Thursday, April 18, 2013

సత్యమూర్తిని ఎలా అంచనా వేయాలి?--అభయ్



భారత నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమ చరివూతపుటల్లో మొదట అభ్యుదయకర, తర్వాత విప్లవకర, చివరిదశలో విప్లవ విచ్ఛిన్నకర పాత్ర నిర్వాహించిన కంభం జ్ఞాన సత్యమూర్తి 2012 ఏప్రిల్ 17న 81వ ఏట మరణించారు. ఆయన మరణంపై చాలా మంది చాలా రకాలుగా, తమ వర్గ ప్రయోజనాలకనుగుణంగా వ్యాఖ్యానించారు. శివసాగరుడిగా విప్లవ కాల్పనిక, దళిత ఉద్యమ సాహితీకృషిని కొందరు కొనియాడారు. మరికొందరు కుల వర్గ విప్లవ నాయకుడిగా దళిత ఉద్యమంలో దీన దళిత బాంధవుడిగా, బహుజన ఉద్ధారకుడిగా ఆకాశానికెత్తారు. ఆయన దళిత ఉద్యమంలో, సాహితీరంగంలో చేసిన కృషిని పొగిడిన వాళ్లలో చాలా మంది మా పార్టీపై అవాస్తవాలతో, వక్రీకరణలతో కూడిన నిజాయితీలేని నిందారోపణలు చేశారు. ఆయన విప్లవానంతర(చివరి)దశ నిజ స్వరూపాన్ని, విప్లవ విచ్ఛిన్నకర పాత్రను ఉద్దేశపూర్వకంగానే దాటవేశారు. లేదా మరుగు పర్చారు.

విప్లవ నాయకుడిగా, కవిగా, దళిత ఉద్యమ నాయకుడిగా,కవిగా ఆయన చేసిన కృషిని ఎత్తిపట్టిన వారు చాలామంది, ఆయన చివరి దశలో గత పాతికేళ్ల కాలంలో విప్లవోద్యమం పట్ల తీసుకున్న వ్యతిరేక వైఖరి గురించి, కొనసాగించిన విచ్ఛిన్నకర అవకాశవాద కార్యకలాపాల గురించి స్పష్టంగా వ్యాఖ్యానించలేదు. లేదా మౌనం వహించారు. ఈనేపథ్యంలో మేం ఆలస్యంగానైనా సత్యమూర్తి జీవితం, ఆచరణల గురించి తెలియజేయాల్సి వస్తున్నది.

కృష్ణా జిల్లాలో ఒక దళిత మధ్యతరగతి కుటుంబంలో 1931లో జన్మించిన సత్యమూర్తి సుదీర్ఘ ప్రయాణంలో తొలి, ద్వితీయ దశలుగా.. కమ్యూనిస్టు అభిమాని నుంచి ఎదిగి కొండపల్లికి సహచరుడిగా..1982లో రాష్ట్ర విప్లవోద్య మానికి నాయకుడుగా ఎదిగే దాకా స్ఫూర్తిదాయకంగా సాగింది. ఆ తర్వాతనే అసలైన సవాల్ ఎదురైంది. సత్యమూర్తి 70 ఆరంభంలో రాష్ట్ర 11వ మహాసభలో రాష్ట్రకమిటీ సభ్యునిగా ఎన్నికైనాడు. 1972లో ఖమ్మంలో అరెస్టై 78లోజైలు నుంచి విడుదలయ్యారు. ఈ కాలంలో ప్రభుత్వ ఫాసిస్టు నిర్బంధకాండ, పార్టీలోని అతివాద, మితవాద రాజకీయ అవకాశవాదాలను ఓడించడంలో కొండపల్లికి అండగా నిలిచాడు. ప్రజాపంథాను నిర్మాణం చేయడానికి తన వంతు కృషి చేశాడు. వివిధ రాష్ట్రాల ఎంఎల్ పార్టీలతో ఐక్యతా చర్చల్లో పాల్గొన్నాడు. పీపుల్స్‌వార్ పార్టీ ఏర్పడటంలో గణనీయమైన కృషి చేశాడు. 1982 జనవరి 2న కొండపల్లి అరెస్టు కావడంతో సత్యమూర్తి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసున్న తర్వాతనే అసలు సమస్య ముందుకు వచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా విప్లవోద్యమానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించడంలో ఘోరంగా విఫలమయ్యాడు.

