Thursday, April 18, 2013

మైనార్టీలకూ సబ్‌ప్లాన్‌ కావాలి By Jalil Khan

శనివారం , ఏప్రిల్ 13 ,2013


రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి సబ్‌ప్లాన్‌ అవసరముంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో మైనారిటీ వర్గాలు 13 శాతం ఉన్నారు. జనాభా దామాషా ప్రకారం వారి అభివృద్ధి కోసం నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. భారీస్థాయిలో బడ్జెట్‌ కేటాయించిన అవి కాగితాలకే పరిమితి అవుతోంది. పూర్తిస్థాయిలో నిధులు కేటాయించిన దాఖలు లేవు. ఉదాహరణకు సమాచార్‌కమిటి నివేదిక ప్రకారం ప్లానింగ్‌లో నివేదిక ప్రకారం 58.11 కోట్లు బడ్జెట్‌ మైనారిటీ సంక్షేమశాఖకు కేటాయించాలి. అయితే యు.పి.ఎ. ప్రభుత్వం 17 వేల కోట్లు కేటాయించింది. 2011-12 సంవత్సరం బడ్జె ట్‌లో 17 కోట్లు కేటాయించారు. విడుదల చేసింది 7 వేల కోట్లు, ఖర్చు చేసింది 4 వేల కోట్లు మాత్రమే. రాష్ట్రప్రభుత్వం 2014వ సంవత్సరం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సుమారు వివిధ పథకాలు కింద 1,100 కోట్లు కేటాయించింది. ఈ పరిస్థితిలో మైనారిటీ వర్గాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికా అవసరం వుంది. ఎస్‌.సి, ఎస్‌.టి కమీషన్‌ తరహాలో మైనారిటీ కమీషన్‌కు చట్ట బద్ధత కల్పించాలి. అందుకు అవసరమైన చట్టాలను రూపొందించాలి. ముస్లింలలో అత్యధికులు స్వయం ఉపాధితో చిన్నచిన్న వృత్తులలో అసంఘటిత రంగంలో జీవనం సాగిస్తున్నారు. ఉత్పత్తి పద్ధతులలో వస్తున్న మార్పులు మూలంగా వారి వృత్తులు దెబ్బతింటున్నాయి. నైపుణ్యం పెంచుకొనేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలి. రాయితీతో కూడిన పరపతి సౌకర్యం అందించాలి. ఇందుకోసం ప్రభుత్వం 500 కోట్లు రివాల్వింగ్‌ఫండ్‌ ఏర్పాటుచేయాలి.
రాష్ట్రంలో ముస్లిం ఆదాయ స్థాయి సాధారణ సగటుకంటే దిగువున ఉంది. ముస్లింలలో 65 శాతం కుటుంబాల సంవత్సర ఆదాయం 24 వేల రూపాయలలోపు మాత్రమే అంటే నెలకు 2వేల రూపాయలులోపు మాత్రమే. అంటే నెలకు 2వేల రూపాయలు రోజుకు 63 రూపాయలు. ఆకాశాన్ని అంటిన ధరలతో తమ కనీస అవసరాలు ఎలా తీర్చుకోవాలో తెలియక మైనారిటీలు మానసికంగా కుంగిపోతున్నారు. అందుకే విద్య, వైద్యంలాంటి అత్యవసర సేవలు మైనారిటీ వర్గాలకు అందుబాటులో లేకుండా ఉన్నాయి. మైనారిటీ వర్గాలలో 80శాతం ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకే వెళుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం  ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. ముస్లిం సమాజంలో 45శాతం ప్రజలు చిన్నాచితకా వ్యాపారులు, చేతివృత్తిపనివారు, పాన్‌దుకాణాలు, కూరగాయలు, పండ్లు, పూల దుకాణాల్లో పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. మరో 30 శాతం మంది వ్యవసాయకూలీలుగా, కార్మికులుగా పనిచేస్తూ కడుపునింపు కొంటున్నారు. రోజూ రెక్కాడితే, డొక్కాడని ఈ మైనారిటీ వర్గం విద్యాపరంగా కూడా అంతే వెనుకబడి వున్నారు. రాష్ట్ర సగటు అక్షరాస్యత 60శాతం ఉండే ముస్లింలలో అది కేవలం 19.5శాతం అక్షరాస్యత తక్కువుగా ఉన్న వర్గం సహజంగానే ఉద్యోగ, ఉన్నతవిద్య శిఖరాలు చేరుకోవడంలో వెనుకబడి ఉంది. మైనారిటీ వర్గాలలో విద్యా వికాసానికి కేంద్ర,రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రయత్నమే జరగలేదు. ముస్లిం వసతి గృహాలు అంతంత మాత్రమే, రాష్ట్రంలో ఉర్దూ అకాడమీకి స్వయంగా పుస్తకాలు ముద్రించుకునే స్వతంత్య్రం ఎప్పుడు వస్తుందో? దేశంలో మైనారిటీలలో 52శాతం మందికి సెంటుభూమి కూడా లేదు. 28శాతం మందికి ఒక ఎకరం, 5శాతం మందికి ఐదు ఎకరాలు ఉన్నాయి. 