హిందూ సాంప్రదాయవాదులు, ఆధ్యాత్మిక వాదులు ఇటీవల బౌద్ధం కూడ హిందూమతంలో భాగమేనని వాదిస్తున్నారు. అంతేగాక సంస్కృత భాష హిందూ మతం సొత్తుగా భావిస్తున్నారు. ఇవి రెండూ వక్రీకరణతో కూడుకొన్నవే. వేదాలను ఆధారం చేసుకొని వచ్చిన వైదిక మతమే పరిణామంలో బ్రాహ్మణ మతంగాను, హిందూమతంగాను పిలవబడుతున్నది. ఇవి పర్యాయ పదాలుగానే వాడుబడుతున్నాయి. వేదాల్లోని పురుషసూక్తం 10వ మండలం చాతుర్వర్ణాన్ని ప్రతిపాదించింది. ఈ చాతుర్వర్ణేతురులే పంచమ వర్ణులుగా పేర్కొనబడ్డరు. ఈ శ్లోకాన్ని మనుస్మ ృతి విస్త ృతం చేసి వర్ణ వ్యవస్థకు సంబంధించిన దినచర్యను, కార్యక్షికమాన్ని ప్రకటించింది. వేదాల్లో అంతకుముందు మూలవాసుల మాతృస్వామ్య విధానం మీద, నీటి సంస్కృతి మీద దాడి జరిగింది. వేదాలు పితృస్వామికమైనవి. అందులో స్త్రీఅణచివేత, పితృస్వామిక అణచివేత ప్రముఖమైన అంశాలు.
వేదాలు భారతీయ మైనవి కావని మన చరివూతకారులందరూ అంగీకరించారు. దీనిని కోశాంబి, రోమిల్లా థాపర్, ఎల్.భాషం నిర్ధారించారు. సామాజిక చరివూతకారులు ఫూలే, అంబేద్కర్‌లు సంప్రమాణంగా నిరూపించారు. ఆర్యులు మధ్యాసియా నుంచి వలస వచ్చిన జాతులు. వారు మొదట సంచార జాతులు. వారు వాఙ్మయంతో పాటు ఆయుధాన్ని నమ్మారు. వారి దేవుళ్ళు, దేవతలు ఆయుధదారులు. వారిది వ్యాప్తి సంస్క ృతి, ఆయుధ సంస్క ృతి. సుదీర్ఘకాలం మూల జాతులతో వారు ఆధిపత్యం కోసం పోరాడారు. వారికి ఆధీనులైన వారిని శూద్రులన్నారు. వారిని ఎదిరించి పోరాడి ఓడిన వారిని బహిష్కరించి అస్పృశ్యులన్నారు. ఆదిభారతీయులకు అస్ప ృశ్య భావన లేదు. భారతదేశానికి ఆర్యులు రాక ముందు ‘అస్పృ శ్యత’ అనే శబ్దం కాని, ‘అస్పృశ్యత అనేభావన కాని భారతదేశంలో లేదు. వింధ్యాపర్వతాల ఇవతల దక్షిణాపథంలోకి ఈ బ్రాహ్మణాధిపత్య భావాలు రావడనికి చాలాకాలం పట్టింది.
ఆర్యులకు అనార్యులకు జరిగిన యుద్ధ క్రమం లో ఆర్యులు దేశీయ ప్రజల నుంచే ఎంతో మౌఖిక విద్య నేర్చుకొన్నారు. ఆ నేర్చుకున్న వాటిని వారు వేదాల్లో ప్రత్యర్థుల వాదాలుగా ఉటంకించారు. దేశీయమైన భావనను జలసంస్క ృతిని, సమతా మార్గాలను ఆధిపత్య వైదికార్య బ్రాహ్మణ వర్గం ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. దేశీ య నాయకులను, పోరాట యోధులను చంపడానికి ‘నిప్పు’ను ప్రధానం చేసి యజ్ఞయాగాలు నిర్వహించారు. యజ్ఞయాగాలంటే.. దేశీయోత్పత్తులైన నవధాన్యాలను, నేతిని అగ్నిలో పోసి తగులబెట్టి దేశీయ ప్రజలను ఆహారానికి దూరం చేయడమే. ఆహార ధాన్యాలనే గాక, జంతువులను వధించడమేగాక చివరకు నరబలి వరకు వారు కొనసాగించారు. దీన్ని ఎదుర్కోవడానికి మూలవాసుల నుంచి దేశీయ పండితులు సంస్కృ తాన్ని అధ్యయనం చేసి చార్వాకులు, లోకాయతులుగా ముందుకు వచ్చి ‘నాస్తిమృత్యోరగోచరః’ మృత్యువు తరువాత ఏమీ లేదని ప్రకటించగలిగారు.
