Saturday, May 11, 2013

బుద్ధుంటే బుద్ధుడ్ని కలుపుకు పోవాలి! ---Usa‘బుద్ధుడు చాలడు, అంబేడ్కర్‌ చాలడు, మార్క్‌‌స కావాలి’ అని ఓదుర్గంధ రాద్ధాంత ఉద్గ్రంథం రాసినప్పటినుండి విర్రవీగిపోతున్న వీరంగనా యకమ్మ అంబేడ్కర్‌పై,అంబేడ్కర్‌ని కలుపుకుపోవాలని చెప్పే ఇండి యన్‌ మార్క్సిస్టులపై వీరంగం వేస్తూనేఉంది. అప్పటి నుండి అంబేడ్కర్‌పై దుమ్మెత్తి పోయటమే పనిగా పెట్టుకొ న్న రంగనాయకమ్మ తన వక్రభాష్య వెటకార వాగాడంబ రాన్ని ప్రదర్శిస్తూ పదేపదే పత్రికలకెక్కు తూనే ఉంది. అంబేడ్కర్‌పై, బుద్ధునిపై వ్యతిరేకత రెచ్చగొట్టే దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అంబేడ్కర్‌పై అగ్రకుల దురహంకార విద్వేషవిషం ‘కక్కు’తూనేఉంది. 

ఆ పనిలో భాగంగానే ‘మార్క్‌‌సనీ అంబేడ్కర్‌నీ కలపగలమా?’అంటూ మే7న ‘సూర్య’దినపత్రికలో ఓవ్యాసం రాశా రు. అంబేడ్కర్‌ చెప్పిన ప్రతిమాటని వక్రీకరించి, అందులోని సానుకూ లార్ధాన్ని ప్రతికూలంగా తారుమారుచేసి తగువులుపెంచే తగువులమారి తారుమా రమ్మలా మారిన రంగనాయకమ్మ చివరికి బుద్ధుడు పనికిరాడు, అంబేడ్కర్‌ పనికి రాడు, మార్క్‌‌సకావాలి అంటూ తన నిజస్వరూపాన్ని బైటపెట్టుకొంది.
ఏ బ్రాహ్మణీయ అగ్రకుల మార్క్సిస్టు అధినేతా ఎదగలేనంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్న సంస్కారవంతుడైన ‘అంబేడ్కర్‌ సూర్యుడు’ మీద ఉమ్మిఊస్తే అది ఊసిన వారి ముఖానే పడుతుందని అమరుడు కె.జి. సత్యమూర్తి ఆమె ముఖాన కొట్టినట్లు చెప్పాడు.

అలా ఎవరెన్ని చెప్పినా తన వితండవాద తొండి వాదాన్ని మార్చుకోని జగమొండి రంగనాయకమ్మ అంబేడ్కర్‌ని అప్రదిష్ఠపాలు చేయాలని ఎంత ప్రయాస పడినా అది వృధాప్రయాస కాక తప్పలేదు. అంబేడ్కర్‌ మరణానం తర స్వాతంత్య్రా నంతర వర్తమాన చరిత్రలో సైతం కోట్లాది పీడిత ప్రజల ఆధారా భిమానాన్ని చూరగొన్న ‘ద గ్రేటెస్ట్‌ ఇండియన్‌’ అంబేడ్కరేనని పబ్లిక్‌ పబ్లిగ్గా జేజేలు పలకటమే అందుకు నిదర్శనం. నిమ్నకులాల్లో పుట్టినవాళ్లు ఎంత మహోన్న తులైనా అగ్రకులా ల్లోని అథములు సైతం వారిని గేలిచేసే కరుడుగట్టిన అగ్రకుల తత్వ సంస్కృతికి వారసురాలిగా మారిన రంగనాయకమ్మ మళ్లీ అంబేడ్కర్‌ని అపహాస్యం చేసే దురహంకార పూరిత వక్రభాష్యం తోనే ఈ వ్యాసాన్ని మొదలెట్టింది.

