శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్షింపేట దళితులపై ఓ వర్గం వారు దాడి చేసి ఐదుగురిని హత్యచేశారు. 30 మందిని తీవ్రంగా గాయపర్చారు. లక్షింపేట కుల వివక్షకు కేంద్రంగా ఉన్నది. గ్రామ సర్పంచ్ చిత్తి రి సింహలమ్మను గ్రామ పంచాయితీ సమావేశంలో ఏనాడూ కుర్చీలో కూర్చోనివ్వలేదు. గ్రామ సచివాలయంలో మొత్తం ఒక వర్గం వారే కావడంతో వారు చెప్పిందే వేదంగా చెలామణి అయ్యింది. వారు ఆడిందే ఆటగా, పాడిందే పాట గా ఉన్నది.
ఈ నేపథ్యంలో దళితులపై దాడికి ఆ గ్రామంలో జరుగుతున్న పరిణామాలకు చాలా చరివూతనే ఉన్నది. వంగర సమీపంలో మడ్డువలస జలాశయం నిర్మాణం కోసం చుట్టుపక్కల గ్రామాల రైతుల భూములును ప్రభుత్వం కొనుగోలు చేసింది. అలాగే లక్షింపేట గ్రామంలో కాపులు, మాలల ఇళ్లు, కాపు రైతు ల పంటభూములు, మడ్డువలస డ్యామ్ నిర్మాణం కోసం సేకరించారు. కొత్త కాలనీకి తరలింపునకు మొదట కాపు కులస్తులు నిరాకరించగా,మాలలు తమ నివాసాలు విడిచిపెట్టి, కొత్త లక్షింపేట కాలనీలోని స్థలంలో గృహాలు నిర్మించుకున్నారు. తరువాత కాపు కులస్తులు కూడా సదరు కాలనీకి తరలి ప్రభు త్వం రైతుల భూములకు పరిహారం చెల్లించి ఉపాధి కోసం కుటుంబానికి ఒక్కరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. కానీ మాల కులస్తులకు ఎటువంటి ఉపాధి చూపించలేదు. కాలనీ తరలించుటలో జలాశయంలో ముంపునకు గురికాకుండా ఉన్న భూమిలో మాలలు పంటలు పండించుకోవడానికి అధికారులు హామీ ఇచ్చారు. అదే ప్రభుత్వం మాలలకు చూపిన ఉపాధి హామీ.
మడ్డువలస డ్యామ్ నిర్మాణం పూర్తయ్యి, నీటితో జలాశయం నిండినా, లక్షింపేట గ్రామం భూములు ముంపునకు గురికాకుండా ఉన్నందున వాటిని దళితులకు ఇచ్చారు. కానీ అదే కాపు కులస్తులు మాత్రం సుమారు 195 ఎకరాలను ఒక్కొక్కరు 5నుంచి 10 ఎకరాలు సాగుచేసుకుంటున్నారు. దేవకివాడ గ్రామం నుంచి సేకరించిన 60 ఎకరాల భూమిని 75 దళిత కుటుంబాల వారు సాగు చేసుకొని బతుకుతున్నారు. ఈ భూములు లక్షింపేట గ్రామానికి ఒక కిలోమీట రు దూరంలోనే ఉన్నాయి. అలాగే డ్యామ్ చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న గ్రామస్తులు కూడా ముంపునకు గురి కాకుండా ఉన్న ప్రాంతాన్ని సాగుచేసుకొంటున్నారు. నేడు సీతారాంపురం, మద్దివలస సరిహద్దులో ఉన్న డ్యామ్ భూములు కూడా దుక్కులు దున్నుతున్నారు. డ్యామ్ భూములను లక్షింపేట మాలలు సాగు చేసుకోవడాన్ని అక్కడి కాపులు సహించలేకపోయారు. దీని ఫలితమే లక్షింపేట దళితులపై దాడి.
ఇది తక్షణ కారణంగా కనిపించినా.. లక్షింపేటలో కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలు దీనికి ఆజ్యంపోశాయి. లక్షింపేటలో కాపులు, మాలలు కలిసి ఎస్సీ రిజర్వుడు పంచాయితీకి ఏకగ్రీవంగా చిత్తిరి సింహాలమ్మను కాంగ్రెస్ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. కాపులకు ముఖ్య నాయకుడుగా ఉన్న వంగర మండలానికి చెందిన బొత్స వాసుదేవరావు నాయుడుదే ఆధిపత్యం.
