Saturday, June 2, 2012

సత్యమూర్తి జీవితం వైరుధ్యం---లంకా పాపిడ్డి



సత్యమూర్తి వ్యక్తిగత విషయాలు నాకు పెద్దగా తెలియవు. ఆయనతో ప్రత్యక్ష సంబంధం, అనుబంధం కూడా తక్కువే. కేజీ సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్యల స్నేహం గురించి సీనియర్స్ గొప్పగా చెప్తుండేవారు. నేను సత్యమూర్తి అంటే ఎక్కువ ఇష్టపడేవాణ్ణి. బహుశా కవితలంటే నాకు చాలా ఇష్టం కావడం వల్ల కావచ్చు.193లో ఖమ్మం జిల్లాలోని ఆలుబాక కొండల మీద (కపూగుట్టలు) రాజకీయ తరగతులు జరిగాయి. సత్యమూర్తి ఈ రాజకీయ తరగతులకు హాజరయ్యారు. ఆయనను ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి, అదే చివరిసారి. అప్పటికే కొండపల్లి సీతారామ య్య అరెస్టు (192 జనవరి) అయ్యారు. సత్యమూర్తి పార్టీ కార్యదర్శి అయ్యారు. పార్టీ కార్యదర్శిగానే ఆ తరగతులకు ఆయన హాజరయ్యారు. పీపుల్స్‌వార్‌పార్టీ అప్పటికింకా చైనా కమ్యూనిస్టు పార్టీని రివిజనిస్టు పార్టీగా ప్రకటించలేదు. 193 రాజకీయ తరగతులలో చైనా కమ్యూనిస్టు పార్టీని రివిజనిస్టు పార్టీగా ప్రకటిస్తూ రాసిన డాక్యుమెంట్‌పైనే క్లాసులు జరిగాయి.

ఈ క్లాసులకు పీపుల్స్‌వార్ పార్టీ నాయకత్వం మొత్తం హాజరైయింది. కానీ ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర కమిటి సభ్యులు కొందరు గ్రూపులుగా వ్యవహరించడమే మిగతా వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటి వరకు పీపుల్స్‌వార్ పార్టీ గ్రూపు తగాదాలు లేని పార్టీ అని నమ్ముతున్న కామ్రేడ్స్‌కు బాధ కలిగించింది. ఈ గ్రూపు తగాదాలను సత్యమూర్తి పరిష్కరించలేకపోయారు. సత్యమూర్తి పార్టీలోని తప్పులను సరిదిద్దడంలో సమర్థవంతంగా వ్యవహరించలేకపోయారు. సత్యమూర్తి అంటే నా లాంటి వారికి అప్పటి వరకు ఉన్న హీరో భావం ఆవిరైపోయింది. తర్వాత ఖమ్మంజిల్లా ఉద్యమం ఎందుకు అభివృద్ధి చెందలేదన్న మరో చర్చ సందర్భంగా సత్యమూర్తి జవాబు ఇవ్వలేకపోవడంతో మళ్ళీ నిరాశ కలిగింది. ఈ క్లాసుల తర్వాత సత్యమూర్తి పట్ల నా అభివూపాయం మారింది.

194లో కొండపల్లి సీతారామయ్య తప్పించుకుని వచ్చాడు.అప్పటికి పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. దీన్ని చక్కదిద్దడానికి పార్టీలో రెక్టిఫికేషన్ క్యాంపెయిన్ ప్రారంభించబడింది. ఈ దిద్దుబాటు ఉద్యమం 195లో పార్టీలో సంక్షోభంగా మారింది. ఈ సందర్భంగా సత్యమూర్తి, కె.ఎస్‌ను విమర్శిస్తూ వివిధ విషయాల పై డాక్యుమెంట్స్ రాశా రు. ఈ డాక్యుమెంట్లలో మూడు ప్రపంచాల సిద్ధాంతాన్ని ఖండి స్తూ రాసిన ఒక్క డాక్యుమెంట్ మాత్రమే సరైన డాక్యుమెంట్ అనిపించింది. మిగతా డాక్యుమెంట్స్ ఏవీ సరైనవి కావు. చివరికి ప్రత్యామ్నాయ వ్యూహం- ఎత్తుగడలు డాక్యుమెంట్ కూడా రాశారు. (ఈ వ్యూహం ఎత్తుగడలు డాక్యుమెంట్‌లో ఎక్కడా అంబేద్కర్ కానీ అంబేద్కరిజం కాని లేదు.) సత్యమూర్తి డాక్యుమెంట్లు వాటి జవాబు డాక్యుమెంట్లు పార్టీలో చర్చించడానికి ఏడాదికి పైగానే పట్టింది. చివరికి సత్యమూర్తి డాక్యుమెంట్స్‌ను సత్యమూర్తిని పార్టీ తిరస్కరించింది.

పీపుల్స్‌వార్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత సత్యమూర్తి జీవితంలో రెండో అధ్యాయం లేదా మరో అధ్యాయం మొదలైంది. తాను ‘దళితుడు అయినందు వల్లనే పీపుల్స్‌వార్ పార్టీలో వివక్షకు గురయ్యాను’ అని ప్రచారం చేశాడు. సత్యమూర్తి దళితుడని పార్టీ లో చాలా మందికి తెలువనే తెలవదు. సత్యమూర్తి పార్టీలో అంతర్గత పోరాటంలో భాగం గా ఎన్నో డాక్యుమెంట్లు రాశాడు. కాని కులవివక్ష గురించి ఒక్క డాక్యుమెంటు కాదు ఏ డాక్యుమెంటులో కూడా ఒక్కవాక్యం కూడా రాయలేదు. కానీ పార్టీ బయట మాత్రం సత్యమూర్తి కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడినందుకే, మాట్లాడినందుకే పార్టీనుంచి పంపేశారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో మొదలై సత్యమూర్తి దళిత నాయకునిగా ఇతర దళిత నాయకులతో కలిసి వివిధ సంస్థలు, పత్రికలు నడిపారు. అప్పటి వరకు వర్గ పోరాటమే కీలకమని చెప్పిన సత్యమూర్తి కులపోరాటం కూడా చేయాలని ప్రచారం చేశాడు.

