సహజంగా వాగ్గేయకారులుగా సమాజం ముందు నిలబడ్డవారికి కవిగా, తాత్వికుడిగా, ఆర్గనైజర్‌గా, విశ్లేషకుడిగా, నృత్యకారుడిగా పేరురాదు. కాని, గద్దర్‌లో ఈ అన్ని లక్షణాలు ఒక సమాహారంగా వున్నాయి. అందుకే ఆయన మాటకు పాటకు ప్రాధాన్యత వచ్చింది. ఈమధ్యకాలంలో ఆయన ఉపన్యాసాలు కూడ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. సందర్భానికి అనుగుణంగా వ్యంగ్యాత్మకమైన బాణాలను సంధించడంలో ఆయనకొక ప్రత్యేకత వుంది. గద్దర్‌గారు నాకు 1975 నుండి తెలుసు. ఆంధ్రదేశంలో ’హేతువాదాన్ని’ ఒక ఉద్యమంగా తీసుకెళ్లే పనిలో నేను 1981లో హేతువాద మహాసభలను తెనాలిలో చాలా పెద్దఎత్తున జరిపినపుడు గద్దర్‌గారిని పిలిచాము. ఆయనకు నా చేత్తో ’డప్పు’ను కానుకగా యిచ్చాము. అప్పటికే విప్లవాన్ని, సామాజికవిప్లవాన్ని జోడించి పాడే గద్దర్‌గారికి చాలా ప్రఖ్యాతి వుండేది.
1980 దశకంలో తెలంగాణాలోకాని కోస్తాంవూధలోకాని పేరు చెబితే జనం వచ్చేవారు కొందరే వుండేవాళు.్ల అందులో గద్దర్ మొదటివరుసలోనివాడు. ఆయన పాటల్లో ఒక తత్త్వం, ఒక ధర్మం, ఒక ఆవేశం, ఒక చర్య ఉండేవి. తెలుగువారి గుండెలో,్ల మెదళ్లలో ధర్మావేశాన్ని కలిగించాయి. శ్రీశ్రీ మహావూపస్థానం 1933 ప్రాంతాల్లో రాసింది. అది వచన కవిత. ఆ కవితలు చదివి కమ్యూనిస్టు ఉద్యమంలోకి చాలా మంది మధ్యతరగతివారు వచ్చారు. కాని ప్రజాసమూహాల్లో నక్సల్‌బరీ ఉద్యమ ప్రభావాన్ని తీసుకొచ్చింది గద్దర్, వంగపండు. వారు ప్రజలపై చూపిన ప్రభావం చరివూతాత్మకమైంది. నేను చిన్నప్పటినుండి పాటలురాస్తూ వుండేవాడిని. పాటగాళ్ళం ప్రాణం. మా చిన్నతనంలో నాజర్ బుర్రకథ, బండారు రామారావు, చెంచురామారావు, అద్దంకి మాణిక్యరావుల పద్యనాటకాలు చూసేవారం. వీళ్ళందరూ దళిత బహుజనుల నుండి వచ్చినవారే. ఆ తరువాత హేతువాద ఉద్యమంలో మేము వంగపండు, గద్దర్ పాటలకు అభిమానులుగా మారాం.
