటి వారికి, ఆ తండాకు శుభం కలగాలని(వడావ్ ) గేయాలతో కులదేవతలను మొక్కుకుంటా రు. 

పెళ్ళి జరిగే రోజుల్లో లంబాడీ కళాకారులు, కవులు ఢప్డియా(డప్పువాయించేవారు) భాట్/ఢాఢి(రబాబ్ అనే సంగీత వాయిద్యాన్ని) ఉపయోగించి చరిత్ర చెప్తారు. దీనికి ముందు గౌరవ సూచకంగా నాయక్ ఇంటిముందు ఢప్డియా, సలా మి డప్డా వాయిస్తారు. ఈ కార్యక్రమాన్ని భాట్ భక్తి గేయంతో ప్రారంభిస్తారు. వీరి తో పాటు తండాలోని స్త్రీ, పురుషులు ప్రతిరోజు నృత్యం(నాచ్), కోలాటం(ధండామారో) కార్యవూకమాలను దేవతల పాటలతో (రామణ్, లక్షణ్ చాలేరే గడేన్) అని మగవారు, (పోరియా గడేతీ అయియే మేరా మా హాతే మోతిరో ఫుల్ )అని ఆడవారు దేవతలను కొనియాడుతూ సాంస్కృతిక కార్యవూకమాలు నిర్వహిస్తారు. 

లంబాడీలు ఇప్పటికే అన్ని రంగాల్లో వెనకబడిపోయారు. కన్న పిల్లలను అమ్ముకుంటున్న కడు దయనీయ పరిస్థితులున్నాయి. గిరిజనులు జీవనోపాధి లేక చేసే పనులనే వారికి అంట గట్టి నీచంగా చూడటం దుర్మార్గం. అమానవీయం. మరోవైపు తండాల్లో విచ్చల విడిగా దొరుకు తున్న సారాయి, గంజాయి లాంటి మత్తు పదార్థాల కారణం గా గిరిజన జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. ఒక సర్వే ప్రకా రం ఒక్క వరంగల్ జిల్లాలోనే దాదాపు పన్నెండువేల మంది మహిళలు వితంతువులుగా మారారు. కొంతమంది లంబాడీలు అద్దె తల్లులుగా మారుతున్నారు.ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలామంది గృహనిర్మాణ కూలీలుగా బతుకులు వెళ్లదీస్తున్నారు. మరికొందరు మత మార్పిడికి కూడా గురవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ‘మా తండాల్లో మా రాజ్యం’అని లం బాడీలు ఎంతో కాలంగా ఉద్యమిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలని డి మాండ్ చేస్తున్నారు.

నాబార్డు కూడా దాదాపు 2500 తండాలను గ్రామ పంచాయతీలుగా చేయవచ్చని నివేదిక ఇచ్చింది. అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో తండాలను గ్రామపం చాయతీలుగా చేస్తామని ఓట్లు దండుకుంటున్నాయి. కానీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడంలేదు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించాలి. ఈ క్రమంలో లంబాడీల సంస్కృతి ఔన్నత్యాన్ని పరి రక్షించుకుంటూనే.. హక్కుల రక్షణకోసం ఉద్యమించాల్సి ఉన్నది. లంబాడీల వివాహాలు, నృత్యాలు, వేషధారణ, సం స్కృతి సంప్రదాయాలను ఎవరు అభాసుపాలు చేసినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. లంబాడీల కళా, సంస్కృతులను కించపరుస్తూ వస్తున్న ఆడియో, వీడియోలను నిషేధించాలి. వాటిని రూపొందించిన వారిపై కఠిన చర్యలు తీసు కోవాలి. సామాజిక అభివృద్ధి ఫలాలన్నింటినీ లంబాడీలకు అందే విధంగా ప్రభుత్వాలు చూడాలి. 

పొఫెసర్ సీతారాం నాయక్,కాకతీయ యూనివర్సి

Namasete Telangana Telugu News Paper Dated : 24/3/2013

No comments:

Post a Comment