Friday, November 29, 2013

మేధావులు ప్రమాదకరం! ( ‘మావోయిస్టు పార్టీ సైన్యం కంటే.., దాని సిద్ధాంతకర్తలు, మేధావులు ఎక్కువ ప్రమాదకరం’) By హరగోపాల్,


కేంద్ర హోంమంత్రిత్వశాఖ తన నివేదికలో ‘మావోయిస్టు పార్టీ సైన్యం కంటే.., దాని సిద్ధాంతకర్తలు, మేధావులు ఎక్కువ ప్రమాదకరం’ అనే ఒక గొప్ప సూత్రీకరణ చేసింది! ఈ సూత్రీకరణ మూలాలు మన రాష్ట్ర పోలీసుల ఆలోచనాధారలో ఉన్నాయి. ఒక కాలంలో దేశానికి చంద్రబాబు ఒక రోల్ మోడల్‌గా మీడియా ఒక భ్రమను సృష్టిం చింది. అలాంటి భ్రమనొకటి ఆంధ్రా పోలీసు యం త్రాంగం సృష్టించగలిగింది. అందుకే హోంశాఖ మావోయిస్టు ఉద్యమాన్ని అణచడానికి ఆంధ్ర అణచివేత నమూనాను పాటించాలని భావిస్తున్నది. నమూనా రూపంలో అమానుషమైతే సారంలో భార త రాజ్యాంగాన్ని, చట్టబద్ధపాలనను, ప్రజాస్వామ్య విలువలను విధ్వంసం చేసేది. సమస్యాత్మకంగా కనిపించిన ఏ వృత్తినైనా అతనికి మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నా లేకున్నా ఎవరినైనా చంపి వేయవచ్చు అనే లైసెన్స్‌ను పొందడం ఈ సూత్రీకరణలో భాగం. బాలగోపాల్ లాంటి హక్కుల నాయకుడిని కిడ్నాప్ చేశారు. వరంగల్‌లో 60మంది ఉపాధ్యాయులను రోజూ పోలీసు స్టేషన్‌లో రిపోర్టు చేయాల ని, చేయకపోతే పైలోకానికి పంపిస్తామని భయవూబాంతులు సృష్టించారు. పోలీసు అధికారులు నియంతలుగా ప్రవర్తించినా ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించలేదు. తెలంగాణ నిజానికి ఒక నియంతృత్వ కోరల్లో బతికింది.

ఇది ఆంధ్ర నమూనా. ఉద్యోగాలు చేసుకుంటూ కొంచెం విలువలతో జీవించేవారు, గ్రామాల్లో ప్రజల పోరాటాలను ఆసక్తితో గమనిస్తున్నవారు, ఈ పోరాటాల్లో న్యాయమున్నదని విశ్వసించే వారందరూ పోలీసుల దృష్టిలో దోషులే. ఆ భయానక పద్ధతులు నక్సలైటు ఉద్యమం బలహీనపడడానికి తోడ్పడ్డాయని విశ్వసించి, ఈ ‘గొప్ప విజయా’న్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు బోధిస్తే,అది వాళ్ల వంటికి బాగానే పట్టింది. చంద్రబాబు పట్ల సృష్టించిన భ్రమ ఎంత నిజమో, ఇది కూడా అంతే నిజం.నక్సలైటు ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి నాలుగు దశాబ్దాలుగా పాలకులు ఈ ఉద్యమ స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దీన్ని ఒకసారి శాంతిభవూదతల సమస్య అని, మరోసారి సామాజిక ఆర్థిక సంక్షోభమని, మరొకసారి దీనికి ఈ రెండు పార్శాలున్నాయని, తమ ప్రయోజనాలను బట్టి సూత్రీకరణ చేస్తూ వస్తున్నారు.

ఎన్టీఆర్ నక్సలైట్లు దేశభక్తులన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో 2004లో ఇది సామాజిక, ఆర్థిక సమస్య అని పేర్కొన్నది. అదే ఎన్నికలలో ఈ ఉద్యమాన్ని అణచివేస్తానన్న చంద్రబాబుకు వ్యతిరేకంగా శాంతిచర్చలు జరుపుతామని రాజశేఖర్‌డ్డి గెలిచాడు. చంద్రబాబు చిత్తుగా ఓడిపోయాడు. అంతకుముందు ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం నక్సల్స్ సమస్య మీద ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసింది. భారత ప్లానింగ్ కమిషన్ ఒక అధ్యయన బృందాన్ని బాలగోపాల్, శంకరన్ లాంటి వాళ్లతో నియమించింది. విశ్వవిద్యాలయాలలో దీని మీద పరిశోధనలు జరిగాయి. నెల క్రితం సోనియాగాంధీ నాయకత్వం వహిస్తున్న జాతీయ సలహా మండలి ఈ సమస్య మీద చర్చించడానికి ఒక పదిమందిని ఢిల్లీకి ఆహ్వానించి ఒకరోజు చర్చ జరిపారు. ఇంకా ఆ రిపోర్టు పూర్తి కాలేదు.

