Thursday, March 28, 2013

తెలంగాణ ఉద్యమ దశ, దిశ ---హరగోపాల్,



telangana-map
తెలంగాణ ఉద్యమ దశ, దిశను మళ్లీ మళ్లీ అంచనా వేయవలసి రావడం బాధాకరంగా ఉన్నా, ఏ ఉద్యమానికైనా తన గమ్యాన్నే కాక తన గమనాన్ని విమర్శనాత్మకంగా చూడడం, ఆత్మావలోకనం చేసుకోవడం ఒక చారివూతక అవసరం. చాలా ఉద్యమాలు లక్ష్యం మీదే కేంద్రీకరించి, గమనాన్ని సరిగ్గా గమనించకపోవడం వల్ల తీరా లక్ష్యాన్ని చేరుకున్నాక, మనం ఇక్కడికెలా చేరుకున్నాం, ఈ గమ్యానికా మనం చేసిన పోరాటం అని పశ్చాత్తాపపడవచ్చు కూడా.

భారత స్వాతంవూత్యోద్యమంలో సర్వస్వం త్యాగం చేసిన వారు, ఇప్పటి ఈ దేశ పరిస్థితులను చూసి చాలా బాధపడుతున్నారు. కాళోజీ చాలా సందర్భాల్లో ఆ మాట అంటూ కన్నీళ్లు పెట్టుకునేవాడు. వావిలాల గోపాలకృష్ణయ్య ఆరోగ్యం క్షీణించినప్పుడు చూడడానికి వెళితే నేను అక్కడ కూర్చున్నంత సేపు, దేశ పరిస్థితిని గురించి ఏడుస్తూనే ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఆయనను చూడడానికి, మాట్లాడడానికి వచ్చానని గుర్తుచేసినా ఏడవడం మానలేదు. సరే తెలంగాణ ఉద్యమాన్ని స్వాతంవూత్యోద్యమంతో పోల్చడం ఎంత వరకు సబబో తెలియదు. కానీ తెలంగాణ ప్రజలకు రాబోయే తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా చాలా ఆశలున్నాయి. ఇవన్నీ నెరవేరతాయని కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితి కంటే మెరుగైన తెలంగాణ నిర్మించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందుకే గమనాన్ని కూడా అంచనా వేయాలి. 

నిజానికి ఈ వ్యాసం మిత్రుడు పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి ‘నమస్తే తెలంగాణ’లో రాసిన ‘సమష్టి చైతన్యమే సడక్‌బంద్’ అనే వ్యాసాన్ని చదివిన తర్వాత తప్పక స్పందించాలనిపించింది. రాఘవాచారి క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన బలమైన ప్రజాస్వామిక గొంతుక. చాలా స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం కలిగి, అన్ని సమస్యలను సూక్ష్మంగా పరిశీలించి, స్థూలమైన భావాలను వ్యక్తీకరించగలిగిన కొద్దిమంది క్షేత్రస్థాయి మేధావులలో ఆయన ఒకడు. ఎందుకో ఆయన వ్యాసంలో ఒక ఆవేశం, ఒక తొందరపాటు కనిపించింది. తెలంగాణ రాష్ట్రాన్ని అతి త్వరగా సాధించుకోవాలి అనే తపన ఉంది. ఆ ఆవేశంలో ఎలాంటి తెలంగాణ అనే ప్రశ్న, అనుమానం వ్యాసంలో స్పష్టంగా వ్యక్తపరచలేదు. ఒక సునిశిత పరిశీలకుడు ఎందుకు ఇంత ఆవేశంగా భౌగోళిక తెలంగాణ గురించి ఆందోళన పడుతున్నాడు అనిపించింది. నాకు కూడా తెలంగాణ రాష్ట్రం త్వరలో ఏర్పడితే బావుండు అని మనసులో బలంగా ఉంది. 

కానీ ఆ తెలంగాణ మానవీయంగా, ప్రజాస్వామికంగా, పేద వూపజల పక్షాన, మతాతీత సంబంధా లు బలపడి, రాష్ట్రంలోని మైనారిటీలు కూడా ఆ రాష్ట్రం తమ రాష్ట్రమని, తాము ఏ పరిస్థితిలో కూడా భద్రంగా సమానమైన పౌరులుగా పరిగణింపబడతామనే విశ్వాసం వాళ్లలో ఉండాలి. అన్ని జీవన రంగా ల్లో మైనారిటీలు క్రియాత్మకంగా పాల్గొనేలా సామాజిక సంబంధాలు ఎదగాలి. నిజానికి తెలంగాణ ప్రాంతానికి ఆ గొప్ప వారసత్వముంది. ఆ వారసత్వ పునాది మీదే పునర్ నిర్మాణం జరగాలి. ముస్లిం మతతత్వ రాజకీయ నాయకులు కొంత సంకుచితంగా ఆలోచిస్తున్న మాట వాస్తవమే. తెలంగాణలో ముస్లిం ల మీద తమ పట్టు తప్పుతుందేమో అన్న అనుమానం వాళ్లకుంది. సాధారణ ముస్లింలలో ఆ అనుమానం బలపడకుండా ఉద్యమం చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఎందుకో రాజకీయాలు ఆ దిశలో సాగుతున్నట్లుగా అనిపించడం లేదు.