వీళ్లిద్దరూ బహుజనులే. ఈ నాలుగు దశాబ్దాల్లో బ్రాహ్మణుల్లో పుట్టిన వారెవరూ మమ్మల్ని ప్రభావితం చేయలేకపోయారు. కారణం వారి భాష, శ్రుతి మా చెవులకు అందలేదు. సాహిత్య విద్యార్ధిగా భట్టుమూర్తి రామరాజ భూషణుని ’వసుచరిత్ర’, పరవస్తు చిన్నయ్యసూరి ’నీతి చంద్రిక, తరువాత వేమన్నను, పోతులూరి వీరవూబహ్మాన్ని ఇష్టపడేవాళ్ళం. వచనకవిత్వ ధారకు వచ్చిన కొత్తల్లో శ్రీశ్రీని, బాలగంగాధర్ తిలక్‌ను ఇష్టపడేవాళ్ళం. జాషువాను చదివాక విషయపరంగా ’గబ్బిలం’ ముందుకు వచ్చింది. గద్దర్‌గారిపాటలు విన్నాక నాకు వేమనలో వున్న తెలుగు, సూటిదనం ఆయనలో కనిపించాయి. చిన్నయ్యసూరిగారి ’నీతిచంవూదిక’లోని ప్రకృతిని, జంతువులను ఉదహరిస్తు చెప్పే పద్ధతీ, పోతులూరి వీరవూబహ్మంలోని భవిష్యత్ దర్శనం, జాషువాలోని దళితతత్వం గద్దర్‌గారిపాటల్లో చూశాను. గద్దర్‌పాటలు వింటున్నపుడు ఉన్నంతగా చదువుతున్నప్పుడు బలంగా వుంటాయా అనే అనుమానం వుండేది. వింటున్నపుడే నోటి కొచ్చే గుణంవాటిలో వుండేది. ఆయనలో సున్నితత్వం ఉంది. పాటకు పాటకు మధ్య ఆయన అమరవీరుల గురించి, పేదలగురించి గుండెలు ద్రవించే మాటలు చెబుతారు. అదంతా కవిత్వమే. గద్దర్‌ని వాగ్గేయకారుడిగా తేల్చాలని వి.ర.సం. భావించింది. విరసంలో చెరబండరాజు రాసిన ’కొండలు పగలేసినం’ గద్దర్ బ్యాలేగా ’పాడింది ఖమ్మంలో చూశాను. అప్పుడు నేను ఉపన్యాసకుడిగా, ’గద్దర్’ గాయకుడిగా మొదటి వరుసలో వున్నాం. ఇద్దరం సభకొస్తే వేలాది మంది ప్రజలు వచ్చేవారు. గద్దర్ వస్తున్నాడంటే నేను సభకు అంగీకరించేవాణ్ణి. ఆయన కవిత్వం వినడానికి ఎదురువచ్చి కూర్చునేవాణ్ణి. మాకు అప్పుడు ఇద్దరం దళితులమే అనే స్పృహలేదు. ఒకసారి పొన్నూరులో కె.వి.రమణాడ్డిగార్ని సభకు పిలిచాము. ఆయన రాసిన ’కవి కోకిల’ ’మహోదయం’ అనే గ్రంథాలు ఇచ్చారు. వారి అమ్మాయి, అల్లుడు పొన్నూరులో డాక్టర్లుగా పని చేస్తున్నారు. ఆయన తరచూ వస్తుంటారు. వారిని అడిగాను- మీరు వ్రాసిన వాటిలో ఒకాయన ’రెడ్డి’, ఒకాయన బ్రాహ్మణసంస్కర్త. దువ్వూరిరామి రెడ్డి భూస్వామ్య భావాలకు ప్రతినిధి, గురజాడ బ్రాహ్మణ సంస్కర్త. మరి విప్లవ భావాలను పాటలో తెస్తున్న గద్దర్ మీద ఒక పుస్తకం ఎందుకు వ్రాయలేదని’ అడిగాను. తరువాత ఆయన గద్దర్‌మీద పెద్దవ్యాసం రాశారు. అప్పుడు మేము ప్రతి ఆదివారం ఒకొక్క మేధావిని ఉపన్యాసకుణ్ణి పొన్నూరు పిలిచి మా ఇంటిలో ఆతిధ్యం ఇచ్చేవారం. ’జ్వాలాముఖి’ని పిలిచాను. ఆయన గొప్ప ఉపన్యాసకుడు. అయితే ఆయన