మొదటి నుంచి ప్రచార రంగంలో పనిచేసిన వాడుగా సిద్ధాంతాన్ని, ఆచరణకు అన్వయించడంలో విఫలం కావడంతో విప్లవోద్యమానికీ, కేంద్ర,రాష్ట్ర కమిటీలకు సారథ్యం వహించలేకపోయా డు. 1984లో కొండపల్లి జైలు నుంచి విప్లవోద్యమంలోకి వచ్చి, పార్టీ నాయకత్వాన్ని ఓ గాడిన పెట్టే ప్రయత్నం చేసినప్పుడు సహకరించకపోగా ఫాల్స్ ప్రిస్టేజీకి పోయి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. కుట్రలకు,ముఠాల ఏర్పాటుకు ప్రయత్నించాడు. దీంతో ఆంధ్ర రాష్ట్ర పార్టీ నాయకత్వం, పార్టీ కేడరు సత్యమూర్తి విధానాలను పూర్తిగా తిరస్కరించారు. ఫలితంగా 1987 సెప్టెంబర్‌లో రాష్ట్ర 13వ మహాసభ ఆయనను పార్టీనుంచి బహిష్కరించింది. సత్యమూర్తి తీసుకున్న తప్పుడు సైద్ధాంతిక, రాజకీయ వైఖరులతో, అమలు చేసిన తప్పుడు నిర్మాణ పద్ధతులతో స్వార్థ ప్రయోజనాలతో విప్లవోద్యమ గమనాన్ని అడ్డుకోవాలని ఆయన చేసిన ప్రయత్నాలను ప్రజలు విఫలం చేశారు. సత్యమూర్తి ఈ విధంగా తన విప్లవకర పాత్రను తానే అంతం చేసుకుని విప్లవ విచ్ఛిన్నకర పాత్రలోకి మారారు. ఈ విధంగా సత్యమూర్తి చరిత్ర చెత్తబుట్టలోకి దొర్లిపోయింది.

సత్యమూర్తి కేంద్రకమిటీలో ముఠాకట్టి అంతరంగిక సంక్షోభం సృష్టించడానికి ప్రయత్నించడంతో ప్రారంభమై.. విప్లవోద్యమంపై, విప్లవనాయకత్వంపై అసత్య ఆరోపణలు, కువిమర్శలు చేసేదాకా సాగింది. ఈ క్రమంలో ఏ విలువలూ పాటించకుండా.. ఆడని అబద్ధం లేదు. పెట్టని శాపనార్థం లేదు. ఒక మాటలో చెప్పాలంటే శత్రువుతో గొంతు కలిపి విప్లవోద్యమంపై విషం గక్కాడు. అదే చివరి వరకూ చేస్తూ వచ్చాడు. అయితే ఆయన ఇదంతా వివిధ ముసుగుల్లో ఉండి కొనసాగించాడు. ఇక ఆయన మరణ సందర్భాన్ని ఉపయోగించుకుని కొందరు ఆయన్ని ఆకాశానికెత్తు తూ.. మా పార్టీపై తోచిందల్లా రాశారు. వర్గాతీత రాజకీయాలను ముందుకు తెచ్చారు. ఆంధ్రవూపదేశ్‌లో మూడున్నర దశాబ్దాలుగా విప్లవోద్యమంలో భాగంగా దళితుల పక్షాన నిలిచి అనన్య త్యాగాలు చేసింది విప్లవోద్యమం. చుండూరు, కారంచేడు దళితులకు వెన్నుదన్నుగా నిలిచి అగ్రకుల దురహంకారులకు తగిన బుద్ధి చెప్పిందీ విప్లవోద్యమమే కానీ.. సత్యమూర్తి కాదని చెప్పక్కరలేదు. 

