Saturday, September 7, 2013

చదువుల ఒత్తిడి విధ్యార్ధుల ఆత్మహత్య By రావుల రాజేశం


కళాశాలలకు ర్యాంకులు కావాలి. విద్యార్థుల తల్లిదం డ్రులకు ప్రథమశ్రేణి పట్టా కావాలి. వారి భవిష్యత్తు గురించి, వారిపైగల ఒత్తిడి గురించి పట్టించుకునే వారే కరవయ్యారు. విద్యార్థులను పుస్తకాల పురుగులుగా మా రుస్తూ బట్టీ పద్ధతికి విద్యావేత్తలు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఉసిగొల్పడంతో రోజు రో జుకి చదువుకోసం వెళ్ళిన విద్యార్థులు ఒత్తి డులను తట్టుకోలేక ఆత్మ హత్యలకు పాల్పడడం తరచు జరుగుతోంది. విద్యార్థులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యనందించి వారిని సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాలయాలు బందిఖానాలుగా మారాయి. చదువు పేరుతో తీవ్ర శ్రమకు గురిచేస్తుండంతో విద్యా ర్థులు పంజరంలో చిలుకల్లాగా నలిగిపోతున్నారు. ఆత్మ స్థైర్యం కోల్పోయి, మానసి క ఒత్తిళ్లకు లోనయి, జీవితంపై విరక్తి చెందుతున్నారు. దీంతో కొందరు విద్యార్థులు హాస్టళ్లనుండి పారిపోతుండగా, మరికొందరు చేజేతులారా ప్రాణాలు తీసుకుంటు న్నారు. రాష్ట్రంలో పలు ప్రైవేట్ హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘ టనలు గతంలో అనేకం జరిగాయి, ఇప్పుడూ జరుగుతున్నాయి. పలువురు విద్యార్థులు యాజమాన్యాల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యేటా 3 నుండి 5 వేల మంది విద్యార్థులు యాజమాన్యాలు, హాస్టళ్ల వేదింపులను, ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇటీ వల ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఒక కాన్వెంటు విద్యార్థి, హాస్టల్ నుంచి పారి పోయే క్రమంలో రెండస్థుల భవనం నుంచి కింద పడి చనిపోవడం ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోంది. తిమ్మాపూర్ మండలంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సాక్షాత్తు ప్రిన్సిపాల్ ఒక విద్యార్థిని కొట్టి, రెండు రోజులుగా గదిలో బంధించిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఇలా వెలుగులోకి వచ్చిన సంఘటనలలో గాని, రాకుండా పోయినసందర్భాలలోగాని వేల మంది విద్యార్థులు నిత్యం నరక కూపంలో మగ్గుతున్నా వారికి మోక్షం లభించడం లేదు. నిత్యం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ప్రైవేట్ విద్యాసంస్థల తీరుకు అద్దం పడుతున్నది. ప్రభుత్వం, సంబంధిత అధికారులు సైతం ఇటువంటి దారుణోదంతాలపై దృష్టి సారించిన సందర్భం ఒక్కటీ లేదు.

రాష్ట్రంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నాయి. ఇష్టారాజ్యంగా పాఠశాలలు నెలకొల్పుతూ డబ్బే పరమావధిగా వ్యవహరిస్తున్నాయి. ఇక రెసిడెన్షియల్ (ఆవాస పాఠశాలలు) పాఠశాలలలో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంటోంది. ఉదయం 4 గంటలనుండి ప్రారంభించి రాత్రి 10 గంటలవరకు క్లాస్‌లు, స్టడీ అవర్లు నిర్వహిస్తున్నారు. ఊపిరి సలుపని రీతిలో రోజులో దాదాపు 12-14 గంటలవరకు పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్నారు. పూర్తిగా బట్టీయంచదువులు, ర్యాకులమోజుకు అనుగుణంగా విద్యార్థులను యాం త్రికంగా తయారు చేస్తున్నారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి దోహదం చేసే ఆటపాటలు, ఇతరత్రా కార్యక్రమాల ఊసెత్తడం లేదు. 90 శాతం పాఠశాల లకు కనీసం ఆట స్థలాలు లేవు. సాక్షాత్తు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతి పాఠశాలలో ఆటమైదానం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినా రాష్ట్రంలో విద్యాశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు.

రాష్ట్రంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీ లను నిర్వహిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాల్లో ఇరుకైన గదుల్లో హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. అయినప్పటికి తనిఖీ అధికారులు గాని, ప్రభుత్వం గాని, మేధావులు కాని ఒక్కరోజైనా హాస్టళ్ళ ఆకస్మిక తనిఖీలు జరిపిన పాపన పోలేదు. దీనితో హాస్టలు అంటేనే విద్యార్థులు హడలెత్తి పోతున్నారు. నలుగురు ఉండాల్సిన గదుల్లో పదిమంది పిల్లలను కుక్కుతున్నారు. గాలి, వెలుతురు సరిగా లేక ఊపిరా డని పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరుగుదొడ్లు, స్నానాల గదులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.నాణ్యత లేని సరుకులతో నాసిరకం భోజనం వడ్డిస్తున్నా, అడ్డగోలుగా డబ్బు వసూలు చేసుకుంటూ యాజ మాన్యాలు కోట్లకు పడగలెత్తుతున్నాయి. వారిని అడిగే దిక్కే లేకపోవడంతో వారి ఆటలు య«థేచ్ఛగా సాగుతున్నాయి. మామూళ్ల రుచి మరిగిన వివిధ శాఖల అధికా రులు పట్టించుకోవడం లేదు. పిల్లలు బాగా చదువుకొని, గొప్పవాళ్లు కావాలని తల్లి దండ్రులు కోరడంలో తప్పులేదు. కానీ పిల్లలకు తగిన స్వేచ్ఛ నిచ్చి పెంచుతున్నా మా, వారి అభిరుచులను గుర్తిస్తున్నామా అని ఆలోచించాల్సి ఉంది. 

రావుల రాజేశం

Surya Telugu News Paper Dated : 08/09/2013 

No comments:

Post a Comment