ఉపన్యాసంలో మంచికి, చెడుకి బ్రాహ్మణులనే ఎక్కువ ఉటంకిస్తున్నాడు. ఇది ఆశ్చర్యం వేసింది. ’జాషువా’నిగాని, వేమన్ననుకాని అంబేద్కర్‌నుకాని, గద్దర్‌ని కాని పేర్కొనలేదు. ఆ తరువాత నేను మాట్లాడేను. విప్లవ రచయితలకంటే కూడ గద్దర్, వంగపండు, అరుణోదయ రామారావు వీళ్ళు మంచి తెలుగు కవిత్వం రాస్తున్నారు. వారిపాటల్లో ఈ వి.ర.సం.వారి వచన కవిత్వంకంటే కూడ మంచి తెలుగు వస్తున్నది. ప్రతీకలొస్తున్నాయి. వ్యంగ్యము, ధ్వని వస్తున్నాయి’ అన్నాను. భోజనాల సమయంలో కూడ చర్చ జరిగింది. జ్వాలాముఖి హిందీలో పండితుడు. నిఖిలేశ్వర్ కూడ హిందీలో పండితుడే. సంస్కృతపదాలనే మిక్కుటంగా కవిత్వంలో వాడేవారు. ఇకపోతే ఎక్కువ హిందీ కవిత్వాన్ని అనువదించేవారు. 1971లో నేను జనగీతం రాసి వారిద్దరిని పీఠిక రాయమన్నాను. అప్పటికి వచ్చినకవిత్వంలో అది మొదటి దళిత కవిత.
అర్దరేతిరికాడ
అరగాలిన పీనుగుల
పడదోసికాలుస్తుండు ఓడురా వాడు
భారతమ్మోరి కడగొట్టు కొడుకా,
పెద్దోళ్ళు నలుగురు
వెలిబెట్టివాణ్ణి
సోద్దెంగ చూస్తూ
నవ్వుతుందేరా
బిడ్డల్ని కందా!
గడ్డల్ని కందా!
(కడుపు తీపి - జనగీతం)
దీనిమీద జ్వాలాముఖి పెద్ద పీఠిక వ్రాశాడు. విరసంలోకి ’దళిత’ వస్తువు రాలేదని ఒప్పుకొన్నాడు. కాని జననాట్యమండలి అలా కాదు. పేద ప్రజల గుండె చప్పుళ్ళు వినిపించింది. ఇటీవల వరవరరావు కవిత్వం బృహత్‌సంకలనం చూశాను. ఆయన పీఠికల్లో ఎక్కడ గద్దర్ ప్రస్తావన లేదు. విప్లవేతర బ్రాహ్మణుల గురించి ఎందరి గురించో గుర్తు చేసుకున్నారు. ఎన్ని సభల్లో వరవరరావు గద్దర్ పాటలు వినివుంటాడు. ఆ స్పందన వ్యక్తం చేయలేదంటే సొంత సంస్థలోనే ఆయన ఎంత కుల వివక్షను అనుభవించి వుంటారో అనిపించింది. బ్రాహ్మణులు ఏ ఉద్యమాల్లోవున్నా నోటితో దళితులను ప్రశంసిస్తారేమోకాని రాతలో ప్రశంసించరు. అందుకే గద్దర్ తన పాటమూలాలను తానే చెప్పుకొన్నాడు. ఈ ప్రభావం గద్దర్ మీద కూడ పడింది. తన సమకాలికులను రాత పూర్వకంగా, నోటి పూర్వకంగా ప్రశంసించడంలో గద్దర్ వెనకబడేవున్నాడు. ఇది విరసం ప్రభావంతోనే జరిగిందని నేను అనుకొన్నాను. గద్దర్‌కు అనేక అస్పష్టతలు వున్నాయి. సిద్దాంతపరంగా, జీవనక్షికమంపరంగా, అభివ్యక్తిపరంగా ఎన్నివున్నా ఆయన ఈ యుగంలో ఒక లెజెండు కావడనికి కారణం ఆయన పాటలోని కవిత్వం. ఆయన గొంతులోని ’మెలొడీ’. ఆయన హృదయంలోని సున్నితత్వం. తెలుగుపాటపై సాహితీ విమర్శలో వివక్ష:
