Monday, July 23, 2012

మానుకోటను మరిచిపోయారా? ---సుజాత సూరేపల్లి


textile-123 talangana patrika telangana culture telangana politics telangana cinema
ఎన్నికల వ్యూహాలు చిత్ర విచిత్ర రూపాలలో ఊపందుకుంటున్నాయి. తెలంగాణకు నేతల తాకిడి మొదలైంది. దశాబ్దాలుగా తెలంగాణ ఇస్తామంటూ పబ్బం గడుపుతూ వస్తున్నవారు మొన్ననే నల్లగొండ ఫ్లోరోసిస్ సమస్య చూసి వస్తామని ఒక పరేడ్ చేసినరు. అంతకు ముందు జగన్ నిజామాబాద్‌లో ఓదార్పుయాత్ర కూడ చేసిండు. గిట్లబోయి గట్లోస్తే, ఒక్కసా రి పలకరిస్తే తమ సమస్యలన్నీ మాయమై పోవునని భ్రమపడెంతగా హడావిడి చేస్తారు రాజకీయ నాయకులు. మభ్యపెడదామని అనుకుంటారు కాని ప్రజలు ఈ అవుట్ డేటెడ్, అరిగిపోయిన ట్రిక్కులకి విసిగి వేసారి పోయారని అర్థం చేసుకోవ నిజమే ఎన్నికలప్పుడు తప్పితే ప్రజలవైపు చూసే సంస్కృతి మన రాజకీయాలలోకి పాకలేదు. నిజానికి తెలంగాణల తవ్వి తీస్తే అంతా గాయాల పొక్కిలి. జిల్లాకొక కథ. దోపి డీ, జీవన విధ్వంసం. దోపిడీ చేసేవాడే నాయకుడి వేషంలో వస్తాడు. మనవాళ్ళు దగ్గరుం డి కథ నడిపిస్తారు. ఇదే ఇక్కడి దౌర్భాగ్యం. తెలంగాణకు శా పం. రాజకీయ పార్టీలన్నీ ఇక్క డి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అన్ని ప్రాంతాలను పీల్చి పిప్పి చేసినరు. ఇంకా చేస్తనే ఉన్నరు.

స్పీకర్ నాదెండ్ల మనోహర్, మెగాస్టార్ చిరంజీవి ఇతరులు కలిసి విశాఖ జిల్లా అరకు ప్రాంతానికి పోయి అక్క డి అదివాసీలతో స్టెప్పులు వేసిన దృశ్యం కళ్ళకు కనపడతనే ఉన్నది. గ్రీన్‌హంట్‌లోనో, బాక్సైట్ తవ్వకాలలోనో మీ బతుకులు కూలిపోక ముందు చివరిసారిగా చూసి వస్తామని పోయినట్టు వారికి చెప్పకనే చెప్పినట్టయింది. మొన్నటి ఫ్లోరోసిస్ యాత్ర కూడా అట్లాంటిదే. ఈ రాజకీయ పార్టీలన్నీ చేయలేని పని అక్కడి ప్రజలు, సంఘాలు చేసినయి. చేస్తూనే ఉన్నయి. నిజానికి ఫ్లోరోసిస్ సమస్యపై చేయని పోరాటం లేదు.వందలకొద్ది ఫ్లోరోసిస్ బాధితులు నిరసనగా ఎన్నికలలో నిలబడి ప్రపంచ చరిత్ర సృష్టించినరు. వేల కిలోమీటర్లు ఢిల్లీకి పాదయాత్ర చేసి ప్రపంచం కళ్ళు తెరిపించినరు.కాని పాలకుల హృదయాన్ని కదిలించలేకపోయినరు.

జలసాధన సమితి తరపున ఎన్నో వినూత్న కార్యక్షికమాలు చేపట్టినరు. ప్రజలు తరతరాలుగా చేయని పాపానికి శిక్షని అనుభవిస్తూ కొన్ని వేలమంది జీవచ్చవాలుగా బతుకుతున్నారు. ఒక్కసారి నల్లగొండకు వస్తే తెలంగాణ ప్రజల బాధలు అర్థం అవుతాయి.కృష్ణానది నీళ్ళు రెండో పంటకు కావా లనేవాళ్ళు, తాగునీరు కోసం, కనీసం గుక్కెడు మంచినీళ్ళ కోసం తపించి పోతున్న ప్రజల ని చూస్తే అర్థం అవుతుంది. వలసపాలకుల నిర్లక్ష్యానికి నిలు సాక్ష్యాలు ఇక్కడి బాధితులు. మా పాలన మాకు వస్తే, మా బతుకులు మారతాయి అనే ఆశ, కోరిక. కాంగ్రెస్‌వారికి గడ్డురోజులు వచ్చినయి కాబట్టి నల్లగొండ పరేడ్ అనివార్యం అయింది. కాంగ్రెస్ లీడర్లు కానీ, రెడ్డి వెలమరాజులు కానీ ఏమి చేయలేకపోయారన్నది చరిత్ర చెప్పిన సాక్ష్యం. నల్లగొండ నుంచి ఎన్నికలలో నిలబడి, ప్రజల కష్టాలను పాలుపంచుకోకుండా, కేంద్రం చేతిలో కీలుబొమ్మలైన వారు ఎవరో, ఏమిటో ప్రజలందరికి తెలుసు. ఎవరు వచ్చిపోయినా తరువాత షరా మామూలే. ఎక్కడి గొంగడి అక్కడే. ఎవడి చావు వాడే.

