Thursday, March 22, 2012

హక్కులడిగితే అణచివేతేనా?---ఆకుల భూమయ్యJaill talangana patrika telangana culture telangana politics telangana cinema

నేడు షహీద్ భగత్‌సింగ్‌ను ఉరితీసిన రోజు.యావత్ భారతదేశం కంటతడిపెట్టి బ్రిటీష్ సామ్రాజ్యవాదులపై కసి పెంచుకున్నరోజు. తమ రాజకీయ భావాలు ప్రచారం చేసినందుకు భగత్‌సింగ్‌ను నాటి బ్రిటీష్ వలస పాలకులు ఉరితీశారు. ఉరి తప్పించాలనే డిమాండ్ చేయవీలున్నప్పటికీ రౌండ్ సమావేశాన్ని వాయిదా వేయించి, ఆ అవకాశం రాకుండా చూసుకున్నారు గాంధీ. దేశమాత దాస్యశృంఖలాలు తెంచడం కోసం బ్రిటీష్ సామ్రాజ్యవాదుల పన్నాగాలను సాయుధంగానే ఓడించగలమనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే హక్కు భగత్‌సింగ్‌కు, ఇతర విప్లవకారులకుందా? లేదా? అనేది ఇక్కడ సమస్య. ఎవరికైనా తమ ఆశయాలను, ఆలోచనలను ప్రచారం చేసుకునే హక్కు, ఆచరించుకునే హక్కు ఉంటుంది. ఉండాలి. లేకుంటే ఆధునిక రాజ్యమనే దానికి, ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. రాజకీయ సిద్ధాంతాలు ఒక్కరోజే ఆకాశం నుంచి ఊడిపడవు. వాటి కోసం చాలా కాలం ఘర్షించక తప్పదు.
నీ అభివూపాయాలతో ఏకీభవించేవాడి అభివూపాయాన్ని గౌరవించడం సహజం. కానీ నీ అభివూపాయాలను విమర్శించేవాడి, ఖండించేవాడి హక్కును గౌరవించడంలోనే నీ గొప్పదనం ఉంటుంది. ఇది ప్రజాస్వామిక విలువ. ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఈ నీతిని అందరూ విధిగా పాటించాలి. లేకుంటే అది నియంతృత్వమే అవుతుంది. వేల సంవత్సరాల మానవ నాగరికత, చరిత్ర క్రమాన్ని పరిశీలిస్తే విభిన్న రాజకీయాభివూపాయాలు, వాటి మధ్య ఘర్షణ మొదటి నుంచి ఉన్నాయి. నిర్దిష్ట సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులలో అమలు కావాల్సిన రాజకీయ విధానాలు నిర్ధారణ కావడానికి భావాల మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్ష ణ నుంచే దేశకాల పరిస్థితులకు తగిన రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది. అయితే నిర్ధారించబడిన రాజనీతికి విరుద్ధంగా ఉండే ఇతరుల అభివూపాయాలు తప్పు అనలేము. ఆచరణలో పలుమార్లు పరీక్షించిన తర్వాత మాత్రమే సత్యం నిర్ధారించబడుతుంది. అప్పటికీ అది కూడా పాక్షిక సత్యమే అవుతుంది తప్ప పరమ సత్యమనిపించుకోదు. ఒక మెజారిటీ అభివూపాయాన్ని ఆచరిస్తూనే ఇతర అభివూపాయాల ఆచరణ యోగ్యతను స్వేచ్ఛ గా చర్చకు పెట్టాలి. నేడు మైనారిటీగా ఉన్న అభివూపాయాలు ఒకానొక సమయంలో మెజారిటీగా మారవచ్చు. 

