Sunday, October 2, 2011

సంప్రదింపులకగ్గిదలగ...By -అల్లం నారాయణ Namasethe Telangana 03/10/2011

సంప్రదింపులకగ్గిదలగ...
పండగపూట మనం పస్తులుంటున్నప్పుడు.. పండుగపూట మనం పీడకలలు కంటున్నప్పుడు..
ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా.., ఇంత ఏక పక్షంగా వ్యవహరిస్తున్న పెత్తందారీ కాంగ్రెస్‌కు సమాధి
కట్టడమే ఇక దారి. ఇక్కడి దాకా వచ్చాం. ఇన్ని త్యాగాలనూ, బలిదానాలనూ చవిచూశాం. ఇంకా
పోయేదేముంది పోరాడితే.. బానిస సంకెళ్లు తప్ప. తెలంగాణ వారసత్వం పిడికివ్లూత్తి ఇక ఒకే నినాదం.
‘జీనా హైతో మర్‌నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్‌నా సీఖో...’ ఊరేగింపు సాగుతున్నది.
వాళ్లు ఇచ్చేదేంది తెలంగాణ పోరాడి తెచ్చుకుందాం... తెలంగాణ.


తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి
ఆఫ్రికా గిరిజనులను, గ్రహాంతర వాసులను
సంప్రదించాలి-ఆజాద్. ఇదొక ఎసెమ్మెస్.


ముందు నవ్వొస్తున్నది. ఆనక ఏడుపొస్తున్నది. అసహనంగా అనిపిస్తున్న ది. తెలంగాణ తగలబడిపోతుంటే, నిలు మనుషులు దహించుకుపోతుం ఫిడేల్ వాయిస్తున్నాడు అపర నీరో చక్రవర్తి. ‘తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి మరికొంత వ్యవధి కావాలి. జాతీయస్థాయి నాయకులతో పాటు అవసరమైతే రాష్ట్రంలో కూడా సంప్రదింపులు జరపాలి’ ఇదీ ఆజాద్ తాజా మాట. నిజానికి ఢిల్లీకి భాష లేదు. తెలంగాణపై మడత మాటలు కూడా ఒడిసిపోయినాక నాలుకలా! అవి తాటిమట్టలా.. ఏడేండ్ల కిందటి మాట. ఆజాద్ ఒక్కసారి యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్షికమంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని మీ ప్రభుత్వంలో రాసుకున్న మాట మళ్లీ గుర్తుకు తెచ్చుకో.. ‘అవసరమగు సంప్రదింపుల ద్వారా విస్తృత అంగీకారాన్ని కుదిర్చి, సరియైన సమయంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేపడ్తుంది’ ఎంత విషాదం.

ఏడేళ్లు ఒక గడిచిన చరిత్ర కూడా కాదు. కానీ అది రెండోసారి ఒక ప్రహసనంగా రూపుకట్టింది. ఏమి విషాదం తెలంగాణది. తోలుమందం కేంద్ర ప్రభుత్వం. అక్రమాల్లో చిక్కిన కేంద్రం. అర్హతలు కోల్పోయిన చిదంబరంలు, ప్రణబ్‌ముఖర్జీలు, ఆజాద్‌లు తెలంగాణ నాలుగున్నర కోట్ల జన జీవితాల మీద తీర్పరులైన విషాదం. చావనివ్వరు. బతుకనివ్వరు. పోరాడనివ్వరు. ఢిల్లీకి ఇక్కడి చావులు కనిపించవు. ఆర్తరావాలు వినిపించవు. పార్లమెంటు భవనం సాక్షిగా చనిపోయిన శవం చెప్పిన రహస్యమూ వినపడదు. అవునది ఒక ధృతరాష్ట్ర సభ. సంజయా! ఏమి జరుగుతున్నదక్కడ. గుడ్డివా డా.. ఇక్కడ నెత్తురు డొల్లాడుతున్నది. రోజుకో శవం ప్రతినబూనుతున్నది. ఆత్మహత్యల రుతువునే చూశారు మీరు. కానీ తెలంగాణలో ఇప్పుడొక సకల జనుల సమ్మె ఉప్పెనై ఎగుస్తున్నది. చీకటి కమ్ముకుంటున్నది. జర పదిలం. మీ చీకటి కొట్టాలకు నిప్పులంటుకుంటున్నయ్.

