వా రం రోజులుగా జాతీయ ఆంగ్ల చానెల్స్ ఒపీనియన్ పోల్స్ గురించి ఎడతెగకుండా చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చ సందర్భంగా కాం గ్రెస్ పార్టీ ఒపీనియన్ పోల్స్‌ను నియంవూతించాలని లేక పూర్తిగా నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయం పట్ల రాజకీయ పార్టీల మధ్య తీవ్ర అభివూపాయబేధాలున్నాయి. దానికి కారణం ఈ సర్వేల ఫలితాలు కొన్ని రాజకీయ సమీకరణలకు అనుకూలంగా కొందరికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఉంటాయి కూడా. ఈ సర్వేలు సీఎన్‌ఎన్ ఐబీఎన్ ఢిల్లీలోని సీఎస్ డీఎస్ సహకారంతో జరిపి, ఫలితాలను చాలా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. సూత్రరీత్యా మాట్లాడే స్వేచ్ఛలో భాగంగా ఏ మీడియా అయినా తమ అభివూపాయాలు చెప్పవచ్చు. కానీ అభివూపాయాలను వాస్తవంగా ప్రచారం చేయడమే కాక, సర్వేల మాటున తాము అభిమానించి, ఆదరించే మతద్వేష రాజకీయ సమీకరణ పట్ల నిలబడడమే సమస్య. మీడియా ఇప్పుడు ప్రజలకు సమాచారాన్ని అందించే సాధనం కాదు. తమ ప్రయోజనాలకు బట్టి, తమ లాభాల దృష్ట్యా సామాజిక వాస్తవాలను విడమరి చి చెప్పకుండా, తమ వాగ్దాటితో ప్రజలను అదరగొట్టి, కాంగ్రెస్ పార్టీకి అలాగే ఇతర పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది.జాతీయస్థాయి నాలుగు ఇంగ్లీషు చానల్స్ రెండు మూడు నెలలుగా నరేంవూదమోడీ భజన తప్ప వేరే పని చేయడం లేదు. అవే చానల్స్‌లో ఒక భాగమైన సీఎన్‌ఎన్ ఐబీఎన్ నిర్వహించిన పోల్ సర్వే పూర్తిగా నరేంవూదమోడీ పక్షాన ఉంది. ఎప్పుడు చానల్‌ను ఓపెన్ చేసినా ఇందుగలడందు లేడను సందేహం లేకుండా ఆయన దర్శన భాగ్యమే లభిస్తున్నది.అంగారక గ్రహానికి మన శాటిలైట్‌ను పం పించే సందర్భంలో ఒకవైపు శాటిలైట్ దూసుక దృశ్యం చూస్తూ, దేశం సాధించిన ప్రగతిపట్ల కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్న సందర్భంలో ప్రయోగం జరిగిన కొన్ని క్షణాల్లోనే నరేంవూదమోడీ రాకెట్‌లా సీఎన్‌ఎన్‌లోకి దూసుకొచ్చాడు. ఈ ప్రయోగం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని, అంతకుముందు చంద్ర మండలానికి మనం మనిషిని పంపిన సందర్భంలో కూడా తాను శాస్త్రజ్ఞులందరిని కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నాని ప్రకటించాడు. అప్పు డు నిజానికి నరేంవూదమోడీ అనే వ్యక్తి ఎవరో ఎవరికి తెలియదు. అన్నింటికంటే ఆశ్చర్యం ఒక విజయవంతమైన ప్రయోగం చేసినప్పుడు దేశ అధ్యక్షుడు, ప్రధాని, శాస్త్ర సాంకేతిక మంత్రి లేదా ప్రఖ్యాతశాస్త్రజ్ఞుల తక్షణ స్పందన చూపించడం సమంజసంగా ఉంటుంది. అలాకాక వివాదాస్పదమైన ప్రతిపక్ష నాయకుడి స్పందనను చూపించడం దేనికి? ఇది నరేంవూదమోడీ ప్రచారానికి సలహాదారుగా నియమించుకున్న వాన్‌పిక్ కంపెనీ పనే. దేశమంతా ప్రయోగాన్ని వీక్షిస్తున్న సందర్భంలో నరేంవూదమోడీని చూపించడం, ఆయన పాపులారిటీని పెంచడానికి సాధనంగా వాళ్లు వాడుకుంటున్నారు. ఇం త పక్షపాతంగా ప్రవర్తించే సీఎన్‌ఎన్ ఐబీఎన్ సర్వేను శాస్త్రీయంగా,నిజాయితీగా జరుపుతుందా? అప్రజాస్వామికమైన మీడియా స్వ తంవూతమైన, స్వేచ్ఛాపూరిత ఒపీనియన్ సర్వే నిర్వహించగలదా అనే అనుమా నం కలగకమానదు.
