డాక్టర్ అంబేద్కర్ విస్తృత రచనలలో పైన పేర్కొన్న రచన చాలా గొప్ప సూత్రీకరణ. ప్రపంచ చరివూతలో ఏ నాగరికత అయినా ఒక గెంతె ముందుకు వేసిన తర్వాత అక్కడ ఆగడం జరిగితే జరగవచ్చు. కానీ అది వెనక్కి వెళ్లే అనుభవం మానవాళికి లేదు. ముఖ్యంగా యూరప్ చరిత్ర మొత్తం ఈ అనుభవం ద్వారా ప్రయోగించిందే. దీని ఆధారంగానే మార్క్స్ తన (మోడ్ ఆఫ్ ప్రొడక్షన్) ఉత్పత్తి శక్తుల అభివృద్ధి క్రమాన్ని సిద్ధాంతీకరించాడు. దీనికి కొంత భిన్నంగా అంబేద్కర్ భారత దేశ మార్పును విశ్లేషిస్తూ ఈ నాగరికత ఒక విప్లవాన్ని సాధించినా ఇక్కడి సామాజిక మతపరశక్తులు ప్రతీఘాత విప్లవాన్ని చేయగలవని, ఒక గెంతేసిన సమాజా న్ని వెనక్కి తీసుకపోగల బలాన్ని కలిగి ఉన్నాయని రాస్తూ, దీనికి ఉదాహరణగా బుద్ధుడు విప్లవ భావాలను ప్రతిపాదిస్తే, ఆ బుద్ధిజం జపాన్, చైనా లాంటి భిన్న దేశాల్లో విసృత ప్రభావాన్ని కలిగిస్తే, బుద్ధిజం రూపకల్పన జరిగిన దేశంలో దాని నామరూపాలు లేకుం డా మనుధర్మశాస్త్రం ప్రతీఘాత విప్లవాన్ని చేసిందని విశ్లేషించాడుపపంచంలో ఎందుకు ఇంత బాధ ఉన్నదని, దానికి మూలకారణాలు ఏంటనే ప్రశ్నకు జవాబు అన్వేషిస్తూ, రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని, కుటుంబాన్ని త్యజించి సిద్ధార్థుడు బయలుదేరాడు. సమాజ జీవనానికి భగవంతుడు అప్రస్తుతమని కర్మ సిద్ధాంత వెన్నుముకను విరగొట్టాడు. మనుషులు నిరాడంబరంగా జీవించాలని, శాంతియుత ప్రపంచంలో జీవించాలని బోధించాడు. ఈ ప్రతిపాదన 2500 సంవత్సరాల కిందట చేయడమన్నది అసాధారణ విషయం. బౌద్ధమతం అన్ని మతాల కంటే భిన్నంగా మానవ జీవితాన్ని, ప్రపంచాన్ని మరో కోణం నుంచి చూడడం నేర్పిం ది. అశోకుడు కళింగయుద్ధం తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించకు న్నా, ఆ మతాన్ని ప్రచారం చేయడానికి కృషి చేశాడు. ఇప్పుడు ఈ కథం తా ఎందుకు అని అంటే, మన దేశంలో దళితులు, మహిళలు, ఇతర పేద వర్గాలు, వెనుకబడిన ప్రాం తా లు చైతన్యవంతమౌతున్నకొద్దీ దీనికి వ్యతిరేకంగా మతద్వేష రాజకీయాలు బలాన్ని పుంజుకుంటున్నవి. ఈ ప్రపంచా న్ని మార్చవలసిన వర్గాలు కూడా మతతత్వ రాజకీయాల వైపు, అలాగే జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తు న్న నూతన పెట్టుబడిదారీ నమూనాకు ఆకర్షితులవుతున్నా రు. కొందరు దళిత మేధావులు దళితుల విముక్తికి ఇది మార్గమని కూడా వాదిస్తున్నారు.