వచన కవిత్వం మీద వచ్చిన విమర్శ పాటమీద రాకపోవడం బ్రాహ్మణ పక్షపాతమే. పాటలు ఎక్కువగా దళిత బహుజనులు రాస్తున్నారు. ఈపాటల మూలాలు వి.ర.సం. బ్రాహ్మణులకు కూడ తెలియదు. ఒకసారి తిరుపతిలో యూనివర్సిటి విద్యార్థ్ధుల సభకు పిలిచారు. త్రిపురనేని మధుసూదనరావు అంటే నాకెంతో అభిమానం. బాగా చదవరి. ఉపన్యాసకుడు కూడ. నేను హేతువాద నాయకుడు నాగసిద్ధాడ్డిగారింట్లో దిగేవాడిని. వారి దగ్గరకు వెళ్ళాం. వారితో సంభాషణల మధ్యలో వి.ర.సం. ప్రస్తావన వచ్చింది. త్రిపురనేని రామస్వామికి దాయాదులు అవుతారు. వారిదీ గుడివాడే. కవిత్వము, చైతన్యమూ పుస్తకం ప్రసిద్ధి చెందింది. ఆయనకు విరసంలోని బ్రాహ్మణ రచయితలమీద అసంతృప్తి వుంది. ఆయనఅప్పుడు కె.జి. సత్యమూర్తి శివసాగర్ ప్రభావంలో వున్నాడు. గద్దర్ గురించి ఆయన పట్టించుకొని మాట్లాడే స్థితిలో లేడు. కారణం ’పాట’లో అత్యున్నతమైన కవిత్వం వుంటుందని వారు గుర్తించకపోవడమే. గద్దర్‌గారు ఇవన్నీ పట్టించుకొనేవారు కాదు. వారందరికి గద్దర్ వినవూమంగా ఉండేవాడు. పెద్దలతో వివాదపడటం ఆయన స్వభావం కాదు. ఒక సాహిత్య చరివూతకారుడిగా నేనే ఆయన తరుఫున మాట్లాడేవాణ్ణి. ఆ విషయం గద్దర్‌కి తెలియదు. నేనెప్పుడూ ప్రస్థావించలేదు. ఇదంతా సాహిత్య చరివూతలో భాగంగానే నేను చూసేవాడిని. కాని ఇతరం కాదు. గద్దర్ మీద మీకు అంత అభిమానం ఎందుకు అని చాలా మంది అడిగారు కాని చెప్పే అవకాశం ఇప్పుడే వచ్చింది. అది కుల పరమైందని కూడ కొందరు అభియోగం వేశారు. గద్దర్‌కాని, నేనుకాని కుల సంఘాల నుండి వచ్చిన వారంకాదు. నేను హేతువాద వుద్యమంనుండి వచ్చాను ఆయన వర్గ పునాదినుండి వచ్చాడు. తెలుగు సాహిత్య చరివూతకి గద్దర్‌కి సంబంధం వుంది. అందుకే గద్దర్ అనగానే అనేక అంశాలు చర్చకు వస్తాయి. గద్దర్ ఒక వ్యక్తిగాదు; ఆంధ్రదేశంలో ప్రధానమైన నక్సలైట్ ఉద్యమం, దళిత వుద్యమాలలో సాంస్కృతిక యోధుడిగా పని చేసినవాడు. ఇవి రెండూ వర్గ, కుల ఆధిపత్యాన్ని ఎదిరించిన ఉద్యమాలు. ఈ ఉద్యమాల్లో సిద్ధాంతాంశాలు వున్నాయి, తాత్వికాంశాలు వున్నాయి, జీవితాంశాలున్నాయి. గద్దర్‌పై కాల్పులు జరిగినప్పుడు మరుక్షణం నన్ను హాస్పిటల్‌లో చూసిన పోలీసులు నన్ను నక్సల్‌బరీ ఉద్యమ సానుభూతిపరుడినని అనుకున్నారు. సత్యమూర్తిగారు లుంబీనిలో ఉన్నప్పుడు కూడ అనుకొన్నారు. నిజానికి నేను సాయుధపోరాటానికి వ్యతిరేకిని. ఫక్తు అంబేద్కర్‌వాదిని. అంబేద్కర్ కుల నిర్మూలనక్షిగంథమే నా ప్రణాళిక. కాని గద్దర్ సాంస్కృతిక పోరాట రూపానికి అభిమానిని. ఇవి రెండు రెండు భిన్నమైన అంశాలు.
