Saturday, July 7, 2012

దళితులపై దాడులు.. న్యాయాన్యాయాలు----దొంత భద్రయ్య





మం త్రి కొండ్రు మురళి దళితుడే అయినప్పటికి ఆయన ప్రభుత్వ భాగస్వా మి. ఈయనకు దళిత స్వభావం ఉన్నదో లేదోకానీ, ఈ ప్రభుత్వానికి అగ్రకుల స్వభావం పుష్కలంగా ఉన్నది. ప్రభుత్వంలో భాగస్వామి గా ఉన్న ఆయన అగ్రకుల స్వభావంతో ఉండక పోయినా అది ఆయనకు ఉన్న దళిత స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అగ్రకుల స్వభావం కలిగిన నాయకులు లక్షింపేట ఊచకోతలో తమ కుల ప్రజలకు అండగా ఉండడంలో ఆసక్తి కలిగినంతగా, కొండ్రు మురళి తాను మంత్రిగా ఉంటూ ఊచకోతకు బలైన తన కుల ప్రజల పక్షాన నిలవడానికి ఎందుకు ముందుకు రాలేకపోయాడు? ప్రభుత్వంలో కీలకంగా ఉన్న బొత్స సత్యనారాయణ అగ్రకుల స్వభా వంతో దాడి చేసినవారికి అండగా నిలి చాడు. కానీ దాడికి గురైన బాధిత ప్రజల ప్రతినిధి అయిన కొండ్రు మురళి అంతే స్థాయిలో తన ప్రజలకు అండగా రాజకీయ పాత్ర పోషించలేకపోయాడు. ఆధిపత్యం చెలాయించి భయవూభాంతులతో ప్రలోభాలకు గురి చేసి రాజకీయ మనుగడను కొనసాగించుకోవచ్చనే ధీమాతో అగ్రకుల నాయకుడు ఉంటే, దయాదక్షిణ్యాలతో రాజకీయ మనుగడను సాగించాలనుకునే స్థితిలో దళిత ప్రజావూపతినిధి ఉన్నాడు.



ఆటవికరీతిలో దాడిచేసిన వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన నాయకుడి కంటే, గండ్ర గొడ్డళ్లు, బరిసెలకు ఆహుతయిన దళిత ప్రజలకు అండ గా ఉండడానికి ముందుకురాని మంత్రి ఏవిధంగా కూడా సమర్థనీయుడు కాదు. రాజకీయంలో ఉంటే తప్ప మనుగడ సాగించలేని పరిస్థితులలో ఉంటే ఏ నాయకుడైనా కొండ్రు మురళిలాగే వ్యవహరిస్తారు. దేశంలో మనుగడలో ఉన్న సమాజాన్ని ప్రశ్నించాలం ఏటికి ఎదురీదే తత్వం ఉన్న వారితోనే సాధ్యపడుతుంది. కాని ఏటిలో కొట్టుకుపోయే వారితో ఈ సమాజ క్రమాన్ని మార్చలేము. ఈ సందర్భంలో ఈ మంత్రి కావచ్చు వేరొక సందర్భంలో ఇంకెవరైనా కావచ్చు. ఎవరైనా ఈ సమాజ పురోగతికి వారు ఏవిధంగానూ ఉపయోగపడరు. లక్షింపేట ఘటనకు ఈ ప్రభు త్వం సిగ్గు పడదు. కారంచేడు, చుండూరు ఘటనలకు బాధపడలేదు. నిజానికి సాటి మానవుల పట్ల కనీస మానవ మర్యాదలను చూపించలేని ఈ సమాజంలో దళితుల స్థితి మరోలా ఉంటుందని ఆశించడం అత్యాశ. సహజంగా అణచివేయబడుతున్న కులాలు ఆధిపత్యం చేస్తున్న కులాలపై ద్వేషాన్ని, ఆక్రోశాన్ని కలిగి ఉండాలి. కాని ఈ దేశంలో అణగారిన కులాలు వారిపై ఎన్ని దాడులు జరిగినప్పటికీ ఈ సమాజం పై ద్వేషాన్ని పెంచుకోవడం లేదు. కారంచేడులో కమ్మ కులస్తులు మాదిగలను నరికి చంపినా, చుండూరులో మాలలను రెడ్డికులం వారు ముక్కలుగా నరికినా తిరు గుబాటు చేయలేదు. 




మహరాష్ట్ర ఖైర్‌లాంజిలో సాక్ష్యం చెప్పిన పాపానికి ఇంటిని తగులబెట్టి తల్లీకూతుళ్లను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన క్రమం నుంచి నేటి లక్షింపేట ఘటనలో మాలలను కాపు కులస్తులు గండ్ర గొడ్డళ్లతో నరికి చంపినప్పటికీ ఈ అణగారిన కులాలు ఈ సమాజంపై ద్వేషాన్ని పెంచుకోవడం లేదు. వీరికి మానవ హక్కుల పట్ల అవగాహన లేదా? దాడుల వెనుక మూలాలు తెలియవా? వీరు దాడులు చేస్తు న్న వారిని ఎదుర్కొవడానికి చేతకానివారా? అసలు వీరికి ఆత్మగౌరవము లేదా? ఈ అణగారిన వర్గాలు తలుచుకుంటే వేల సంవత్సరాలుగా తమ కులాలపై జరుగుతున్న దాడులకు కారణమైన పీడక కులాలు ఈ పాటికి కనుమరుగు అయ్యేవి. అంబేద్కర్ అందించిన ప్రజాస్వామిక ఆలోచన విధానంతో పోరాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఆధిపత్య కులాల ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నది. అది ఏవిధంగాను కింది కులాలకు ఉపయోగపడదని అంబేద్కర్ చెప్పారు. అందుకే అంబేద్కర్ హింస ఒక శక్తి మాత్రమే అది సమస్యకు పరిష్కారం కాదని చెప్పాడు. అంబేద్కర్ చెప్పినట్టు హింసలో నమ్మకం లేకనే ఇంత ప్రజాస్వామికంగా ఉంటున్నారు. లేదంటే ఈ దేశం హింసతో వేగిపోతుంది. ఈ ప్రజాస్వా మ్య పరిధిలో అణగారిన వర్గాలకు రక్షణలను కల్పించే విషయంలో ఇంకా విఫలమైతే ఈ కులాల నుంచి తీవ్రమైన పోరాటాలు రాకమానవు. అవే వస్తే దాని పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో ఈ ప్రభుత్వాలు, ఆధిపత్య కులాలు ఆలోచించాలి. బానిసల లాగా చచ్చేబదులు విముక్తి కోసం పోరాడుతూ చావడమే గొప్పదని చెప్పిన స్పార్టకస్ మాటలను ఈ వర్గాలు అనుసరిస్తే.. పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఈ సమాజం తెలుసుకోవాలి.




