తరతరాలుగా దళిత వారు,ముఖ్యంగా గిరిజనులు అణచివేతకు,వివక్షకూ బలవుతూనే ఉన్నారు. ఇక ఆదివాసుల జీవితాలు అయితే.. రంపపు కోతకు, నిత్య దాడులకు బలవుతున్నా యి. ఈ నేపథ్యంలో అటు మైదాన వూపాంత ప్రజలతో సరితూగి జీవించలేక, అటు ఆదివాసులుగా తగిన రక్షణ లేక నానాటికీ కడు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఎరుకలవారు. ఆంధ్రవూపదేశ్‌లో 2001 జనాభా లెక్కల ప్రకారం గిరిజన తెగలు 35 ఉన్నాయి. వాటి జనాభా 49,97,643 గా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఎరుకల తెగను తీసుకుంటే.. రాయలసీమ, ఇంకా ఇతర జిల్లాల్లో మొత్తం కలిపితే 3,30,954 మంది ఉన్నారు. వీరి జనాభా 1961లో 1,2,024 ఉండగా 2001 నాటికి మూడు లక్షల పైచిలుకుకు పెరిగింది. ప్రాంతాల వారిగా ఎరుకల జనాభా చూస్తే..తెలంగాణలో1,25,021 కాగా, ఆంధ్రాలో 2,05,933, రాయలసీమలో 1,06,505 మంది ఉన్నారు. యానాదులను మినహాయింపుతోనే ఈ గణాంకాలు.
ఈ గణాంకాలను బట్టి ఎరుకలు జనాభా రీత్యా అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఎరుకల అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోవడంలేదు. దీంతో.. ఎరుకలు అభివృద్ధి ఫలాలు అందక సామాజికంగా అణచివేయబడుతున్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థికరంగాలలో వెనుకబడి ఉన్నారు. పైగా కులపరమైన అన్యాయాలకు,అవమానాలకు బలవుతున్నారు.
ఎరుకల బతుకులపై బ్రిటిష్ కాలంనుంచీ వివక్ష, అణచివేత కొనసాగుతున్నది. నాటి బ్రిటిష్ అధికారి జె.ఎం.స్టీఫెన్ 171లో ఎరుకలను క్రిమినల్స్‌గా పరిగణించాలని ప్రతిపాదన చేసి సీటీ యాక్ట్‌ను రూపొందించారు. 1902-03లో మద్రాసుతో కలుపుకొని తెలుగు ప్రాంతంలో కూడా సీటీ యాక్ట్ అమలు చేశారు. ఆ తరువాత 190లో సీటీ యాక్ట్, సెటిల్‌మెంట్ చట్టం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ క్రమంలోనే బ్రిటిష్‌పాలకులు 1924లో భారతదేశంలో క్రిమినల్ ట్రైబ్ చట్టాన్ని అమలు చేశారు. ఈ నేపథ్యంలో ఆనాటినుంచీ నేటి దాకా గిరిజన తెగలు సీటీయాక్ట్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
171నుంచి క్రిమినల్ ట్రైబ్ చట్టానికి వ్యతిరేకంగా గిరిజనులు, ఆదివాసులు పోరాడుతున్నారు.
జాతీయోద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలోనే.. 1935 ప్రాంతంలో ఆంధ్రవూపాంతంలోని నెల్లూరు జిల్లాలో ఓ బహిరంగ సభకు వచ్చిన పండిట్ నెహ్రూ సీటీ యాక్ట్‌కు వ్యతిరేకంగా ఎరుకలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 1941లో ఎరుకలు తమను గిరిజనుల జాబితాలో చేర్చాలని ఉద్యమించారు. అలాగే వెనుకబడిన గ్రామీణ భారతంలోని 200 తెగలను బ్రిటిష్ ప్రభుత్వం సీటీ యాక్ట్ కిందికి తేవడంతో.. ఈ ప్రజలంతా బ్రిటిష్ పాలకుల విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రకృతిపై ఆధారపడి బతుకుతున్న తమను దొంగలుగా ముద్రవేయడం అమానుషమని తిరుగుబాటు చేశారు. దీంతో.. దిగివచ్చిన బ్రిటిష్ పాలకులు 1952 , ఆగస్ట్ 31న సీటీ యాక్ట్‌ను ఎత్తివేశారు.అంతేకాదు, బడుగులకు రిజర్వేషన్లపై ప్రభుత్వం నియమించిన కాకా కలేల్కర్ కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటించింది. ఈ సందర్భంగా కూడా ఎరుకలు పెద్ద ఎత్తున కదిలి తమను గిరిజనులలో చేర్చాలని డిమాం డ్ చేశారు.
అలాగే 1954లో విజయవాడకు వచ్చిన కమిషన్‌కు వేలాది మంది ఎరుకలు కలిసి తమను గిరిజనుల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ క్రమంలోనే ఏర్పడ్డ అనేక కమిషన్‌లు బడుగుల అభివృద్ధి, రిజర్వేషన్ల విషయంలో దేశవ్యాప్తంగా పర్యటించి అధ్యయనం చేసి, బడుగుల అభివృద్ధికి అనేక సూచనలు చేశారు.అలాగే ఎరుకలను ఎస్టీలుగా మార్చాలని సూచించారు. అయితే ఇప్పటిదాకా వచ్చిన ఏ కొద్ది హక్కులైనా, సంస్కరణలైనా ఎరుకలు పోరాడి సాధించుకున్నవే. కానీ పాలకులు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులు కావు.