వేమన్న గురించి బ్రౌన్ పట్టించుకొన్నట్టు ఇప్పుడు గద్దర్ గురించి బి.నరసింగరావుగారు పట్టించుకొన్నారు. ’మా భూమి’, ’రంగులకల’ నిర్మాతగానేకాక కళాకారుల ప్రోత్సాహకుడిగా, మోటివేటర్‌గా వున్నారు. ఆయన సినిమా ’మా భూమి’లో గద్దర్ ’బండెనక బండికట్టి’ పాటపాడారు. అది ఆంధ్రదేశాన్ని ఊపింది. అప్పటినుండి నరసింగరావుగారిని నేను పలుసార్లు కలిశాను. గ్రామాల్లో ’మా భూమి’ సినిమా వేయిద్దామని కోరాను. నరసింగరావు లేకుండ గద్దర్ లేడు. బ్రౌన్ లేకుండ వేమన్న లేడు. కక్కయ్య లేకుండ పోతులూరి వీరవూబహ్మం లేడు. బసవడు లేకుండ వీరశైవ ఉద్యమం లేదు. నరసింగరావుగారి సలహా మంచి చెప్పినా చెడు చెప్పినా గద్దర్ అనుసరిస్తాడని ప్రతీతి. నరసింగరావుది నాకు తెలిసి పరిమిత, పరిణితమైన మాట. అది గద్దర్‌కి దిక్సూచి అనడంలో సందేహం లేదు. అయితే గద్దర్‌ది స్వతంత్ర వ్యక్తిత్వం. ఆయన ఎవరికీ అనుచరుడు కాదు. ఆయనది సొంత గొంతే. ఆయన స్టేజిమీద ఉన్నప్పుడు చూడాలి. అది ఒక పెద్ద దృశ్యం. నాకళ్ళల్లో గద్దర్ కళాదృశ్యం. ఆయనకళ్ళు ఎర్ర చేసినపుడు నాజర్‌లో ఉండే రౌద్రం చూశాను. గద్దర్ డప్పుకొడుతున్నప్పుడు సైన్యం కవాతుకు మార్చి బాండ్‌లా వుంటుంది. ’రెేలారే’ వంటి లయతోకూడిన ధ్వనులు ఆకాశాన్ని భూమిని ఏకం చేసేవి. ఆయన కొన్నిసార్లు నీలి సమువూదంలా, కొన్నిసార్లు ఎర్ర సమువూదంలా ఘోషిస్తాడు. ఆయన కర్ర తిప్పే పద్ధతిలో వీరత్వం వుంది. ఆయనది గుంపు నాట్యం. సంధ్య, దివాకర్, జైరాజ్‌వంటి ఎందరో సాంస్కృతిక యోధులు ఆయనతో గొంతు గలిపారు. వారి చరివూతను కూడ గద్దర్‌కు రాయవలసిన బాధ్యత వుంది.