‘భస్మీ భూతస్య దేహస్య పునరాగమనంకుతః’ భస్మమైన దేహము తిరిగి రాదు అని ప్రకటించారు. మొదటి ఆర్యరాజ్యాన్ని ధర్మరాజు స్థాపించాడు. ధర్మరాజు మొద ట వురి తీసింది చార్వాకులనే అనేది మనం అర్థం చేసుకోవాల్సివుంది.
మన దర్శనాల్లో మొదటి దర్శనం ‘చార్వాక దర్శనం’ రెండవది జైన దర్శనం. మూడవది నిరీశ్వర సాంఖ్యం,నాల్గవది నిరీశ్వర వైశేషికం, ఐదవది నిరీశ్వర బౌద్ధం, నిరీశ్వర న్యాయదర్శనం ఆరవది. ఈ షడ్ దర్శనాలు దేవుడు లేడని చెబుతున్నాయి. చైతన్యం కంటే ముందటిది పదార్థం. పదార్థం నుంచే చైతన్యం జనించింది. దేవుడు అభూత కల్పన అని వాదించాయి. తరువాత వాటి ముందు ఈశ్వరుణ్ణి చేర్చడం జరిగింది. ఎమ్.ఎన్.రాయ్ తన‘మెటీరియలిజం’ గ్రంథంలో విస్తృ తంగా ఈ విషయాన్ని చర్చించారు. తరువాత బ్రాహ్మణులు ఆయాతాత్విక శాఖ ల్లో జొరబడి మళ్ళీ పదార్థాన్ని సృష్టించడనికి ఏదో ఒక శక్తి ఉండి ఉంటుంది. ఆ శక్తే ప్రపంచాన్ని సృష్టించడమే కాకుండా, ప్రతి జీవికి జనన, మరణ గతులను వారి పూర్వ జన్మలను బట్టి నిర్ణయిస్తుంది. మనిషి నిమిత్త మాత్రుడు. అతడు ఈ సృష్టికి మూలమైన బ్రహ్మ అతడు సృష్టించిన గ్రహగతులను బట్టే వర్తిస్తాడు.
అతడిదేమిలేదు అని నిర్ణయించారు. దీనిపై తాత్విక చర్చ జరిగింది. ఉపనిషత్తులు, దర్శనాలు ఈ తాత్విక చర్చను మౌఖిక దశలో సత్యాసత్య నిరూపణ కోసం చేశా యి. లిఖిత దశకు వచ్చేసరికి అంతా ఈశ్వరమయం చేయడానికి ప్రయత్నం చేశా రు. నిజానికి బ్రాహ్మణ పండితులంతా ధర్మాన్ని, నీతిని మూలవాసుల దగ్గరే నేర్చుకున్నారు. దేశీయ విద్యలువీరి దగ్గరే నేర్చుకున్నారు. బుద్ధుడు తన సంఘవాదాన్ని, అనాత్మవాదాన్ని మూలవాసుల దగ్గరే నేర్చుకున్నాడు. ఆది భారతీయు లు గొప్ప తాత్వికులు. వారిది నిరీశ్వర సాంఖ్యం. ‘కపిల’ అంటే ‘నల్లనిది’ అని అర్థం. ఆ నల్ల తల్లిపాలు తాగి తత్వం చెప్పిన వాడే కపిలుడు. అతడే నిరీశ్వరసాంఖ్యాన్ని బోధించాడు. ఆ శాఖీయుల దగ్గరే బుద్ధుడు తన ‘నిరీశ్వర’ వాదాన్ని అధ్యయనం చేశాడు. ఆయుధ విద్యలో గొప్ప వారైన ఏకలవ్యుడైనా, బలరాముడైనా, వాలి అయినా దేశీయ సంస్కృతిలో జనించిన ఆదిమవాసుల వారసులే.
