Sunday, September 22, 2013

ఆంగ్ల ప్రావీణ్యతే లక్ష్యం By డాక్టర్. ఆర్. యస్. ప్రవీణ్ కుమార్ ఐ పి యస్, సెక్రెటరీ , APSWREIS.Dr. Repally Shiva Praveen Kumar IPS (Inspector General of Police) Secretary, Andhra Pradesh Social Welfare Residential Educational Institutions Society (APSWREIS), Hyderabad, Andhra Pradesh, India   

Dr. Repally Shiva Praveen Kumar IPS (Inspector General of Police) with Dress తల్లిదండ్రులు సవారన్న, ప్రేమమ్మ. ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో చిన్నతనం నుంచే చదువు ప్రాధాన్యత తెలిసింది. వారిద్దరూ ఏ ఊళ్లో పనిచేసినా.. అక్కడ ఉండే దళితవాడలకు వెళ్లి ఉచితంగా ట్యూషన్లు చెప్పేవాళ్లు. అర్ధబలం, అంగబలం లేని మనకు చదువే పెద్దబలం అంటూ వారు చెప్పిన వారి మాటలు ఎందరో విద్యార్థులను బడి బాటపట్టేలా చేశాయి. ఇక నా విద్యా భ్యాసమంతా సాంఘికసంక్షేమ గురుకుల పాఠశాల్లోనే జరిగింది. ఏడవ తరగతి వరకు అమ్రాబాద్‌లో, ఎనిమిది నుంచి పదోతరగతి వరకు అలం పూర్‌లో చది వాను. ప్రశ్నలకు సమాధానాలు పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా సొంతంగా రాసినందుకు సోషల్‌ టీచర్‌ క్లాస్‌లో అందరి చేత చప్పట్లు కొట్టించా రు. నా స్కూల్‌ జీవితంలో నన్ను ఎంతో ప్రభావితం చేసిన సంఘటన ఇది.
ఇంగ్లీష్‌ నేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాం..
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ కర్నూల్‌లో ఇంటర్‌ చదివిన తరువాత రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేశాను. కాలేజీల్లో విపరీతమైన ర్యాగింగ్‌ ఉండేది . వివక్ష చూపించేవారు. మిత్రులు, కొందరు ప్రొఫెసర్లు ధైర్యం చెప్పేవారు. ఇంటర్‌ వరకు తెలుగు మీడియంలోనే మా విద్యాభ్యాసమంతా కొనసాగింది. తోటి విద్యార్థులను చూస్తే తెలిసింది మేం ఎంత వెనుకబడి ఉన్నామో.. గ్రామీణ ప్రాంతాల నుంచి రావ డం, ఇంగ్లీష్‌పై అంతగా పట్టు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. చాలా అవకాశాలు చేజార్చుకున్నాం. తెలుగు మీడియంలో చదివిన వారందరం ఒక గ్రూప్‌గా సాధన చేశాం. కోఠిలో దొరికే ఇంగ్లీష్‌ నవలలను కొని( చాలా తక్కువ ధరకు లభించేవి) డిక్షనరీ సహాయంతో పోటీలు పడి చదివేవాళ్లం. గ్రామర్‌ నేర్చుకోవడానికి ఇది బాగా పనిచేసింది.
మూడో ప్రయత్నంలో సివిల్స్‌...
మా సీనియర్స్‌ తనతో పాటు సివిల్స్‌ రాయమని ప్రోత్సహించారు. మొదటిసారి సివిల్స్‌ రాసినప్పుడు ఇంట్లోనే ఉండి రోజుకు 16గంటలు చదివేవాడిని. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. ఎపి స్టడి స ర్కిల్‌ ఎంట్రన్స్‌లో మొదటిర్యాంకు రావడంతో అక్కడ కోచింగ్‌ తీసుకునే అవ కాశం లభించింది. రెండో ప్రయత్నంలోనూ ఇంటర్వ్యూ వరకే వెళ్లాను. మూడవ ప్రయత్నంలో 1994 లో ఐపిఎస్‌కు సెలక్ట్‌ అయ్యాను. పోలీస్‌ శాఖలో 15సంవత్సరాలు పని చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో కలిసిన కొందరు విద్యార్థుల ద్వారా మళ్లిd చదవాలనిపించింది. 2011లో హార్వర్డ్‌ యూనివర్సిటీకి దరఖాస్తు చేశాను.


