Wednesday, May 30, 2012

పాలమూరు - పరకాల-ఎక్కడికి---హరగోపాల్పాలమూరుకు పరకాలకు చాలాతేడా ఉంది. పాలమూరు జిల్లా చాలా చాలా వెనుకబడినజిల్లా. చైతన్యస్థాయి ఎదగవలసిన జిల్లా. వలస లు, కరువులతో బాధపడుతున్న ప్రాంతమిది. అదికాక ముస్లింలసంఖ్య కూడా ఎక్కువే. ఇవన్నీ పరకాలకు వర్తించవు. అయినా తెలంగాణ పాలక వర్గాలు, బలమైన సామాజికవర్గాలు, కులాలు కాంగ్రెస్, తెలుగుదేశంతో విసిగిపోయిన నాయకత్వం ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నది. జగన్‌మోహన్‌డ్డిని తెలంగాణలోకి రానిస్తే ఆయనను అంగీకరించడానికి చాలామంది తెలంగాణ నాయకులు సిద్ధంగా ఉన్నారు. జగన్‌మోహన్‌డ్డి వ్యక్తిత్వం ఎలాంటిది? ఇంత సంపద ఎలా కూడబెట్టుకున్నాడు? ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు?ఇవన్నీ తెలంగాణలోని బలమైన సామాజిక వర్గాన్ని ఆందోళనకు గురిచేయడం లేదు. తెలంగాణ భవిష్యత్తు ఏమిటి? వస్తే ఎవరైనా తెస్తే ముఖ్యమంత్రి పదవికి, సంపద కూడబెట్టుకోవడానికి అవకాశాలు పెరగొచ్చు. 

ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగితే ఇప్పుడు రాజశేఖర్‌డ్డి, చంద్రబాబు కల్పించిన అధికారంలో వాటాకు, ఆస్తులు పెంచుకోవడానికి మార్గాలు బాగానే ఉన్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రపంచబ్యాంకు నుంచి వచ్చిన సబ్ కాంట్రాక్టులు, తెలుగులో చెప్పాలంటే ఉప ఉప కాంట్రాక్టులు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో వాటాలు, మద్యం నుంచి ధారావాహికంగా వచ్చే డబ్బు.. ఇదీ బాగానే ఉంది. ఒకరకంగా బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఇది జాతీయ పార్టీ, అధికారంలోకి ఎప్పుడైనా రావచ్చు. మతతత్వం గురిం చి మాట్లాడితే మంచిదే కదా. మతం ద్వారా పేదవాళ్లను మభ్యపెట్టవచ్చు. మనుషులను విభజించవచ్చు. గుజరాత్ లాంటి ‘సమర్థవంతమైన’ పాలన రావచ్చు. నరేంవూదమోడి లాంటి ముఖ్యమంత్రి మనలో ఎవరైనా కావ చ్చు. ఇలా ఆలోచనా సరళి. అందుకే తెలంగాణ ప్రాంతం విషయంలో బీజేపీ చాలా ధీమాగా ఉంది. తెలంగాణ ప్రజలకు ఇది ఒక అగ్ని పరీక్ష.

మిగతా అన్ని పార్టీలు బాగున్నాయా? బీజేపీ ఒక్క పార్టే తక్కువా అని అడగవచ్చు.నిజానికి చాలా వేగంగా బీజేపీలో ముందుకుపోతూ ఎదుగుతున్న యువ నాయకుడు కిషన్‌డ్డి.ఆయన మర్యాదకైనా తన ‘పాదయాత్ర’ ప్రారంభించే ముందు నాక్కూడా ఫోన్ చేశాడు. తెలంగాణ కోసమే కదా అని నేను మర్యాద పూర్వకంగానే మాట్లాడాను. కానీ ఆయన శైలి, మాటలు, దృక్ప థం తెలంగాణ ప్రజల మనస్తత్వానికి కాని చారివూతక స్పృహకు కాని ఎక్కడా పొంతన కుదరదు. ఆయన వెంకయ్యనాయుడు శిష్యుడు. ఎందుకు ఆయన సుష్మా స్వరాజ్‌ను అభిమానించొచ్చు కదా. వెంకయ్యనాయుడు తెలంగాణ కోసం ఏం మాట్లాడాడో నాకు తెలియదు కాని సుష్మా స్వరాజ్ తెలంగాణ గురించి పార్లమెంటులో బాగానే మాట్లాడింది. రెండు ఆయన నరేంవూదమోడీ ప్రధా ని కావాలన్నాడు. నాకు భయమేసింది.

తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తి నరేంవూదమోడిని అభిమానించడం నమ్మరాని విషయం. సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లో, యశ్వంత్‌సిన్హానో, జశ్వంత్‌సింగ్ ఇంతమంది ఉండగా ఈయన వేలాదిమంది ముస్లింలను ఊచకోత కోసిన గుజరాత్ ముఖ్యమంవూతిని ఎందుకు సమర్థిస్తున్నాడు? అంటే గోద్రా సంగతి ఏమిటి అని అడగడం తప్ప వేరే జవాబులేదు. గోద్రా దుర్మార్గంలో పాల్గొన్న వాళ్ళను శిక్షించండి, కాని ఒకరు నేరం చేస్తే ఇంకా తల్లి గర్భం నుంచి బయటికి కూడా రాని అమాయకపు శిశువుకు ఎందుకు శిక్ష! గోద్రా అంటే ఎక్కడున్నదో తెలియని అమాయకపు ముస్లిం మహిళల పట్ల ఎందుకు అంత అరాచకత్వం? నిజానికి గుజరాత్ ఘటనల తర్వాత మనిషి మీద, మానవత్వం మీదే అనుమానమొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ దేశ జాతీయ మీడియా, ఇంగ్లిషు చానెల్స్ నరేంవూదమోడికి విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నాయి. 

నరేంవూదమోడి కేరళలో కమ్యూనిస్టుపార్టీ హింసను ఖండించడమే కాక, హింసకు ప్రజాస్వామ్యంలో స్థానంలేదు అని అంటే ఏ మా త్రం సిగ్గులేని మీడియా దానికి ప్రచారం కల్పించింది. కానీ ఒక్కడు కూడా గుజరాత్ హింసాకాండ సంగతి ఏంటి అని అడగలేదు. ఈ మొత్తం ప్రక్రియను గమనించకుండా, తెలంగాణలో ఎదుగుతున్న ఒక బీజేపీ నాయకుడు మోడిని సమర్థించడం తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతికి అంగీకారంకాదు, కాకూడదు. అందుకే తెలంగాణ జేఏసీ కోదండరాం, సింగిడి రచయితలు స్పష్టంగానే బీజేపీ రాజకీయాలకు దూరమవుతున్నారు. నిజానికి సంయమనంతో మాట్లాడుతున్న సీహెచ్.విద్యాసాగర్‌రావు, బండారు దత్తావూతేయలు ఎందుకు అగ్రనాయకులుగా అంగీకరించడడం లేదో అర్థంకాదు. నిజానికి ఇద్దరూ కేంద్ర కేబినేట్‌లో పనిచేసిన నాయకులే. 

ఇక ఇంకొక ముఖ్య అంశానికి వస్తే, పాలమూరు ఎన్నికల నుంచి ముస్లింలను విమర్శిస్తూ రజాకార్ల నుంచి ప్రస్తావించారు. ఇప్పుడు రజాకార్ల ప్రస్తావన ఎందుకు అని మనం అడగవచ్చు? దానికి మించి బందగీ, షోయబుల్లాఖాన్‌ల త్యాగాలను గుర్తుచేసుకోవచ్చు.ఇంకా చరివూతలోకి వెనక్కి వెళ్ళాలంటే తుర్రెబాజ్‌ఖాన్ సహసాన్ని గురించి మాట్లాడవచ్చు.కలియుగ దైవమని భావించే వెంక సహచరి అని ప్రచారంలో ఉండే బీబీనాంచారి గురించి మాట్లాడొచ్చు. తెలంగాణలోని పీర్ల పండుగ గురించి మాట్లాడవచ్చు. ముస్లింల గురించే మాట్లాడాలంటే ఇదంతా తెలంగాణ వారసత్వమే కదా, దాని మీదే మాట్లాడొచ్చు కదా, అయితే పరకాలలో మాట్లాడుతూ ‘రజాకార్ల గురించి మాట్లాడడమే మతతత్వమయితే నేను మతతత్వవాది’ నే అని కిషన్‌డ్డి అన్నారు. రజాకార్ల దురాగతాల గురించి, దుర్మార్గాల గురించి నాకు తెలిసినంత కిషన్‌డ్డికి తెలిసే అవకాశం లేదు. ఊళ్లో కాసీం రజ్వీని మా గ్రామస్తులు చంపారు. అయితే మా గ్రామం కాసీం రజ్వీని చం పింది. తుర్రెబాజ్‌ఖాన్‌కు రక్షణ కల్పించింది. రజాకార్లను గుర్తుపెట్టుకొని ఇతర త్యాగాలు చేసిన ముస్లింలను గుర్తుపెట్టుకోకపోవడం మతతత్వం.