కాని వీరి జీవిత విధానానికి, ఆది భారతీయుల జీవిత విధానానికి స్పష్టమైన వైరుధ్యం వుంది. బ్రాహ్మణవాదం వ్యక్తివాదం, పితృస్వామ్య జీవనం, ఇతరుల ను అర్ధించడం బ్రాహ్మణవాదంలో తప్పులేదు. ఆదిభారతీయులది సంఘవా దం. ఇతరులను అడగకుండ తమ శ్రమ మీద తామే జీవించడనికి వారు ప్రయత్నిస్తారు. ఈ ప్రభావం ఆధునిక విద్య తరువాత బ్రాహ్మణ కుటుంబాల మీద పడింది. వారు వ్యక్తివాదం నుంచి కొందరు సామాజిక వాదానికి పరివర్తితం చెందుతున్నారుబాహ్మణ స్త్రీలు దళితులను వివాహంఆడినంత, బ్రాహ్మణ పురుషులు దళిత స్త్రీలను పెళ్లి చేసుకోలేకపోయారు. కారణం బ్రాహ్మణ స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాటంలో వుంది. దళితులు స్వేచ్ఛకోసం పోరాటంలో వున్నారు. మానవులందరూ ఒక్కటే అని చెప్పింది దళితులే. ఈ వాదానికి అగ్రవర్ణాల్లో వున్న బుద్ధుడు ముందు ఆకర్షితుడయ్యాడు. దాన్ని పెద్ద ఉద్యమంగా తెచ్చాడు. బ్రాహ్మణులు అందులో చేరారు.
కొందరు వ్యక్తి వాదాన్ని బౌద్ధంలో చొప్పించడనికి ప్రయత్నించారు. బౌద్ధం పాళి నుంచి మగధ నుంచి, పైశాచి భాషలను సంస్క ృ తంలోకి తెచ్చింది బ్రాహ్మణుల నుంచి వచ్చిన ఆచార్యులే. అయితే మళ్లీ దానిలో ‘వర్ణవాద’ పితృస్వామ్య భావజాలాన్ని చొప్పించారు. అంబేద్కర్ వచ్చి మళ్ళీమూలవాసుల నుంచి బుద్ధుడు నేర్చుకొన్న సమతా బౌద్ధాన్ని ‘బుద్ధ అండ్ దమ్మ’ పేరుతో బయటకు తెచ్చాడు. ఈమధ్యలో ఇస్లాం, క్రైస్తవంలోకి ముందు దళితులు వెళ్ళాక తర్వాత, బ్రాహ్మణులు సవర్ణులు అందులో ప్రవేశించి పితృస్వామ్య వ్యక్తి వాదాలను భారతీయ ఇస్లాంలోను, భారతీయ క్రైస్తవంలోను ప్రవేశపెట్టారు. దళితులు ప్రతి బ్రాహ్మణేతరవాదాన్ని ‘సంఘవాదంగా’ మలచాలని చూస్తారు. బ్రాహ్మణులు ప్రతి బ్రాహ్మణేతర వాదాన్ని బ్రాహ్మణీకరించాలని చూస్తారు. ఆదిభారతీయులదే అసలు భారతదేశంఅని వారికి తెలుసు. వీర వైష్ణవ, వీర శైవ ఉద్యమాలను దళితుల కోసమే సృష్టించారు. పల్లెల్లోకి జొరబడ్డారు. కాని బ్రాహ్మణులు పల్లెల్లో నిలబడలేకపోయారు.
వారి వ్యక్తి వాదానికి వీరి సామూహిక వాదానికి యుద్ధమే జరిగింది. మార్క్సిజం భారతదేశానికి వచ్చినపుడు కార్మిక వర్గంగా దళితులే ఆహ్వానించారు. మార్క్సిస్టు అధ్యయనపరులుగా అనువాదకులుగా వచ్చిన బ్రాహ్మణులు ప్రధానమైన కుల వైరుధ్యం నుంచి తప్పించి ఆర్థిక వాదం గా దాన్ని కుదించ చూశారు. అప్పుడూ అంబేద్కర్ తన కుల నిర్మూలనా గ్రంథం తో ఎదుర్కొన్నాడు. అంబేద్కర్ ప్రభావాన్ని గాంధీ గుర్తించాడు. దాన్ని అడ్డుకోవడనికి ‘వర్ణ సిద్ధాంతాన్ని’ మళ్ళీ ముందుకు తెచ్చాడు. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడంలో తప్పు లేదని, దళితుల ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బకొట్టడనికి ఎరవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. కాంగ్రెస్‌ను బ్రాహ్మణవాద అనుసరణ సంస్థగా మార్చాడు. ఒక ప్రాంతంలోమైనారిటీలుగా వున్న హిందువుల రక్షణార్థం బయలుదేరిన ఆర్‌ఎస్‌ఎస్ భారతదేశం విడిపోయిన తరువాత ఇండియాలో మెజారిటీవాదంగా చెలామణి అవుతున్నది. మెజారిటీ ప్రజలైన దళితులు ఆదివాసీలు లేకుం డా హిందూ రాజకీయ వాదం బలపడదు కాబట్టి, ఇప్పుడు దళితుల మత మార్పిడులను ఎదిరిస్తున్నారు.