హార్వర్డ్‌ లో సీటు రావడం మరచిపోలేని అనుభవం..
ప్రపంచప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదవాలని ఆశించేవారు, అర్హత ఉన్నవారు లక్షల్లో ఉంటారు. గ్రామీణ పేద కుటుంబం నుంచి వచ్చిన సగటు విద్యార్థినైన నాకు సీటు రావడం అనేది మాత్రం అదృష్టమే. చిన్నతనం నుంచి నేను అనుభవించిన వివక్ష, అరకొర వసతుల్లో సాగిన విద్యాభ్యాసం, యూనివర్సిటీ మార్కుల్లో తేడాలు అన్నిటినీ ఎదుర్కొని ఐపిఎస్‌కు ఎంపిక కావడం వివరించాను. ఇంటర్వ్యూలో సైతం వీటిపైనే ఎక్కువగా ప్రశ్నలడిగారు. హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ అసోసియేట్‌ డీన్‌ అలెగ్జాండ్రా మార్టినెజ్‌ నా దరఖాస్తు, ఇంటర్వ్యూలో మాట్లాడిన విధానం ఉత్తేజపూ రితంగా ఉందన్నప్పుడు ఆనందిం చాను. నా లాగే మరెందరో సమాజంలోని కులవివ క్షను అధిగమించి అంతర్జాతీయ విశ్వవిద్యాల యాల్లో ఉన్నతవిద్యను అభ్యసించాలన్నదే నా ఆశయం. అందుకు కావల్సిన సదుపాయాలు కల్పిస్తూ.. మార్గనిర్దేశకత్వం మాత్రమే నేను చేస్తున్నాను.
నేటి విద్యార్థులకు భాష సమస్య కాకుండా..
బాల్యంలో మేం ఎదుర్కొన్న సమస్యలు ఇప్పటి తరం విద్యార్థులకు ఎదురుకావద్దన్న ఆలోచనతో హార్వర్డ్‌ యూనివర్సిటీలో కోర్సు పూర్తిచేసుకుని రాగానే.. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిగారిని స్వయంగా కలిసి నేను చదివిన సాంఘిక సంక్షేమ శాఖలో పోస్టింగ్‌ ఇవ్వమని, పేద విద్యార్థులకు సేవచేసే అవకాశం కల్పించమని కోరాను. ఆయన ఎంతో ఆనందంగా.. అభినందనలతో ఈ పోస్ట్‌ ఇచ్చి లక్షా70వేల మంది విద్యార్థుల జీవితాలను నా చేతుల్లో పెట్టారు.
నేను గురుకుల పాఠశాలలో సమస్యలు ఎమిటో నాకు బాగా తెలుసు. వాటికి పరిష్కారాలు ఆలోచించి, అమలుచేస్తూ గురుకుల విద్యార్థులను ఇతరులకు ఏ విధంగానూ తీసిపోని స్థాయికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. నా ఆలోచనలను అర్థం చేసుకున్న ప్రభుత్వం నాకు స్వేచ్ఛనిచ్చింది. బడ్జెట్‌లో కేటాయించిన నిధులనే జాగ్రత్తగా ఉపయోగిస్తూ.. చదువులోనే కాదు.. ఇతర అని ్న రంగాల్లోనూ విద్యార్థులు ముందుం డేలా శిక్షణనిస్తున్నాం.
మేధావులైన ఉపాధ్యాయులు..
వె ురికల్లాంటి విద్యార్థులు..
నేను వచ్చిన కొద్ది రోజుల్లోనే.. రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో పరిస్థితులను స్వయంగా తెలుసు కున్నాను. చాలా మంది ఉపాధ్యాయులు ఎంతో ప్రతిభ గలవారున్నా సరైన గుర్తింపు లభించడంలేదు. ఈ సంవత్సరం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందిస్తున్నాం. విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కల్పిస్తూ.. వారిని జాతీయస్థాయిలో కార్పొరేట్‌ విద్యా ర్థులతో సమానంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం.
పేద గ్రామీణ విద్యార్థులందరూ అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ అందరితో సమానంగా.. అందలంపై ఉండాలన్న నా ఆలోచనను అర్ధం చేసుకున్న సిబ్బంది, ఉపాధ్యాయులు ఎంతో సహకరిస్తున్నారు. వారి కొత్త ఆలోచనలను జోడిస్తున్నా రు. విద్యార్థులకు చదువుతో పాటు వారిలోని సృజనాత్మకత వెలికితీసి మెరికల్లాంటి రేపటి తరాన్ని తయారుచేస్తున్నారు.
