Saturday, April 27, 2013

చిన్నప్పట్నించీ రెబలే! (గీతారామస్వామి) హైదరాబాద్ బుక్‌వూటస్ట్‌ Zindagi Special Story



rebalee

ఉద్యమాలకు.. హైదరాబాద్ బుక్‌వూటస్ట్‌కి చాలా దగ్గరి సంబంధం ఉంది!ఆ రెండింటికి అనుబంధాన్ని పెనవేసిన వారధి.. గీతారామస్వామి!తమిళియన్ అయినా తెలుగును ప్రేమించింది..హెచ్‌బీటీతో ఇక్కడ పుస్తక విప్లవాన్నే తెచ్చింది!చక్కటి వయ్యికి చెదరని చిరునామాగా మారింది..అక్షరంతోనే కాదు అభిమానంతో దళితులకూ దగ్గరైంది...ఆ ఆదరంతోనే ‘ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ హాడ్ యాన్ 
ఎంటైర్ కమ్యూనిటీ టు లవ్ అండ్ బిలవ్డ్ రిటర్న్’ అని సంతోషపడ్తుంది! మంచి పుస్తకంలాంటి ఆమె మనసు పుటలు వివరిస్తున్న ఎన్నో విషయాలివి...
మాది సంప్రదాయ మధ్యతరగతి తమిళ బ్రాహ్మణ కుటుంబం. కానీ ఇంట్లో నేను చిన్నప్పటి నుంచీ రెబలే. నా తీరుతెన్ను చూసి ‘అసలు ఈ ఇంట్లో పిల్లవేనా నువ్వు?’ అంటూ ఆశ్చర్యపోయేది మా అమ్మ. మా అక్క జీవితంలో జరిగిన ఓ సంఘటన నన్నలా రెబల్‌గా మార్చింది. మా అక్కంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ తర్వాత అమ్మలాంటిది. మమ్మల్నందిరినీ బాగా సంబాళించేది. ఎవరితో ఎలా ఉండాలో ఆమెకు బాగా తెలుసు. చదువుల్లో కూడా ఫస్టే. మా అక్క అప్పట్లోనే అంటే నలభై ఏళ్ల కిందట.. ఆఫీసర్ హోదా ఆడవాళ్లకు అందని ద్రాక్షలా ఉన్న టైమ్‌లోనే బ్యాంక్ ఆఫీసర్‌గా చేసింది. అందుకే అక్కను చూస్తే చాలా గర్వంగా ఉండేది. అక్కవాళ్లు మా పక్కవీధి (మారేడుపల్లి, సికింవూదాబాద్)లోనే ఉండేవాళ్లు. అమ్మ చెప్పినట్టుగా మా అక్క తన జీతాన్ని సపరేట్ అకౌంట్‌లో వేసుకొనేది. ఇది ఆమె భర్తకు నచ్చేది కాదు. జీతం తనకు ఇవ్వ అక్కను కొట్టాడు. తను ఏడుస్తూ మా ఇంటికి వచ్చింది. అంతకుముందు ఆమెనంత బేలగా ఎప్పుడూ చూడలేదు. రెక్కలు తెగిన పక్షిలా అయిపోయింది. బాధతో మనసు మొద్దుబారిపోవడం అప్పటి నుంచే మొదలైంది నాకు. మా అక్కను అంతలా భయపెట్టి, ఏడిపించేవాడున్నాడా? అనిపించేది. కానీ అప్పటికి మేమింకా పిల్లలమే. పరిస్థితిని మౌనంగా చూడ్డమే తప్ప దాని గురించే మాట్లాడే అర్హతలేదు. కానీ ఆ సంఘటన నన్ను చాలా కదిలించింది. పెళ్లి పేరుతో కట్టుకున్నవాడు ఏం చేసినా చెల్లుబాటే, భార్యను బానిసకన్నా ఘోరంగా చూస్తున్నా అడిగే దిక్కుండదు! ఎంత అన్యాయం? అని రగిలిపోయా. బ్రాహ్మల్లో విడాకుల మాట ఉండదు. ఒకవేళ అలాంటిది జరిగితే మిగిలిన ఆడపిల్లల్లో స్వతంవూతభావాలు మొదలవుతాయనే భయం! అందుకే మా అక్కను కూడా మళ్లీ భర్త దగ్గరకు పంపించడానికి పెద్ద మనుషులంతా (వాళ్లందరూ కూడా బ్రాహ్మలే అనుకోండి. అది వేరేవిషయం) కలిసి మాట్లాడి ఇద్దరికీ సర్దుబాటు చేసి ఆమెను అత్తారింటికి పంపించారు. 