భారతదేశం వర్గకుల దేశమైనందున వర్గకుల పోరాటం చేయాలన్నాడు. మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని కలిపి కొత్త సిద్ధాంతం అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమం లో మార్క్సిస్టు- లెనినిస్టు పార్టీలను తీవ్రంగా విమర్శించాడు. వర్గం కీలకం అన్న విప్లవ పార్టీల సిద్ధాంతాలను తప్పుపట్టాడు. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు పనికిరాని సిద్ధాంతాలని కొట్టిపారేశాడు. తానే స్వయంగా ఒక విప్లవ పార్టీలో ఉండగా వర్గపోరాటమే కీలకమని ప్రచారం చేసినందుకు ఎప్పుడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు.

దళిత సంఘాలలో తిరిగి ఏ దళిత సంఘంలోనూ ఇమడలేకపోయాడు. తన కొత్త సిద్ధాంతం ఆధారంగా, తన కొత్త వ్యూహం ఎత్తుగడలు ఆధారంగా ఒక పార్టీని నిర్మించలేకపోయాడు. ఒక ఉద్యమాన్ని నిర్మించలేక పోయాడు. ఓహో సత్యమూర్తి ఆహా సత్యమూర్తి అని పొగిడిన దళిత సంఘాలు ఏవీ సత్యమూర్తిని తమ సంఘాల నాయకునిగా స్వీకరించలేకపోయాయి. ‘దళిత వాదాన్ని లేదా అస్తిత్వ వాదాన్ని వినిపించిన సత్యమూర్తి హఠాత్తుగా మధ్యలో ఒక ‘విప్లవ పార్టీ’ గా చెప్పుకుంటున్న పార్టీకి కార్యదర్శి అయ్యాడు. ఆ పార్టీకి వ్యూహం, ఎత్తుగడలు డాక్యుమెంట్లు రాసి పెట్టాడు. ఈ డాక్యుమెంట్లు రాసేటప్పుడు మళ్ళీ మార్క్సిజం, అంబేద్కరిజంలను కలగలిపిన సిద్ధాంతం సత్యమూర్తికి గుర్తు రాలేదు.రమ్మని ఆహ్వానించగానే అన్ని మరిచిపోయి ఆపార్టీకి కార్యదర్శి అయ్యాడు.

ఆ పార్టీకి కార్యదర్శి అయ్యి పీపుల్స్‌వార్ పార్టీకి లేఖ కూడా రాశాడు. భారతదేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని విప్లవపార్టీలు కలవాల్సిన అవసరం ఉందని, దానికి పీపుల్స్‌వార్ పార్టీ చొరవ చూపాలని లేఖ రాశాడు. అయితే కుల వివక్షకు నిలయం అయిన పీపుల్స్‌వార్ పార్టీని విప్లవపార్టీల ఐక్యతకు చొరవ చూపాలని కోరడం ఒక విచిత్రం అయితే, ఈ లేఖ ద్వారా అర్థమయ్యే విషయమేమంటే సత్యమూర్తి దళిత అస్తిత్వ ఉద్యమాలను అప్పుడు మరిచిపోయారు? సత్యమూర్తి తన అవసరానికి అనుకూలంగా విషయాలను మరిచిపోవడం, గుర్తుకు తెచ్చుకోవడం వల్లనే చివరికి ఏ ఉద్యమానికి చెందని వాడుగా అయ్యాడు.
సత్యమూర్తి చనిపోయిన తర్వాత పొగుడుతూ పత్రికలలో వ్యాసాలు రాస్తున్నారు. విప్లవపార్టీలో ఉన్నప్పుడు గొప్ప విప్లవకారుడు అంటున్నారు.

దళిత ఉద్యమంలోకి వచ్చిన తర్వాత గొప్ప దళిత నాయకుడు అంటున్నారు. విప్లవోద్యమంపై దాడి చేసుకుంటూనే సత్యమూర్తి దళిత ఉద్యమనేతగా గుర్తింపు పొందాడు. ఇది వైరుధ్యం. అసంగతం. సత్యమూర్తి దళిత ఉద్యమనేతగా పొగిడితే ఆయన గత విప్లవ జీవితం వ్యర్థం అయిన జీవితంగానూ, పశ్చాత్తాపపడవలసిన జీవితంగానూ చెప్పుకోవలసి ఉంటుంది. అలాగాక సత్యమూర్తి విప్లవకారుడని పొగిడితే ఆయన దళిత ఉద్యమ జీవితం దారి తప్పిన జీవితంగా చెప్పుకోవలసి ఉంటుంది. అంతేకాని అదీ కరెక్టే, ఇదీ కరక్టే అంటే అది అవకాశవాదమే అవుతుంది. విప్లవోద్యమ వ్యూహం వేరు, లక్ష్యాన్ని చేరుకునే మార్గం వేరు. దళిత ఉద్యమ వ్యూహం వేరు, లక్ష్యాన్ని చేరుకునే మార్గం వేరు. ఈ రెండు విషయాలు అర్థం అయితే తప్ప సత్యమూర్తి జీవితంలోని వైరుధ్యం అర్థం కాదు.


మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యు
Namasete telangana News Paper Dated : 03/06/2012 

No comments:

Post a Comment