ఉప్పెనలు పొంగుతున్నప్పు డు మాట్లాడే భాష వేరు. అది యుద్ధరావంలా ఉంటుంది. ఏమి సంప్రదించమంటావు ఆజాద్. ఇవ్వాల్టికివ్వాళ ఒక ఉపాధ్యాయుడు జై తెలంగాణ అని ప్రాణమిడిసిండు. ఇంటర్ విద్యార్థి ఒకడు జై తెలంగాణ అని రైలు కింద దుమికిండు. సంప్రదించగలవా ఆజాద్. తెలంగాణలో తిరిగే వాళ్ల కోసం రాళ్లు సిద్ధం చేసినవాడు నారాయణ. నిజమే తెలంగాణకు ఇగ ఉన్నదొకటే దారి కామ్రేడ్ నారాయణ దారి.. ఈసారి సంప్రదింపులు అంటే ప్రజలు రాళ్లతో కొడతారు’ నిజమే. మరి ఏమి చేయమంటారు. చెప్పేవాడికి లేకున్నా సిగ్గు వినేవాడికన్నా ఉండాలి. ఓపికకూ ఒక హద్దు, సహనానికీ ఒక హద్దు ఉంటా యి. ఇప్పటికే తెలంగాణ సకల జనుల సహనం హద్దులు చెరిపేసుకున్నది. ఒక్క బస్సూ నడవదు. ఒక్క ఆఫీసూ తెరుచుకోదు. ఒక్క బొగ్గుబావీ నడవ దు.

ఒక్క గుడి తలుపూ తెరుచుకోదు. దేవుడా.. దేవుడా.. ఎంత కఠినాత్ముల మధ్య, ఎంత పాపాత్ముల మధ్య మమ్మల్ని ఆగం జేస్తివి గదా! అని పూజారీ సమ్మెకట్టి అడుగుతున్నడు. ఇగ ఏం జెయ్యాలె తెలంగాణ. ఏడేండ్ల కిందటే మాటరాని బొమ్మ సోనియమ్మ ‘తెలంగాణ మనోభావాల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. మీ ఆకాంక్షలను సఫలం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం’ ఏమయిందమ్మా.. నీకు మాట కూడా రాదు. చిదంబరం జర నీ మాటలు ఆపుతావా! పుట్టెడంత విసుగొస్తున్నది. చెప్పిందే చెప్పకు. ‘తీవూవత అర్థమయింది’ బెంగాలీ బాబు ప్రణబ్‌ముఖర్జీ. అసలు కేంద్రంలో ఒక ప్రభు త్వం నడుస్తున్నదా! కిరణ్‌కుమార్‌డ్డి భాష మారింది. ‘కఠినంగా అణచివే స్తాం’.. నోరు పెరుగుతున్నది. ఏమి అణిచేస్తావ్ ముఖ్యమంత్రీ. నీ బానిసమంత్రి తెచ్చిన మందలో జై తెలంగాణ నినాదం.

