Monday, July 23, 2012

జీవచ్ఛవాలపై ఎందుకీ వివక్ష?----శిరందాస్ ప్రవీణ్‌కుమార్


కొడుకు పుట్టిండని ఓ తండ్రి సంబురపడ్డడు. ఐదేండ్లు నిండంగనే బడి కి తోలిండు. కొద్ది రోజుల్లోనే తెలివికల్లోడ్ని కన్నవ్ అంటే ఎగిరి గంతేసిండు. కానీ ఆ సంబురం రెండేండ్లు కూడా నిల్వలేదు. కొడుకు జీవచ్ఛవంగా మారిండు. మంచంలో ఉన్నా లేనట్లుగనే కనిపిస్తడు. నాయినా నీకెందుకు కష్టం.. నాకింత విషమిచ్చి చంపరాదే అంటే ఆ తండ్రి కండ్లల్ల నీళ్లు సుడులు తిరిగినయి. బతికినంత కాలం నిన్ను బతికిస్తనంటూ ఆ తండ్రి సేవ చేస్తనే ఉన్నడు. అమ్మా.. అన్నం తిన్నవా అనడిగితే.. ఓ యువతి (అమ్మాయిలానే ఉండడం దౌర్భాగ్యం) కండ్లనిండ నీళ్లు తీసుకొని బువ్వ తినక వారం రోజులైంది సారూ.. అని చెప్పింది. ఎందుకమ్మా? తింటే దొడ్డికి వస్తది. కడిగేటోళ్లు లేరు. అమ్మనాయిన కూలీకి పోతరు. వాళ్లు లేనప్పుడు దొడ్డికొస్తే పక్కల్నే పోవాలి. ఈగలన్నీ చుట్టుముడుతయి. గబ్బు వాసనొస్తది. ఏం చేయాలి సారూ.. నాకీ బతుకొద్దని తింటలేనని చెప్పింది. ఇదీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇటీవల అఖిల పక్షాన్ని తోలుకొని ఫ్లోరైడ్ ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించినప్పుడు వెల్లడైన అంశాలే. కన్నీటి పర్యంతం చేసే ఈ సజీవ వెతలు ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో లెక్కకు మించినన్ని కనిపిస్తయి. నల్లగొండ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఏ గుడిసెనో, ఏ పసుల పాకనో కదిలించినా ఇట్లాంటి తెలుస్తయి. ఇలాంటి జీవచ్ఛవాల గురించి తెలియని పాలకులు లేరు. స్పీకర్ పర్యటనతో ఏదో ఒరిగిపోతుందని బాధితుపూవరూ ఊహించడం లేదు. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలన్నింటికి నీళ్లిందించేందుకు, పూర్తిస్థాయిలో సంక్షేమం దిశలో అడుగులు వేసేందుకు ఓ ప్రణాళికను రూపొందించాలని నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. అట్లనే ఇండ్లల్ల, స్కూళ్లల్ల అల్యూమినియం(రాతెండి) గిన్నెల్ల వండుకొని తింటే ఫ్లోరైడ్ ప్రభావం అధికమవుతుంది.

అందుకే వాటి బదులు స్టీలు గిన్నెలు సప్లయి చేయాలని కలెక్టర్‌కు చెప్పారు. బడులు, పేదోళ్లందరికీ స్టీలు గిన్నెలు ఇయ్యాలని చెప్పారు. ఆయనిట్ల పోయిండో లేదో.. లయన్స్ క్లబ్బోళ్లను పిలిచి స్టీలు గిన్నెలు మీరు సప్లయి చేస్తరా? అని కలెక్టర్ అడిగారు. 40 ఏండ్ల నుంచి అదే ప్రాంతం నుంచి ఎన్నికైతున్న రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌డ్డి మాత్రం అక్కడే ఉన్నడు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నోర్లు వెళ్లబెట్టి చూశారు. ఇప్పుడే గదా! స్పీకర్ గారు చెప్పింది.. స్టీలు గిన్నెల సప్లయి బాధ్యతను కూడా స్వచ్ఛంద సంస్థలపై రుద్దుతున్నరని ప్రశ్నించారు.