మా పార్టీ నుంచి బహిష్కృతుడైన తర్వాత సత్యమూర్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్ని నీచమైన సైద్ధాంతిక, రాజకీయ అవకాశవాద కసరత్తులు చేశాడో, ఎన్ని రాజకీయ పార్టీలు మారాడో, లేదా వాటి నుంచి బహిష్కృతుడైనాడో ఎన్ని జెండాలు మార్చాడో తెలుగు ప్రజలకు, ప్రత్యేకంగా విప్లవ రాజకీయాలతో అంతో ఇంతో పరిచయమున్న వారందరికీ తెలుసు. పీపుల్స్‌వార్ పార్టీది మితవాద ఎత్తుగడల పంథా అని విమర్శించి, తనదే అసలు సిసలైన ఎత్తుగడల పంథా అని చెప్పుకున్న ఆయన రెండేళ్లు తిరగకుండానే తమిళనాడు,మహారాష్ట్రల్లో తన సహచరులకు ఎందుకు ముఖం చూపించలేకపోయాడు? భారత విప్లవోద్యమానికి సరైన పంథాను రూపొందించానని ప్రకటించుకున్న సత్యమూర్తి మార్క్సిస్టు-పూనినిస్టు కేంద్రం (ఎం.ఎల్. సి)నాయకుల పంథా అపసవ్యమైనదీ, పసలేనిది కాకపోతే, విప్లవ విచ్ఛిన్నకర పాత్ర నిర్వహించేది కాకపోతే పురిటిలోనే ఎందుకు సంధి కొట్టుకుపోయింది? విప్లవ రాజకీయాలకు వీడ్కోలు పలికిన తర్వాత ఆయన బహుజనోద్ధరణకంటూ బహుజన సమాజ్ పార్టీలో చేరి తాను ఏ మేరకు బహుజనులను ఉద్ధరించాడు? అవకాశవాదిగా, స్వార్థపరుడిగా మారి మార్క్సిజం-పూనినిజం-మావోయిజానికి, సి.పి.ఐ. (ఎం.ఎల్) పీపుల్స్‌వార్‌కు దూరమైన తర్వాత పాతికేండ్ల సుదీర్ఘ జీవితంలో ఆయన దళిత-బహుజన ప్రజల విముక్తి కోసం క్రియాశీలంగా కొనసాగించిన కార్యాచరణగానీ, నిర్మాణాత్మకంగా చేసిన కృషి గానీ, నిర్మించిన సమరశీల ఉద్యమం గానీ ఏమిటనేది చైతన్యవంతులైన ఆంధ్రవూపదేశ్ పోరాట ప్రజల్లో తెలియందెవరికి? ఆయన తాను నిర్మించానని చెప్పుకున్న దళిత-బహుజన ఉద్యమాన్ని తానే స్వయంగా బూర్జువా పార్లమెంటరీ రాజకీయాల్లోకి దిగజార్చివేసిన తర్వాత అది ఎలా బూర్జు వా దళిత ఉద్యమస్రవంతిలో భాగం కాకుండాపోతుంది? ఆయన వివిధ సమయా ల్లో పరస్పర విరుద్ధంగా తీసుకున్న సైద్ధాంతిక రాజకీయ అవకాశవాద వైఖరులకూ, పనిచేసిన అవకాశవాద పార్టీలకూ గల సంబంధం గురించి మా పార్టీ చెప్పింది అవాస్తవమని నేడెవరు బుకాయించగలరు? సత్యమూర్తి వివిధ సమయాల్లో తీసుకున్న సైద్ధాంతిక-రాజకీయ వైఖరులకూ, పనిచేసిన నిర్మాణాలకూ, ఈ రెంటికీ ఆయన రాసిన కవిత్వానికీ, చేసిన గానాలకూ గల సంబంధాన్ని విడదీయడం అమాయకత్వమో లేక బూటకమో కాక మరేమవుతుంది? విప్లవోద్యమాన్ని వదిలిన తర్వాత సత్యమూర్తి ఒకచేత్తో వర్గ-కుల విముక్తికంటూ,సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానంటూ, దళిత-బహుజన విముక్తికంటూ చేసిన కలం సృష్టీ, మరోచేత్తో విప్లవోద్యమానికి వ్యతిరేకంగా చేసిన కలం సృష్టీ ఆయన చేసిన రెండు గళాల కవితాగానాలూ వర్గ విముక్తి-కుల విముక్తి ఉద్యమాలకు తోడ్పడినాయా లేక ఆ విశాల ఉద్యమాల ను విచ్ఛిన్నం చేసి తూట్లు పొడవడానికి తోడ్పడినాయా? ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది విప్లవకారులను పట్టుకొని బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్తపు పారిస్తుంటే, వాటితో గొంతు కలిపి మా పార్టీకీ, ఉద్యమానికీ వ్యతిరేకంగా వివిధ ముసుగుల్లో సత్యమూర్తి చేసిన వ్యాఖ్యలను, ప్రకటనలను మా పార్టీ నిశితంగా పరిశీలించి ఆయనను పొలిటికల్ కోవర్టుగా ప్రజల ముందు బహిర్గతపరించింది. ఉద్యమాలన్నిటిలోనూ అవకాశవాదులు, ముఠాకోరులు, విచ్ఛిన్నకారులు, స్వార్థపరులు సదా ముందు వరుసలో నిలబడి ఉపన్యసిస్తారే గానీ ఆచరణకొచ్చే సరికి వారు వెనుక వరుసలో కూడా కనిపించరని సత్యమూర్తి పాతికేండ్ల ఆచరణ మరోసారి రుజువు చేసింది.

