Friday, November 15, 2013

దోరల తెలంగాణ ప్రమాదం ! ---గజ్జల కాంతం


రాష్ట్ర విభజన అర్థవంతంగా జరగాల్సిన చారిత్రక అవ సరం ఎంతైనా ఉంది. సమైక్యం కోసం ఉద్యమిస్తున్న సమైక్యవాదులు, పెట్టుబడిదారుల కంటే తెలంగాణ ప్రాంతంలో దొరలు అత్యంత ప్రమాదకరం. రాష్ట్ర విభజన జరిగితే ఈ ప్రాం త జనాభాలో 85 శాతం దాకా ఉన్న బహుజనులకు రాజ్యా ధికా రంలో గణనీయమైన వాటా దక్కాల్సిన చారిత్రక అవసరం ఉం ది. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం, మంత్రుల బృం దం ఈ దిశగా ప్రయత్నాలను చేయాలి. పెట్టుబడిదారులు కేవలం అధికారమే పరమావధిగా వ్యవహరిస్తారు. కానీ దొరల, అగ్రవర్ణాల ప్రభావం నేరుగా ప్రజలకు పెను శాపంగా పరిణమిస్తుంది. ఐదు దశాబ్దాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తెలంగాణ ప్రాంతంలో బహుజనులు బాగా వెనకబడిపోవడానికి తెలంగాణలోని వెలమ దొరలతో పాటు ఇతర అగ్రవర్ణాలే ప్రధాన కారణం. దళిత, వెనకబడిన తరగతి ప్రజలు తరాలుగా బానిసలుగా జీవితాలు గడుపుతూ వస్తున్నారు. 

దొరల దౌర్జన్యాలు, పెత్తందారీ పోకడలవల్లే నక్సలిజం పుట్టుకొచ్చింది. 1955నుంచి తెలంగాణ ఉద్యమం జరుగు తూనే ఉంది. ఫజల్‌అలీ కమీషన్‌కూడా పెద్దమనుషుల ఒప్పందం అమలు కాకపోవడాన్ని తప్పు పట్టింది.1969లో చారిత్రాత్మక తెలంగాణ ఉద్యమం నడిచింది. 369కి పైగా విద్యార్థులు బలి దానం చేశారు. 3వేల మందికి పైగా యువకులు జైళ్లలో మగ్గారు. దళితులు, బీసీలు తమ జీవి తాలను త్యాగంచేశారు. 2009నుంచి ఇప్పటిదాకా వెయ్యిమంది దాకా చనిపోయారంటే వారి లో బీసీలు, దళితులే ఎక్కువ. రాజకీయ, అధికార సాధనలో మంత్రుల బృందం విభజన అనం తర తంతుకు సంబంధించి దృష్టి సారించాలి. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలు, బ్రాహ్మణులు కలిపి 85శాతం ఉన్న విషయం మంత్రుల బృందం పరిగణలోకి తీసుకోవాలి. ఐదు దశాబ్దాల్లో తెలం గాణ మంత్రులు కేవలం ఐదుసంవత్సరాల మూడునెలలు మాత్రమే పరిపాలించడం వెనక బాటుతనానికి నిదర్శనం. ఉపాధి, విద్య, ఇరిగేషన్‌, విద్యుత్‌, ప్రభుత్వ ఆస్తులు ఇతర వనరుల కు సంబంధించి అన్యాయం జరిగింది. 

తెలంగాణలో వెలమ దొరలు, అగ్రవర్ణాలు, సీమాంధ్ర రాజకీయ నాయకులతో తెలంగాణలో అన్యాయం జరిగింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణకు సంబంధించి సానుకూలంగానే స్పందించగానే కొన్ని పార్టీలు యూటర్న్‌ తీసుకోవడం గర్హనీయం. వైఎస్‌ఆర్‌ సీపీ, టీడీపీ, బీజేపీ, సీపీఐలు తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు చేశాయి. జులై 30 నే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించిన వెంటనే వైఎస్సార్‌సిపి, తెలుగుదేశం పార్టీలు యూ టర్న్‌ తీసుకోవటం తెలంగాణ ప్రజలను, టిడిపి శ్రేణులను వంచించడమే. అయితే దొరల తెలంగాణ వస్తే రాష్ట్ర విభజన జరిగి కూడా శుద్ధ దండుగ. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ తన రాజకీయ స్వార్థంకోసం ప్రయ త్నిస్తుండటాన్ని మంత్రులబృందం గమనించాలి. 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 26 సీట్లే టీఆర్‌ఎస్‌ గెలవడం జరిగింది. 

2009లో టీడీపీతో పొత్తుపెట్టుకుని 10 సీట్లకే పరిమితం కావడం ప్రజల్లో పలుకుబడి లేదనే విషయాన్ని విదితం చేస్తోంది. అధినేత ఎంపీగా ఉన్న మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో ఎంఎల్‌ఏసీటును గెలిపించుకోలేని చరిత్ర టిఆర్‌ఎస్‌ది. పరకాలలోకూడా బొటాబొటి మెజారి టీతో గెలిచింది. అందరూ ఈ మెయిల్స్‌ ద్వారా లేఖలు పంపితే తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ- మంత్రుల బృందాన్ని స్వయంగా కలిసి 11 అంశాల మీద సవివరంగా నివేదిక ఇవ్వడం జరిగింది. టీఆర్‌ఎస్‌ విలీనం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఎటువంటి లాభం ఉండదు. కొత్త రాష్ట్రం హద్దులు, రాష్ట్రంలో ఎన్నికల నియోజకవర్గాలు, జ్యుడిషియరీలకు సంబంధించి సహేతుకంగా వ్యవహరించాలి. 17 పార్లమెంటు, 119 అసెంబ్లీ, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని మంత్రుల బృందాన్ని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కోరింది. ఉమ్మడి రాజధానికి సంబం ధించి సముచితమైన నిర్ణయం తీసుకోవాలని, ఇరు ప్రాంతాల్లోనూ వెనకబడిన ప్రాంతల అభి వృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీల బాగుకు ఊతం ఇవ్వాలని కోరింది. స్థానికులకు రక్షణ కల్పించాలి. శాంతిభద్రతలు సజావుగా ఉండాలి.

ప్రతిపాదిత బిల్లులో ప్రత్యేక బార్‌ కౌన్సిల్‌తో బాటు ఇతర వెసులు బాటు ఉండాలని, జలవివాదాలకు తావు లేకుండా విభజన ఉండాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కోరింది. అన్ని సమస్యలను అధిగమించిన తర్వాతనే పోలవరం పనులు మొదలుపెట్టాలని, బొగ్గు ఇతర స్థానిక వనరులను తెలంగాణ రాష్ట్రంలోనే అనుభవించే విధంగా ఉండాలని, విద్యుత్‌, ఉత్పత్తి సరఫరా సంబంధించి అర్ధవంత మైన విభజన జరగాలి. అఖిల భారత ఉద్యోగుల సర్వీసుల విషయంలోనూ పారదర్శకత అవసరం. దొరల తెలంగాణను అడ్డకోకుంటే కాంగ్రెస్‌ పార్టీకి కొండంత అండగా ఉన్న ఎస్‌.సి, బి.సి, ఎస్‌.టి, మైనారిటీ, ఇతర వర్గాలు దూరం కావడం అనివార్యమే అవుతుంది. 

రచయిత తెలంగాణ ప్రజా సంఘాల సమాఖ్య చైర్మన్‌

Surya Telugu News Paper Dated : 15/11/2013 

No comments:

Post a Comment