ఒపీనియన్ పోల్స్‌ను ఎన్నికల కంటే చాలా ముందే నిర్వహించి ప్రజాభివూపాయం పేరమీడియా హీరోల ఇమేజ్‌ను పెంచుతూ పోతే, ఇది ప్రజాభివూపాయం పేర, ప్రజాభివూపాయాన్ని ప్రభావితం చేస్తుందనేది ఒక వాదన. మీడియా ప్రజాభివూపాయాన్ని ప్రభావితం చేస్తే ఏం తప్పు అనే ప్రశ్న కూడా వస్తుంది. ప్రజాస్వామ్యంలో మీడియా వాస్తవాలను ప్రజలకు అందించి, అన్ని రాజకీయ సమీకరణల బలాబలాల్ని చర్చిస్తే ప్రజలు మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు. సమాచారం లోపభూయిష్టమైనదైతే అది ప్రజలను తప్పుదోవ పట్టించినట్లవుతుంది. ఈమీడియాకు కనీసం జాతీయ భావాలున్నాబావుండేది. కానీ దీని వేళ్లు సామ్రాజ్యవాదశక్తుల్లో ఉన్నాయి. ఒకవైపు నూతన ఆర్థిక విధానాన్ని ప్రచారం చేస్తూ దానిలో భాగంగా మతోన్మాద రాజకీయాలను ప్రేరేపించడం చూస్తున్నాం. దేశంలో భిన్న రాజకీయ పార్టీలున్నాయి. నూతనంగా ఎదిగిన సామాజిక వర్గాల ప్రతినిధులున్నారు. ప్రాంతీయ పార్టీల నాయకులున్నారు. వీరెవ్వరినీ కాదని మతతత్వ పార్టీకి అందులో కరుడుగట్టిన నరేంవూదమోడీకి మీడియా ఇంత ప్రాధాన్యాన్ని ఇవ్వడం మనం ఎలా అర్థం చేసుకోవాలి.
మీడియాకు మాట్లాడే లేదా రాసే స్వేచ్ఛ పౌరుడికున్న స్వేచ్ఛలో భాగమే. అంటే పౌరులకు సరైన సమాచారాన్ని, వాస్తవాలను చెప్పనప్పుడు అంతవరకు మీడియా స్వేచ్ఛ హరించబడినట్టే. ఒపీనియన్ పోల్స్ నిర్వహించడం, లేదా వాటిని ప్రచారం చేయడాన్ని అధికార పార్టీ నిషేధించాలని ప్రతిపాదించింది. ఇది సరైన నిర్ణయం కాదు. ఇది అప్రజాస్వామికం కూడా. మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ దాన్ని ఎదుర్కొవలసిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉం టుంది. మనదేశ ప్రజాస్వామ్యం టీవీ డబ్బాలకు పరిమితం కావడం, మీడియా లో కనిపిస్తే ప్రజలను కలిసినట్లే అని భావించడం, యాంకర్లు ఎలా ప్రవర్తించి నా దాన్ని సహించడం మన రాజకీయ నాయకులకు అలవాటైపోయింది. ప్రజాస్వామ్యం మీడియా మీద ఆధారపడితే ఫాసిజం పెరగడం సులభం. అన్నాహజారేను సృష్టించి దేశంలో అతి ప్రముఖ నాయకుడిగా ఒక సంవత్సరం పేర్కొని మరు సంవత్సరమే వందమంది ప్రముఖులలో ఆయన పేరు కూడా లేకుండా మీడియా చేయగలిగింది. నాయకులను సృష్టించడం వాళ్లను మాయం చేసే మాయల మరాటీగా మీడియా అవతారమెత్తింది. అందుకే ఒపీనియన్ పోల్స్ ఎన్నికల ఫలితాను నిర్ధారించగలవని అధికార పార్టీ భావిస్తున్నట్లున్నది. మనదేశంలో ఈ పరిస్థితి రావడానికి రాజకీయ పార్టీల దివాళాకోరు రాజకీయాలే కారణం. రాజకీయ పార్టీలకు నిబద్ధత గల కార్యకర్తలు లేకపోవడం, మీడియా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు వివరించే వాళ్లే క్షేత్రస్థాయిలో లేకుండాపోయారు. ఇది చాలా ప్రమాదదశకు చేరుకుంటున్నది. ఒక్క బీజేపీకి మాత్ర మే సంఘ్‌పరివార్ క్యాడర్ ఉన్నది. వీళ్ల కార్యకర్తలు చాలా శిక్షణ పొందిన వారు. మీడియా ప్రచారాన్ని నరేంవూదమోడీ ‘గుజరాత్ అభివృద్ధి’ని ప్రజలకు చేరవేయడంలో కానీ లేదా ఎవరైనా ప్రత్యామ్నాయ నాయకులు ఎదుగుతుంటే వ్యతిరేక ప్రచారాన్ని చాలా పకడ్బందీగా చేయగలరు. ఇది ఫాసిజానికి కావలసిన కలుషి త వాతావరణాన్ని సృష్టించే శక్తి గల ఒక రాజకీయశక్తి. దీన్ని తిప్పికొట్టగలిగే క్షేత్రస్థాయి కార్యకర్తలు లేకపోవడమే ఒపీనియర్ పోల్స్‌ను నిషేధించాలనే తప్పుడు ప్రతిపాదనకు దారి తీసింది.