షారూఖ్ ఖాన్‌లాంటి వాళ్లు కాదు..
ఏపీలో రాడికల్ లెఫ్ట్‌మూవ్‌మెంట్‌కి రిమార్కబుల్ అనుకున్న టైమ్‌లో నేను ఉస్మానియా యూనివర్శిటీలో చదవడం నిజంగా నా అదృష్టం. అమెరికా సామ్రాజ్యవాదానికి, జాత్యహంకారానికి వ్యతిరేకంగా.. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ రోజులవి. అంతేకాదు స్త్రీ విముక్తి పోరాటం ఊపిరి పోసుకుంటున్న సమయమది. అప్పటి యూత్‌కి అభిమాన హీరోలు.. షారూఖ్ ఖాన్ లాంటి సినిమా పర్సనాలిటీస్ కాదు.. చె గువేరా, హో చిమిన్‌లాంటి విప్లవయోధులు! మన దగ్గరా నక్సల్‌బరీలో మొదలైన రైతు పోరాటం అటు కోల్‌కత్తా నుంచి ఇటు కేరళ దాకా.. ఎందరో విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది. పేదలు, మహిళలు ఐడెంటిఫై అయ్యేలా చేసింది. అలాంటి టైమ్‌లోనే ఉస్మానియా యూనివర్శిటీలో కొంతమంది విద్యార్థినులం కలిసి చిన్న గ్రూప్‌గా ఉండేవాళ్లం. అందులో మళ్లీ బ్రాహ్మలే ఎక్కువ. అప్పుడు అమ్మాయిలుగా దేశజనాభాలో సగంగా ఉన్నా.. సమాన హక్కులు మాత్రం ప్రశ్నార్థకమే! వి నియర్లీ హాడ్ నో రైట్ టు ఎడ్యుకేషన్. మా కాలేజ్‌లోనే.. సగంలో చదువు ఆపేసి వెళ్లిపోయిన చాలామంది అమ్మాయిలను చూశాను. బయట స్వేచ్ఛగా.. కంఫర్టబుల్‌గా ఉండే ప్రదేశాలు లేవు. రోడ్ల మీద, క్లాస్ రూమ్స్‌లో, హోటల్స్‌లో అన్నిచోట్లా సెక్సువల్ హెరాస్‌మెంట్లే. ఎక్కడబడితే అక్కడ ఆడవాళ్ల అర్థనగ్న శరీరాలతో వ్యాపారం చేసుకునే అసహ్యకరమైన హోర్డింగ్స్! వీటన్నిటి మీద మా గ్రూప్ పోరాటం మొదలుపెట్టింది. అప్పుడు మా ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన ఒకేఒకటి లెఫ్ట్ గ్రూప్. జార్జిడ్డి ఫస్ట్ మీటింగ్ తర్వాత క్యాంపస్‌లోని చాలామంది లెఫ్ట్ స్టూడెంట్స్‌ని కలిశాన్నేను. ఐ వజ్ స్ట్రాంగ్లీ ఎట్రాక్టెడ్ టు దెమ్. నేను కలిసిన వాళ్లంతా నాట్ ఓన్లీ ఇంటలిజెంట్స్.. మహిళలపట్ల గౌరవం ఉన్నవాళ్లు, తాము తమ తల్లిదంవూడుల కోసమే కాకుండా ఎంతోకొంతో సమాజం కోసం కూడా ఉపయోగపడాలని తాపవూతయపడేవాళ్లు! కుటుంబ ఆశయాలు, అందులో బ్రాహ్మణ ఆశయాలు... అంటేనే వెగటు స్టార్టయింది నాకు. పురుష దురహంకారి అయిన ఓ మగాడికి పెళ్లాంగా... అత్తగారింటికి సేవలు చేస్తూ.. ఆ ఇంటి దీపాన్ని వెలిగిస్తూ... ఆ ఇంటి ఆచారవ్యవహారాలను తు.చ తప్పకుండా పాటిస్తూ... బంగారు నగలు, పట్టుచీరలు కొంటూ.. గుళ్లుగోపురాలు తిరుగుతూ.. ఆదర్శ గృహిణి అనే ట్యాగ్ తగిలించుకోవడం నాకు మొదటినుంచీ ఇష్టం ఉండేది కాదు. 

