Monday, April 8, 2013

సమాజ రక్షకులు ‘మాల’లే ----అఖిల మాల విద్యార్థి సంఘం (ఏఎంఎస్‌ఏ)వేల సంవత్సరాల పూర్వం భారత సమాజ నిర్మాణమే కులాల పునాదిగా ఏర్పడింది. ఇప్పటికీ అది చెక్కు చెదరని నిచ్చెనమెట్ల వ్యవస్థగానే ఉన్నది. వర్ణ/కుల (అ)ధర్మము ప్రకారం త్రివర్ణాలు-వూబాహ్మణ, క్షత్రియ, వైశ్యులు చేయడానికి నిరాకరించిన పనులన్నింటిని, ప్రధానంగా ప్రకృతితో నిరంతరం సంఘర్షణపడే పనులను శూద్ర (ఉత్పత్తి కులాలు), అతి శూద్రులు(అంటరాని కులాల) వారు చేసిపె చేశారు. వీటిని ధిక్కరించడానికి వీలు లేదు.అది చట్టం.శూద్ర,అంటరాని కులాల నైతిక విధి అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చేవకు ఈ దుస్థితి రాజ్యసమ్మతంగానే కొనసాగుతుండేది. అయితే ఆ కుల కట్టుబాట్లు, నమ్మకాలు ఇప్పటికీ గ్రామీణ సమాజంలో బలంగానే ఉన్నాయి.

దేశం మొత్తం మీద దళితులు చేసే పనులను అపవివూతమైనవిగా, అంటరానివిగా, బ్రాహ్మణీయ సమాజం చెప్పి, ఆ అభివూపాయాలకు స్థిరత్వాన్ని కల్పించింది. దీనికి అసమాన మానవ విలువలకు పుట్టినిల్లు అయిన బ్రాహ్మణత్వం తోడైంది. మరోమాటలో చెప్పాలంటే బ్రాహ్మణత్వం నిరాకరించిన అన్ని పను లు దళితులకు అంటగట్టి, అగ్ర కులతత్వంతో వాటి ని అంటరానివిగా చూస్తున్నది. మలాన్ని ఎత్తిపోయ డం, భూమిని ప్రేమించడం, దాన్నుంచి బువ్వను తీయడం, జంతువులు, మనుషులు చనిపోతే ఖన నం చేసేదాకా అంతటా అంటరాని కులాలే శ్ర మించాలి. చచ్చిన జంతువుల చర్మం తొలచి మనిషికి మెత్తని తోలు చెప్పులను, ఊరిలో దరువు వేయడానికి డప్పును, వ్యవసాయ ఉపయోగకరమైన అనేక తోలు వస్తువులను మాదిగ, దళిత కులాలు చేస్తున్నాయి. అలాగే మిగతా అగ్రకులాలు, బహుజన కులాలు సైతం చేయడానికి నిరాకరించిన అన్ని పనులను మన రాష్ట్రంలో మాలలు వారి ఉప కులాలు, కుల వ్యవస్థ పుట్టినప్పటి నుంచి చేస్తున్నాయి. 

ఈ సమాజ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా.. పూర్వం సంపద రక్షణకోసం, దోపిడీలను నివారించడానికి మాలలు గ్రామ రక్షకులుగా గ్రామాల్లో గస్తీ కాచేవారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి గ్రామాలను సుభిక్షంగా ఉంచేవారు. అది తర్వాత కాలంలో పాలనారంగంలో భాగమై నేటి గ్రామ సేవకులు, సుంకరులుగా రూపాంతరం చెందారు. చరివూతలో నేటి రక్షణ వ్యవస్థకు బీజాలు వేసింది మాలలే.