గద్దర్ రాజకీయ జీవితంకంటే కళాకారుడిగా, కవిగా, సాహితీకారుడిగా కొనసాగించిన జీవితమే గొప్పది. ఆయనమీద ఆయన తల్లి ప్రభావం అనన్యమైంది. భార్య విమల కూడ ఆయన జీవనక్షికమాన్ని నిర్ణయించడంలో ప్రభావాన్ని చూపింది. పిల్లలకంటే మేనల్లుడే ఎక్కువ అనుయాయి. కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తూ ’ప్రజాయుద్ధ నౌక’గా పేరొందడం గొప్ప విషయం. కుటుంబం చాలా మంది ఉద్యమకారులను నియంవూతిస్తుంది. గద్దర్ ఈ విషయంలో సమతుల్యం చేశాడనిపిస్తుంది. నక్సలైట్ నిర్బంధాన్ని ఎదుర్కొని ఆయన చేసిన ప్రయాణం సామాన్యమైందికాదు. తిండి, నీరు, వసతి, పడక ఇవన్నీ ప్రజాజీవనంలోనే కొనసాగించారు. అప్పటికి పొన్నూరులో సాంస్కృతిక విప్లవాన్ని ముమ్మరంగా సాగిస్తున్నాం. అక్కడకు వచ్చినవావరైనా మా ఇంటిలో దిగేవారు. వారితో సంభాషణలో చాలా నేర్చుకొనేవారం. గద్దర్ బైటకి వస్తే ప్రజల్లో మమేకం అయ్యేవారు. ఆయనది చాలా స్పందించే హృదయం. ప్రజల దుఃఖానికి కరిగిపోయే గుణం ఆయనది. కళాకారుడికి గోసి, గొంగడిని ఆయనే ప్రవేశపెట్టారు. చిన్న గడ్డంతో ఆయన కళ్ళల్లో ఎన్నో భావాలు పలికించేవారు. ఆయన కళాత్మక ప్రదర్శనల్లో కుల, మత, వర్గభేదాలు లేవు. అందరూ ప్రేక్షకులే. అందుకే ఆయన్ని తెలుగుజాతి వైతాళికుడు అని సంబోధించాను. వేమన తరువాత ఆ స్థాయిని గద్దర్‌కే మనం ఇవ్వాల్సి వస్తుంది. గద్దర్ ఎర్ర నీలిసమువూదాలు పోటెత్తిన దగ్గర పునరుజ్జీవం పొందారు. అది అందుకోవడం కష్టం. అనుయాయులకు, మిత్రులకు అందకుండ ఎదగడం గద్దర్ వ్యక్తిత్వంలోని ప్రధానపార్శ్వం.
మార్క్సిజం అధ్యయనంనుండి అంబేడ్కర్‌ను చూసినవారిలో లోతైన సమన్వయాన్ని మనం చూస్తాం. మార్క్సు తత్వశాస్త్రం అంటే ప్రపంచాన్ని వ్యాఖ్యానించేదేకాదు, సమాజాన్ని మార్చేది అనే వ్యాఖ్యానం ప్రసిద్ధమైంది. హెగెల్ భావవాదానికి ఫూలే భౌతికవాదాన్ని అన్వయించడంలో అతని ప్రతిభ వుంది. ఆ కోణం నుండి చూస్తే ప్రతి మార్క్సువాది అంబేద్కర్‌ను చదువవలసి వుంది. అంబేడ్కర్ కులనిర్మూలన, ’బుద్ధ ఆర్ మార్క్స్’ తులనాత్మక పరిశీలనతో చాలా కీలకమైన అంశాల్ని మన ముందుకు తెచ్చాయి.