ఇపుడు విజయమ్మ సిరిసిల్ల చేనేత కార్మికులను పరామర్శిస్తనంటున్నది. దాని పేరు దీక్ష. ఈ పరామర్శలు, ఓదార్పు యాత్రలు ఎందుకో, ఏమి ఉద్ధరిస్తాయో? దీనితో ప్రజలకు వొరిగేది శూన్యం. అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసి పెట్టిన ఘనత ఇక్కడి చేనేత కార్మికులది. తెలంగాణ కళలకు పెట్టింది పేరు. ఆటు పోచంపల్లి, గద్వాల్, ఇటు సిరిసిల్ల లాంటి ప్రాంతాలు చేనేతలో ఎంతో పేరు గాంచినవి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ నేతన్నలకు 1985 నుంచి గడ్డు రోజులు మొదలైనయ్. దీనికి తోడూ ఎల్‌పీజీ (ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ)లు కార్మికులను, కర్షకులను బిచ్చగాళ్ళుగా మార్చాయి. నూతన ఆర్థిక విధానాలు చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశాయి. చేతి వృత్తులు కూలబడ్డాయి. మగ్గాలు అటకెక్కినై. దీంతో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయినా ఇక్కడికి విజయమ్మ ఒక్కసారి వచ్చి ఒక్క కన్నీటి బొట్టు రాలిస్తే సమస్య పోతుంది అనుకుంటున్నారు కొద్దిమంది. విజయమ్మ దోచుకున్న లక్షల కోట్లలోంచి కొన్ని వేలు రాలిస్తే సమస్యలు పోతాయా?

తెలంగాణపై తమ వైఖరి ఏంటో తేల్చకుండా ఏ ఒక్క పార్టీ అడుగు పెట్టొద్దు అని ముక్తకంఠంతో ఇక్కడి ప్రజలు నినదిస్తున్నారు. స్వ ప్రయోజనాల కోసం తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన పార్టీలు, పబ్బం గడుపుకొని అవతల ఎట్ల పడ్డాయో మనం మరిచిపోవద్దు. రాష్ట్రపతి ఎన్నిక, క్విడ్ ప్రో కో, నీకింత నాకింత అని అక్కడ ఒప్పందాలు అయిపోయాయి. శత్రువులు కాస్త మిత్రులు అవుతున్నారు.

తెలంగాణ బిడ్డలుగా మాదొక సవాలు. ముందుగా మీకు తెలంగాణ గురించి ఏమి తెలుసో మాకు తెలియాలి. ఎవరు మమ్మల్ని మోసం చేశారో, ఎందుకు చేశారో మీరు చెప్పాలి. మీరు నిజంగా ఇక్కడి సమస్యలు తీర్చాలంటే ఇక్కడ ఉన్న దోపిడీని అడ్డుకోవాలి. కరీంనగర్‌లో ఓపెన్‌కాస్ట్ వల్ల జరుగుతున్న విధ్వంసాన్ని ఆపడానికి దీక్ష చేయా లి. ఊర్లను మింగుతున్న ఓపెన్‌కాస్టు లను ఆపా లి. అలాగే 720 గ్రానైట్, కంకర క్వారీలతో అల్లాడుతున్న కరీంనగర్‌ను, పర్యావరణాన్ని ఈ మైనింగ్ నుంచి కాపాడగలరా? బలి అవుతున్న గ్రామాలను, చారివూతక ప్రదేశాల ను, జంతుజాలాన్ని రక్షించగలరా? మిడ్ మానేర్, ఎల్లంపల్లి, అబ్దుల్ కలాం, సుజల స్రవంతి, రాజీవ్ రహదారి పేరుతో భూములు లాక్కొని, కనీసం నష్టపరిహారం చెల్లించకుండ పనులు నిర్వహిస్తున్న వారిని నిలదీసి ప్రజలకు న్యాయం చేకూర్చగలరా?
రాజకీయ ఎత్తుగడలకు సన్నాయి వాయిద్యాలకు మోసపోయే స్థితిలో మేం లేము.

మసిపూసి మారేడు కాయ చేసే మాటలతో ఇంకా మమ్ములలను మాయ చేలేరు. మోచేతికి బెల్లం అంటించి నాకమనే నాటకాలు ఆపండి. మీ మోసపు మాటలు,చేష్టలతో ఇప్పటికే తెలంగాణ అలిసిపోయి ఉన్నది. ఆత్మహత్యలతో విసిగి పోయి ఉన్నది.ఆవేదనతో ఆతలాకుతలమైతున్నది. కరువు రాకా సి కోరలకు తెలంగాణ కన్నబిడ్డలను అమ్ముకుంటున్నది. మాకు మీ దీక్షలు వద్దు. మమ్మల్ని మళ్లీ రగిలించొద్దు. రెచ్చగొట్టొద్దు. మీ చర్యలు చరివూతను పునరావృతం చేస్తే, మరో తిరుగుబాటుకు మీరే కారణం అవుతారు. ఇక వెనుదిరిగేది లేదు. మేము పోరాటానికి సిద్ధం.మాకు కేసులు, చావులు, యుద్ధాలు కొత్త కాదు. ఇక్కడి గడ్డ మీద కాలుపెట్టే ముందు మొన్నటి మానుకోట సంఘటనను గుర్తుతెచ్చుకోండి. ఆ పవివూతమైన రాయి ఇంకా మా చేతిలో పదిలంగానే ఉన్నది.
-సుజాత సూరేప
Andhra Jyothi News Paper Date : 23/07/2012 

No comments:

Post a Comment