Thursday, July 12, 2012

కిశోర్‌చంద్రదేవ్ పిల్లిమొగ్గ---ప్రొఫెసర్ జి. హరగోపాల్


కేంద్ర గిరిజన మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మారణకాండకు సరైన సమయంలో, సమస్య లోతుల్లోకి వెళ్లి అడిగిన ప్రశ్నలు, సలహాలను ఆహ్వానిస్తూ నేను వ్యాసం రాశా ను. తర్వాత ఒక బలమైన అనుమానమే కాక కొంత భయం కూడా వేసింది. ఈ విషయం మీద వీవీతో మాట్లాడుతూ ఈ మంత్రి నేను అలా అనలేదు పత్రికలు తప్పుగా రిపోర్టు చేశాయని అంటే రాసిన వ్యాసాన్ని ఎలా సమర్థించుకోవాలో అనే అనుమానం ఉంది అని అంటే, అలా అన్నా మనం ఆశ్చర్యపోవలసిందేమీ లేదు అని వీవీ అన్నారు. మంత్రి తానన్న మాటలను, వ్యాఖ్యలను వెనక్కితీసుకోకపోయినా, ఈమధ్యే ఛత్తీస్‌గఢ్ సంఘటనలో పోలీసుల ప్రవర్తన మీద స్పందిస్తూ, వాళ్లు అలాంటి పొరపాట్లు చేయకుండా ఆంధ్రవూపదేశ్‌లోని గ్రేహౌండ్స్ లాంటి లక్ష్యానికి అంకితమైన బలగాన్ని తయారు చేయాలని సూచన చేశారు. ఇది ఒక రకంగా నాలాంటి వాళ్లను నిరాశకు గురిచేసింది. లేకలేక ఒక మంత్రి ఒక సంఘటనకు ప్రజాస్వామ్యంగా స్పందించాడని కొంత సంతోషపడ్డా తాను అంతకుముందు లేవదీసిన చర్చకు ఈ సలహా ఎట్లా సరిపోతుందో అర్థం కావడం లేదు.ఆయన అడిగిన ప్రశ్న అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులకు అడవి మీద, ఖనిజ సంపద మీద హక్కు ఉంటుందని వాళ్ళ అనుమతి లేకుండా ఖనిజాలను బయటివాళ్లకు అప్పజెప్పకూడదని, అలాగే ఖనిజాలను దేశ ప్రయోజనాలకే ఉపయోగించాలని అంటూ, ‘గ్రేహౌండ్స్’ ఈ లక్ష్యాలను ఎలా సాధిస్తుందో, ఆ బలగాలు ఎలా ఉపయోగపడతాయో చెప్పవలసిన బాధ్యత ఉంది.

ఆంధ్రవూపదేశ్‌లో గ్రేహౌండ్స్ బలగాలు విజయాన్ని సాధించాయని, మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేశాయని దేశ వ్యాప్తం గా ప్రచారం జరుగుతోంది. దీంట్లో కొంత నిజమున్నా ఛత్తీస్‌గఢ్‌కు ఆంధ్రవూపదేశ్‌కు చాలా తేడా ఉంది. అయితే మావోయిస్టు పార్టీ ఈ రాష్ట్రంలో వెనక్కి తగ్గిన తర్వాత ఖనిజ సంపద దోపిడీ నిరాఘాటంగా సాగింది. లక్షల కోట్ల ఆస్తుల గురించి రాష్ట్రంలో చాలా చర్చ జరుగుతున్నది. ఈ కోట్ల రూపాయల సంపదలో ఖనిజాల నుంచి వచ్చిన లాభాలు, నల్లధనం, దాని నుంచి రాజ్యం మీద వాళ్లు చేస్తున్న సవారీ మన అనుభవంలోనే ఉంది. గ్రేహౌండ్స్ మావోయిస్టు ఉద్యమాన్ని అణచడానికి కొంతవరకు ఉపయోగపడిందేమో కానీ, ఈ కోట్ల సంపద దోపిడీని అది ఎలా ఆపగలదు? ఈ అక్రమ సంపదను రక్షించుకోవడానికి దోపిడీదారులు పెంచి పోషించిన మాఫియాను ఏం చేయగలరు? నేను ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తం గా పనిచేస్తున్న 160 మంది సీనియర్ పోలీస్ అధికారులకు లెక్చర్ ఇచ్చినప్పుడు మాఫియా పాత్రను, అది పెరిగిన విధానా న్ని విశ్లేషిస్తూ, ఈ మాఫియా దగ్గర ఆయుధాలున్నాయి, ఇది సంపూర్ణంగా చట్ట వ్యతిరేక మూక, వీళ్లకు రాజకీయ విశ్వాసాలులేవు. ఈ మాఫియా దాదాపు అన్ని లాభసాటి రంగాల్లో ఉంది. మహారాష్ట్రలో కిరోసిన్ మాఫియా జిల్లా కలెక్టర్‌ను సజీవంగా అంటుపెట్టింది. (దానికి కిరోసిన్‌నే ఉపయోగించి ఉంటారు) అలాగే మధ్యవూపదేశ్‌లో అనుకుంటా ఒక ఐపీఎస్ ఆఫీసర్‌పై నుంచి ట్రక్కు నడిపించి చం పారు.