ఈ ప్రక్రియ అంతా ఒకవైపు జరుపుతూనే హోంమంవూతిత్వ శాఖ ఆంధ్ర పోలీసుల సలహానే సమస్యకు పరిష్కారంగా ఆలోచించడం హాస్యాస్పదంగా ఉన్నది.మేధావులు, సిద్ధాంతకర్తలు ఉద్యమాలను నిర్మించలేరు, నడపలేరు. ఉద్యమాలు ప్రజల అసంతృప్తి నుంచి అసమానతల నుంచి, అన్యాయాల నుంచి, అణచివేత నుంచి పుట్టి మహావృక్షాలుగా ఎదుగుతా యి. ఉద్యమాలకు సామాజిక అన్యాయం కారణమైనప్పుడు మేధావులు కారణాలను విశ్లేషిస్తారు. వాటి నే సమాజానికి చెబుతారు. చెప్పాలి కూడా. జాతీయ సలహామండలికి ఏం చెప్తారో బయట కూడా అదే చెబుతారు. జాతీయ సలహా మండలి మేధావులను పిలిచి నేరం చేసిందని హోంమంత్రిత్వ శాఖ అంటే మనం చేయగలిందేమీ లేదు. లోతుగా ఆలోచించవలసిన అంశమేమంటే మనది ప్రజాస్వామ్య దేశమే నా? ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏమిటో ఎన్నోసార్లు రాయడం, మాట్లాడడం చేస్తూనే ఉ న్నాం.

చట్టబద్ధ రాజ్యాంగబద్ధ పాలన ఉదార ప్రజాస్వామ్యానికి ఉండే బలం. ఆ విలువల ఛట్రంలోనే పాలకులు ‘మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేద’ ని అంటుంటారు. ఎవరి హింసకు తావులేదో చెప్ప రు. ప్రజా ఉద్యమాలకు హింసచేసే అధికారం ఉండ దని చాలామంది అంటుంటారు. కానీ రాజ్యానికి ఎవరంటే వాళ్ల మీద హింస చేసే అధికారం ఉంటుం దా? ఈ ప్రశ్న అడగని సమాజం చాలా ప్రమాదపు అంచులకు చేరుకున్నట్లు. అంతకుమంచి ఆలోచనల మీద నియంవూతణ చేసే హక్కు ఉంటుందా? అనేది ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి ఉండే ప్రధాన తేడా. నియంతృత్వం మనిషి మేధ స్సు మీద నిఘా పెడుతుంది. అది ప్రమాదకరమని భావిస్తుంది. అం దుకే అది మేధో వికాసానికి ఎన్ని ప్రతిబంధకాలు కల్పించాలో అన్ని రకాల ప్రతిబంధకాలను కల్పిస్తుం ది. ఉదారప్రజాస్వామ్యం భావవూపకటనాస్వేచ్ఛ పునాదుల మీద నిర్మాణం జరిగినట్లు సిద్ధాంతకర్తలందరూ రాస్తూ వచ్చారు.

ఒక దేశం ప్రజాస్వామ్య దేశమని తనను తాను పిలుచుకొనడానికి మొదటి అర్హత భావప్రకటనా స్వేచ్ఛ. రెండుపజా ఉద్యమాలకు కల్పించే అవకాశాలు. శాంతియుత ఉద్యమాలను, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచినప్పుడు ప్రజలు వేరే మార్గం లేక ఆయుధాలు తీసుకోవచ్చు. ఆయుధాల తో ఉద్యమాలను అణచివేస్తే ఆయుధాలతో ప్రజలు పోరాడుతారు. ఆ పోరాటాలను విశ్లేషించే వారుంటారు, ఉండాలి కూడా. పాలకులకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికై నా చెప్పే వారుండాలి. అది చెప్పేవాడే ప్రమాదకర మని భావిస్తే ప్రజాస్వామ్యం అంతిమ దశలో ఉన్నట్లేపస్తుత ప్రధాని కొత్తలో ‘నక్సలైట్లు మన పిల్లలే అని, వాళ్లు దేశాన్ని విడగొట్టడం కోసం పోరాడడం లేదని, ప్రజల సమస్యల కోసం ఉద్యమిస్తున్నార’ని మంచి మాటలే అన్నాడు. ఈ దశాబ్ద కాలంలో ప్రధానిలో వచ్చిన మార్పు.అది వ్యక్తిగతం కాదు. ఈ మధ్య రాజకీయ సుస్థిరత దెబ్బతినడమే కాక బోలెడ న్ని స్కాంలు బయటకు వచ్చాయి.

వ్యవస్థ విశ్వసనీయతే ప్రమాదంలో ఉన్నది. ఆ ప్రమాద ఘంటికల కలవరమే హోంశాఖ సూత్రీకరణ. ఈ సూత్రీకరణ తెలంగాణ వరకు కొంత నిజం కావచ్చు. కాని మిగ తా మావోయిస్టు రాష్ట్రాల్లో సిద్ధాంతకర్తలు, మేధావు లు పెద్దగాలేరు. లేకున్నా ఉద్యమాలు నడుస్తున్నా యి. ఆఉద్యమాల నుంచి మేధావులు రావచ్చు. కాని మేధావుల వల్ల ఉద్యమాలు రావని ఆంధ్ర పోలీసులకు అర్థం కాలేదు. అసమక్షిగంగా అర్థం చేసుకున్న సూత్రీకరణను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం, దాన్ని కేంద్ర హోంశాఖ నమ్మడం, నమ్మశక్యంగా లేదు. హోంశాఖ ఈ జ్ఞానోదయంతో అణచివేత ప్రారంభిస్తే ఉద్యమాలు ఏమౌతాయో తెలియదు. కానీ నియంత ఎదగడానికి కావలసిన రహదారిని వేసినట్లే. అలాంటి నియంత ఎదిగితే ఈ సూత్రాన్ని వాళ్లు చాలామందికి అన్వయించవచ్చు. అప్పుడు వీళ్లు చేయగలిగిందేమీ ఉండదుపజాస్వామ్యం పునాదులు విలువల సూత్రీకరణ మీద ఉంటుంది. విలువలే ప్రమాదమనడం ఎంత ప్రమాదం!

Namasethe Telangana Telugu News Paper Dated: 28/11/2013 

No comments:

Post a Comment