స్వేచ్ఛా సమానత్వాల గురించి, సత్యాన్వేషణ కోసం తమ వాదనల ద్వారా నిజాన్ని నిగ్గు తేల్చాలన్నందు కు నాడు గ్రీసు పాలకులు సోక్రటీస్‌కు విషమిచ్చి చంపడాన్ని ఇప్పుడెవరైనా సమర్థించగలరా? భిన్నాభివూపాయాలు స్వేచ్ఛగా కలపోసుకోగలగడమే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ. భిన్నాభివూపాయం వెలిబుచ్చితేనే కంటక ప్రాయంగా చూడ డం, నిర్బంధాలకు గురిచేయడం, భౌతిక నిర్మూలనకు పూనుకోవడం, తమ న్యాయవ్యవస్థతో ఉద్దేశపూర్వకంగా తీవ్ర శిక్షలకు బలిచేయడం వర్గ రాజ్యరక్షణకు అవసరమనిపించవచ్చు. కానీ ప్రజాస్వామ్య పరిరక్షణకు పనికిరాదు. ఇలాంటి నిర్బంధాలు, అణచివేతలు సామాజికాభివృద్ధిని అడ్డగిస్తాయి. మానవ సమాజం అనేక రాజకీయ దశలు దాటి వచ్చింది. బానిస సమాజం నుంచి మొదలుకొని భూస్వామ్య రాజరికాలు వేల ఏళ్లు రాజ్యమేలాయి. కానీ తరువాత కాలంలో అభివృద్ధిని అడ్డగించడంతో ఆ వ్యవస్థలను ఛేదించి మూడు శతాబ్దాల కిందట యూరప్‌లో ప్రారంభించి అనేక దేశాలలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతున్నది.
కొన్ని దేశాల్లో శతాబ్ద కాలంగా ఉన్నతమైన సోషలిస్టు వ్యవస్థలు ఆచరణలోకి వచ్చాయి. అన్ని దేశాల్లో ప్రజాస్వామ్య, సోషలిస్టు వ్యవస్థలను నిర్మాణం చేస్తూ కమ్యూనిజంవైపు అడుగేయాల్సి ఉన్నది. అలాంటి సామాజిక పరిణామ దశలో ప్రజాస్వామిక ఉద్యమాలపై నిర్బంధం, అణచివేత, రాజ్యహింసలు ప్రయోగించి నియంతృత్వ వ్యవస్థలను కొనసాగించబూనుకోవడం మూర్ఖత్వం. ఆచరణలో సాధ్యం కానిది.
సమకాలీన భారత సమాజంలో జరుగుతున్న వివక్ష, అణచివేతలు సమాజ విచ్ఛిన్నానికి దారి తీయక తప్పదని అర్థం అవుతున్నది. రాజకీయ అభివూపాయాలు కలిగి ఉన్నందున జైలు పాలైన వారిపట్ల జైలు అధికారులు ఎలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారో అంచనా వేయగలము. దేశ ద్రోహుల పట్ల ఉదారంగా మెలిగే మన న్యాయ వ్యవస్థ, నిజమైన దేశభక్తుల పట్ల ఎందుకు ఇంత వివక్ష పూరితంగా ఉంటున్నదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. 
ఆదర్శ్ స్కాంలో రాజకీయ నాయకులు, అధికారులు, సైనికాధికారులు కూడా ఉన్నారు. ఇప్పటికీ కేంద్రంలో కొందరు మంత్రులుగా కూడా ఉంటున్నారు. రాష్ట్రం లో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతున్నది. దానికి ఐఏఎస్ అధికారులు వత్తాసుపలికి జైలుపాలయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటై వారి ప్రాసిక్యూషన్‌కు అనుమతించక న్యాయ వ్యవస్థను, సీబీఐని ఒక ఆట ఆడిస్తున్నారు. రాజకీయ నాయకులు, బ్యూరోక్షికాట్లు కుమ్మక్కై, పరస్పరం రక్షించుకుంటూ దేశాన్ని దోచుకుంటున్నారు. ఈ సందర్భంలో అలాంటి వారిపట్ల ఉదారంగా ఉంటున్న చట్టం, న్యాయవ్యవస్థ, దేశం కోసం, సమాజ హితం కోసం నిరంతరం తాపవూతయ పడు తూ తమ ప్రాణాల్ని తృణవూపాయంగా ఎంచి అభివృద్ధి నిరోధక రాజ్యవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారుల ఎడల ఎంత వివక్షాపూరితంగా ఉంటున్నాయో స్పష్టంగా చూస్తున్నాము.

పాలకుల్లో ఒక వర్గం అండ ఉన్నందున గుజరాత్‌లో జరిగిన సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ లాంటి కేసు ల్లో సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు జరపగలదేమో కానీ, దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే కేసుల్లో సీబీఐ దర్యాప్తు అనేది ఒక కంటి తుడుపు మాత్రమేనని తేలిపోయింది.
మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్రంతో చర్చల ప్రక్రియలో ఉన్న కామ్రేడ్ ఆజా ద్ కేసులో బూటకపు ఎన్‌కౌంటర్ కాదని సీబీఐ తుది నివేదికలో చెప్తే సుప్రీంకోర్టు నమ్మేసింది. సీబీఐ పోలీసు వ్యవస్థలో భాగమేకదా. అలాంటి సంస్థలు తమ సొంత పోలీసులపై నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించగలవా? కేంద్ర హోం మంత్రి చిదంబరానికి వ్యతిరేకంగా సీబీఐ నక్సలైటు కేసుల్లో దర్యాప్తు చేయగలదనుకోవడం భ్రమ మాత్రమే. అందులో వాస్తవాలు వెల్లడించడం కన్నా రాజ్యవ్యవస్థను కాపాడడం అనే అంశం ప్రాధాన్యం వహిస్తుంది.