అధికారులను బెదిరిస్తూ ఉంటారు. అలాగే దేశ వ్యాప్తంగా సమాచార హక్కు కోసం పోరాడుతున్న చాలామందిని హత్య చేశారు. సమాచార హక్కు కోసం పోరాడే వారు నిరాయుధులు, చట్టం మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నవారు. వాళ్లకు ఎలాంటి రక్షణ లేదు. ఇది ఛత్తీస్‌గఢ్‌లో శంకర్‌గుహ నియోగి లాంటి ఒక గొప్ప కార్మిక నాయకుడిని చంపినప్పుడే నియంవూతించవలసిన మూక. ఈ మాఫియాను ఎలా ఎదుర్కోవాలి? దానికి గ్రేహౌండ్స్ ఏం చేయగలవు అన్న సవాలు మనముందు ఉన్నది. దీనికి స్పందిస్తూ కొందరు పోలీసు అధికారులు ఈ మాఫియా తో పోరాడవచ్చు కదా అని అన్నారు. అంటే పోలీసు అధికారులకు కూడా మాఫియాను ఎలా నియంవూతించాలో అర్థం కావడంలేదు.

సమస్య మూలాలు ఖనిజ సంపద అక్రమ దోపిడీలో ఉందని, గిరిజనులకు పూర్తి హక్కులను ఇవ్వడమే పరిష్కారమని ఒకవైపు అంటూ రాజ్యహింసను సమర్థించడం, సమస్య ఒకటైతే పరిష్కారం హింసలో చూడడం, అధికారంలో ఉన్న వారికి సహజమేమో అనిపిస్తుంది. నిజానికి ఈరోజు మావోయిస్టు హింసకంటే కూడా వాళ్ల రాజకీయ విశ్వాసాలే వ్యవస్థను చాలా భయపెడుతున్నాయి. రాజకీయ విశ్వాసాలులేని ఏ హింసైనా చాలామందికి అంగీకారంగా ఉంది. నిజానికి గుజరాత్ మాన వ హననంలో హత్యలు, మానభంగాలు, చిన్న చిన్న పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపడానికి వ్యతిరేకంగా మేం పోరాటం చేశాం. పిల్లలను మావన కవచంగా మావోయిస్టులు ఉపయోగిస్తున్నారు అని మీడియా ఎంత ప్రచారం చేసినా, మొన్న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన హత్యాకాండ సందర్భంలో మావోయిస్టులు లేరని అందరూ అంగీకరిస్తున్నారు. ది హిందూ దిన పత్రిక, ఎన్డీటీవీ ఈ విషయాన్ని కొంత విస్తృతంగానే సమాజ దృష్టికి తీసుకొచ్చాయి. పిల్లలను మానవ కవచంగా వాడుతున్నారన్నది కనీసం ఈ సంఘటనలో లేదని అంటే దీన్ని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకున్నారన్నది స్పష్టంగానే కనబడుతుంది.

మావోయిస్టు ఉద్యమం ఒక సైన్యాన్ని కలిగి ఉందని, వాళ్లు రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారని, ఇది చాలా భయంకరమైన అంశమని బీజేపీ చాలా పెద్ద ఎత్తున వాదిస్తున్నది. మావోయిస్టు పార్టీ కూడా ఈ అంశం మీద కొంచెం ఎక్కువగా మాట్లాడడం వల్ల విశాల ప్రజానీకంలో కూడా ఆ అభివూపాయం ఉంది. కానీ ఈ సమాజం చాలా అమానుషంగా మారుతున్నదని, మానవీయ విలువలు కాపాడుకోవలసిన ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలని చాలామందే కోరుకుంటున్నారు. సమాజంలోని వ్యవస్థీకృ త హింసను క్రమక్షికమంగా అర్థం చేసుకుంటున్నారు. హింస, ప్రతిహింసలు సామాజిక మార్పులో భాగం కావచ్చు కానీ, సమాజం తనను తాను మానవీ య సమాజంగా నిలుపుకోవడానికి చాలా పోరాటాలే చేయవలసి ఉంది. ఈ మానవీయ పోరాటాలలో మావోయిస్టు ఉద్యమం పాత్ర ఎంత ఉంటుందన్నది ఒక చారివూతక సవాలు. దాంట్లో వాళ్లు అంటున్న ప్రతిహింస పాత్ర గురిం చి చర్చ జరగవలసి ఉంది.

సమాజం హింస, ప్రతిహింస వలయంలో చిక్కుకొని విపరీతమైన ప్రాణనష్టం జరుగుతుందని, దీన్ని ఎలాగైనా నివారించాలనే లక్ష్యంతో మన రాష్ట్రం లో పౌర స్పందన వేదిక శంకరన్ ఆధ్వర్యంలో (మానవత్వం పరిమళించిన మంచి మనిషి) దాదాపు ఆరు, ఏడు సంవత్సరాల కృషి ఫలితంగా మావోయి స్టు పార్టీ, జనశక్తి నాయకులు ప్రభుత్వం తో చర్చించడానికి స్వయాన వచ్చా రు. చర్చల ఫలితమేమిటో తెలుగు సమాజానికి అనుభవపూర్వకంగా తెలుసు. ఈ విషయం కిశోర్ చంద్రదేవ్‌కు తప్పక తెలిసే ఉంటుంది. చర్చల సందర్భంలో ప్రజాస్వామిక హక్కులు, భూసంస్కరణలు వంటి సమస్యలు చర్చకు రావడంతో అక్ర మ సంపాదన అధినేతలు చర్చలను ఒక్క అడుగు ముందుకు పోనీయలేదు. ఇంత అనుభవం ఉండి, ప్రజల నుంచి ఎదిగి వచ్చిన కిశోర్ చంద్రదేవ్ ఆదివాసీల సమస్యకు గ్రేహౌండ్స్‌యే పరిష్కారం అనటం సరైంది కాదు. ఉత్తరాంవూధలో మావోయిస్టు ఉద్యమం ఉంటే లక్షింపేట ఊచకోత జరిగి ఉండేదా? ఆయన ఆదివాసీల సమస్యకు పరిష్కారం గ్రేహౌండ్స్‌యే అనడం చారివూతక విషాదం.
Namasete Telangana News Paper Dated : 12/07/2012

No comments:

Post a Comment