Tuesday, June 12, 2012

సింహల చరిత్ర కారుడు ప్రొఫెసర్ భుక్యా భంగ్యా -Subjugated Nomads – పుస్తక సమీక్ష By Karthik Navayan

సింహలనుంది ఒక చరిత్రకారుడు ఉద్బవించే వరకు వేటగాడు చెప్పే పిట్ట కథలు కట్టు కథలే చరిత్రగా చలామణి అవుతాయి అనేది ఆఫ్రికాన్ సామెత (Until lions have their historians, tales of the hunt shall always glorify the hunter). ఈ దేశం లో ఆదిమ జాతులు ఆదిమ కులాలు తమ తమ చరిత్రలను తిరగ రాస్తున్న సమయమిది అంటరానితనం అవమానాల పెనుమంటల పెనుగులాట లో నుండి తమ తమ గతాన్ని తవ్వి ఇదిగో ఇది మా చరిత్ర అని వర్తమాన  చరిత్రకారుల డొంకతిరుగుడు వాదనలకు సవాల్ విసురుతున్న నూతన చరిత్రకారుల యుగం ఇది.
ఇపుడు పేదలుగా, అంటబడని వారుగా, కేవలం ఓటర్ లుగా, ప్రబుత్వాలు ప్రవేశపెట్టే వివిధ పథకాలకోసం ఎదిరిచుసే అర్బకులుగా ఉన్న ఆదిమ జాతుల గత చరిత్ర ఏమిటి? ఒక నాలుగైదు వందల సంవత్సరాల కిందకి వెళ్లి చుస్తే వారు ఇలాగే ఉన్నారా?  వారి బ్రతుకులు ఇలాగె  ఉన్నాయ? అనే అనేకానేక ప్రశ్నలకు ప్రస్తుతం చలామణిలో ఉన్న పేరు మోసిన చరిత్రకారుల వద్ద ఆయ ఆదిమ జాతులను సంతృప్తి పరిచే సమాదానం లేదు. ఇది మన ప్రస్తుత విద్యావ్యవస్థ లోని, విద్యాలయాలు చేస్తున్న వివిధ చరిత్ర పరిశోదనల్లోని  డొల్లతనాన్ని తెలియజేస్తుంది. విద్య వ్యవస్థలోని అప్రజస్వమిక దొరనులను తెలియజేస్తుందిప్రస్తుతం సామజిక ఆర్ధిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనానికి గురి అయిన కులాలు, జాతులు తమ తమ నిజ  చరిత్రలను తాము మాత్రమే బయటికి తీసుకురావలసి వస్తున్న పరిస్థుతులు కూడా చాల ఆలోచించవలసినవి. ఎందుకు అగ్రకుల చరిత్రకారులు ఈ ఆదివాసుల, అంటారని వారి చరిత్రలను గూర్చి నిజానిజాలను రాయలేక చెప్పలేక పోతున్నారో కూడా ఆలోచించవలసిందే. ఉన్నత విద్య వ్యవస్థ  ఇప్పటికి కొనసాగిస్తున్న కుల, జాతి వివక్ష లో బాగమే అడుగు కులాల, జాతుల నిజ చరిత్రలను దాచి పెట్టడం.అని బావించ వలసి వస్తుంది.ఇంకా చెప్పాలంటే అగ్ర కుల చరిత్రకారులు గనక ఈ దేశ నిజమైన చరిత్రను రికార్డు చేయడమంటే  తమ తమ తాతలు, తండ్రులు ఈ దేశం లోని అడుగు కులాలపై, జతులపై సాగించిన అమానవీయ అణచివేత దోపిడీ దౌర్జన్యాలను రికార్డు చేయడమే.  అంత నీతి, నిజాయితి గలిగిన చరిత్రకారులు ప్రస్తుతమున్న విద్య రంగంలో దుర్బినివేసి వెతికినా దొరకరు. అందుకే అడుగు కులాలు, జాతులు తమ తమ చరిత్రలను తవ్వి తీయవసలిన అవసరం ఇపుడు వచ్చింది