తెలిసిగానీ తెలవకగానీ వర్గవిముక్తిని వదిలి, దీనితో వేర్పరచి కుల,లింగ తదితర సామాజిక అసమానతలు తొలగించడానికి ఎంచుకొనే కార్యక్షికమాలనే-ఉద్యమాలనే సర్వస్వంగా భావించేవారు ఎన్నటికీ పీడిత ప్రజల, పీడిత సామాజిక సెక్షన్ల నిజమైన విముక్తికి పరిష్కార మార్గాలను చూపించలేరు. విశాల ప్రజాస్వామిక విప్లవంలో విడదీయరాని భాగంగా సకల పీడిత సామాజిక సెక్షన్ల ఉద్యమాల ఆవశ్యక త ఎంత ఉన్నా అవి తమ నాయకత్వంలోని అవకాశవాదశక్తుల మూలంగా సామాజిక విప్లవానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడితే లేదా ఆ విప్లవంతో విడివడిపోతే అవి అత్యంత అమానుషమైన, క్రూరమైన అసమానతల వర్గవ్యవస్థ, కుల వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థల పునాదిని కూడా తాకలేవు. అవి చేయగలిగిందల్లా నేటి వ్యవస్థకు ప్రమాదం కలిగించని విధంగా సంఘర్షిస్తూ, రాజీపడుతూ పాక్షిక సంస్కరణలను సంపాదించడం మాత్రమే. సమస్త సామాజిక రుగ్మతల, సమస్యల పరిష్కారానికి మార్క్సిజం-పూనినిజం,మావోయిజమే సైద్ధాంతిక వెలుగు చూపుతుంది. సరైన రాజకీయ పంథాయే గమ్యాన్ని చేరుస్తుంది. వర్గ పోరాటానికి అత్యున్నత రూపంగా సాయుధ పోరాటమే కేంద్రంగా ఉంటుంది. వీటి ద్వారానే దోపిడీ, పీడనల నుంచి విముక్తి సాధ్యమవుతుంది. మానవాళి సంపూర్ణ విముక్తి సాధించడానికి మార్గం సుగమమవుతుంది.