‘బుద్ధుడా? మార్క్సా? అనే ప్రశ్నలేపి మార్క్‌‌స పనికిరాడు అని తేల్చేశాడు’ అంబేడ్కర్‌ అంటూ ఆయన్ని (Anti Marxist) మార్క్సిస్టు వ్యతిరేకిగా చిత్రించే దురుద్దేశ్యంతో ఆయన మాటల్ని వక్రీకరించి తారుమారుచేసింది. నిజానికి బుద్ధుని పట్ల, అంబేడ్కర్‌ పట్ల తనకున్న తిరస్కార భావాన్ని బయటపెడుతూ బుద్ధుడు పనికిరాడు, అంబేడ్కర్‌ పనికిరాడు అని తేల్చేసింది రంగనాయకమ్మే. ‘బుద్ధుడు - కారల్‌మార్క్‌‌స’ Budha and Karl Marx అని శీర్షిక పెట్టిన అంబేడ్కర్‌ బుద్ధుడి తో కారల్‌ మార్క్‌‌సని పోలి కపెట్టి చూస్తే, బుద్ధుడా? మార్క్సా? Budha Versus Karl Marx అని బుద్ధు డితో కారల్‌మార్క్‌‌సని పోటీపెట్టి చూపినట్లు వక్రీకరించి తన వక్ర బుద్ధిని బైటపెటు ్టకొంది.

ఇలా అంబేడ్కర్‌ వ్యాసానికి తలమానికమైన తల లాంటి శీర్షిక తల(రాత)నే మార్చివేసిన రంగనాయకమ్మ ఆ వ్యాసంలో అంబేడ్కర్‌ చర్చించిన ముఖ్యాంశా లన్నిటినీ ఇలాగే వక్రీకరించి వక్రమార్గం పట్టించింది. అందుకు పరాకాష్ఠగా ఈ దేశ ‘శ్రామికవర్గం అంబేడ్కర్‌ చూపించిన ఆధ్యాత్మిక ఎదుగుదల మార్గం పట్టి అంతా తమ తలరాత అనుకొన్నట్లు ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది అనుకొంటే సరిపోదూ’. అనే అపహాస్య వాక్యంతో తనవ్యాసం ముగించింది.

ఆమె వితండవాద రాద్ధాంతానికి సిద్ధాంత శుద్ధిలేక పోయినా కనీసం చిత్తశుద్ధి అయినా ఉంటే సిద్ధాంతపరంగా ఆమెతో విబేధించినా, వ్యక్తిగత నీతి నిజాయితీల వ్యక్తిత్వాన్నయినా గౌరవించేవాళ్లం. కానీ సిద్ధాంతశుద్ధి, చిత్తశుద్ధీ రెండూలేని రంగ నాయకమ్మ ఇక అంబేడ్కర్‌ని అగౌరవ పరచడం కట్టిపెట్టి ముందు ఈ వక్రబాష్యానికి తక్షణమే సంజాయిషీఇచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలి. అంబేడ్కర్‌ ఒరిజి నల్‌గా ఇంగ్లీషులో రాసిన తన గ్రంథానికి Budha and Karl Marx అని శీర్షిక పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున అంబేడ్కర్‌ రచనల్ని తెలుగులోకి అను వాదం చేసిన 3వ సంపుటి అట్టమీద ‘బుద్ధుడు- కారల్‌ మార్క్సు’ అనే శీర్షికే పెట్టా రు.

ఇందుకు విరుద్ధంగా Budha Versus Marx అన్నట్లు ‘బుద్ధుడా? మార్క్సా’ అనే శీర్షిక పెట్టిన రంగనాయకమ్మ దీనిని ఏ మూలగ్రంథం నుండి లేదా ఏ అను వాద గ్రంథం నుండి స్వీకరించిందో స్పష్టం చేయాలి. ఇది కేవలం భాషా దోషానికి సంబంధించిన సాంకేతికఅంశం కాదు. సానుకూల అంశాన్ని ప్రతికూల అంశంగా వక్రీకరించి దాని అర్థాన్ని తారుమారుచేసి తగువులుపెట్టే తగువులమారి తారుమా రమ్మ వక్రబుద్ధికి సంబంధించిన అంశం.

‘బుద్ధుడు కావాలా? మార్క్‌‌స కావాలా?’, ‘బుద్ధుడా? మార్క్సా!’ అనే శీర్షిక ఎవరో ఒకర్ని సమర్ధించి మరొకర్ని వ్యతిరేకించేందుకు దారితీస్తుంది. ‘బద్ధుడు మరియు కారల్‌ మార్క్‌‌స’ అనే శీర్షిక ఇరువురి వాదాల్లోవున్న భిన్నాభిప్రాయాల్ని ఎత్తిచూపుతూ నే ఏకాభిప్రాయాన్ని అభిప్రా యంగా గుర్తించి ఉమ్మడి కార్యాచరణలో కలుపుకు పోయే వైఖరికి దారిని సుగమంచేస్తుంది. ఈ దృష్టితోనే అంబేడ్కర్‌ బుద్ధుడి ఆలోచన ల్లో మార్క్‌‌స ఆలోచనల్లో ఉన్న ముఖ్యమైన ఏకాభిప్రా యాలని, భిన్నాభిప్రా యాలని తులనాత్మకంగా నిజాయితీగా సరిపోల్చి చూశారు.

