కాశెవోసి కొంగుబిగించి కొడవలి చేతవట్టి తెలంగాణ కోతల
‘మునుం’ పట్టింది. ఇది తెలంగాణను సమెక్యవాద ముసుగు లో దోచుకుంటున్న
సీమాంధ్ర పెట్టుబడిదారుల, పాలకవర్గాల ఆధిపత్య అహంకారాలమీద, తెలంగాణ
పాలకవర్గాల దళారీతనంమీద పట్టిన కోతల మునుం.ఈ మునుం మూడు భిన్న కథల్లో
కొనసాగింది. పొలం చదును చేసి, బిగిసిపోయిన కొయ్యకాళ్ల నూడబెరికి వ్యవసాయ
యోగ్యం చేయడానికి సాగిన కాలం ఒక కథ. కన్నీళ్ళు, వేదన, నిస్సహాయతల కాలం అది.
మునుం పట్టి నాట్లువేసి, నీరుపోసి పంటను పెంచి న కాలం రెండవ కథ. ఈ కథ
ప్రధానంగా తెలంగాణ పురావైభవాన్ని, చారివూతక, సాంస్కృతిక ఔన్నత్యాన్ని
ఎత్తిపట్టిన కాలం. ఇక చివరి కథ పోరాటాల మునుం కాలం.
భూస్వామ్య ఆస్తి సంబంధాలను ధ్వంసంచేసి, శ్రమను విముక్తంచేసి మార్కెట్టును వ్యాప్తిచేస్తూ పెట్టుబడి శ్రమల మధ్యవున్న సంబంధాన్ని నిరంతరంగా వృద్ధిచేస్తూ వుండే రాజకీయార్థిక నిర్మాణాన్ని పెట్టుబడిదారీ విధానం అంటున్నం. పెట్టుబడిదారీ వర్గం పెరుగుతున్న క్రమంలో, పోటీకూడ పెరిగిన ఫలితంగా మార్కెట్టు మరింత వ్యాపించి భూస్వామ్య సంబంధాలను నిరంతరంగా ధ్వంసం చేయాలి. జాతిరాజ్యాలు బలంగా వుండడంవల్ల ఈ పరిణామం మొత్తం తన రక్షిత భౌగోళిక ప్రాంత పరిధిలోనే జరగాలి. ఇట్లా మార్కెట్టు కుంచితమైపోవడం ద్వారా లాభాలు తగ్గిపోవడం వల్ల పారిక్షిశామిక పెట్టుబడి వాణిజ్య పెట్టుబడిగా, ద్రవ్యపెట్టుబడిగా రూపాంతరం చెందింది. గుత్తాధిపత్య లక్షణాలు సమకూర్చుకున్న ద్రవ్యపెట్టుబడికి మరింత అదనపు విలువను పొందడానికి నూతనమ్కాట్ల వేట అవసరమైంది. పెట్టుబడి పూర్వవిధానాలు కలిగిన నూతన మార్కెట్లు పెట్టుబడి నిలదొక్కుకోవడానికి, బలపడడానికి కావాల్సిన అన్ని వసతులు సమకూర్చాయి. చౌక శ్రమ, అసాంఘిక నిర్మాణం లో వ్యాపారం, సరుకులు అమ్ముకోగలగడం ముడిసరుకుల వెలికితీత, ద్రవ్య స్పెక్యులేషన్, పెట్టుబడులుపెట్టే అవకాశం కల్పించాయి. పెట్టుబడిపూర్వ సమాజంలో ప్రవేశించే అంతర్జాతీయ పెట్టుబడి శ్రమశక్తి, ఉత్పత్తి సాధనాలలో మార్పుల ద్వారా కాకుండా, ఉత్పత్తి విధానంలోని మార్పులతో సంబంధంలేని కొత ్తసరుకులను ప్రవేశపెట్టింది. ఉత్పత్తుల ప్రక్రియ కంటె చెలామణి ద్వారా మిగులు పోగుచేసుకోవడానికి సిద్ధపడడం వల్ల అది స్థానిక పాలకవర్గంతో సహజీవనం చేయవలిసి వచ్చింది.