ఇప్పటికి గ్రామం అంటే.. బొడ్రాయిని ఊరి నడిబొడ్డునా పొందించడంతో మొదలవుతుంది. ఆ బొడ్రాయి పొందిక మొదలుకొని గ్రామ దళిత, బహుజన దేవతైలన ముత్యాలమ్మ, మైసమ్మ, పోచమ్మ, నల్లపోచమ్మ, పెద్ద దేవర, గంగమ్మ, కట్ట మైసమ్మ వంటి దేవతలను గ్రామాల్లో నిలబెట్టి ప్రతియేడు జాతరలను, పండుగలను చేయడంలో ముందుండి నడిపేది మాల పంబాల/ బైండ్ల వాళ్లే. ఇందులో ఊళ్లోని సబ్బండ జాతులు పాల్గొంటాయి. ఇక్కడ మాల పంబాల/బైండ్లలు సాటి మనిషికి అర్థమయ్యే తాత్తికతనే ఆడుతూ పాటల రూపంలో గానం చేస్తారు. అన్ని కులాల వారిని సమానంగా చూస్తారు. దేవత పూజలలో అంటుముట్టుకు అసలు చోటే లేదు. ఇది బ్రాహ్మ పూజారి తత్తానికి భిన్నమైనది. ఈ విధంగా భూమి పుత్రులుగా, గ్రామ రక్షకులుగా పంటనిచ్చే నీరటి గాళ్లుగా, బేగరి పర్యావరణవేత్తలుగా, బట్టనేసిన ఆధునికులుగా, గ్రామ వైద్యులుగా ప్రజల ఆధ్యాత్మిక గురువులుగా బహువిధాలైన సేవలను అనేక వేల సంవత్సరాలుగా చేస్తూ, ఆర్థిక, సామాజికాభివృద్ధిలో గొప్ప పాత్రను పోషిస్తున్న ది అంటరాని మాల కులాలే. ఇన్ని సేవలు చేసిన వారికి సైతం వందేళ్ల కిందటి వరకు అక్షరం అంటరానిదైంది. ఫూలే, సావివూతిబాయి ఫూలే, అంబేద్కర్ వంటివారి పోరాటల ఫలితంగా అక్షరాలు నేర్చుకొని విద్య, ఉద్యోగ రంగాలలో కొంతమేరకైనా చోటు సంపాదించగలిగారు.

ఆధునిక కాంలో కుల సంస్కృతిని, అగ్రకుల ఆధిపత్య అధికార భావజాలాన్ని, దాడులను చరిత్ర పొడవునా ఎదురుతిరిగి పోరాడడంలో అంటరాని మాలలే ముందున్నారు. చరివూతలో ఆది ఆంధ్రసమాజ నిర్మాణం, అది హిందూ మహాసభ, దళిత మహాసభ, అంబేద్కర్ యువజన సంఘాల నిర్మాణం మొదలుకొని కంచికర్ల, కారంచేడు, చుండూరు, పదిరికుప్ప,ం నీరుకొండ మొదలు నేటి లక్షింపేట దళిత హత్యాకాండలు జరిగినప్పుడు బాధిత దళితులకు అండగా నిలబడి అగ్రకుల సమాజంతో, రాజ్యంతో కొట్లాడింది ప్రధానంగా మాలలే. చరివూతలో భాగ్యడ్డి వర్మ, అరిగె రామస్వామి, పి.ఆర్. వెంకటస్వామి, బి.ఎస్. వెంకవూటావు, శ్యాం సుందర్, కుసుమ ధర్మన్న, బొజ్జా అప్పలస్వామి, జాలా రంగస్వామి, జాలా మంగమ్మ, బోయి భీమన్న, ఈశ్వరీబాయి వంటి వారికి వారసులుగా ఇప్పటికి ఎందరో ఉద్యమకారులు అనేక ప్రజాస్వామ్య ఉద్యమాల్లో భాగస్వాములై ఉద్యమిస్తున్నారు.కుల రహిత సమాజంకోసం పోరాడు తున్నారు. 