ఆ క్రమంలో, ఆ కర్తవ్య నిర్వహణలో బాగంగా రాసిందే  ప్రొఫెసర్ భూక్యా  భంగ్యా  రాసిన ” అణచబడిన సంచారులు”(నిజాం పాలనలో లంబాడీలు)  (subjugated  Nomads – the lambadas  under the  rule of  the  nizams ) అనే  తన పీ ఎచ్ డీ పరిశోదన గ్రంధం. లండన్ లోని  Warwick university  లో మూడు సంవస్తరాల వ్యవదిలో ఈ పుస్తకాన్ని రాసారు. దీనిని ఒరిఎంట్ బ్లాక్ స్వాన్ అనే ప్రచురణ సంస్థ 2010  లో ప్రచురించింది. 255  పేజీల ఈ పుస్తకం లంబడిలా గత చరిత్రను మన ముందు ఉంచుతుంది. ప్రస్తుతం అనువాద దశలో ఉన్న ఈ పుస్తకం త్వరలో తెలుగులో కూడా వస్తుంది. లంబడిలా నిజమైన గతాన్ని తెలుసుకోవాలనే వారికీ ఇదొక కరదీపిక  ఈ పుస్తకంలో ఎ విషయం కూడా అధరాలు లేకుండా లేదు. ప్రతి వాక్యానికి రేఫెరన్స్ ఉంటుంది. ఈ పుస్తకాన్ని రాయడానికి ప్రొఫెసర్ భూక్యా  భంగ్యా  నిజాం పరిపాలన కు సంబందించిన అనేక రాత  ప్రతులతో పాటు నిజాం/ బ్రిటిష్ కాలం నాటి చట్టాలతో పాటు  అనేక  వేల పుస్తకాలను చదివారు. ఆ పుస్తకాల లిస్టు ఈ పుస్తకం చివరలో ఇచారు
ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, అణచబడిన, అంటారని జాతుల చరిత్రలను విద్య రంగ పరిధిలోని తీసుకోచిన మొట్ట మొదటి పుస్తకం  యిదే. ఈ దారీ లోనే అన్ని అణచబడిన కులాలు అణచబడిన జాతులు  తమ తమ నిజమైన చరిత్రలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆయ దళిత ఆదివాసి సమూహాలకు చెందిన విద్యా వేతలైన ఈ పని చేయవలసి ఉంది
ఒకప్పుడు స్వయం సంవృద్ది తో రాజీలేని జీవితం గడిపిన ఆదిమ జాతులు వలస పాలనా కాలంలో బ్రిటిష్  వారితో కలిసి  వారి తాబెదరులయిన స్థానిక అగ్ర కుల  అధికారులు ప్రవేశపెట్టిన పరిపాలన సంస్కరణల వల్ల తమ తమ వ్రుతులు, ఉపాది కోల్పోయి. తమ జీవన వైవిధ్యాన్ని కోల్పోయి ప్రస్తుతపు పేదవారుగా అన్ని రంగాలలో వెనుకబడిన జాతులుగా మిగిలి పోయారు. ఈ చారిత్రక పరిణామా క్రమాన్ని పట్టి యిచేదే ఈ పుస్తకం. మరొక ముఖ్య విషయం ఏమిటంటే లంబాడ జాతి ఆయా సంస్కరణల వాళ్ళ తమ జాతికి ఉనికికి ఏర్పడిన ముప్పును అధిగమించేందుకు అనివార్యంగా తమను తాము హిందూ మతం లో ఒక కులంగా బావించుకొని బాగామైపోయే క్రమాన్ని ఈ పుస్తకం పట్టి చూపిస్తుంది
ప్రధానంగా హైదరాబాద్ డెక్కన్ లోని లంబాడి జాతి ఎ సంస్కరణల వల్ల, ఎ పరిపాలన విధానాల వల్ల తమ సాంస్కృతిక వైవిధ్యాన్ని కోల్పోయి  వర్తమాన కాలం లో  తమ తమ కన్న   బిడ్డలను అమ్ముకొనే దుర్బర పరిస్థితులకు గరయ్యిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. ఒక నాలుగైదు వందల సంవత్సరాల వెనకకు వెళ్లి చుసినట్టైతే లంబాడీలు ఇపుడున్న సామజిక ఆర్థిక పరిస్థుతులకు బిన్నమైన పరిస్తులను కలిగి ఉన్నారు. యిప్పటిలగా అపుడు వారు తమ కన్నా బిడ్డలను అమ్ముకొనే దుర్బర దారిద్ర్య పరిస్తులలో లేరు. వారు స్వయం సంవృద్ది కలిగిన అప్పటి వ్యవసాయ మరియు వాణిజ్య రంగాలకు అత్యంత ముఖ్యమైన రవాణా రంగాన్ని నిర్వహిస్తున్న వారు. అంతే కాకుండా అపుడు సైన్యాలు యుద్దానికి ఎక్కడికైనా బయలుదేరవలసి వస్తే ఆ సైన్యానికి సంభందించిన యుద్ద సామగ్రిని మరియు ఆహార సామగ్రిని సైన్యం తో పాటు తరలించేది లంబాదీలే
లంబాడీలు ప్రధానంగా పశువుల పెంపకం దారులు ఒక్కొక్కరికి వందలు మరియు వేల సంక్యలో పశువులు ఉండేవి. ఈ పశువుల ద్వారానే వీరు రావణ రంగాన్ని నిర్వహించేవారు. హైదరాబాద్ డెక్కన్ లోని అప్పటి వాణిజ్య వ్యాపార వ్యవస్థ అంత లంబడిలా పై ఆధారపడి మనుగడ సాగించింది. వ్యవసాయ ఉత్పతులైన ఉల్లిగడ్డలు, బియ్యము, గోదుమలు మార్కెట్ కు తరలించడానికి లంబదీలే ప్రధాన ఆదారం. బ్రిటిష్ వలస పాలనా కంటే ముందు రవాణా రంగం అంత లంబాడీల పైననే ఆధారపడి ఉండేది.