భూస్వామ్య వ్యవస్థను కూలదోయకుండా దానితో రాజీ కుదుర్చుకుంది. ఉత్పత్తిశక్తులు, ఉత్పత్తి సంబంధాలు ఈ రెండు వ్యవస్థల లక్షణాలు కలిగివుండి, భూస్వామ్య వ్యవస్థ ఉపరితలం బలోపేతమైంది. అంతర్జాతీయంగా మరింత విస్తరించింది. ఇదే మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ కొనసాగుతున్న అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థ. తొంభయవ దశకం ఆరంభం నుంచి భారత వూపభుత్వం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలతో నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టింది. మార్కెట్టు వృది ్ధకోసం, ఎగుమతుల వృద్ధి కోసం సామ్రాజ్యవాద దేశాలు మన దేశంమీద రుద్దిన ప్రక్రియ ఇది. భారతదేశంలో దోపిడీ కొనసాగించడానికి, యథాతథ స్థితిని కొనసాగించడానికి భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదంతో వున్న మైత్రి వల్ల ఏ ఆటంకం లేకుండా ఈ ప్రక్రియ మనమీద రుద్దబడింది. పర్యవసానంగా బహుళజాతి సంస్థలతో కలిసి భూస్వాము లు, ధనిక రైతులు చిన్న, సన్నకారు రైతుల నుంచి భూముల్ని హస్తగతంచేసుకొని వాళ్ళను రైతుకూలీలుగా మార్చారు. వీళ్ళు ఆ భూముల్లో అధిక భాగాన్ని పడావు పెట్టడం వల్ల, వాణిజ్య పంటలకు వినియోగించడం వల్ల దేశంలో ఆహార కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని అంటాయి. స్థూల జాతీయఉత్పత్తిలో వ్యవసాయోత్పత్తి 1980లో 39శాతం వుంటే, 2010 నాటికి అది 15 శాతానికి పడిపోయింది. ఆ రకంగా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామీణ చేతివృత్తులు మొత్తంగా ధ్వంసమైనవి. ఇట్లా లక్షలాది ప్రజలు తమ భూముల నుండి, వృత్తినుండి, నైపుణ్యం నుండి విడుదల చేయబడి నిరుద్యోగులుగా మిగిలారు. అట్లా ఒక అసంఖ్యాకమెన రిజర్వుడ్ పారిక్షిశామిక సైన్యం ఏర్పడింది. దేశీయంగా పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ కలగాపులగపు వ్యవస్థలో దానికవసరమైన నైపుణ్యంలేని కారణంగా జీవనోపాధి దొరకక ఈ ప్రజలు సమాజపు అట్టడుగు పొరల్లోకి ఇంకిపోయారు. దాని పర్యవసానమే మితిమీరిన పట్టణీకరణ. దాని పర్యవసానమే అసంఖ్యాకమెన రైతుల, రైతుకూలీల ఆత్మహత్యలు. ఇట్లాంటి సామాజిక భౌతిక పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ ఉద్య మం తలెత్తితే, దాన్ని ఒకాయనకు మంత్రి రాకపోవడం వల్లనో, మరొకాయనకు రెండవసారి వీసీ పదవి రాకపోవడంవల్లనో మొదలైన ఉద్యమంగా చూడడమంటే వ్యక్తివాద, భావవాద ధృక్పథమే.
రెండు అసమ సమాజాల్ని బలవంతం గా కలపడం వలన పాశ్చాత్య పెట్టుబడిదారుల పాలనలో వున్న సీమాంవూధులు అమాయక తెలంగాణ ప్రజలను అన్నివిధాల దోచుకోవడం మొదపూంది.