శాశ్వత పరిష్కారమో, తాత్కాలిక పరిష్కారమో గానీ నల్లగొండ జిల్లా అధికారులు పెద్ద ప్రణాళికనే తయారు చేసి స్పీకర్‌కు పంపించారు. దాని విలువ మూడు వేల కోట్ల పైమా స్టీలు గిన్నెలకే దిక్కు లేదు. సమైక్య పాలకులు ఇంత పెద్ద మొత్తంలో ఇస్తరా అని తెలంగాణ ఉద్యమకారులు చర్చించుకుంటున్నరు. ఆంధ్రాలో తుఫా నొస్తే చాలు.. సర్కారు మొత్తం అక్కడనే ఉంటది. బియ్యం మొదలుకొని గిన్నెలు, చెద్దర్లు, బట్టలు, వారి కుల వృత్తుల సామక్షిగినంత సప్లయి చేస్తరు. గిక్కడెందుకనో సర్కారోళ్లకు ఏది సప్లయి చేయాలన్న సంస్థలో, దాతలో గుర్తుకొస్తరు. 2001 ప్రాంతంలోనూ సబ్సిడీ మీద ఫిల్టర్లు ఇయ్యడానికి కూడా స్వచ్ఛంద సంస్థలపై, ఔదార్యం చూపించే వారిపైన దృష్టి పెట్టారు. బడికి పోయే పిల్లలు రోజూ నువ్వుండలు, పల్లీ పట్టీలు తింటే మంచిదని వైద్యులు సూచిస్తే వాటినీ సంస్థలకే అప్పగిస్తోంది. ఉపశమనం కోసం వైద్య పరీక్షలు చేసేందుకు దశాబ్ద కాలం కిందట చాలా ఊర్లల్ల క్యాంపులు పెట్టారు. డాక్టర్లు పరీక్షలు చేసి చాలా మందికి ఫ్లోరోసిస్ ఉన్నదని చెప్పా రు. నొప్పుల మందులేసుకుంటే ఉపశమనం కలుగుతుందన్నరు. వారానికి సరిపడ ఇచ్చిపోయారు. ఆ తర్వా త మందులు ఇచ్చినోళ్లు లేరు.. తెచ్చినోళ్లు లేరు. ప్రభు త్వం ఫ్లోరోసిస్ బాధితులను కార్పొరేట్ ఆసుపవూతికి తీసుకుపోయి శస్త్ర చికిత్సలు చేయించిన దాఖలాలు లేవు. కనీ సం ఆరోగ్యశ్రీ పథకంలో దీన్ని ఇప్పటికీ చేర్చలేదంటే ప్రజాస్వామ్యంపై అపనమ్మకం ఏర్పడుతుంది.డెంటల్ ఫ్లోరోసిస్‌కు చికిత్స చేయాలంటే లక్షల్లోనే ఖర్చయితది. దానికితోడు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన వైద్యులు, యంత్రాలు కావాలి. పైగా వేలాది మందికి శస్త్ర చికిత్సలు అవసరవుతయి. వందల కోట్లల్లో బడ్జె ట్ కేటాయించాల్సి వస్తదని పాలకులు ఫ్లోరోసిస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చలేదని చాలాకాలంగా ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి అభివూపాయపడుతున్నది. అట్లనే వైకల్యం ఉన్నోళ్లందరికీ పింఛన్ ఇస్తున్నరు. పాలకుల అంధత్వం వల్ల మంచం మీదనే జీవచ్ఛవాలుగా ఉన్న వారిని సాధారణ వికలాంగుల లెక్కనే జమ కడుతున్నరు. వీళ్లకూ అంతనే పింఛన్ ఇస్తున్నరు. ఇంట్ల అందరూ వికలాంగులే ఉంటే సర్కారిచ్చే రూ.500లతో ఎట్ల బతుకాలో పాలకులు ఆలోచించాలి. మందులకు కూడా సరిపోవడం లేదన్నది వాస్తవం. బాధ్యతలో సర్కారు వాటా ఎంతన్నదే ప్రశ్న?