ఈ సంవత్సరం కేంద్రప్రభుత్వం క్యాలీటీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అనే అంశంపై ఈనెల 27,28తేదీల్లో బెంగళూర్‌లో జరిగే సదస్సుకు 40మంది ఉపాధ్యాయులు హాజరువుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల నుంచి ప్రతినిధులు ఇక్కడ క్వాలిటీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అందించడానికి సూచనలు ఇస్తారు.
ఇంగ్లీష్‌ మాతృభాష కాని దేశాలు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి.
ఇంగ్లీష్‌ అనేది గ్లోబల్‌ లింక్‌ భాషగా మారి అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందింది. ఇంగ్లీష్‌ మాతృభాష కాని ఎన్నో దేశాలు ఇంగ్లీష్‌ మాధ్యమంలో విద్యాబోధన చేస్తూ.. పట్టుసాధిస్తున్నాయి. ధనిక వర్గాలు స్వాతంత్య్రానికి పూర్వమే ఆంగ్లభాషను సొంతం చేసుకున్నాయి. ఇంగ్లీష్‌ అంటే మనలో ఒక భయం. ఆ భయం బాల్యంలోనే పోవాలి అన్నది మా తాపత్రయం. అందుకే ఇంగ్లీష్‌ నేర్చుకోవడం అనేది ఉద్యమంగా తీసు కుంటున్నాం. భాష రాని కారణంగా ఎవ్వరూ ఉన్నతవిద్యా, ఉపా ధి, ఉద్యోగా వకాశాలను కోల్పోవద్దు అన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.
రిజర్వేషన్లతో పాటు ఆత్మవిశ్వాసం పెంచాలి..
సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న షెడ్యూల్‌ కులాలు, తెగలవారికి రిజ ర్వేషన్లు ఇచ్చారు. కాని, వారిలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నాలు చాలా తక్కువగా జరిగాయి. 67సంవత్సరాల స్వతంత్రభారతంలో ఇంకా చదువురాని వారెందరో ఉన్నారు. మా విద్యాసంస్థల్లో అధికశాతం మొదటితరం విద్యావంతులు. వారికి ఎప్పుడూ తాము తక్కువ వాళ్లం అన్న భావన మన స్సు మూలల్లో ఉండటంతో ఉన్నతస్థానాన్ని అందుకున్నవారు చాలా తక్కువగా ఉంటున్నారు. నేను ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా వచ్చిన తరువాత విద్యార్థులతో ప్రతిరోజూ ఒక ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. . అందులోని మొదటి వాక్యం.. మేం ఎవరికన్నా తక్కువ కాదు.. ఈ ఒక్క మాటతో వారిలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ సంవత్సరం ఎంసెట్‌, ఐఐటి, నీట్‌లకు ఎంపికైన విద్యార్థులున్నారు. అతి పేద కుటుంబం నుంచి వచ్చిన మొదటితరం విద్యావంతురాలు జయంతి మెడిసిన్‌లో సీట్‌ సాధించింది.
విద్యార్థిదశలో జీవితలక్ష్యం అనేది లేకపోతే సమాజంలోని దురాలవాట్లన్నీ చుట్టేస్తాయి. నీవు ఈ ఉద్యోగం సాధించాలి, ఈ స్థాయికి చేరుకోవాలి అంటూ.. చెప్పడానికి ప్రపంచజ్ఞానం లేదు. కాని ఇప్పుడు ప్రపంచం చాలా చి న్నదిగా మారి విస్తృతమైన అవకాశాలను మన ముందుకు తీసుకువస్తోంది. వాటిని జీవనపురోగమ నానికి ఉపయోగించుకునేలా నేటి విద్యార్థులకు సూచనలు ఇవ్వగలిగితే చాలు వారే సమసమాజ నవజాతి నిర్మాతలవుతారు.
ప్రతి సంవత్సరం స్కూల్‌, కాలేజ్‌ కాన్వొకేషన్‌ డే..
విశ్వవిద్యాలయాల్లో మాదిరిగానే రెసిడెష్షియల్‌ స్కూల్‌, కాలేజిల్లో కాన్వొకేషన్‌ డే నిర్వహించాలని నిర్ణయించాం. డ్రాఫవుట్‌లను అరికట్టేందుకు, విద్యపై ఆసక్తి పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని మా ఆలోచన. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా యూనిఫామ్స్‌ను నిఫ్ట్‌ వారి సహకారంలో రూపొందించాం. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచి.. తాము చేరుకోవల్సిన గమ్యం గురించి తెలియ జేయాల న్నదే ఆ ప్రయత్నం.
బాలబాలికలకు ప్రత్యేక కౌన్సిలింగ్‌..