2000వ సంవత్సరంలో నేషనల్‌ శాంపిల్‌ సర్వే సమర్పించిన నివేదిక వెల్లడించిన పరిస్థితుల్లో ఇవ్వటానికి ఏమార్పు రాలేదు. జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాలు నిర్వహించిన సర్వేలు, గోపాల్‌సింగ్‌ కమీషన్‌, కేరళ నరేంద్రర్‌ కమీషన్‌, కర్ణాటక మైనారిటీ కమీషన్‌, గుజరాత్‌ కెజిమున్షిసర్వే, మధ్యప్రదేశ్‌ శ్యామలిచంద్రలేఖ సర్వేల నుండి నేటి సంచాల్‌ కమిటి వరకు ఈ వాస్తవాలను అంగీకరించాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలకులు టైంపాస్‌ కమిటీలతో కాలాన్ని, ప్రభుత్వధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది.
ప్రతి రాజకీయ పార్టీ కేవలం మైనారిటీ వర్గాల ఓట్లు కోసం పరుగులు తీస్తుంది. ఎస్‌.సి, ఎస్‌.టి తరహాలో మైనారిటీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు అవసరం వుంది. ఈ దశలో దేశంలో రెండవ అతిపెద్ద వర్గమైన మైనారిటీ వర్గం అందులో ముస్లింల ఆర్థిక పరిస్థితి ఇంత దయనీయంగా ఉండడం దేశ ప్రతిష్ఠను ఏమాత్రం పెంచదు. ఈ పరిస్థితి మారడం కేవలం ముస్లిం ప్రజలకే కాక దేశం మొత్తానికే అవసరం. ప్రపంచంలో ముస్లింలు అధికంగా గల దేశాల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ముస్లింలు నిరాదారణకు గురౌతుంటే పాశ్చాత్యదేశాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. దేశంలో నివసించే మైనారిటీలు భారతదేశంను మాతృభూమిగా పరిగణిస్తారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా, ఏ శక్తులు ఎన్ని కుట్రలుపన్నినా ఈ భావనలో మార్పు ఉండదు. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు అతిపెద్ద మైనారిటీ వర్గీయులైన ముస్లింల  జీవన ప్రమాణాలును పెంచేందుకు కృషి చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం 2012వ సంవత్సరంలో ఎస్‌.సి, ఎస్‌.టి సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి చట్టబద్దత కల్పించడం జరిగింది. అదే తరహాలో అట్టడుగు వర్గం మైనారిటీ కొరకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. అందు కొరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వున్న మైనారిటీ వర్గాలు మైనారిటీ విద్యాసంఘాలు, మైనారిటీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న మైనారిటీ సెల్‌ కమిటీలు మైనారిటీ అభ్యుదయ వాదులు తమవంతుగా మీ ప్రాంతాలలో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేసి, మైనారిటీ సంక్షేమ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మైనారిటీ వర్గ ప్రజలకు అవగాహన కల్పించాలి. మైనారిటీ సంక్షేమ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు వల్ల ప్రయోజనాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక వుంది. మైనారిటీ కార్పోరేషన్‌కు లక్ష నుంచి 5 లక్షల వరకు రుణాలు ప్రతి ఏడాది వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు. మైనారిటీ కార్పోరేషన్‌ సబ్సిడీలు మాత్రమే ఇస్తోంది. దీనిపై సబ్సిడి కాంపౌనెంట్‌ పెంచటానికి అవకాశాలు ఉన్నయి. జాతీయ మైనారిటీ ఆర్థిక సంస్థ కూడా లబ్ధిదారులకు సహాయం చేస్తుంది. అణగారిన వర్గాల కోసం తమవంతుగా సంక్షేమాన్ని కృషి చేయాలి. ఎస్‌.సి, ఎస్‌.టి సబ్‌ప్లాన్‌ తరహాలో మైనారిటీల కొరకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటుకు ఉద్యమించాలి. వాడవాడలా ఉద్యమిస్తేనే వాటి ప్రయోజనాలు పేద మైనారిటీ వర్గాలు పొందుతారు. తమ హక్కులు పరిరక్షణ కొరకు ఉద్యమించాలి, హక్కులను సాధించుకోవాలి.

Vaartha Telugu News Paper Dated : 13/4/2013

No comments:

Post a Comment