‘ఢిల్లీపెత్తనానికి సీమాంధ్ర పెత్తందార్లకు పుట్టిన అక్రమ సంతానం ఆంధ్రవూపదేశ్’’ (ఉదయమిత్ర) పెద్దమనుషుల ఒప్పందాన్ని, తెలంగాణ రీజనల్ కమిటీని తుంగలో తొక్కి వేల ఎకరాల భూముల్ని కబ్జా చేసుకున్నరుపాజెక్టుల్లో భూములు కోల్పోయిన వాళ్ళు కూలీలుగా మారితే, నీటివూపవాహాలకు ఎదుక్కి వచ్చిన సీమాంవూధులు భూ యజమానులైనరు.1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినంక బాహాటంగానే హైదరాబాదు చుట్టుపక్కల వేలఎకరాల్ని కబ్జా చేసుకున్నరు. ఒక్క తెలంగాణలోనే కాదు ఒరిస్సాలోని హీరాకుడ్ ప్రాజెక్టుకింద కూడ వీళ్ళ నిర్వాకం ఇదే. అక్కడెనా, ఇక్కడెనా అక్రమంగా సంపద పోగు చేసుకోవడం, స్థానికులను ద్వితీయక్షిశేణి పౌరులు గా దిగజార్చడం, వారి వేష,భాషల్ని, సంస్కృతుల్ని అవహేళన చేయ డం, తద్వారా అణచివేతను కొనసాగించడం సీమాంధ్ర పెట్టుబడిదారుల నైజం. ఇట్లా నయావలసవాదం, అంతర్గత వలసవాదం దాని పెంపు డు బిడ్డ అయిన సామ్రాజ్యవాద సంస్కృతి తెలంగాణను పరాయీకరణకు గురిచేసింది. అందుకనే తెలంగాణ కవులు ఈ పరాయీకరణ విషపు కోరల్లో నేనొక్కన్నేనా?అని తమను తాము ప్రశ్నించుకున్నరు. విధ్వంసాన్ని వేదనతో వ్యక్తీకరించిండ్రు.‘నెలలు నిండని శిశువుల కన్న ప్రపంచీకరణ’ సోయి తోటే చేసింవూడని చెప్పలేం కాని, పరిణామాలను అర్థం చేసుకున్నరు.‘ఇంతచేస్తే!/రాళ్ళు జీల్చినోళ్ళకు గూళ్ళు లేవు ఇటుకలు చేసినోళ్ళకు ఇండ్లు లేవు/గొర్రెలుగాసినోళ్ళకు గొంగళ్ళు లేవు’ (రామగిరి శివకుమార శర్మ) ‘వెలుగుపంట దిగుబడి పెంచేందుకు పెంటగా మారిన పల్లెల’ దుస్థితిని చిత్రీకరించినరు(సదాశివుడు).‘మంచీచెడు అర్సుకోలేని సిమెంటు మనుషుల’ పట్నం నుంచి తమ వూరెల్తున్న కల కంటనే వున్నరు’(బెల్లి యాదయ్య).వ్యవసాయరంగం కుదేలవ్వడానికి కారణం తలాపున పారుతున్న గోదావరి, తెలంగాణ కాళ్ళ కడాలె చుట్టుకున్న కృష్ణ నీళ్ళను సీమాంవూధులు కుట్ర పూరితంగా దోచుకోవడం వల్లనేననే సోయి తెలంగాణ కవులకొచ్చింది. ‘భూమి బ్లాంక్ చెక్, నీళ్ళు విలువను రాస్తయ్ నీళ్ళు లేక కాదు, నీతిలేక బ్లాంక్ చెక్ నా తెలంగాణ’ (సుంకిడ్డి నారాయణడ్డి)‘కె.ఎల్.రావుకు నీళ్ళొదులుదాం తిలోదకాలతో సహా అతనొక కుట్రదారు’(అల్లం నారాయణ) ‘తలాపున నదులున్నాపొలాల నవ్వులు నగుబాటైన వైనం (ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్)‘సమక్షిగతకింద సాగుకాని చెలక’గా మిగిలిపోయిన తెలంగాణకు’తిండిగింజలు దొరకకపోవడం ఈ శతాబ్దపుకువూటగా గుర్తించింవూడు (బియ్యాల జనార్దన్ రావు). సామ్రాజ్యవాద సాంస్కృతిక దాడికి, అంతర్గత వలసవాదుల దాడికి పరాయీకరించబడ్డ తెలంగాణ తన అస్తిత్వాన్ని పలవరించింది. ‘భాష ఒక ముట్టిచ్చిన దీపం, భాష ఆత్మల అనుసంధానం ఆరాట పోరాట విరాట్ స్వరూపాల అమ్మలగన్నయమ్మ భాష యాసేడిది....తెలంగాణ ఒక జీవద్భాష’ (అల్లం నారాయణ) మరి అట్లాంటి భాషమీద మాట్లాడడానికి కూడ భయపడేంత హీనత్వాన్ని ఎట్లా రుద్దిండ్రు?’బందిపోట్లయినా బాగుండేది, సర్వసంపదలను ఒలిచియిచ్చి సంస్కృతినెనా దక్కించుకునేవాళ్ళం’ అన్నంత దీనస్థితికి ఎట్లా నెట్టింవూడు(జయధీర్ తిరుమలరావు).‘ఏ పదబంధ ప్రబంధంలోనూ నా యాసలేదు బాసలేదు
వాక్యం నా పలుకు వల్లించదు, అక్షరాల్లో నా నుడికార శబ్దంలేదు నా భాషనే ఆంబుక్క పెట్టిన నీవు జీవశ్వాస ను బంధిస్తున్న దేవేందర్).
ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచీకరణ పడ తన్ను తాను ఆంధ్రవూపదేశ్‌కు సీయీవోగా ప్రకటించుకున్న చంద్రబాబు విజన్2020 అంటూ అభివృద్ధి నమూనాను దిగుమతి చేసుకుండు. భారీవూపాజెక్టులు,అంతర్జాతీయ విమానాక్షిశయా లు, ఆరులేన్ల రోడ్లు, తృతీయ ఆర్థికరంగమైన సేవారంగపు అసమానవృద్ధి అభివృద్ధికి చిహ్నాలుగా చెప్పుకున్నడు. ఆర్థిక ప్రథమ రంగమైన వ్యవసాయం పనికిరాదని తూలనాడిండు. ఉత్పత్తితో ప్రత్యక్ష సంబంధం లేకుండా డబ్బు సంపాదించవచ్చనే భావజాలాన్ని పెంచిపోషించిండు (స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్‌లా గా). అభివృద్ధి అంటే ఒక సమాజంలోని ప్రజ లు ఎదుర్కొనే సమస్యలకు సమాధానం వెతికే క్రమం కాక, అభివృద్ధి చెందిన దేశాలలోని కార్యక్షికమాల అనుకరణే అభివృద్ధిగా చిత్రించిం డు. మార్క్సిస్టు శాస్త్రీయ అవగాహన ప్రకారం నిర్మాణం-విధ్వంసం అభివృద్ధికి విడదీయలేని రెండు పార్శ్వాలు. విధ్వంసంలో విస్థాపనకు గురైన ప్రజలు నిర్మాణంలో ఇమిడిపోయినప్పుడే అది అభివృద్ధి అవుతుంది. కాని తెలంగాణలో అట్లా జరుగలేదు. ప్రాజెక్టులకోసమో, సెజ్‌ల కోసమో భూముల్నుంచి బేదఖల్ చేయబడ్డవాళ్ళు రోజు కూలీలుగా మారిండ్రు. వృత్తుల నుంచి విస్థాపనకు గురైనవాళ్ళు పట్టణంలో అడ్డాకూలీలుగా, బిచ్చగాళ్ళుగా మారిండ్రు. కొండొకచో విప్లవీకరించబడ్డరు. కొన్నిచోట్ల సంఘ వివూదోహ శక్తులుగా మార్చబడ్డరు.ఈ క్రమాన్ని మన కవులు సరిగ్గానే ఒడిసి పట్టుకున్నరు.‘తెలంగాణ పల్లెకు సర్కారికి వొక బ్యారం కుదరని యాపారం’ నడుస్తుందనే విషయాన్ని గమనిస్తనే వున్నరు(వడ్డెబోయిన శ్రీనివాస్). ‘ప్రాంతేతరునికే నల్లబంగారం, గని సంపదను దోచుకెళ్ళడం, మోసుకెళ్ళడమే ఆధునిక రాజ్యంలో అసలైన అభివృద్ధి’గా చెలామణీ అవుతున్న వైనాన్ని గుర్తిస్తనే వున్నరు (పిట్టల రవీందర్).
