Tuesday, May 1, 2012

సత్యమూర్తికి సంతాపం ప్రకటించని విప్లవోద్యమం--Dontha Badhraiah



భారత విప్లవ ఉద్యమంలో అగ్రజుడు సామాజిక విప్లవోద్యమ స్ఫూర్తి ప్రదాత, సాహితీ సేనాని కె.జి. సత్యమూర్తి విప్లవోద్యమ నిర్మాణానికి చేసిన త్యాగంలో ఏమైనా లోపంఉందా? సత్యమూర్తి మరణిం చాక విప్లవోద్యమం ఒక అక్షరం కూడా సం తాపంగా మాట్లాడనంతటి అంటరాని వాడ య్యాడా? శివసాగర్‌గా ఆయన సృష్టించిన విప్లవోద్యమ సాహిత్యం కంటే అద్భుతంగా సృష్టించిన మొనగాడు ఇంకా ఎవరైనా విప్ల వోద్యమంలో ఉన్నారా? నడుస్తున్న చరిత్రకు బీజాలు పడి చిగురి స్తున్నాయి. ఆ బీజాలకు సత్యమూర్తి జవ జీ వాలను అందించాడు. ఆయన కోరుకున్న చరిత్ర పరిపూర్ణంగా మనుగడ సాగిం చేందుకు సర్వం సిద్ధమవుతోంది. విప్లవోద్యమంలో, దళిత ఉద్యమంలో, సాహిత్యంలో శివసాగర్‌ ఆశించిన చరిత్ర భవిష్యత్తులో సాక్షాత్కరించబోతోంది. శంభుకుని వారసులు ఎవరూ రాముణ్ణి గౌరవించరు. ఏకలవ్యుని వారసులు ఎవ రూ ద్రోణుణ్ణి క్షమించరు. బలి చక్రవర్తి అనుచరులు ఎవరూ వామనుణ్ణి సహిం చరు.

సత్యమూర్తి అభిమానులు ఎవరూ విప్లవోద్యమాన్ని గౌరవించరు. సత్య మూర్తి మరణం పట్ల మౌనం పాటిస్తున్న ఉద్యమం- అడవిని కబ్జాచేసిన మనువు తనకు తానే కండ్లలో సూదులు గుచ్చుకుని, నాలుక తెగకోసుకుని, చెవిలో సీసం పోసుకున్నట్లు అడవిలో దొర్లాడడం భవిష్యత్తులో జరగబోయే పరిణామం. 
ఉద్యమ నిర్మాతగా సత్యమూర్తి ప్రతిపాదించిన కులం అస్తిత్వాన్ని గుర్తించ డానికి ఉద్యమం ఒప్పుకోక పోవడంతో తన ప్రతిపాదనపై వెనక్కి తగ్గడానికి ఒప్పుకోలేదు. అందువల్ల ఉద్యమం క్రమంగా సత్యమూర్తిని పొమ్మనలేక పొగ బెట్టిన విధంగా వ్యవహరించి ఆయనను తీవ్ర వివక్షకు గురిచేసింది. ఆ విధంగా ఆయన విప్లవోద్యమం నుండి క్రమంగా దళిత ఉద్యమం వైపు వచ్చాడు. కొన్ని అంశాలల్లో నిజంగానే సత్యమూర్తిది విశిష్ఠమైన జీవితం. డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ తన సామాజిక ఉద్యమాన్ని నడిపిస్తున్న క్రమంలో, ఈ దేశ రాజకీయ స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న చాలా మంది నాయకులు అంబే డ్కర్‌ సామాజిక ఉద్యమాన్ని అపహాస్యం చేస్తూ అసలు దాని అవసరం లేదన్నట్టు వాదించారు. 

అందులో గాంధీ ‘నేను ఒక్కడిని ఈ దేశ స్వాతంత్య్రానికి నాయకత్వం వహిస్తుండగా నీవేందుకు ప్రత్యేకంగా నిమ్న కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా’వంటూ అంబేడ్కర్‌పై అగ్రహం చెందాడు. ఆ విషయంలో గాంధీకి అంబేడ్కర్‌ తీవ్రవాగ్విదం జరిగింది గాంధీని ఉద్దేశించి ‘మీరు కాని, మీ పార్టీ కాంగ్రెస్‌ కాని నిమ్న కులాలకు చేసింది ఏమీ లేదు. మీరు ఈ కులాలకు దేవాలయ ప్రవేశం జరిపించలేదు.ఈ కులాలకు విద్యను అందించాలని కోరలేదు. అంట రాని వారిగా చూడకూడదని మీరు పోరాటం చేయలేదు. నిమ్న కులాలకు స్వేచ్చా స్వాతంత్య్రాలు ఉండేందుకు అవసరమైన ఏ కార్యక్రమం మీరు చేయలేదు’ అంటూ తీవ్రంగా స్పదించాడు ఈ విధంగా అంబేడ్కర్‌ తాను నిమ్న కులాల ప్రయోజనాల విషయంలో తన వాదనను నిరభ్యంతరంగా వినిపిం చాడు. అదే సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వం లండన్‌లో జరిపిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు అంబేడ్కర్‌ను నిమ్న కులాల ప్రతినిధిగా ఆహ్వానించింది.