1990 దశకంలో పాలక కులాలు ఆర్థిక సంస్కరణలను తెరమీదికి తీసుకొచ్చి ప్రజాసంక్షేమ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకున్నాయి. విద్య, ఉద్యోగ, మౌలిక రంగాలన్నీ ప్రైవేట్ వక్తుల/ సంస్థల గుత్తాదిపత్యంలోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సర్కారు బడులున్నీ దళిత, బడుగు, బలహీనకులాల్లోని పిల్లలకే పరిమితమవుతున్నాయి. అక్కడ మేధోరంగంలో పోటీపడే ఇంగ్లిష్ మీడియం చదువులు లేవు. డ్రాప్ అవుట్ సమస్య విపరీతంగా ఉన్నది. ఉన్నత విద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ రంగ విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతున్నది. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలోని యువత బతుకు ఛిద్రమౌతున్నది. ఆర్థిక సమ స్యలతో అగ్రకులాల రాజకీయాలకు అంగడి సరుకుగా మారుతున్నారు. ఈ తరుణం లో దళిత, బహుజన సామాజికవర్గాల చదువుకున్న బిడ్డలుగా మనముందు తరాల భవిష్యత్ కోసం సామాజిక ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నది.

దళిత ఉద్యమాల్లో అగ్రస్థానంలో ఉండే మాలలు అస్తిత్వ కేంద్రంగా ఆత్మగౌరవ పోరాటాల పునాదిగా అన్ని అంటరాని కులాల అభివృద్ధి, రాజ్యాధికారంలో సమాన వాటా కోసం ఐక్యపోరాటాలను నిర్మించాలనే ఆశయంతో ఈ అఖిల మాల విద్యార్థి సంఘం (ఏఎంఎస్‌ఏ)ను ఏర్పాటు చేస్తున్నాం. కావు నా మాల కులంనుంచి ఎదిగిన బుద్ధిజీవులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు తమ కుల అస్తిత్వాన్ని, వివిధ సామాజిక, రాజకీయ ప్రజాఉద్యమా ల్లో నిర్వహించిన పాత్రను అంచనావేసి తమ ముందుతరాలకు అందించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే వారు ఆత్మగౌరవంతో తమ,ఇతర అణగారిన కులాల హ క్కుల కోసం ఈ కులాధిక్య సమాజంతో, రాజ్యంతో పోరాడుతారు. ఈ సందర్భంగా దళితేర మేధావులు, ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు మా సంస్థను ముందుకు తీసుకపోవడంలో సహకరిస్తూ, అండగా ఉంటారని ఆశిస్తున్నాం.

ఈ సందర్భంగా దళిత బహుజనుల అభ్యు న్నతి కోసం- కేజీ నుంచి పీజీ వరకు అన్ని సమాజిక వర్గాలకు ఒకే విద్యావిధానం అంటే ఒకే మీడియం, ఒకే సిలబస్, ఒకే పరీక్షా విధానం ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్స్ సకాలంలో చెల్లించాలి. ప్రజాధనంతో నిర్మాణమైన అన్ని ప్రైవేట్ రంగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు హక్కుగా గుర్తించాలి. ఉద్యోగాలు కల్పించాలి. ప్రభుత్వాలు గ్రామసేవకులుగా (విలేజ్ అసిస్టెంట్స్) మాల కులస్తులనే నియమించాలి. మంత్రాల నెపంతో పంబాల, బైండ్ల వంటి దళిత కులాల వారిని హింసించడం, భౌతిక దాడులతో హత్యచేయడం వంటి వాటిని తీవ్ర నేరాలుగా పరిగణించాలి.వారి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నిందితులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం శిక్షించాలి. స్త్రీ దేవాలయాలలో వీరిని పూజారులుగా నియమించాలి. మాల ‘నేతకాని కార్మికుల’ను ప్రత్యేక నేతకార్మికులుగా గుర్తించి వారి అభివృద్ధి కోసం మాల ‘నేతకాని ఫెడరేషన్’ను ఏర్పాటు చేయాలి. 

వ్యవసాయ, నీటి పారుదల రంగాల ఉద్యోగ భర్తీల్లో నీరటి మాలలకు ప్రత్యేక అవకాశాలు కల్పించి, ఉద్యోగ కల్పనలో వారికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. శవదహనాలను చేసే మాల బేగరులను ప్రాచీన పర్యావరణ సంరక్షకులుగా గుర్తించాలి. వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించాలి.


Namasete Telangana Telugu News Paper Dated: 9/4/2013


No comments:

Post a Comment