దళితులు చార్వాకులుగా, సాంఖ్యకులు గా, బౌద్ధమత వాదులుగా, భక్తి ఉద్యమకర్తలుగా, వీరశైవులుగా, ముస్లిం, క్రైస్తవ స్వీకర్తలుగా తమపై రుద్దిన కళంకాన్ని తుడుచుకొని తమకు తాము నిలబడడానికి హిందూ బ్రాహ్మణవాదానికి ప్రత్యామ్నాయాలను రూపొందిస్తూ వస్తున్నారు. దళితులు తమ తాత్విక సిద్ధాంత బలంతో జీవన విధానాలతోవూబాహ్మణుల మీదే కాక మిగిలిన త్రివర్ణాల మీద కూడ తమ ప్రభావం వేయగలుగుతున్నారు. స్వాతంవూత్యానంతరం రాజ్యాంగ సూత్రాలకు అనువైన కులాలుగా ఎస్సీ, ఎస్టీలు మారిన తరువాత సామాజిక జీవనంలోకి ప్రవేశించాక ప్రేమ, కరుణ, ప్రజ్ఞ వారి నుంచి ప్రధాన స్రవంతికి ప్రవహించడం ప్రారంభించాయి. నీతి, వ్యక్తిత్వం, శ్రమ, మానవత్వం ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే సందర్భంలో దళితులు తమ జీవనవిధానం ద్వారా ఇతరులకు మార్గదర్శకులవుతూ వస్తున్నారు. బ్రాహ్మణులు అంబేద్కర్‌ను నిర్లక్ష్యం చేసి ఆయన రాజ్యాంగ సూత్రాలను నోటికి వల్లించి రాజ్యాంగ నిపుణులుగా ప్రసిద్ధి చెందుతున్నారు.
వారి వేదాలు, మనుస్మ ృతులు వారికి అన్నం పెట్టవని తెలుసుకొని అంబేద్కర్ వ్యక్తిత్వంలోని పరిశోధన, రాత, విశ్లేషణ, ప్రతివాదం వైపు ఆకర్షితులయ్యారు. బీసీలు మండల్ కమిషన్ రిపోర్టు వచ్చిన తరువాత దళితులు తమ మిత్రులుగాభావించి వారి నుంచి పోరాట స్ఫూర్తిని అందుకొని సామాజిక, రాజకీయ హక్కుల పోరాట ఉద్యమంలో దళితులతోచేయి కలుపుతున్నారు.
చార్వాకుల దగ్గర నుంచి నేటి వరకు అన్ని సిద్ధాంతాలని, తత్వాలని, దళితులు ప్రభావితం చేస్తున్నారు. దళితులు మానవతావాదంవైపు, సంఘవాదంవైపు, ఆత్మగౌరవపోరాటం వైపు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఇది బ్రాహ్మణ వాద ఓటమికి దళితవాద విజయానికి ఒక నిర్మాణ యుగం. కారంచేడు అన్ని పార్టీలు, ఉద్యమాల ఎజెండాలోకి కుల నిర్మూలన అంశాన్ని తీసుకురాగలిగింది. సామాజిక, సాంస్క ృతిక పునర్జీవనోద్యమానికి కుల, మత బేధాలు లేవు. శాస్త్రీయ దృక్పథం ఒక్కటే మార్గం. ఆదిభారతీయులే భారతీయ పునర్నిర్మాణానికి నిజమైన వారసులు.
Namasete Telangana News Paper Dated : 27/05/2012
No comments:
Post a Comment