చరివూతలో అంబేద్కర్ ప్రతిపాదించిన సూత్రీకరణ ఎలా పనిచేస్తుంది అనడానికి ఈమధ్యే థాయ్‌లాండ్ దేశానికి వెళ్లినప్పు డు, వాళ్ల చరిత్ర మన దేశ చరివూత కు భిన్నంగా ఏమీలేదు. అంబేద్కర్ ప్రతిపాదనకు కొత్త సాక్ష్యాధారాలు అగుపించాయి. థాయ్‌లాండ్ ప్రజలను చాలా ఆకర్షించి అది బౌద్ధ దేశంగా మార్చిం ది. ఇప్పటికీ వాళ్లు బౌద్ధులే. కానీ వాళ్ల మత విశ్వాసాలకు, వాళ్ల జీవన విధానానికి ఏం సంబంధం లేదు. దీనికి ఉదాహరణ థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఒక సుప్రసిద్ధ బౌద్ధ దేవాలయముంది.ఈ బుద్ధ విగ్రహాన్ని ఎమరాల్డ్ బుద్ధా అని పిలుస్తారు. దేశ, విదేశాల నుంచి ఈ దేవాలయానికి పర్యాటకులు వస్తుంటారు. అయితే దేవాలయ గోడలనిండా రామాయణ కథ ఉన్నది. రావణుడు, హనుమంతుడు, సీతల కథ విస్తృతంగా చిత్రీకరించబడి ఉన్నది. ఎక్కడా బుద్ధుడి జీవితాన్ని గురించి గానీ, లేదా బుద్ధుడి అన్వేషణా క్రమం గురించి కానీ ప్రస్తావన లేదు. బుద్ధుడి ప్రార్థనాలయంలో రామాయణ కథ ఏమిటి అని అడిగితే మా గైడ్ తమ దేశ రాచరిక వ్యవస్థ బుద్ధుడి బోధనల మీద ఆధారపడి కొనసాగలేదని, రాచరికం కొనసాగాలంటే అది రామాయణం ద్వారానే సాధ్యం అని వివరించింది.థాయ్‌లాండ్‌ను పరిపాలించిన రాజులందరినీ రామ-ఒకటి, రామ-ండు, రామ-మూడు అని పిలుస్తారు. ఈ బౌద్ధ ప్రార్థనాలయము రాజ వూపాసారంలోనే ఉన్నది. అయితే గుడిలోకి వెళ్లడానికి ఎలాంటి నిబంధనలు లేవు. కానీ రాజ ప్రాసారంలోకి, మహిళలు ప్యాంటు వేసుకొని కాని, పురుషులు జీన్ ప్యాంట్ వేసుకొని కాని వెళ్లకూడదు. ఈ నిబంధనను చాలా కచ్చితంగా పాటిస్తారు. ఇది ఒక విచిత్ర అనుభవం.ఎంతకాదన్నా మన దేశంలో దేవాలయాలలో కొన్ని నిబంధనలను పాటిస్తారు కానీ రాజ్యాధికారంలో ఉన్న వాళ్ల విషయంలో కొన్ని సడలింపులు ఉన్నాయి. థాయ్‌లాండ్‌లో ఇప్పటికీ రాజును చూడడానికి లేదా కలవడానికి వెళ్లిన వాళ్లు ఆయన ముందుకు మోకాళ్ల మీదే నడిచి వెళ్తారని అక్కడి వాళ్లు అన్నప్పుడు, మేం చాలామందిమి ఆశ్చర్యపోయాం.బౌద్ధిజాన్ని అనుకరిస్తే ఇలాంటి రాచరిక పద్ధతులు సాధ్యం అయ్యేవి కావు. ఇది రాముడి చిహ్నం ద్వారానే సాధ్యం.