నక్సలైట్‌నని చెప్పింది..
1975..ఎమ్జన్సీ టైమ్‌లో జరిగిన ఒక సంఘటనతో లెఫ్ట్‌లో పనిచేయాలనే కృత నిశ్చయానికి వచ్చాను! ఎమ్జన్సీ డిక్లేర్ చేశాక.. మా కామ్రేడ్స్ ‘మనలో కొంతమంది అరెస్ట్ కావచ్చు. కాబట్టి ఫలానా వాళ్లు.. వాళ్ల వాళ్ల సొంతూర్లకు వెళ్లిపోవాలని, ఫలానావాళ్లు ఇక్కడే (హైదరాబాద్‌లోనే) ఉండాల’ని డైరెక్షన్స్ ఇచ్చారు. నేను నా పీజీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయకుండా హ్యాపీగా తప్పించుకుని కామ్రేడ్స్ సజెస్ట్ చేసినట్టుగా అండర్‌క్షిగౌండ్‌కి వెళ్లిపోయాను. ఎవరికీ తెలియకుండా ఇక్కడే(హైదరాబాద్‌లో) ఓ స్లమ్ ఏరియాలో రూమ్ తీసుకొని ఉన్నాను. కొన్నాళ్ల తర్వాత విషయం తెలుసుకున్న మా పేరెంట్స్ నన్ను వెనక్కి రప్పించడానికి ఓ ప్లాన్ వేశారు. దాని ప్రకారం మా అమ్మకు హార్ట్‌ఎటాక్ వచ్చిందని, ఆమెను చూడ్డానికి నేను వెంటనే మద్రాస్ రావాలని మా ఫ్రెండ్స్‌తో చెప్పించారు. నేను వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ కామ్రేడ్స్ బలవంతపెట్టడంతో మద్రాస్ వెళ్లకతప్పలేదు. ఇంటికి చేరుకోగానే నన్ను ఓ గదిలో పెట్టి తాళం వేసేశారు మా వాళ్లు. అప్పటికే మా పెద్దక్క తన రెండో బిడ్డతో బాలింతగా ఉంది. ఇంకో అక్క పెళ్లికి ఉంది. అందుకే నా వల్ల ఏ సమస్యనూ రిసీవ్ చేసుకోడానికి సిద్ధంగా లేరు మా పేరెంట్స్. కాబట్టే పిలిపించి బంధించారు. మూడు రోజులైంది. గది కిటికీలోంచి వచ్చిపోయేవాళ్లను పిలుస్తూ ‘నాకు ఇరవై రెండేళ్లు. నేను మేజర్‌ని. నా ఇష్టానికి విరుద్ధంగా గదిలో బంధించారు. నన్ను విడిపించండి’ అంటూ హెల్ప్ అడిగాను. ఇది చూసి మా పెద్దక్క వచ్చిన వాళ్లందరికీ నేను నక్సలైట్‌నని చెప్పింది. అంతే.. ఆ మాటవినగానే వాళ్లంతా పరుగోపరుగు. ఆ వీధి వీధి వినబడేలా అరిచాను, కేకలు పెట్టాను. నన్ను విడిపించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ వీధిలో ఉండేది మూడొంతులు బ్రాహ్మలే మరి! మూడు రోజులు తర్వాత మా పేరెంట్స్ నన్ను రామమూర్తి అనే సైకియావూటిస్ట్ (అప్పటి రాష్ట్రపతి గౌరవ డాక్టర్) దగ్గరకి తీసుకెళ్లారు. ఆ డాక్టర్‌తో నేను మేజర్‌నని, నాకు 22ఏళ్లని, నా పేరెంట్స్ నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను బంధించారు తప్ప నాకేం కాలేదని, నేను పరిపూర్ణ మానసిక ఆరోగ్యంతో ఉన్నానని బతిమాలుకున్నా నా మాటలను ఆ డాక్టర్ పట్టించుకోలేదు. సరికదా తన బ్రాహ్మణ మనస్తత్వాన్ని చూపించాడు. నన్ను త్వరలోనే బాగుచేస్తానని మా అమ్మానాన్నలకు అష్యూన్స్ ఇచ్చాడు ఆ సైకియావూటిస్ట్.
reba