ఒక్క మాటలో కులరహిత- వర్గరహిత సమసమాజ లక్ష్యాన్ని సాధించే సాధనాలు వేరైనా లక్ష్యం ఒకటేనని, ఆ గమ్యాన్నిచేరే మార్గాలువేరైనా గమ్యం ఒకటేనని స్పష్టం‚చేశాడు. సాధనాలు, మార్గా ల విషయంలో; హింస, అహింస, ప్రతిహింస, బూర్జువా నియం తృత్వం, కార్మిక నియంతృత్వం, కులప్రమే యంలేని వర్గపోరాటం, కులవివక్షా వ్యతిరేక వర్గపోరా టం తదితర విషయాల్లో మార్కిస్టుకి- బుద్ధిస్టు అయిన అంబేడ్క ర్‌కి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాల భిన్నత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే మౌలిక లక్ష్యాల్లో, ఆశయాల్లో ఉన్న ఏకత్వాన్ని సానుకూల దృష్టితో చూడాలని చెప్పాడు.

ఈ దృష్టితో- ఇండియన్‌ మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు బుద్ధుడ్ని కలుపుకోవాలని విజ్ఞప్తి చేశాడే తప్ప రంగనాయకమ్మ వక్రీకరిస్తున్నట్లు బుద్ధిజాన్ని, మార్క్సిజాన్ని కలగలపాలని ఎక్కడా చెప్పలేదు. ఈ అర్థంలో ‘మార్క్సిస్టులు వాళ్ల దురభిమానాల్ని పక్కనబెట్టి, బుద్ధుడ్ని (సరిగా) అధ్యయనం చేసి ఆయన వేటికోసం (ఏ లక్ష్యాలకోసం, ఏ ఆశయాలకోసం) నిలబడ్డాడో అర్థం చేసుకుంటే తప్పకుండా తమ వైఖరి మార్చు కుంటారని భావిస్తాను. బుద్దుడిపట్ల తిరస్కారభావంతో ఉన్న (బ్రాహ్మణీయ అగ్ర వర్ణ) మార్కిస్టులు ఆయనను ఆరాధిస్తారని ఆశించటం అత్యాశే.

అయినా బుద్ధుని బోధనలలో వాళ్లు గుర్తించాల్సింది ఏదో ఉందనే విషయాన్నైనా కనీసం గ్రహిస్తారని మాత్రం చెప్పగలను’ అన్నాడు. కనుక బుద్ధుంటే ఇకనైనా తిరస్కార భావాన్ని విడనా డి బుద్ధుడ్ని కలుపుకపోవటం ఇండియన్‌ మార్క్సిస్టుల, కమ్యూనిస్టుల కనీస కర్తవ్యం అని చెప్పక తప్పదు.కాని రంగనాయకమ్మ తిరస్కార భావాన్ని విడనాడకపోవటమే కాక అల్పబుద్ధితో కూడిన తుస్కార భావంతో బుద్ధుడ్ని కించపరిచే బుద్ధిమాలిన పనికి పాల్పడింది. అంబేడ్కర్‌ చూపుడు వేలు సూర్యున్ని చూపిస్తుంటే సూర్యున్ని కాకుండా వేలును చూసే హ్రస్వ‚దృష్టితో అంబేడ్కర్‌ని కించపరుస్తూ అంబేడ్కర్‌ చూపుడు వేలు ఆద్యాత్మిక మార్గాన్ని చూపిస్తున్నదని అపహాస్యం చేసింది.

నిగ్రహాన్ని చూపమని చూపుడు వేలు చూపుతున్న అంబేడ్కర్‌ విగ్రహం మూర్తే తప్ప విముక్తి మార్గాన్నిచూపే స్ఫూర్తికాదని కొట్టిపారేసింది. కనుక ఆమె చేసిన ఈ వక్రభాష్యానికి, అపహాస్యానికి సంజాయిషీ ఇచ్చే దాకా ఆమె వితండవాద రాద్ధాంతం సిద్ధాంత చర్చకి అర్హమైంది కాదని ప్రకటిస్తున్నాం.Surya Telugu News Paper Dated : 11/5/2013

No comments:

Post a Comment