ఏ పని జరగాలన్నా ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది. ఈయన గారే లక్షింపేట దాడికి సూత్రధారి అని దళితులు అంటున్నారు. అలాగే.. ఏకక్షిగీవంగా ఎన్నికైన సింహాలమ్మను ఏనాడూ గ్రామ పంచాయితీ సమావేశాలలో కుర్చీపై కూర్చోనివ్వలేదు. కానీ పంచాయితీ సభ్యులు మాత్రం కుర్చీల్లో కూర్చుంటారు. కాపులు చెప్పిందే, సూచించిందే చేయాలి. గ్రామంలోని పాల కేంద్రాన్ని దళితుడైన గణపతి నిర్వహిస్తున్నాడు. దీనికి అందరూ పాలు పోసేవారు. తరువాత ఏమైందో ఏమో.. కాపులు మరో పాలకేంవూదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గణపతి పాలకేంవూదానికి కాపులు పాలు ఇవ్వడం మానేశారు. కాపులతో సమానంగా దళితులు ముంపునకు గురికాని భూములను సాగు చేసుకోవడాన్ని సహించలేక రగిలిపోతున్నారు. దళితులు సాగుచేసుకుంటున్న భూముల నుంచి దళితులను ఎలాగై నా తరిమేయాలని పథకం పన్నారు. గ్రామం నుంచి వెళ్లిపోయిన వారిని గ్రామానికి పిలిపించి, దళితులు భూములు దున్నరాదని వివాదం సృషించారు.
దీంతో దళితులు తాము దున్నుకుంటున్న భూములను తమకే అప్పగించాలని శ్రీకాకు ళం జిల్లాకపూక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, డ్యామ్ అధికారులు, రాజకీయ నేతలు, మంత్రి కొండ్రు మురళి సమక్షంలో ఇరు పక్షాలు వివాద పరిష్కారానికి ప్రయత్నించారు. మాలలకు భూమి ఇవ్వడానికి కాపులు అంగీకరించలేదు. పీసీసీ అధ్యక్షడు, మంత్రి బొత్స ముఖ్య అనుచరుడైన బొత్స వాసుదేవరావు నాయుడు మాలలపై కక్షగట్టి దళితులపై దాడికి పథక రచన చేశాడు. ‘మిమ్మల్ని నలుగురినో, ఐదుగురినో చంపితే గానీ భూములు వదలర’ని హెచ్చరించాడు. ఈవిధంగా లక్షింపేటలో కాపులు, దళితుల మధ్య రోజురోజుకూ ఘర్షణ వాతావరణం పెరిగిపోతున్నా శాంతిభవూదతలు కాపాడవలసిన వంగర పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. గ్రామంలోని ఉద్రిక్తతల నేపథ్యంలో 18 మార్చి నుంచి నేటి వరకు లక్షింపేట గ్రామస్తులపై సీఆర్‌పీసీ 107 సెక్షన్ అమలులో ఉన్నది. కాపు లు 54 మంది, మాలలు 53 మందిపై బైండోవరు కేసులు పోలీసులు పెట్టారు.
ఆ తరువాత గ్రామంలో 144 సెక్షన్ కూడా నెలరోజుల పాటు కొనసాగింది. శాంతి కమిటీని ఏర్పాటుచేశారు. భూ వివాదానికి సంబంధించి సీఆర్‌పీసీ 145 ఆర్డర్ కూడా లక్షింపేట గ్రామస్తులపై విధించారు. నేటికీ ఆ గ్రామంలో 107 సెక్షన్ అమలులో ఉన్నది. లక్షింపేట సర్పంచ్ సింహాలమ్మ బంధువు పంటచేనును పక్క గ్రామానికి చెందిన వ్యక్తి పశువులు పాడు చేశాయి. దీనిని అతను ప్రశ్నించాడు. దీంతో.. కాపులు ముందుకు వచ్చి తిరుపతిరావు నాయకత్వంలో దళిత రైతు అప్పడును కులం పేరుతో దూషించి కొట్టారు. దీంతో చేసేది లేక దళితులు కులం పేరుతో దూషిం చి కొట్టినందుకు వంగర పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. దీనిపై విచారించిన డీఎస్పీ కాపు కులస్తులైన ముద్దాయిలను అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన కాపులు తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినందుకు మాల కులస్తులను బెదిరించసాగారు. బెదిరించినట్లుగానే 12-06-2012నాటి దాడిలో అప్ప డును బల్లెంతో పొడిచి దారుణంగా చంపారు.
అట్రాసిటీస్ కేసు నమోదైన నాటినుంచీ లక్షింపేటలోపోలీస్ పికెట్ పెట్టారు. కానీ ఇంతలో ఎన్నికలు రావడంతో పికెట్‌లోని పోలీసులను ఎన్నికల నిర్వహణకు పంపారు. పోలీస్ పికెట్‌లేని సమయాన్ని అదనుగా భావించిన కాపులు దళితులపై దాడికి పన్నాగం పన్నారు.