ఇప్పటికీ కళ్లల్లో నీళ్లు..
నన్ను నక్సలైట్లు బ్రెయిన్‌వాష్ చేశారని ఆ డాక్టర్ తిరిగి బ్రెయిన్‌వాష్ చేయడం మొదలుపెట్టాడు. సెడెటివ్స్ ఇచ్చాడు. ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. సింపుల్‌గా నన్ను చంపకుండా ఎందుకిలా టార్చర్ పెడ్తున్నారు? ఎందుకు నన్నో జంతువులా తయారు చేస్తున్నారు? అనుకునేదాన్ని. ఆ నిస్సహాయస్థితిని గుర్తు చేసుకుంటుంటే నాకిప్పటికీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. నాకిచ్చిన సేమ్ ట్రీట్‌మెంట్‌నే తీసుకుంటున్న వేరేవాళ్లను గమనించేదాన్ని.. వాళ్ల కంటిపాపలు స్థాన భ్రంశం చెంది.. నోట్లోంచి చొంగకారుతూ.. శరీరానికి, మనసుకు సంబంధంలేకుండా కనిపించేవారు. శక్తినంతా కోల్పోయి నేను నిస్సహాయంగా మారిన ఒకేఒక ప్లేస్ అది. అందుకే అప్పటినుంచి నాకు మద్రాస్ అంటే అసహ్యం. ఈ సంఘటన ప్రస్తావన ఎందుకంటే.. తమ పిల్లల మైండ్‌సెట్ మార్చడానికి బ్రాహ్మణులు ఎంతటికైనా ఎలా తెగిస్తారో చెప్పడానికే! జాట్స్ తమ ఇంటి ఆడపిల్లలు వేరే కులస్థులను పెళ్లిచేసుకుంటే కూతుళ్లను చంపడానికైనా వెనకాడరని చదివాను. సౌత్ ఇండియాలో కూడా ఆడపిల్లలు కులాంతర వివాహం చేసుకుంటే కొట్టి, బంధించే నాన్ బ్రహ్మిణ్ కుటుంబాల గురించీ తెలుసు. కానీ బ్రాహ్మణుల్లాగా టార్చర్ పెట్టి మనసు మార్చే ప్రయత్నం చేసేవాళ్లు మాత్రం ఉండరనుకుంటా? అలాగని మా పేరెం క్రూరులు, సనాతన సంప్రదాయవాదులేమీ కారు. చాలామంచి వాళ్లు. మా ఒంటిమీద ఒక్క దెబ్బ వేయకుండా పెంచారు మమ్మల్ని. దే వర్ సింప్లీ బ్రాహ్మిణ్. ఎలాగైనా సరే తమ బిడ్డను దారిలోకి తెచ్చుకోవాలనే బ్రాహ్మణ తాపవూతయం అంతే! వాళ్లు చెప్పేది వింటున్నట్టు నటించి తర్వాత నెలకు ఇంట్లోంచి తప్పించుకొని వచ్చేశాను. ఎమ్‌ఎల్ పార్టీలో ఫుల్‌టైమర్‌గా చేరాను. కానీ పార్టీలోకూడా అట్టేకాలం కొనసాగలేకపోయా. అందులో పనిచేసిన రోజులన్నీ నా జీవితాన్ని ఎన్‌రిచ్ చేసినవే! బయటకు రావడానికి ఇదీ కారణం అని స్పష్టంగా చెప్పలేను. కానీ ‘లెఫ్ట్ మూవ్‌మెంట్‌లో పనిచేసే యాక్టివిస్ట్‌కి చేసే పనిపట్ల ధృడవిశ్వాసం ఉండాలి, సమాజంలోని అనేక సమస్యల పట్ల అవగాహన ఉండాలి, ఉ్యద్యమం ప్రజాస్వామ్యబద్దంగా సాగాలి’ అని మాత్రం అర్థమైంది. 