స్వాతంవూత్యానంతరకాలంలో ఆంధ్రవూపదేశ్‌లో కూడా ఎరుకలను మొదట దొంగలుగానే చూసిన చరిత్ర ఉన్నది. ఇది 197 దాకా కొనసాగినా.. నేడు కూడా ఏదో రూపంలో, ఆ వివక్ష, అణచివేతలు కొనసాగుతున్నాయి. ఎక్కడ దొంగతనం జరిగినా.. ఎరుకలనే మొదట అనుమానించి పోలీసులు అనేక రకాలుగా వేధింపులకు పాల్పడుతున్నారు. నేరస్తులు దొరకని పరిస్థితి ఉంటే.. చివరికి ఎరుకలనే బలిచేసే స్థితి ఉన్నది. సింహాచలం గుడిదోపిడీ, బనగానపల్లి బ్యాంకు దోపిడీ చేశారని చెప్పబడిన ఎరుకలంతా ఇప్పుడు రోడ్లపై టీ-బండి పెట్టుకుని బతుకుతున్నారు. విజయవాడ కనకదుర్గ గుడిలో దొంగతనం ఎవరు చేశారో తేలలేదు. చివరికి తేలికగా దొరికే ఎరుకలను తెచ్చి ఆ కేసులో ఇరికించా రు. జైలుపాలు చేశారు. కాయకష్టం చేసుకుని బతుకుతున్న ఎరుకలను దొంగలు గా చిత్రీకరిస్తున్న ఈ ప్రభుత్వం,ఇవాళ నేతలంతా వేల కోట్ల కుంభకోణాలు చేసి దేశసంపదను దోచి ప్రజలను భ్రష్టు పట్టించారు కదా, ఇకనుంచి రాజకీయ నేతలందరినీ నేరస్తులుగా, దొంగలుగా ముద్రవేస్తారా?
అగ్రవర ్ణపాలకులు అనాది నుంచి అనుసరిస్తన్న పద్ధతి ఇదే. నాడు అర్జునుడికన్నా ప్రతిభావంతుడైన ఏకలవ్యుడిని మోసం చేశారు. గురు దక్షిణ పేరుతో.. బొటనవేలును తెగనరికారు. అగ్రకుల బ్రాహ్మణవాదం బడుగు, బలహీన వర్గాలకు, గిరిజనులకు ఎన్నడూ న్యాయం చేయలేదు. ఇప్పుడూ చేయదు. రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి ఓట్లు అడుక్కొని అధికారంలోకి వచ్చిన పాలకులు ఏ ఒక్క రాజ్యాంగ విలువను అమలు చేయడం లేదు. పోగా రాజ్యాంగానికి తూట్లు పొడిచి ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నారు. దేశసంపదను లూటీ చేసి, ప్రజలను ఏమీలేని నిరుపేదలుగా, భిక్షగాళ్లుగా మార్చుతున్నారు.
మైదాన ప్రాంతంలో ఉంటూ గిరిజన జీవితం జీవిస్తున్న వారి ని ఈ పాలకులు పట్టించుకోవడం లేదు. రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులకు కూడా దూరం చేస్తున్నారు. గిరిజన శాఖామంవూతిగా రెడ్యానాయక్ ఉన్నప్పుడు ఎరుకలను ఎస్టీల్లో చేర్చడానికి తీవ్ర ప్రయత్నం జరిగింది.అయినా అది సఫలం కాలేదు. అయితే.. ఇప్పటికే ఎస్టీల్లో ఉన్న 35 తెగలకు రిజర్వేషన్లు అందడంలేదు. రిజర్వేషన్ల శాతాన్ని పెంచకుండా..మరికొన్ని తెగలను ఎస్టీల్లో చేర్చితే.. రిజర్వేషన్‌లు ఎలా దక్కుతాయని ఎస్టీలు వాదిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచినప్పుడే తగి న న్యాయం దక్కుతుందని గిరిజన నేతలు అంటున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే అగ్రవర్ణ ఆధిపత్య తీర్పులను, విలువలను రద్దు చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడు బీసీల్లోని అత్యంత వెనుకబడినవర్గాలను ఎస్టీల్లో చేర్చినా తగు ప్రయోజనం చేకూరుతుంది.
ఈక్రమంలో ఎరుకలను వారి జనాభా కనుగుణంగా వారి అభివృద్ధికోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. విద్యా,ఉద్యోగ,రాజకీయరంగాలలో ముందు భాగాన ఉండేట్లు ఎరుకలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. 300 ఎరుకలు ఉన్న నివాస గ్రామాలను గ్రామపంచాయితీలుగా గుర్తించి రాజకీయ ఎదుగుదలకు ప్రోత్సహించాలి. ఎరుకలు కూడా ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా.., పోరాడి తమ హక్కులను సాధించుకోవాలి.
-పాపని నాగరాజు
సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యద
Namasete Telangana News Paper Dated : 03/06/2012
THERE is no leader to guide yerukulas
ReplyDeleteTHERE is no leader to guide yerukulas
ReplyDelete