మార్స్కుచెప్పిన దోపిడి నిర్మూలన, బుద్ధుడు చెప్పిన దుఃఖ నివారణలో వుంది. ఇద్దరూ వ్యక్తిగత ఆస్తిని కాదన్నారు. కాకపోతే ఒక వ్యవస్థను అవసరమైతే బలవంతంగా కూలదోసే దగ్గర అంబేడ్కర్ ప్రజాస్వామికంగానే పునర్నిర్మాణం జరగాల్సివుందన్నాడు. భారతదేశంలో ఆర్ధికశాస్త్ర విద్యార్ధిగా మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన తత్వవేత్త అంబేద్కర్ మాత్రమే. డాంగేకాని, అధికారికాని, నంబూవూదిపాద్‌కాని, ఇంకా ఏ మార్క్సిస్టు లేక ఎం.ఎల్. పార్టీనాయకులు మార్క్సును సరిగా అధ్యయనం చేయలేకపోయారు. అంబేడ్కర్ మార్క్సు ప్రతిపాదించిన అంశాలకంటే అదనంగా వున్నా వాటిని కూడ బౌద్ధంలో చూపించాడు. బౌద్ధంలో ఒక జీవన క్రమం ఉంది. సత్యమూర్తిగారితోను, గద్దర్‌తోను దళిత వుద్యమం తరుపున నేను ఎన్నోసార్లు మాట్లాడను. వారికి అంబేడ్కంర్ అంటే అపారమైన గౌరవం. కాని సాయుధపోరాటంలో అమరులైనవారి త్యాగాలపట్ల వారికి ప్రగాఢ సానుభూతి వుంది, ప్రేమ వుంది. తమ పాటలు విని ఉద్యమంలోకి వచ్చి ప్రాణాలు అర్పించినవారికి భిన్నంగా మేము ఆలోచించలేమనేది వారి వాదన. మార్క్సు అంబేడ్కర్‌వాదం స్పష్టంగా ప్రజాస్వామ్యాన్ని పేర్కొంది. అలాగే పార్లమెంటరీ రాజకీయ పోరాటాన్ని ప్రయోగంలో నిలిపింది. సాంస్కృతిక విప్లవాన్ని, తాత్విక విప్లవాన్ని స్పష్టంగా నిర్దేశించింది. తప్పకుండ మార్క్సిస్టు లెనిన్ వాదాలకు అంబేద్కర్ వాదానికి ఆచరణలో తేడా వుంది. కాని అంతిమంగా ఇద్దరూ కోరుకొంటున్నది సమ సమాజాన్నే. అయితే ఇంత స్పష్టమైన విధానరేఖ ఉన్నప్పటికి కూడ మార్క్సిస్టుపూనినిస్టు పార్టీల అనుబంధ సాంస్కృతిక విప్లవానికి నాయకత్వం వహిస్తూ ప్రజల్లో, ప్రధానంగా అస్పృశ్యతను అనుభవిస్తున్న ప్రజల్లో వుంటున్న మార్క్సు వాదులందరికి ఈ సమస్య ఎదురవుతుంది. పీపుల్స్‌వార్ దగ్గర, దాని అనుబంధ సంస్థల దగ్గర ’అస్పృశ్యతా’ నిర్మూలనకు, కులనిర్మూలనకు కార్యక్షికమం లేదు. ఆవిషయాన్ని వర్గపోరాటంలో భాగంగానే చూస్తున్నారు కాని ఇతరం కాదు. ’అస్పృశ్యులు’ కుల పీడితులు మైదాన ప్రాంతాల్లో సామూహిక దాడులకు గురవుతున్నారు.