వెరీ పాజిటివ్ పీరియడ్...
మూవ్‌మెంట్‌నుంచి బయటకు వచ్చాక అంటే 1980 - 84 మధ్యకాలంలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్‌లో ఫుల్ టైమ్ వర్క్ చేశాను. 82-83 మధ్య హెచ్‌బీటీ పని హ్యాపీగా సాగుతున్నప్పుడే.. దళిత మేధావి కత్తి పద్మారావు ఒకసారి ‘మీ పుస్తకాలను ప్రతివాళ్లు కొనుక్కొని వాళ్ల బుక్‌ర్యాక్స్‌లో అందంగా అలంకరించుకుంటున్నారు బాగానే ఉంది.. కానీ పేదల సంగతేంటీ? మీ పుస్తకాల గురించి తెలియని దళితుల మాటేంటి? వాళ్లుకు చేరని, వాళ్లు చదవని మీ పుస్తకాల ప్రచురణ ప్రయోజనమేంటీ?’ అన్నాడు. నిజమే అనిపించింది నాకు. అప్పటినుంచి నా లక్ష్యం మారింది. పేదలు, ఎస్సీలు ముఖ్యంగా మాదిగల కోసం పనిచేయడం మొదలు పెట్టాను. 84లో జరిగిన కారంచేడు సంఘటన నా దృష్టిని మరింత విశాలం చేసింది. ఫాక్ట్ ఫైండింగ్ టీమ్‌గా మేము కారంచేడు వెళ్లాం. మళ్లీ మళ్లీ విజిట్ చేశాం. సిరిళ్‌తో (భర్త, కారంచేడు బాధితులకు న్యాయ సలహాదారుల్లో ఒకరు)కూడా వెళ్లాను. లారీ లోడ్స్‌తో బియ్యం, బట్టలులాంటి బాధితులకు అందుతున్నాయి. అవన్నీ ఎవరు పంపిస్తున్నారు, వాళ్లకు కారంచేడు బాధితులకు సంబంధం ఏంటీ అని ఆ లోడ్ తెస్తున్న వాళ్లను అడిగితే.. ‘బాధితులతో మాకేమీ పరిచయం లేదు. కానీ వాళ్లు దళితులని మాత్రం తెలుసు. అందుకే ఈ సహాయం’ అని సింపుల్‌గా సమాధానమిచ్చారు. అంతకుముందు రష్యా, చైనా విప్లవాలప్పుడు ప్రజల్లో ఉన్న ఉత్సుకత, ఆ సొసైటీలు ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాయో చదివాను. కానీ మన రాష్ట్రంలో రాడికల్ లెఫ్ట్ మూవ్‌మెంట్‌కి సంబంధించి అలాంటి ఒక్క సంఘటననూ చూడలేదు. అలాంటిది కారంచేడులో కనపించింది. ఆ దళిత, పేద ప్రజల మధ్య. దిస్ వజ్ ఎ వెరీ పాజిటివ్ పీరియడ్ ఇన్ మై లైఫ్! ఆ తరాత 85 నుంచి 92 దాకా వ్యవసాయ కూలీలకు సంబంధించిన ఓ ట్రేడ్ యూనియన్‌ను ఆర్గనైజ్ చేశాను. అటు ట్రేడ్ యూనియన్‌ను చూసుకుంటూనే హెచ్‌బీటీ వాళ్లు కోరడంతో దానికీ పని చేసిపె అప్పటికే సిరిళ్‌డ్డి (జార్జిడ్డి సోదరుడు, లెఫ్ట్, దళిత్ మూవ్‌మెంట్స్‌లో చాలాకాలం పనిచేశాడు)తో నాపెళ్లవడం... పాప(ఇప్పుడు డిగ్రీ చదువుతోంది)పుట్టడంతో 1993నుంచి 98దాకా హెచ్‌బీటీకి తాత్కాలికంగా దూరమయ్యా. కానీ 1999 నుంచి మళ్లీ నా దృష్టినంతా హెచ్‌బీటీ మీదే పెట్టాను. నా లాటరల్ రిలేషన్‌షిప్స్‌ని ఎన్‌రిచ్ చేసుకోవడానికి మిగిలిన చాలా యాక్టివిటీస్‌లో కూడా పాలుపంచుకున్నాను. 