కన్నీళ్ళు తుడుచుకొని, గోసి సరిచేసుకొని, గొంగడి భజాన వేసి అతా ర చేతవట్టింది తెలంగాణ. ‘భవూదకాళి చెరువు లో రుద్రమ దాచిన తల్వార్’ తడిమి చూసింది (జగన్‌డ్డి). హైదరాబాదును ఎకరాలు గా, గజాలుగా అమ్ముకుంటున్న నయా వలసపాలకులను తాలిబన్లుగా చిత్రిస్తూ ప్రేమవారధి పురావైభవాన్ని కవులు కీర్తిస్తున్నారు (లోకేశ్వర్). తనకు ‘సామాజిక ఉద్యమాల ఓనమాలు దిద్దించిందని’(ఎస్వీ సత్యనారాయణ),’ మొహంజాహి బంగారు పూలజడ’ (షాజహాన), ‘వేదనలు వైరుధ్యాలు ఎన్నివున్నా అనుబంధాల నగరమ’ని(లోచన్) హైదరాబాద్ వైభవాన్ని కీర్తిస్తనే వున్నరు.తెలంగాణలోని అనేక సాంస్కృతిక ప్రత్యేకతల్ని ఎత్తిపడుతున్నరు. ఏడుపాయల జాతరను(యం.డి.అహ్మద్),నిర్మల్ రంజన్‌లను (మునిమడుగుల రాజారావు),పాలమూర్‌లేబర్ ఓపికను(లింగాకారి మహేష్),ఆదిలాబాద్ అమాయకుల ఔన్నత్యాన్ని(అప్పాల చక్రధారి) గానం చేస్తున్నరు.‘బత్కుమీదికన్న మనిషిమీదికన్న మట్టిమీన్నే పావురం’ (సూటెంకి రవీంద్ర) అంటూ’ యుద్ధాన్ని నేర్పిన ఈ మట్టికి’(జూలూరు గౌరీశంకర్) ఘనమెన చరిత్ర వున్నదని చెప్తున్నరు.‘యుద్ధంలో రాలిపడిన బొడ్డుమల్లె లేత నవ్వులపై పూసిన సూర్యకిరణం నా తెలంగాణ’ (కాశీం) అని కీర్తిస్తున్నరు.పోరాటాల వారసత్వ ప్రతీకలైన సమ్మక్క, సారక్క, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, బందగీ, తుపూరేబాజ్‌ఖాన్, మగ్దూం,షోయబుల్లా ఖాన్, నల్లా ఆదిడ్డి, సంతోష్‌డ్డిలను గుర్తుచేసుకుంటున్నరు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా నిలిచిన బతుకమ్మ స్ఫూర్తిని గానం చేస్తున్నరు.
ఈ పుష్కర కవిత్వంలో తెలంగాణ గ్రామీణ భాషను, నుడికారాన్ని కవులు ప్రతిభావంతంగా వాడుకున్నరు. హైదరాబాద్‌లో స్థిరపడ్డవాళ్ళకంటె చిన్నపట్టణాలో ్లవున్న కవులే ఈ పని ఎక్కువగా చేసిండ్రు. సీమాం ధ్ర కవులు సంఘీభావంగా రాసిన కవిత్వమూ ఇందులో ఉంది. సీమాం ధ్ర దళిత కవులు, విరసం మిత్రులు తప్ప మిగిలినవారు మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్టు చేస్తున్నారా? చేస్తే ఉద్యమంలో భాగస్వాములు కావాలికదా!నోటితో పొగిడి నొసటితో వైఖరుల పట్ల తెలంగాణ అప్రమత్తంగా ఉండాలి. పోతే, కె.శ్రీనివాస్ ముందుమాటలో ‘ఆధునిక ప్రయోగశైలిలో, శిల్పంతో తెలంగాణవాద కవిత్వం రాయడం సాధ్యం కాదనిపిస్తుంది. అట్లా వచ్చిన కొన్నికవితలు సానుభూతిపరుపూన ప్రాంతేతరులు రాసిందే కావడం విశేషం’ అన్నాడు. ఈ వాక్యాలు ఒకదానికొకటి వైరుధ్యంగా వున్నయి. అతను చెప్పదలుచుకన్నదేమిటోబోధపడడంలేదు. అట్లే తెలంగాణలో మధ్యతరగతి ఒక శ్రేణి గా రూపుదిద్దుకోకపోవడం 1969లో అయితే కావచ్చుగాని, 2012లో ఆ పరిస్థితి ఉందనుకోను. మరింత చర్చ జరగాలి. ఇక సంపాదకుల ముందు మాటలో ‘1946 నుంచి ఎనిమిదేళ్ళుగా ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగిన’ అని రాశారు. ఎంతగింజుకున్నా 1948 సెప్టెంబర్ 18నుంచి వెల్లోడి గవర్నర్‌గా కొనసాగిన కాలమనుకోవచ్చు కాని,1946 అయ్యే అవకాశం ఏ కోశాన లేదు. శిల్పరీత్యా పలుచనైన కవిత్వాన్ని ఇందులోంచి మినహాయిస్తేనే బాగుండేది. పుష్కరకాల కవిత్వాన్ని సంకలనం చేయడంలోని శ్రమని, పరిమితుల్ని గుర్తించి సంపాదకులను అభినందించాలె. తెలంగాణ ఉద్యమంలో ‘మునుం’ మైలురాయి.

-డాక్టర్ కాసుల లింగాడ్డి
సెల్: 9948900691
సెల్: 9948900691
No comments:
Post a Comment