ప్రఖ్యాత ఎడిటర్ ఎన్.రామ్ 6-11-2013న ది హిందూ పత్రికలో 2002 గుజరాత్‌ను ఎందుకు మరవకూడదో రాస్తూ, మోడీని ఎందుకు పారిక్షిశామికవేత్తలు, వ్యాపారస్థులు పొగుడుతున్నారో వివరించాడు. మోడీ నాయకత్వం ఎం దుకు ప్రమాదమో, 2002 సంఘటనను, అలాగే దేశ రాజకీయాలను, అంతర్జాతీయ ప్రమాణాలు భవిష్యత్తులో కూడా ఎలా వెంటాబోతున్నాయి అన్న అంశాన్ని ప్రస్తావించాడు. ఔట్‌లుక్ మ్యాగజైన్‌లో పాట్నా ప్రహసనాన్ని మోడీ ప్రసంగంలోని అబద్ధాలను, అర్ధసత్యాలను గురించి అరు ణ్ సిన్హా సోదాహరణంగా రాశాడు. ఆయన ప్రసంగంలో మౌర్య సామ్రాజ్యానికి గుప్తుల వంశానికి తేడా తెలియకపోవడం,అలెగ్జాండర్‌ను బీహారీలు ఓడించారనడం, నిజానికి అలెగ్జాండర్ పంజాబ్ నుంచే వెనుతిరిగిపోయాడు. తక్షశిల బీహార్‌లో ఉందనడం, తక్షశిల ఇప్పటి పాకిస్థాన్‌లో ఉంది. గుజరాత్ అతి ఎక్కువ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నదని అనడం, నిజానికి గుజరాత్ విదేశీ పెట్టుబడి 7.2 బిలియన్ డాలర్లు కాగా మహారాష్ట్రలో అది 45 బిలియన్లు. ఇలాంటి అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడినా ఎలక్ట్రానిక్ మీడియా దాన్ని కప్పిపుచ్చడం, దానికి విరుద్ధంగా రాహుల్‌గాంధీ ఏ తప్పుడు వ్యాఖ్య చేసినా దానికి విపరీత ప్రచారం కల్పించారు. ఒకరి వ్యాఖ్యలను భూతద్దంలో చూపి, మరొకొరి తప్పులను దాచడం ఎం త పొరపాటో, దాని వల్ల మీడియా విశ్వసనీయత ఎంత దెబ్బతింటుందో వాళ్లు అంచనా వేయలేకపోతున్నారు. గుజరాత్ అభివృద్ధి గురించి ఐదు దశాబ్దాలుగా నిరంతరం అధ్యయనం చేసిన జాన్ బ్రెమన్ చాలా లోతైన అంశాలను ప్రస్తావించాడు. యాభై ఏళ్లలో గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని వాళ్ల సంఖ్య పెరిగిందని, అసమానతలు విపరీతంగా పెరిగాయని, స్కూలు విద్య, ఉన్నత విద్య పూర్తిగా విస్మరించబడిందని, మొత్తంగా ప్రజా సంక్షేమం చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నదని విశ్లేషించాడు. గుజరాత్‌లో గ్రామీణ జీవితం వాళ్ల అభివృద్ధి నమూనా పర్యవసానంగా అస్తవ్యస్తమైందన్న వాస్తవాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతినడం వల్ల అహ్మదాబాద్‌కు వస్తున్న పేదవాళ్లకు ఒక గుడిసె వేసుకోవడానికి కూడా ఒక గజం స్థలం లేకుండా సంపన్నులు ఆక్రమించుకున్నారని బ్రెమన్ వివరించాడు.నరేంవూదమోడీ మీద ఎక్కువ వ్యాసాలు రాయడానికి పాఠకులకు వివరణ ఇచ్చుకోవాలి. మోడీ కంటే ఇతర రాజకీయ నాయకులు గుణాత్మకంగా మెరుగై న వారని అనడం కష్టం. కాంగ్రెస్‌పార్టీ నూతన ఆర్థిక విధానాన్ని పెంచి పోషించింది. ఈ విష వృక్షాన్ని కాపాడడానికి పాలక వర్గాలు మోడీ ఇమేజ్‌ను పెంచుతున్నాయి. విష వృక్షాన్ని పెంచడం ఒక ఎత్తయితే దాన్ని కూలిపోకుండా పాలకులకు ఒక రక్షక నేత కావాలి. ఆ నేత ప్రజలను సంపూర్ణంగా ద్వేషించేవాడు కావాలి. అలాంటి నాయకుడిని పాలకులు మోడీలో చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు తమ ప్రజాపోరాట సంస్కృతిని, మానవత్వాన్ని, మత సామరస్యాన్ని, తమ గొప్ప ఉమ్మడి సంస్కృతిని విషవృక్షపు గాలుల నుంచి రక్షించుకోవాలి. ఒపీనియన్ పోల్స్ బారిన పడకూడదు.
Namasete Telangana Telugu News Paper Dated: 07/11/2013
No comments:
Post a Comment