తెలంగాణకుండే పోరాట చరివూతలో బందగీ, షోయబుల్లాఖాన్‌ల త్యాగం సమ ష్టి జ్ఞాపకంలో మెదులుతూనే ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం లో ముస్లిం మతతత్వ రాజకీయాలని, రజాకార్లను ఎదిరించిన అనుభవంతో పాటు ఒక సమష్టి సమాజ స్వప్నం ఆ పోరాటంలో ఉంది. తెలంగాణ ఒక గాయా ల వీణ అన్నప్పుడు ఉద్యమాల ఆటుపోటులన్న ఆ వ్యక్తీకరణలో ఉన్నాయి. ఇప్పటి ఉద్యమంలో ఆస్ఫూర్తి కంటే, మతతత్వ భావజాల ప్రభావం పెరుగుతున్నది. రెండు మతతత్వ పార్టీలు మరింత బలాన్ని పెంచుకుంటున్నాయి. అయితే ఎన్నటికైనా మైనారిటీ మతతత్వం కంటే మెజారిటీ మతతత్వం ప్రమాదకరమైంది అని నమ్మేవాళ్లలో నేనొకడిని.

మెజారిటీ మతతత్వం వెనక రాజ్యం కూడా ఉంటుంది. కనుక అది ఎక్కువ ప్రమాదకరం. ఇది మనం గుజరాత్‌లో స్పష్టంగా చూశాం. తెలంగాణలో బలపడుతున్న బీజేపీ ప్రధాన నాయకులు తెలంగాణ పోరాట స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ రాష్ట్ర బీజేపీ భిన్నంగా ఉం టుంది అన్న కనీస విశ్వాసాన్ని కలిగించే బదులు మొత్తం చరివూతను వెనక్కి నెట్టడానికి కష్టపడుతున్నారు. పార్టీ బలపడుతున్నకొద్దీ ఇంకా చాలామందిని, అన్ని వర్గాలను కలుపుకపోవాలి అని ప్రయత్నించే బదులు, తెలంగాణ బీజేపీ నాయకులు నరేంవూదమోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారు. తెలంగాణపై నరేంవూదమోడీ వ్యక్తిగత అభివూపాయాలేమిటో మనకు తెలియదు. ఆయన తెలంగాణ గురించి ఎక్కడా మాట్లాడినట్టు తెలియదు. ఆయన గుజరాత్ రాష్ట్ర అస్మిత గురిం చే మాట్లాడాడు. నిజానికి తెలంగాణ గురించి చాలా స్పష్టంగా కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడిన బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్. 

ఆమె గురించి బీజేపీ నాయకులు ప్రస్తావించడం కూడా లేదు. కనీసం బీజేపీ నాయకత్వ సమ స్య ఎన్నికలైన తర్వాత పార్టీ నిర్ణయిస్తుంది అన్న కనీస ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా లేకుండా సరాసరి నరేంవూదమోడీ తమ నాయకుడని ప్రకటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి, ఈ ఉద్యమానికి నరేంవూదమోడీ ప్రధాని కావడాని కి ఏం సంబంధమో మనకు తెలియదు. బీజేపీ నుంచి మరెవరైనా ప్రధాని అయి తే తెలంగాణ ఇవ్వదా? అది పార్టీ నిర్ణయమే అయినప్పుడు ఎవరు ప్రధాని అయి తే ఏం అని అనకపోవడం, నరేంవూదమోడీ ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు గుజరాత్‌లో జరిగిన మారణకాండను పరోక్షంగా సమర్థించడమే అవుతుంది. ఆ రాజకీయాలు తెలంగాణకు ఎలా ప్రయోజనం అన్న ప్రశ్నకు జవాబు రావలసే ఉన్నది.