కారంచేడు, చుండూరు ఘటనల్లో నిందితులకు శిక్షలు ఖరారు కావడానికి 15 సంవత్సరాల కాలం పట్టింది.ఒకవేళ మాల మాదిగలు ఏ ప్రాంతాలోనైనా కమ్మలు, రెడ్డి, కాపుల మీదనో దాడులు చేస్తే శిక్షలు ఖరారు కావడానికి 15 సంవత్సరాలు పడుతుందా? కేవలం నెలల వ్యవధిలోనే విచారణ జరిపించి మరణ శిక్షలు లేదంటే యావజ్జీవ శిక్షలు ఖరారు అయ్యేలాగా ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఇంకా అవసరమైతే దళితులు ఆ విధమైన దాడులు చేస్తే సమాజంలో శాంతిభవూదతల సమస్య కారణాన్ని చూపించి వారిని ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చివేస్తున్నది. మాల మాదిగలు కమ్మల మీద, రెడ్డిల మీద, కాపుల మీద దాడులు చేస్తే శాంతిభవూదతల సమస్య అవుతుంది. దాంతో వారిని చంపడానికైనా సిద్ధపడే ప్రభుత్వం అదే మాల మాదిగల మీద కారంచేడు నుంచి 25 సంవత్సరాల కాలంగా ఎన్నో ప్రాంతాల్లో అగ్రకులాలు దాడులు చేస్తే హత్యాకాండ కొనసాగిస్తే అది శాంతిభవూదతల సమస్యగా ఈ ప్రభుత్వాలకు కనిపించదా? కారంచేడు, చుండూరు ఘటనల్లో నిందితులను శిక్షించేందుకు దళితులు జాతీయస్థాయిలో సుదీర్ఘ కాలంపాటు ఉద్యమా లు చేయాల్సివచ్చింది. అయినప్పటికీ శిక్షలు ఖరారు కావడానికి 15సంవత్సరాలకాలం పట్టిం ది. అంటే మాల మాదిగలపై దాడులు చేసిన వారికి శిక్షలే పడాలంటే జాతీయస్థాయిలో పోరాటాలు చేస్తూ సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాలి. మాల మాదిగలు ఒకవేళ అగ్రకులాలపై దాడులు చేస్తే వారిని శిక్షించడానికి జాతీయస్థాయి ఉద్యమం అవసరముంటుందా? రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్ణయం జరుగుతుంది. దానికి ఉదాహరణ చిలుకలూరిపేట బస్సు దహనం కేసు. ఆ ఘటన చాలా హేయమైనది, క్షమించరాదనిది. 




ఆ ఘటనలోపాల్గొన్న దళితులు విజయవర్ధన్‌రావు, చలపతి నిందితులు. వారిపై నేరం రుజువు కావడానికి ఒకటి, రెండు సంవత్సరాలోనే జరిగి వారికి మరణ శిక్షపడింది.కారంచేడు,చుండూరు ఘటనలో ఇప్పుడు లక్షింపేట ఘటనల్లో పథకం ప్రకారం నరికి చంపేశారు. ఇంతటి మారణకాండ జరిగినప్పటికీ ఆ ఘటనల్లో పాల్గొన్న నిందితుపూవరికి మరణ శిక్షలు ఖరారు కాలేదు. వీరికి శిక్షలు తగ్గించాలని ఏ ఉద్యమం చేయాల్సిన అవసరం కమ్మలకు, రెడ్డిలకు రాలేదు. అంటే దాడులు చేయడంలో కుల ఆధిపత్యం ఉన్నది. శిక్షలు పడేందుకు విచారణను నడిపించడంలో ప్రభుత్వానికి కుల స్వ భావం ఉన్నది. ఈవిధమైన వివక్షాపూరితమైన ప్రభుత్వాల వైఖరి ఇలాగే ఉంటే అణగారిన వర్గాలు ఏదో ఒకరోజు అగ్ర కులాలపై సామూహిక దాడులు చేసే పరిస్థితి వస్తుంది. అంబేద్కర్ చెప్పినట్టు హింస ఒక శక్తి మాత్రమే అది సమస్యకు పరిష్కారం కాదని చెప్పినప్పటికీ కొంతకాలం ఆ శక్తిని కూడా ప్రభుత్వాలకురుచి చూపించే రోజు రాకముందే కళ్ళు తెరిచి లక్షింపేట ఘటనలో పాల్గొన్న నిందితులను కఠినంగా శిక్షించాలి.

-దొంత భద్రయ్య
Namasete Telangana News Paper Dated : 08/07/2012

No comments:

Post a Comment