జూన్ 11న బొత్స వాసుదేవరావు నాయు డు ఇంట్లో 20మంది కాపులు సమావేశమయ్యారు. హత్యాకాండకు పథక రచన చేశారు.12న ఉదయం ఏడు గంటలకు కాలనీ రహదారి పక్కన ఆవు తిరుపతిరావు ఇంటి దగ్గర కాపులు సమావేశమయ్యారు. దాడి కుట్ర తెలియని దళితులంతా తమ పనుల్లో మునిగిఉన్నారు. ఏడున్నర గంటల ప్రాంతంలో దళితవాడలో బాంబులు వేసి భయవూబాంతులు సృష్టించారు. కాపు స్త్రీలు కారం చల్లుతూ మాలలపై దాడికి దిగారు. దొరికిన వారిని దొరికినట్లు కత్తులు, బల్లాలతో పొడిచారు. కర్రలు, బండరాళ్లతో బాది నలుగురిని చంపారు. ఇంటి తలుపులు పగుల కొట్టి ఇళ్లలోని వారిని బయటకులాగి దారుణంగా నరికి చంపారు. 30 మందిని తీవ్రంగా గాయపరిచారు. దాడితో దళితులు హాహాకారాలు చేస్తుం కాపులు వికటాట్టహాసం చేస్తూ.. హత్యాకాండ కొనసాగించారు. ఆ సమయంలో మంచినీళ్లు తెచ్చుకుంటున్న కలమటి సంఘమ్మను కట్టెలతో తీవ్రంగా కొట్టి చేతులు, కాళ్లు విరగ్గొట్టారు. ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది.
ఈ హత్యాకాండ వెనుక కాపుల దౌర్జన్యకాండ ఎంత ఉన్నదో, దీనికి పరోక్షంగా సహకరించిన పోలీసుల పాత్ర కూడా అంతే ఉన్నదని చెప్పకతప్పదు. కాపులు జూన్ 12 ఉదయం సమావేశమవుతున్నారని పోలీసులకు సమాచారమందించినా సకాలంలో స్పందించలేదు. సుమారు పది గంటల ప్రాంతంలో ఓ కానిస్టేబుల్ వచ్చి జరుగుతున్న దౌర్జన్యాన్ని చూసి వెంటనే వెళ్లిపోయాడు. తిరిగి పదకొండున్నరకు వచ్చి హంతకులు పారిపోయేందుకు వీలుగా విజిల్స్ వేస్తూ ఊళ్లోకి వచ్చారు. పారిపోతున్న కాపులను పట్టుకొనేందుకు ప్రయత్నించలేదు. అప్పటికే శ్రీనివర్తి వెంకట్, బూరాడ సుందరరావు చనిపోయారు. కొన ఊపిరితో ఉన్న శ్రీనివర్తి సంఘమేషు, చిత్తరి అప్పడు దారిలో చనిపోయారు. జూన్ 20న మరో క్షతగావూతుడు పాపయ్య చనిపోయాడు.
గ్రామంలోని ఘర్షణ వాతావరణం, కాపుల బెదిరింపులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా..పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే లక్షింపేట హత్యాకాండ జరిగింది. నెలల తరబడి పోలీస్ పికెట్ పెట్టి, ఎన్నికల నెపంతో పోలీసులను ఉపసంహరించిన ఉన్నతాధికారులు పరోక్షంగా దళితులపై దాడికి కారణమయ్యారు. ఆ తర్వాత నిందితులను అరెస్టు చేయడంలోనూ పోలీసులు చూపిస్తున్న నిర్లక్ష్యం చూస్తూనే ఉన్నాం. అసలు దోషులను విడిచి పెట్టి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ దాడిలో బొత్స సత్యనారాయణకు దగ్గరి బంధువులున్నారన్న విషయం దాచేస్తే దాగని సత్యం. వీరిని కాపాడేందుకు ఉన్నత స్థాయిలో పైరవీలు సాగుతున్నాయి. లక్షింపేట దాడిని, పోలీసులు, పాలకులు వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రంలోని ప్రజాసంఘాలు, హక్కుల సంఘా లు, మేధావులు తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దళితులపై దాడి వెనుక ఉన్న కుట్ర బయటకి రావాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలి. చనిపోయిన వారికి పది లక్షలు, గాయపడిన వారికి రెండు లక్షలు పరిహారం చెల్లించి బాధిత కుటుంబాలకు రక్షణ, ఉపాధి కల్పించాలి. దళితల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దళితుల ఆత్మరక్షణకు దళితుల తోకూడిన గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేయాలి.
-యెపూరమల్ల రాములు, రాష్ట్ర అధ్యక్షుడు మాలమహానాడు
-కె. కాశీవిశ్వనాథం, రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ దళిత కూలీ రైతు సం
Namasete Telangana News Paper Dated 1/7/2012