పట్నమోళ్లకు, ఊర్లల్ల ఉండేటోళ్లకు ఏమైన తేడా ఉంటదా? కచ్చితంగా ఏ తేడా ఉండదు. నగరాల్లో ఎట్ల బతుకుతున్నరో, ఇక్కడా అట్లనే తింటున్న రు.. కాలకృత్యాలు తీర్చుకుంటున్నరు. కానీ సర్కారు దృష్టిలో మాత్రం ఒక్క టి కాదు. అవును.. సాగర్ నీళ్లు భాగ్యనగరానికి సప్లయి చేస్తున్నరు. మనిషికి రోజుకు 120 లీటర్లు లెక్క కట్టి ఇస్తున్నరు. అదే ఊర్లల్ల మనిషికి 40 లీటర్లని లెక్క కడుతున్న రు. అది కూడా వారానికి ఒక్కసారి రాకపాయే. ఎందుకీ వివక్ష? మనుషుల మధ్య ఎందుకీ వ్యత్యాసం? ఫ్లోరైడ్ ప్రభావిత 975 గ్రామాల్లో ఇప్పటికీ 450 గ్రామాలకే నీళ్లిస్తున్నరు. వాటికి కూడా ఈ లెక్కన ఇస్తుంటే పాలకులు ఫ్లోరోసిస్ బాధితుల పట్ల చూపిస్తున్న కరుణాకటాక్షాలు ఎట్లున్నయో మేధావులు ఆలోచించాలి. కచ్చితంగా నగరవాసులకు ఏ వంతున కృష్ణా జలాలు ఇస్తున్నరో మాకూ ఆ లెక్కనే ఇవ్వాలన్న డిమాండ్ ఈ మధ్య కాలం లో బాగా వినిపిస్తోంది. కనీసం 80 లీటర్ల వంతున లెక్క కట్టి పొద్దున్నే సప్లయి చేయాలి. మనిషికి మనిషికి మధ్య తేడా చూపించే హక్కు ఎవరిచ్చారని హైదరాబాద్‌లోని తెలంగాణ రీసెర్చ్ సెంటర్‌లో ఇటీవల జరిగిన ఓ సెమినార్‌లో మేధావులు, శాస్త్రజ్ఞులు పాలకుల ను ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ బాధితులకు నెలకు కనీసం రెండు వేలు పింఛన్, అంత్యోదయ కార్డు ద్వారా నెలకు 35 కిలోల బియ్యం పంపి ణీ చేయాలన్నరు. ఆర్టికల్14, 21లతో పాటు ఆర్టికల్ 39(బి),(ఇ),(ఎఫ్), 41, 43 47 ప్రకారం ప్రజలకు రక్షిత మంచినీళ్లందించాల్సిన బాధ్యత సర్కారుదే. హైకోర్టు 2001 ఆగస్టు ఒకటో తేదీన ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా.. అందుకే తక్షణం ఫ్లోరైడ్ ప్రభావిత అన్ని గ్రామాలకూ కృష్ణా జలాలను అందించే పనులను చేపట్టాలని డిమాండ్ చేశా రు. ఆయా గ్రామాల్లోని బడులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేయాలి. వాటికి కృష్ణా జలాలను సప్లయి చేయాలి. కనీసం భావితరాలను దీన్ని నుంచి కాపాడుకునేందుకు అవసరమైన చర్యలను ప్రభు త్వం చేపట్టాలి.
-శిరందాస్ ప్రవీణ్‌కుమా

Namasete Telangana News Paper Dated : 24/07/2012

No comments:

Post a Comment