తెలంగాణ అన్నా... మాదిగలన్నా ఇష్టం
అయితే నేను ఫస్ట్ ఫస్టే దళిత్స్ మీద దృష్టిపెట్టలేదు. అంబేద్కర్ సిద్ధాంతాన్ని, ఆయన పర్‌సెప్షన్‌ని అర్థం చేసుకోవడానికి, దానికి చేరువ కావడానికి నాకు చాలా టైమే పట్టింది. ఇబ్రహీంపట్నంలో రైతుకూలీల గురించి నేను చేసిన వర్క్‌ని సీపీయం వ్యతిరేకించడం కూడా అవగాహన మరింత పెరగడానికి కారణమైంది. నేను దళిత్ వాడల్లో మీటింగ్స్ పెట్టడం, అక్కడ బసచేయడం పార్టీవాళ్లకు నచ్చేది కాదు. విమర్శించేవాళ్లు. మెయిన్ విలేజ్‌లో పెట్టమనేవాళ్లు. అలా పెడితే వాళ్లు అక్కడికి రాలేరని తెలిసే దళితవాడల్లోనే మీటింగ్ అరెంజ్ చేసేదాన్ని. అందుకు దళిత్ యాక్టివిస్ట్‌లు చాలా హెల్ప్ చేసేవాళ్లు. అలా వాళ్లతో నేను బాగా కలిసిపోయాను. ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ హాడ్ యాన్ ఎంటైర్ కమ్యూనిటీ టు లవ్, అండ్ బిలవ్డ్ రిటర్న్! అప్పుడే తెలంగాణ అన్నా, తెలంగాణలోని మాదిగలన్నా విపరీతమైన ఇష్టం మొదలైంది నాకు. ఇప్పుడు నేనిలా ఉండడానికి కారణం వాళ్లే! వాళ్లను చూసే ఓర్పు, సహనాలు నేర్చుకున్నా. స్టామినా ఎలా ఉంటుందో తెలిసింది. ఇవేమిటి... నవ్వడం, ఏడ్వడం, పంచుకోవడం, ఓదార్చడం.. అన్నీ వాళ్లను చూసే నేర్చుకున్నా. రోజు గడవడమే కష్టంగా ఉన్నా.. ప్రతి క్షణాన్ని ఎంతలా ఆస్వాదిస్తారో దగ్గరుండి చూశాను. వీటితోపాటు అక్కడి భూస్వాములైన రెడ్డిల త్రెట్‌నూ ఎదుర్కొన్నా. వాళ్లను ఎదుర్కొనే స్థయిర్యాన్నీ ఇచ్చింది మళ్లీ ఆ దళితులే!

ఎవరో తెలియాల్సిన అవసరం లేదు..
గత పదిహేనేళ్లుగా దళితులకు అనుకూలంగానే పనిచేస్తున్నాను. ఐయామ్ గెటింగ్ మోర్ కంఫర్టబుల్. నేనెవరో నాకు తెలియదు. తెలియాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను.. గత అనుభవాల సారాన్ని. ఐ కెన్నాట్ విష్ దెమ్ అవే.. నేను ఇప్పటికీ ఆలోచించగలిగే స్థితిలో ఉన్నాను. దానికనుగుణంగా నన్ను నేను తీర్చిదిద్దుకోగలను కూడా! కాపురమంటే కష్టసుఖాల కలబోత.. ఇందులో డౌటే లేదు. ఒక నాన్‌వూబాహ్మిణ్ పార్ట్‌నర్‌గా సిరిళ్ న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ ఆర్టికల్స్ , పుస్తకాలు.. చర్చలతో నాలోని బ్రాహ్మణ అవకారాలను పోగొట్టడానికి చాలానే శ్రమపడ్డాడు. అవగాహన కల్పించడానికి చాలానే ప్రయత్నించాడు. పిల్లల్ని పెంచడం ఆషామాషీ వ్యవహారేమేమీ కాదు. అవర్ డీప్లీ ఇన్‌గ్రైన్డ్ కల్చరల్ మోర్స్ అండ్ వాల్యూస్ రియల్లీ బ్రాటౌట్ హియర్.. ఎందుకంటే మన కల్చరల్ వాల్యూస్, మోరల్స్‌ను తర్వాత తరాలకు అందచేసేది పిల్లలే!


Namasete Telangana Telugu News Paper Dated : 28/4/2013

No comments:

Post a Comment