ఇంతకు ముందు రాసిన వ్యాసంలో నేను ప్రస్తావించిన అంశాల గురించి కిషన్‌డ్డి ఆలోచించాలి. చరివూతను చెప్పేటప్పుడు సమక్షిగంగా చెప్పాలి. రజాకార్ల చేసిన దుర్మార్గం గుజరాత్‌లో దుర్మార్గం, సల్వాజడుం దుర్మార్గాలతో పోల్చవచ్చు. రజాకార్ల పేరు వింటేనే మా అమ్మ కొంత భయంగా మాట్లాడేది ఇంట్లో ఎక్కువ అల్లరి చేసే తన కొడుకును రజాకార్ అని పిలిచేది. వాళ్ళు హిందూ స్త్రీ పట్ల చేసిన తప్పు లు క్షమించరానివే, వాటిని తప్పక గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడూ పునరావృత్తం కాకుం డా చూసుకోవాలి. కాని వాళ్లకు రక్షణ కల్పించి, గడీలలో వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించి సహకారం చేసిన హిందూ భూస్వాముల గురిం చి ఎందుకు మాట్లాడడం లేదు. వాళ్లకు వ్యతిరేకంగా సహసంగా పోరాడిన ఆనాటి కమ్యూనిస్టుపార్టీని ఎందుకు అభినందించడం లేదు? వాళ్ళ దుర్మార్గాలకు బలైన కమ్యూనిస్టు కార్యకర్తల గురించి పరకాలలో ఎందుకు మాట్లాడడం లేదన్నదే ప్రశ్న.

తెలంగాణలో బీజేపీ పార్టీ నిలదొక్కుకోవాలంటే గుజరాత్ నమూనా పనికిరాదు. ఆది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ విషయం బీజేపీలో చాలా చురుకుగా పనిచేసి మధ్యంతరంగా చనిపోయిన మహబూబ్‌నగర్ ఝాన్సీ తో నేను ప్రస్తావించేవాణ్ణి. ఆమె ఎప్పుడూ నే ను ఆ విషయాలు, మతతత్వ రాజకీయాలు ప్రస్తావించలేదు కదా అనేది. నిజం కూడా ఆమె చాలా ఆవేశంగా తెలంగాణకు గడిచిన అన్యాయాన్ని గురించి మాట్లాడేది. ఇంతకుముందే ఇతర వ్యాసాల్లో ప్రస్తావించిన అంశాలను మళ్లీ ప్రస్తావించవలసిన అవసరం ఏర్పడింది. పాలమూ రు జిల్లాలో కోస్గి దగ్గర ఒక గ్రామంలో వలసల గురించి అధ్యయనం చేయడానికి వెళ్ళి, వాళ్ళ గ్రామంలో అట్టడుగున ఉండే అతిపేద ఐదు కుటుంబాలు ఏవి అని అడిగితే పేదరికంలో కూరుకుపోయిన ఆ గ్రామ దళితులు ఒక ముస్లిం కుటుంబాన్ని చూపించారు. 

అలాగే మా నాన్న గంటల తరబడి పూజ చేసేవాడు. మత విశ్వాసాలు చాలా బలంగా ఉన్నవాడు. కాని మా గ్రామంలో ఉండే ముస్లింలందరూ ఆయనను అభిమానించేవారు. ఆయన చనిపోయిన రోజువాళ్ళే దుకాణాలను మూయించారు. ఆయనకు చేసే కర్మకాండ ఖర్చు కొంత భరిస్తామని ఒక ముస్లిం అబ్బాయి చాలా పట్టుపట్టాడు. అంతేకాదు గుజరాత్ మానవ హననం తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దాదాపు 14 గంటలు జరిగిన మీటింగ్‌లో ప్రతి తెలంగాణ వ్యక్తి కన్నీ ళ్లు పెట్టుకున్నాడు. కొందరు బోరుమని ఏడ్చారు. ఇది తెలంగాణ విశిష్ట సంస్కృ తి. ఈ సంస్కృతిని విస్మరించి, ఇంత మానవీయ విలువలను విధ్వంసం చేసే ఏ ప్రయత్నాన్నైనా తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు. కొట్టాలి కూడా.

పొఫెసర్ జి. హరగోపా
Namasete Telangana News Paper  Dated : 31/05/2012 

No comments:

Post a Comment