నూతన సాంకేతికత వాళ్ళ వచ్చిన రైల్వీలు, తద్వారా వచ్చిన పెద్ద కంపనీలు  చిన్న స్థాయి వ్యాపారంగా కొనసాగిన లంబడిలా రావణ రంగాన్ని దెబ్బతీసి వారిని రోజు వారి కూలీలుగా మార్చివేశాయి. అలాగే బ్రిటిష్ వారు తీసుకోచిన చట్టాలు ( cattle  tress pass  act – 1857 , మరియు criminal  Tribes  Act )   అన్ని లంబడిలా జీవితాలను వారి జీవన వైవిధ్యాన్ని నియంత్రించేవి మాత్రమే కాకుండా వారి పశువుల పెంపకాన్ని కూడా నియంత్రించాయి మరియు లంబదిలను నేరస్త జాతిగా ముద్ర వేయడానికి దోహద పడ్డాయి
మామూలుగానైతే  ఏదైనా పంటను లంబదిలకు చెందిన పశువులు నాశనం చేసినట్లయితే, లంబాడీలు ఆయ పంట చేనులను పశువుల పేడతో నింపడం ద్వార పరిహారం చెల్లించేవారు కానీ బ్రిటిష్ పాలనా కాలం లో వచ్చిన చట్టాల వలన చెల్లించవలాసిన పరిహారం రుపయలలోకి మారి  అదీ  పెరిగి లంబాడీలు తమ తమ పశువుల ను దూరం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే దోపిడీలు అనేవి కూడా లంబదిలకు పుట్టుకతో వచినవి కాదు వారసత్వంగా వచ్చినది కాదు. బ్రిటిష్ వలస పాలనా సంస్కరణలు వారి తాబెదారులైన స్వదేశీ అగ్రకుల పలక వర్గాల విధానాల వలన తమ తమ జీవనోపాదులు కోల్పోయి గత్యంతరము లేక ఎంచుకున్నదే. ఈ విషయాన్నీ ఈ పుస్తకం అనేక చారిత్రక ఆధారాలతో నిరూపిస్తుంది
అణచబడిన, అంటారని, ఆదివాసి ప్రజల నిజ చరిత్ర లను విద్య వ్యవస్థ పరిదిలోని తీసుకు రావాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం నెరవేర్చింది ఇలాంటి పుస్తకాలు అన్ని ఆదివాసి అంటారని సమూహాలపై రావాల్సిన అవసరం ఉంది. అనేక అంటారని కులాలు తెగలు క్రమ క్రమంగా అంతరించి పోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ పేరుతో అటవీ సంరక్షణ పేరుతో అడవి జంతువులను అడవులను కాపాడేందుకు ప్రణాళికలు వేస్తున్న పాలకులు అడవే ఆధారంగా జీవనం సాగిస్తున్న ఆదివాసులను ఇతర అంటారని  సమూహాలకు సంబంధించి ఎ ప్రణాళిక లేదు ఉన్న పతకాలేవి వారి అవసరాలను తీర్చేవిధంగా లేవు కావున ఆయ సమూహాల పై వారి జీవన వైవిద్యాల పై పరిశోదన అనేది తక్షణం అవసరం
ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్టీ లలో 30 వరకు తెగలు ఉన్నాయి ఏవో కొన్ని తెగలు తప్ప ఇంకా అనేక తెగలు విద్య కు వైద్యానికి నోచుకోని దశలోనే ఉన్నాయి అలాగే ఎస్సీ లలో 61 కులాలు ఉంటె మాల మాదిగా తప్ప మిగతా కులాలు ఎవరికీ తెలియవు వారు ఎ పరిస్తులలో జీవనం సాగిస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. నాగరికులుగా చెప్పుకుంటున్న ప్రస్తుత సమాజం లో నుండి కొన్నీ తెగలు కులాలు క్రమ క్రమంగా ఆర్తనాదాలతో అంతరించి పోతున్నాయి యిది ఎ సమాజానికైనా మంచి పరిణామం కాదు. ఈ పరిస్థితి వారి గురుంచి చరిత్రకారులు, మేధావులు, విద్యవేతలు తక్షణం ఆలోచించవలసిన అవసరం ఉండి. ఆయా అణచబడిన సమూహాలనుండి చరిత్రకారులు ఉద్బవించ వలసి ఉన్నది. వర్తమాన  చరిత్ర కారుడు ప్రొఫెసర్ భూక్యా  భంగ్యా లాగే  అనేక మంది సింహాల చరిత్రకారులు ఆయా అణచబడిన జాతులనుండి , కులాల నుండి ఉద్బవించ వలసి ఉన్నది
- బత్తుల కార్తీక్ నవయన్
రిసెర్చ్ స్కాలర్
ఆంగ్లము మరియు విదేశీ బాషల విశ్వ విద్యాలయము
తార్నాక , హైదరాబాద్.