ఈ నేపథ్యంలోనే రామ జన్మభూమి వివాదాన్ని చూడవలసి ఉంటుంది. ఎంత కాదన్నా స్వాతంవూత్యోద్యమ పుణ్యమా అని, అలా గే ప్రజా పోరాటాల చైతన్యం వలన మన దేశంలో రాచరిక వ్యవస్థ రద్దుకావడం, ఒక రాజ్యాంగ ఆధారిత ప్రభుత్వం ఏర్పడింది. ఒక ఎన్నికల వ్యవస్థ, ఐదు ఏళ్లకొకసారి, ఎంత లాంఛనవూపాయమైనా రాజకీయ పార్టీలు గెలుస్తున్నాయి, ఓడిపోతున్నాయి.ఈ ప్రక్రియలో భాగంగానే ప్రత్యామ్నాయ నాయకులు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో దళితవర్గాల నుంచి కాన్షీరాం, మాయావతి, అలాగే వెనకబడిన కులాలకు సంబంధించిన ములాయంసింగ్, లాలూ ప్రసా ద్ నాయకులుగా ఎదిగారు. ఈ పెరుగుతున్న చైతన్యానికి స్పంది స్తూ వి.పి.సింగ్ మండల్ కమిషన్ చేసిన సూచనల మేరకు రిజర్వేషన్లను రూపొందించారు. అధికారం క్రమక్షికమంగా బలవంతమైన వర్గాల నుంచి మారుతూ, లేదా ఈ వర్గాలతో అధికారాన్ని పంచుకునే పరిస్థితి ఏర్పడుతున్న క్రమంలో మతద్వేష రాజకీయా లు ఒక ఊపు అందుకొని కొత్త సామాజిక శక్తుల బలం పెరగకుం డా అడ్డుకట్టవేశాయి. ఈ అడ్డుకట్టవేయడానికి రాముడిని, రాముడి గుడిని ప్రధాన రాజకీ య ప్రక్రియలోకి తీసుకరావడమేకాక ఆ చిహ్నం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో అధికారానికి కూడా రాగలిగాడు. దీన్ని ప్రతీఘాత రాజకీయాలుగా అభివర్ణించవలసి ఉంటుంది.
ఈ పర్యాయం భూస్వామ్య ఆధిపత్య భావజాలంలో నుంచి నరేంవూదమోడీని సృష్టించి, ఒకవైపు రాముడు, మరోవైపు మోడీ ని కలిపి వచ్చే ఎన్నికలలో మతతత్వ రాజకీయాలు పాల్గొననున్న వి.అయితే పైన గుజరాత్ అభివృ ద్ధి నమూనా అంటున్నారు. ఆ నమూనా ఏమిటో ఎవ్వరికీ తెలియదు. మీడియా బాకాలూదు తూ రోజూ ప్రచారం చేస్తున్నది. ఒక్క చానల్ కూడా ఈ అభివృద్ధి నమూనా మీద లోతైన చర్చ జరపడంలేదు.ఇదే నమూనాకు ప్రతినిధులైన మన్మోహన్‌సింగ్, చిదంబరం, అహ్లువాలియా రూపాయి పడిపోతుంటే విలవిల కొట్టుకుంటున్నారు. చివరకు అలా పడిపోవడం కూడా మంచిదే అని సమర్థించుకుంటున్నారు. చిదంబరం సుప్రీంకోర్టు, రిజర్వు బ్యాంకుల మీద ఆగ్రహం ప్రకటిస్తున్నాడు. ఈ నమూనా కొనసాగింపే గుజరాత్ నమూనా కదా! మోడీ అయినా ఏం చేస్తాడు? అయితే మన్మోహన్‌సింగ్‌కు రాముడి మద్దతులేదు. మోడీకి రాముడి బాణం ఉంది. బాణం ఎవ్వరి మీద ఉపయోగిస్తారో కొంత మనకు తెలుసు. ఎంతకాదన్నా రాముడు ఉదారత్తమైన చిహ్నం. రామాయణం రాసిన వాల్మీకి కూడా కొన్ని వందల, వేల సంవత్సరాల తర్వాత కూడా థాయ్‌లాండ్ రాచరికానికి, భారతదేశ మతతత్వ రాజకీయాలకు రాముడు పనికి వస్తాడని ఊహించి ఉండడు. కానీ ప్రతీఘాత విప్లవ భావాన్ని ప్రవేశపెట్టిన డాక్టర్ అంబేద్కర్ ఈ అంశాన్ని చాలా గొప్పగా పసిగట్టగలిగాడు.
పొఫెసర్ జి. హరగోపాల్
Namasete Telangana Telugu News Paper Dated : 05/09/2013
No comments:
Post a Comment