Tuesday, May 7, 2013

వేలుపిళ్లై ప్రభాకరన్ మీదకవితలకు ఆహ్వానం ---- వేముల ఎల్లయ్య దానక్క ఉదయ్‌భాను




శ్రీలంకలో మెజారిటీ సింహాళీయుల సకల ఆధిపత్యాల నుంచి స్వయం నిర్ణయాధికారం, స్వతంత్య్ర ‘ఈలం’కోసం మూడు దశాబ్దాల కు పైగా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం(ఎల్‌టీటీఈ) అద్భుతమైన పోరాటం నిర్వహించింది. బౌద్ధమతాన్నవలంబించేదిగా చెప్పుకునే సింహాళ ప్రభుత్వం తమిళులను కనీసం పౌరులుగా కూడా గుర్తించకపోవడమే కాదు, దారుణంగా అణచివేసింది. లక్షలాదిమందిని హతమార్చింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామికవాదులందరూ ఈ అణచివేతను తీవ్రంగా నిరసించారు. 

అయితే.. తెలుగులో అనేక సంఘటానాత్మక కవిత్వ సంకలనాలు వెలువడ్డాయి. వలసవాదులకు, సామ్రాజ్యవాదానికి, బ్రాహ్మణీయ దాడులకు వ్యతిరేకంగా అనేక కవితా సంకలనాలు వచ్చాయి. కానీ జాతుల నిర్ణయాధికార పోరాటాలకే ప్రేరణాత్మకమైన ఎల్‌టీటీఈ ఉద్యమనేత ప్రభాకరన్ అమరుడై ఇప్పటికి నాలుగేళ్లు గడుస్తున్నా కనీసం ఒక్క కవితా సంపుటి, సంకలనం వెలువడక పోవడం శోచనీయం. అమరుడు ప్రభాకరన్ చేసిన పోరాటం, త్యాగం ఇతివృత్తంగా కవితా సంకలనం తీసుకురావాలని భావిస్తున్నాం. కవితలను ఈ నెల 30వ తేదీలోగా రచయిత(వూతి)లందరూ తమ రచనలను పంపాలని కోరుతున్నాం. రచనలు పంపాల్సిన చిరునామా: దానక్క ఉదయ్‌భాను, రూం. నెం. 238, ఎం.హెచ్-ఇ(ఎన్నెక్స్), హెచ్‌సీయూ, గచ్చిబౌలి, హైదరాబాద్-500 046. samuraihcu@gmail. com

- వేముల ఎల్లయ్య 
దానక్క ఉదయ్‌భాను, ఫోన్:9502448846

Namasete Telangana Telugu news paper Dated : 8/5/2013

No comments:

Post a Comment