సత్యమూర్తి తన రాజకీయ జీవితకాలంలో పీడిత ప్రజల ప్రయోజనాల కోసం నిలిచి పోరాడిందాని కన్నా, ఎంతో ఎక్కువగా వారి ప్రయోజనాలను, ఆకాంక్షలను దెబ్బతీసే, నీరుగార్చే, వక్రమార్గం పట్టించే కార్యాచరణలోనే మునిగిపోయాడు. సత్యమూర్తి చివరి దశలో వివిధ ముసుగులు ధరించి కొనసాగించిన విప్లవ వ్యతిరేక రాజకీయ జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా మరుగుపర్చి తొలిదశలో నిర్వహించిన అభ్యుదయకర, రెండవ దశలో నిర్వహించిన సామాజిక విప్లవ పాత్రనే తుదివరకు కొనసాగించిన వాడిగానో, ప్రజల ప్రయోజనాల కోసం నిస్వార్థంగా సేవచేసిన వీరుడిగానో, ప్రజల ప్రయోజనాల కోసమే తన రచనలను త్రికరణ శుద్ధిగా అంకితం చేసిన నిజమైన ప్రజాకవిగానో, చెప్పిందే చేసిన, చేసిందే చెప్పిన నిజాయితీ గల రాజకీయ నాయకుడిగానో ఆయన్ని అంచనా వేయడం తప్పు. ఏ విప్లవకారుడినైనా, ప్రగతిశీల సామాజిక ఉద్యమకారుడినైనా అంచనా వేసేటప్పుడు వారి ఉద్యమ జీవితం ఎలా ఆరంభమై కొంతకాలం లేదా చాలాకాలం కొనసాగిందనేది మాత్రమే కాదు చివరి వరకూ అదెలా కొనసాగిందనేది, అదెలా అంతమైందనేదీ కూడా తప్పనిసరిగా చూడాలి.

ఇలాంటి వ్యక్తిని అంచనా వేసేటప్పుడు మార్క్సిస్టు మహోపాధ్యాయుడు మావో చేసిన బోధనే విప్లవకారులకు ప్రామాణికంగా ఉంటుంది. అదే సరైనది.‘ఒక యువకుడు విప్లవకారుడేనా అని ఎలా నిర్ణయించడం? మనం ఎలా చెప్పగలం? ఒకే ఒక ప్రమాణం మాత్రమే ఉండగలదు. అతడు కార్మిక కర్షక, విశాల జన సామాన్యంతో సమైక్యం కావాలనే కోరుకుంటున్నాడా? ఆచరణలో అలా సమైక్యం అవుతున్నాడా? అతడలా చేయడానికి ఇచ్చగిస్తూ దానిని ఆచరణలో పెడుతూ ఉంటే అతడు విప్లవకారుడు. లేకుంటే కాదు, లేదా విప్లవ ప్రతీఘాతకుడు. అతడీనాడు కార్మిక కర్షకులతో సమైక్యమైతే అతడీనాడు విప్లవకారుడు. రేపు అలా సమైక్య మవడం మానుకొని వైదొలగి సామాన్య ప్రజల్ని వ్యతిరేకిస్తే అప్పుడు విప్లవకారుడు కాకుండాపోతాడు. లేదా విప్లవ ప్రతీఘాతకుడౌతాడు’ (మావో యువజనోద్యం సాధారణ పంథా). ఇలా పరిశీలించగలిగినప్పుడే సత్యమూర్తి విషయంలోనే కాకుం డా ఏ ఉద్యమకారుడి విషయంలోనైనా సరైన అంచనాకు రాగలుగుతాం. భిన్న ప్రాపంచిక దృక్ఫథాలు, భిన్న ప్రయోజనాలు గల వర్గసమాజంలో సత్యమూర్తి విషయంలో వివిధ వ్యక్తులు, సంస్థలు పరస్పర భిన్నమైన లేదా వివిధ రకాల అంచనాలకు రావడం ఆశ్చర్యకరమైందేమీ కాదు. సత్యమూర్తి తొలిదశలో అభ్యుదయవాదే. రెండవదశలో విప్లవకారుడే. ఆయన ఈ రెండు దశల్లో వివిధ రంగాల్లో నిర్వహించి న పాత్రకు చివరి దశలో స్వయంగా నష్టపరిచాడు. తన గొప్ప విప్లవకర పాత్రను తానే స్వయంగా నెగేట్ చేసుకున్నాడు. ఒక విప్లవకారుడు ఒక రెనగేడ్‌గా మారాడు. ఒక విప్లవకారుడిగా జీవించిన కాలపు సత్యమూర్తి మనకు ఆదర్శం. ఒక రెనగేడ్‌గా మరణించిన కాలపు సత్యమూర్తి మనకొక నెగెటివ్ గురువు. ఇది విప్లవ గతితర్కం. 

-అభయ్
సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతిని

Namasete Telangana Telugu News Paper Dated : 19/4/2013

No comments:

Post a Comment