ఒక టీవీ చానల్ నిర్వహించిన కార్యక్షికమంలో గుజరాత్‌లో జరిగిన మారణకాండకు మీరు విచారిస్తున్నారా అని అడిగితే, ఆ ప్రశ్న మళ్లీ మళ్లీ ఎలాగూ అడగబోతారు కాబట్టి దానికి నేను ఇప్పుడు సమాధానం చెప్పను అని దాటవేశాడు. ఒక వ్యక్తి ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో శాంతిభవూదతలు పూర్తిగా విఫలమై ప్రాణ నష్టం జరిగితే బాధపడకపోవడమేమిటి? చాలామంది మారణకాండకు ముఖ్యమంత్రి ఎలా బాధ్యుడు? న్యాయస్థానాలు కూడా ఆయనను తప్పుపట్టలేదు అని అంటున్నారు. ఆయన బాధ్యతా కాదా అని కాదు తన రాష్ట్రంలో అంతమంది మనుషులు (వాళ్లను మనుషులు అని ఆయన భావిస్తే) చనిపోతే కనీస మానవీయ స్పందన ఉండాలి కదా. ఒక రైలు ప్రమాదం జరిగితే లాల్‌బహదూర్ శాస్త్రి తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. రైలు ప్రమాదానికి శాస్త్రి ఎలా కారణమౌతాడు అని ఎవరైనా అంటే మన జవాబు ఏమిటి?

గుజరాత్ మొత్తం అభివృద్ధి నరేంవూదమోడీ వల్లే జరిగిందనే ప్రచారం ఎంత విచిత్రం! అభివృద్ధి ఆయన వల్ల జరిగింది, కానీ మారణకాండకు ఆయన బాధ్యు డు కాడు అనేది ఎంతవితండవాదం. గుజరాత్ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. గుజరాతీలు వ్యాపారంలో చాలా అనుభవమున్నవారు. 1970లో నేను అమెరికాలో ఏమాత్రం ఇంగ్లిష్ భాషా జ్ఞానంలేని గుజరాతీ మహిళలు చాకచక్యంగా వ్యాపారం చేయడం చూ శాం. ఒక రాష్ట్ర అభివృద్ధికి ఒకే ఒక వ్యక్తి కారణం అనడం చాలా అప్రజాస్వామికం. ఒక వ్యక్తే అభివృద్ధిని సాధించగలడు అంటే సాయిబాబా ఉంగరం లాంటి భ్రమే.

గుజరాత్ అభివృద్ధికి నరేంద్ర మోడే కారణం అని అనుకున్నా, ఆ నమూనా దేశానికి మొత్తం వర్తిసుం దా, వృద్ధిరేటు పదకొండు శాతమో, పద్నాలుగు శాత మో అనుకున్నా, ఆ వృద్ధిరేటులో మనుషుపూక్కడు న్నారు? మన దేశవృద్ధి రేటు పెరుగుతూ ఉంటే మానవాభివృద్ధి (Human Development) రేటు తగ్గుతున్నది. ఈ మధ్యే ప్రచురించిన ‘మానవాభివృద్ధి’ 2013 నివేదికలో ప్రపంచంలోని దేశాల్లో మనం132, 133 వ స్థానంలో ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో లక్షలాది సంఖ్యలో కుదించా రు. సంక్షేమ రంగం నుంచి రాజ్యం పారిపోతున్నది. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవే టు పరమవుతున్నది. అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యవసాయ, వాటా మొత్తం జాతీయాదాయంలో 13.5 శాతానికి తగ్గిపోయింది. అంటే 60 కోట్లమంది గ్రామీణ ప్రజలు 13 శాతం ఆదాయం మీద బతికితే, 20 మంది పారిక్షిశామికవేత్తల వాటా 22 శాతం. ఈ 22 శాతం సంపదను అనుభవిస్తున్న వాళ్లు గుజరాత్ అభివృద్ధి నమూనాను సమర్థిస్తున్నారు.

తమ మీడియా ద్వారా 24 గంటలు ప్రచారం చేస్తున్నారు. కోట్లాదిమంది నిరుపేదల గురించి మాట్లాడడం ఎందుకు మానేశారు? నిజానికి తెలంగాణ పోరాటాలు గతంలోనైనా ఇప్పటిడైనా ఈ ప్రశ్నలు ముందుకు తెస్తూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలను వాటితో పాటు శ్రామిక ప్రజలను, రైతాంగాన్ని తెలంగాణ రాష్ట్ర ఉద్యమం విస్మరించకూడదు. పోరాట వారసత్వ పునాదుల మీద నిర్మాణమైన తెలంగాణ ఉద్యమంలోను ఎక్కి వచ్చిన నిచ్చెనకు కిందికి తోయకూడదు. రాఘవాచారి లాంటి విద్యావంతులు తెలంగాణ గురించి ఆవేశంగా రాసేటప్పుడు ఈ ప్రశ్నలను సజీవంగా ఉంచాలి. పాలమూరు కరువులో పెరిగిన మనం కూడా ఈ ప్రశ్నలను విస్మరిస్తే నరేంద్రమోడీని, ఆయన నమూనాను సమర్థించే చేరుకునే ప్రమాదముంది. 

పొఫెసర్ జి. హరగోపా


Namasete Telangana Telugu News Paper Dated: 28/03/2013

No comments:

Post a Comment