కారరచేడులో ఇదే జరిగింది. మా మంచి నీళ్ళు మురికి చెయ్యవద్దన్నందుకు అగ్రకుల భూస్వాములు దారుణమారణ హోమం చేశారు. వారి సమాధుల మీద ’దళిత సహాసభ’ అని వ్రాసి ఉద్యమం సృష్టించాం. గద్దర్‌గారు వచ్చారు దళితులకోసం పాటరాశారు, పాడారు. దళిత పులులమ్మాఅనే ఈపాట దళిత ఉద్యమానికి ఊపుఇచ్చింది. పాటలో ధర్మవీరం ఉంది. తెలుగు సాహిత్యంలోనే శిఖరాయమానమైన పాట అది. 1985 చలోచీరాల సెప్టెంబర్ 1 మహాసభలో గద్దర్ ఈపాట ఆలపించారు. దళిత మహాసభ వేదికపైకి వరవరరావుని రానివ్వలేదు. కేవలం దళితులే దళితుల గురించి పాడతారు, మాట్లాడతారు అనేది నియమం. ఈ నియమం వివాదాస్పదం అయింది. ఈ వివాదమే దళిత వ్యక్తిత్వాన్ని నిలిపింది. దళిత ఉద్యమానికి విరసంలో వుండే బ్రాహ్మణులకు వైరుధ్యం వుంది. దళిత ఉద్యమానికి, జననాట్యమండలికి వైరుధ్యం లేదు. జన నాట్యమండలిలో బ్రాహ్మణులు లేరు, దళిత బహుజనులే వున్నారు. వారు పల్లెల్లో పుట్టారు, పల్లెల్లో ఆడతారు, పాడతారు, తింటారు, పండతారు. వారు మిడిలిక్లాస్ కాదు, శ్రామికజనం. దళిత ఉద్యమ పోరాటంలో అనేక వేదికల మీద జననాట్యమండలి తన ఉద్యమ స్పూర్తిని చాటింది. కొన్నిసార్లు ఆయుధాలు లేకుండ ఈ పోరాటంతో ఏమి సాధించలేరని చెప్పింది. అప్పుడు మేము విభేదించాం. అంబేడ్కర్ ఆయుధాలతో పోరాడలేదు. అంబేడ్కర్‌ది తాత్విక ఆయుధం. అది మామూలు ఆయుధాలకంటే బలమైంది. మీరూ అంబేడ్కర్‌ను చదవండి అని చెబుతూ వచ్చాం. 1991లో చుండూరులో దళితులపై ఊచకోతప్పుడు కూడ ఈ సవాలు ఎదురైంది. గద్దర్ అప్పుడు పార్టీమనిషిగా మాట్లాడాడు. దళిత వుద్యమం అంబేడ్కర్ బాటలోనే చలో ఢిల్లీ వరకు వెళ్ళింది. ఇదంతా వైరుధ్యం సమన్వయం పద్ధతిలోనే జరుగుతూ వచ్చింది. 1989 తరువాత గద్దర్‌లో గుణాత్మకమైన మార్పు చూశాను. అంబేడ్కర్ అధ్యయనం పెరిగింది. ’కులసమస్య’ను పట్టించుకోకుండ ఏ పార్టీ విజయవంతం కాదు అనే అంశాన్ని పార్టీలో ’గద్దర్’ పెట్టగలిగాడని విన్నాను. అది గద్దర్ కంట్రిబ్యూషన్ అనే చెప్పాలి. మారోజువీరన్న కూడ ఇదే వైరుధ్యానికి గురయ్యాడు. ’కులనిర్మూలన’ ఉద్యమాన్ని కుల అస్తిత్వ ఉద్యమంగా అతడు భావించాడు. వర్గ,కుల అంశాలను జోడించ ప్రయత్నించాడు. ప్రయోగంలో వైఫల్యం జరిగింది. కాని, భారతసమాజంలో ’కులం’ ప్రాధాన్యం చర్చకు రావడం ’కారంచేడు’ తరువాతే. అందుకే కారంచేడు ఉద్యమానికి ముందు గద్దర్ వేరూ, కారంచేడు ఉద్యమం తరువాత గద్దర్ వేరూ అవుతూ వచ్చారు. గద్దర్‌మీద కాల్పులు జరిగినప్పుడు పార్టీలకు సిద్ధాంతాలకు అతీతంగా దళితులు, బహుజనులు ఇతర ప్రజాబాహుళ్యం హృదయంతో స్పందించారు. తెలంగాణా ఉద్యమంలో దళిత బహుజనులు మరింతగా గద్దర్‌ను సొంతం చేసుకున్నారు.
- కత్తి పద్మారావు
(మిగతా రే
Namasete Telangana News Paper Dated : 13/06/2012
No comments:
Post a Comment