విప్లవకారుల కేసుల్లో వర్గ ప్రయోజనాల కోసం అన్ని వ్యవస్థలు ఒక్కటవ్వడం చూస్తున్నాం. ముఖ్యంగా న్యాయవ్యవస్థ ఇతర సంస్థలకన్నా కొంత ఉదారంగా ఉన్న చరిత్ర ఉంది. కానీ ఉద్యమకారుల విషయం వచ్చేసరికి బినాయక్‌సేన్ లాంటి వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్షలు, జీతన్ మరాండి లాంటి వాళ్లకు ఉరిశిక్షలు వేయడంలో తమ వర్గ నీతినే చాటుకుంటున్నాయి. ఆజాద్ కేసు సందర్భంలో‘రిపబ్లిక్ తన బిడ్డల్ని తానే చంపుకోవడం అనుమతించరానిద’ని సుప్రీంకోర్టు ఒక మంచి మాట చెప్పి న్యాయ వ్యవ స్థ పట్ల ప్రజల్లో గౌరవం పెంచిం ది. పదిహేనేళ్లలో దేశ ప్రజలకు అన్నంపెట్టే రైతులు రెండున్నర లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు.
దీనికి కారణం ఈ రిపబ్లిక్ కాదనగలమా? స్వయంగా సుప్రీంకోర్టు చెప్పినా ముక్కిన బియ్యాన్ని కూడా ఆకలితో అలమటించే వాళ్లకు పంపిణీ చేయలేమ ని చెప్పింది ప్రభుత్వం. బడా పారిక్షిశామిక వేత్తలకు, దివాలా తీసే బ్యాంకులకు బెయిలవుట్ ప్యాకేజీ లు ప్రకటిస్తున్న ప్రభుత్వం, పేదలను నిర్వాసితులను చేస్తున్నది. దీన్ని ప్రశ్నిస్తే అది టెర్రరిస్టు చర్య అవుతుందా? దేశ ద్రోహులను అందలమెక్కిస్తూ..నిజమైన దేశ భక్తులను దేశ ద్రోహులుగా, టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్న విచిత్ర పరిస్థితి మన సార్వభౌమ రిపబ్లిక్‌ది. చివరకు గ్రీన్‌హంట్ పేర రాజ్యం తన ప్రజలపైనే యుద్ధాన్ని ప్రకటించింది. నాలుగు లక్షల కోట్ల మేర అపార ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి సామ్రాజ్యవాదులకు అనుమతిచ్చింది. దాన్ని అడ్డుకుంటున్న ఆదివాసులపై దేశ ద్రోహులంటూ ముద్రవేసి వారి గూడాలను తగలబెడుతున్నది. సామూహిక లైంగిక అత్యాచారాలకు పాల్పడడం, నిర్బంధ క్యాంపులు పెట్టడం, అందులో పారా మిలటరీని, సైన్యాన్ని దించడం చేస్తున్న మన రిపబ్లిక్ గురించి ఏమనుకోవాలి. సుప్రీంకోర్టు స్వయంగా నిరాకరించిన ‘సల్వాజుడుం’ను మరో పేరుతో పోలీసులుగా నియమించడం చూస్తే ఈ పాలకులకు న్యాయవ్యవస్థపై కూడా గౌరవం లేదని తేలిపోతున్నది. ఆదివాసులకు అండగా ఉంటున్న మావోయిస్టు పార్టీ నాయకులపై, కార్యకర్తలపై దేశవూదోహులుగా ముద్రవేసి అక్రమ కేసులు బనాయిస్తున్నది. వీరికి బెయిల్ కూడా రాకుండా చేసి ఏళ్ల తరబడి అక్రమంగా జైళ్లలో నిర్బంధిస్తున్నది.

1931 మార్చి 23న దేశ విముక్తి కోసం భగత్‌సింగ్ ఉరి కంబమెక్కాడు.1950 లో రాజ్యాంగం అమలై రిపబ్లిక్ ఏర్పడింది. ప్రభుత్వం 5,6, షెడ్యూల్డ్స్‌ను, పి.ఇ.ఎస్.ఎ చట్టాలను కాదని ఆదివాసీ ప్రాంతాల్లో ఎంవోయులు కుదుర్చుకున్న ది. అంబేద్కర్ ఈ రాజ్యాంగం పేదలకు మంచి చేయలేకపోతే దాన్ని తానే తగలబెడతానన్నాడు. న్యాయమైన రాజకీయ హక్కుల కోసం, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం భగత్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకుని పోరాటం సాగిస్తున్న రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి. మార్చి 23ను జైళ్లలో పోరాడుతున్న రాజకీయ ఖైదీల పోరాట సంఘీభావ దినంగా పాటిద్దాం. దేశ వ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి రాజకీయ ఖైదీల విడుదల కోసం పోరాడుదాం. నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమంలో దేశభక్తులతో పాటుగా కలిసి పయనిద్దాం.

-ఆకుల భూమయ్య
తెలంగాణ ప్రజావూఫంట్ రాష్ట్ర ఉపాధ్యక్షు

నమస్తే తెలంగాణా న్యూస్ పేపర్ Dated : 23 /03 /2012 

No comments:

Post a Comment