2 comments:

 1. "నాగరికులుగా చెప్పుకుంటున్న ప్రస్తుత సమాజం లో నుండి కొన్నీ తెగలు కులాలు క్రమ క్రమంగా ఆర్తనాదాలతో అంతరించి పోతున్నాయి యిది ఎ సమాజానికైనా మంచి పరిణామం కాదు."

  మీ ఆవేదనలోని అక్షరాక్షరంతో ఏకీభవిస్తున్నాను. నిజంగానే చాలా మంచి పుస్తకం గురించి పరిచయం చేశారు. ఈ పుస్తకం తెలుగు అనువాదం పూర్తయితే తప్పక తీసుకుంటాను.

  ReplyDelete
 2. చెప్పడం మర్చాను. వ్యాసం ప్రారంభం నుంచి చివరి వరకు చాలా అక్షరదోషాలున్నాయి. కాస్త సరిచేయండి. ఇన్ని తప్పులు చూడ్డానికి బావుండవు. చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.

  పుస్తకం పరిచయం మాత్రం చాలా బాగుంది.

  "ఎందుకు అగ్రకుల చరిత్రకారులు ఈ ఆదివాసుల, అంటారని వారి చరిత్రలను గూర్చి నిజానిజాలను రాయలేక చెప్పలేక పోతున్నారో కూడా ఆలోచించవలసిందే."

  అగ్రకులాల చరిత్రకారుల పరిమితిని మీరు గుర్తించలేదేమో. దళితవాడల్లోకి, గిరిజన తెగల జీవితాల్లోకి వారు తొంగి చూసి ఉంటే వారికి చరిత్ర మరింత వాస్తవంగా ఆర్థమయ్యేదేమో. కుల సమాజంలో ఉండి అలా తొంగి చూడటం విప్లవోద్యమంలోనే సాధ్యం. కాని వీరి కర్తవ్యం చరిత్ర రచన కాదు. పోరాటంలో రాలిపోతున్న వారు చరిత్ర పరిశోధన ఎలా చేయగలుగుతారు. వారితో కలిసి పనిచేస్తూ వారి జీవితం గురించి వ్యాసాలు రాయడమే చరిత్ర కాదు కదా. దానికో వైధానికం ఉంది. దాని పరిధిలోకి వెళ్లడం ఉద్యమంలో ఉన్నవారికి కష్టమే.

  ఎవరి చరిత్ర వారే రాసుకోవడం...
  బ్రాడ్ సెన్స్‌లో ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఇదే పరిష్కారం కాకపోయినప్పటికీ..

  ReplyDelete