దీని ఫలితంగానే ప్రత్యేక నియోజకవర్గాల కమ్యూనల్‌ అవార్డును ప్రకటితమైంది. ఈ ప్రత్యేక నియోజకవర్గాల పై గాంధీ నిరసన ప్రకటించి పూణేలోని ఎరవాడ జైల్లో నిరాహార దీక్ష చేశాడు. అదే విదంగా విప్లవోద్యమంలో కులం గురించిన చర్చను లేవదీసిన సత్యమూర్తిని ఏవిధంగా అవమానించినా- అంబేడ్కర్‌ను లిబరల్‌ బూర్జువగా వర్ణించిన ఉద్యమం దేశంలో ప్రజాస్వామిక వాదులను, రాజ్యాంగ వాదులను మొత్తంగా దళిత ఆదివాసి ప్రజానికాన్నీ అవమానించే విధంగా ఆ ప్రకటనచేసిందో అదే విధంగా గాంధీ ప్రత్యేక నియోజకవర్గాలు రద్దు చేయా లంటూ దళిత ఆదివాసి ప్రయోజనాలను ఆదిలోనే దెబ్బతీసేందుకు కుట్ర పన్నాడు. ఆ విధంగానే విప్లవోద్యమం కూడా ఉద్యమంలో కులం గురించిన చర్చను అవకాశం ఇస్తే అది మమ్ముల్నే మింగేసి చివరకు ఉద్యమంలో దళిత ఆదివాసిలే ఆధిపత్యం చేలాయించే పరిస్థితి వస్తుందనే కులం గురించిన చర్చను రాకుండా అడ్డుకున్నారు. కులం వద్దు అని భావించిన ఆనాటి జాతీయ నాయ కులందరూ అంబేడ్కర్‌ వాదన ముందు నిలబడలేకపోయారు.

బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా అంబేడ్కర్‌ వాదనతో ఏకీభవించి కమ్యూనల్‌ అవార్డును ప్రకటించింది. దీన్ని అడ్డుకోవడానికి గాందీ నిరహార దీక్ష ఎత్తుగడను ప్రయోగించినట్లు - విప్లవోద్యమంలో కూడా కులంపై చర్చను అడ్డుకునేందుకు దానిని ప్రతి పాదిస్తున్న సత్యమూర్తిని బయటకు పంపేందుకు నిశ్చయించుకుంది. అయితే ఆనాడు కులం అవసరం లేదని, అంబేడ్కర్‌ వాదన అవసరం లేదని భావించిన వారందరూ ఆ తరువాత కాలంలో అంబేడ్కర్‌ను గుర్తించారు. ఫలితంగానే గాంధీతో సహా చరిత్రలో మిగితా జాతీయ నాయకులందరికంటే అంబేడ్కర్‌ ఆలోచనా విధానానికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఏర్పడింది. అదే కోణంలోవిప్లవోద్య మంలో కూడా సత్యమూర్తి ప్రతిపాదించిన కులం అంశాన్ని చర్చించడానికి నిరాకరించిన ఉద్యమం భవిష్యత్‌లో సత్యమూర్తి వాదనతో ఏకీభవించవలసి వస్తుంది. ఆయన ప్రతిపాదించిన మానిఫెస్టోతోనే ఉద్యమం నడిచే పరిస్థితి వస్తుంది.

dontha-bhadraiah
సత్యమూర్తి అంబేడ్కర్‌లాగే తీవ్ర వివక్షకు గురైనాడు. అయినప్పటికీ తాను ప్రతిపాదించిన అంశానికి కట్టుబడి ఒక స్పష్టతతో జీవించాడు.అందుకే ఆయన తాను మార్క్సిస్టుగానే చనిపోతానని ప్రకటిం చాడు. సత్యమూర్తి జీవితం రాజీ లేనిది. విషయ నిబధ్దమైనది. ఏటికి ఎదురీతే తత్త్వం సత్యమూర్తిది. ఉద్యమ మనుగడకు ఈ దేశంలోనే దళిత ఆదివాసి బలహీన వర్గాలకు ఉప యోగపడే కులం ఆవశ్యక తకు మధ్య వైరుధ్యం ఏర్పడితే కులం అంశానికే ప్రాధాన్యతనిస్తానని అడవిలోనుండి నిష్ర్కమించిన మహాయోధుడు సత్యమూర్తి.



Surya News Paper Dated : 02/05/2012 

No comments:

Post a Comment