రేపటి ప్రపంచానికి వారసులైన నేటి బాలబాలికలు నిర్ధిష్టమైన జీవనప్రణాళికతో ముందుకు సాగేలా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకునేలా తర్ఫీదు నిస్తున్నాం. బాలికలు ఆత్మనూన్యతాభావంతో ఉంటున్నారు. వారి కోసం వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వారి సమస్యలను ధైర్యంగా చెప్పేలా.. శిక్షణనిస్తున్నాం. అలాగే బాలలకు ప్రత్యేక కౌన్సిలింగ్‌ ఇస్తున్నాం. ఆడవారిని తమతో సమానంగా చూసేలా.. గౌరవించేలా వ్యక్తిత్వ వికాసతరగతులను నిర్వహిస్తున్నాం. యూత్‌ ప్లారమెంట్‌ను జోనల్‌ స్థాయిలో ఏర్పాటుచేస్తున్నాం. మా ప్రయత్నాన్ని మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె అబ్దూల్‌కలామ్‌ ఎంతో అభినందించారు. ఇటీవల అనంతం పేరుతో మేం ఏర్పాటుచేసిన కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మా విద్యార్థులను భావిజాతి నిర్మాతలుగా అభివర్ణించారు.
ప్రత్యేక మ్యాగజైన్‌.. స్పెరోస్‌
నేను గమనించిన మరో ముఖ్యమైన విషయం రెసిడెన్షి యల్‌ స్కూల్‌ విద్యార్థులంటే చిన్నచూపు ఉంది. అందుకనే వారిని రెసిడెన్షియల్‌ విద్యార్థులన కుండా స్పెరోస్‌ అంటున్నాం. నాలుగునెలల కిందట స్పెరోస్‌ పేరుతో ఇంగ్లీష్‌ మ్యాగజైన్‌ తీసుకువచ్చాం. ప్రతినెలా వచ్చే ఈ మ్యాగజైన్‌లో విద్యార్థుల రచనలే ఉంటాయి. ప్రతి జిల్లా నుంచి బెస్ట్‌ ఎస్సే, బెస్ట్‌ పోయమ్‌ను ఎంపిక చేసి వాటిని ప్రచురించడంతో పాటు ఐదువందల రూపాయల పారితోషికం అందిస్తున్నాం. ఉన్నతవిద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఇం గ్లీష్‌ రాని కారణంగా చేజారిపోవద్దు అన్నదే నా ఆలోచన. ఈ విషయంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు దిశదశ నిర్దేశం చేయాలన్నదే నా తపన.
2015నాటికి మౌంట్‌ ఎవరెస్ట్‌ పై స్పెరోస్‌..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 290 విద్యాసంస్థల్లో లక్షా70వేల మంది విద్యార్థులున్నా రు. ప్రతి విద్యార్థి జంకు లేకుండా ఆంగ్లంలో మాట్లాడాలి, తడబడకుండా చదవాలి. ఇలా అంటున్నాని నేను మాతృభాష వ్యతిరేకిని కాను. ఇంగ్లీష్‌ రాకపోవడం అనేది ఒక మైనస్‌ కావద్దు అన్నేదే నా ప్రయత్నం. గత రెండు సంవత్సరాలుగా టెక్నాలజీ పరంగా చాలా సంస్కరణలు జ రుగుతున్నాయి. ప్రతి విద్యార్థిలో అంతర్లీనంగా దాగిన శక్తిసామర్ధ్యాలను వెలికితీసేలా ప్రత్యేక విధానాలు అవలంభిస్తున్నాం. ప్రతి స్కూల్‌కు ఇరవై వేల రూపాయల క్రీడాసామాగ్రిని అందిస్తున్నాం. ఇండోర్‌ , ఔట్‌డోర్‌ క్రీడల్లో శిక్షణనిస్తున్నాం. ప్రపంచంలోని ఎతైన పర్వతాలను అధిరోహించిన శేఖర్‌బాబు ఆధ్వర్యంలో మొదటిబ్యాచ్‌ విద్యార్థులు భువనగిరికొండపై రాక్‌ క్లైమింగ్‌లో శిక్షణపొందుతున్నారు. 2015నాటికీ మౌంట్‌ ఎవరెస్ట్‌ అధిరోహించేలా శిక్షణ ఇస్తున్నాం. అర్ధబలం, అంగబలం లేనప్పుడు చదువునే ఆయుధంగా మలచుకోవాలి అనేది నేను నమ్మే సిద్దాంతం. అదే విద్యార్థులకు వివరిస్తూ.. కులం పేరుతో వివక్షకు గురవుతున్న వారందరికీ విద్యే వజ్రాయుధమని, దేశ ఉజ్వల భవిష్యత్‌కు గురుకుల విద్యార్థులే మార్గదర్శకుల ు కావాలన్నది నా తపన.

Exclusive Interview with Andhra Prabha Telugu News Paper Dated : 22/09/2013 

1 comment:

  1. hi sir iam dileep , iam prepare IPS how sir iam telugu medium student plz hlp me english subject

    ReplyDelete