మీ క్యాంప్ ఆఫీస్‌ను ఆవరించింది జై తెలంగాణ. వినపడలేదా.. ఒకే నినాదం. పోలీసు భాష మాట్లాడుతున్నడు చిత్తూరు నల్లారి కిరణ్‌కుమార్‌డ్డి. ‘ప్రజలే ప్రతిఘటిస్తారు’. ఏ ప్రజలు ప్రతిఘటిస్తారు. మీ క్యాంపు ఆఫీసు ముందర జై తెలంగాణ, జై కేసీఆర్ అంటున్న ప్రజలేనా? వచ్చీరాని తెలుగులో మాట్లాడే సోకాల్డ్ హైదరాబాదీ ప్రతిఘటించడం మాత్రమే స్పష్టంగా పలుకుతున్నడు. ఇప్పుడిక కిరణ్‌కుమార్‌డ్డి బానిస ఏకాకి. మంద మందిల కలిసి జై తెలంగాణ నినాదమైపోయింది. ఇంకేం పరిశీలిస్తారు ఏలినవారు. ఇదే సమయంలో రాజ్‌భవన్‌లో ఒక మంత్రి రాజీనామా చేస్తున్నాడు. ఇదే సమయంలో అసెంబ్లీలో రాజీనామాలు ఆమోదించమని డిమాండ్ చేస్తూ నలుగురు శాసనసభ్యులు తాళం వేసుకుని గదిలో బంధించుకున్నారు. ఇదే సమయంలో గాంధీ భారీ విగ్రహం ముందున్న గన్‌పార్క్‌లో కాగడాలు వెలుగుతున్నాయి.

అవి జరుగుతున్న, జరగబోయే సకల జనుల తెలంగాణ ఉద్యమానికి దారి చూపుతున్న దివిటీలై వెలుగుతున్నాయి. ఢిల్లీలోనూ కాగడాలు దారిచూపుతున్నాయి. బతుకమ్మలో జై తెలంగాణ నినాదం మార్మోగుతున్నది. మొన్న నఢి వీధిలో ఒక మంత్రిని అరెస్టు చేశారు. ఒక ఎమ్మెల్యేను చొక్కా చింపి, గాయపరిచారు. మరో ఎమ్మె ల్యే శోష తప్పి పడిపోయాడు. ఒక కాంగ్రె స్ ఎంపీని అరెస్టు చేశారు. ఉద్యోగ సంఘ నాయకునిపై నడిమందిలో మఫ్టీ పోలీసులు హత్యావూపయత్నం చేశారు. ఇంకేమి చేస్తారు కిరణ్‌కుమార్‌డ్డి గారూ.. అయినా అయినా.. ఏదీ ఆగలేదు కదా! మీ తుపాకులు సింగరేణి బొగ్గును తవ్వలేదు కదా! ఒక్క బొగ్గు పెళ్లా బయటపడలేదు కదా! ఒక్క ఆఫీ సూ తెరుచుకోలేదు గదా! సాక్షాత్తూ ముఖ్యమంత్రి సచివాలయానికి పోలీసు కాపలా మధ్య ఎన్నడూ వెళ్లలేదు కదా! ఇక సంప్రదించండి తెలంగాణను. ఏమి బాధ తెలంగాణది.

సరే! సంప్రదింపులంటే అదే కావొచ్చు అనుకొని విస్తృత అంగీకారం కోసం ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి యూపీఏ పదకొండు పార్టీలు, బయటి నుంచి మద్దతిచ్చే ఏడు పార్టీలు, ఎన్డీఏ ఎనిమిది పార్టీలు, ఒక్క సీపీఎం, డీఎంకె తప్ప తెలంగాణకు సమ్మతించారు కదా! అదేమయింది. కొలువా కుమ్మరియ్యా! అంగీకారం ఉన్నందుకే గదా! డిసెంబర్ 9న సాక్షాత్ చిదంబరం ‘తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది’ అన్నది. ఏడున రాష్ట్రంలో రెండుకళ్ల చంద్రబాబు, సామాజిక మోసకారి చిరంజీవి.. ఆ జీవీ.. ఈ జీవీ అందరు ఆమోదిస్తేనే కదా డిసెంబర్ 9. పోనీ ఆ తర్వాత కృష్ణ కమిటీ అంటిరి ఆ నివేదికలో అణచివేత కోసం రహస్య ఛాప్టర్‌ను ఇప్పుడు అమలు చేస్తూ రెడ్డి రాకుండానే మొదలాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసలు ద్రోహి. తెలంగాణలో ఇప్పుడొక పోరాటం నడుస్తున్నది. ఆ సెగ ఆ కాక ఢిల్లీకి తాకింది. కానీ.. మళ్లీ అవే మాటలు.

ఫుజూల్ బాత్. రానివీ పోనివీ.. తీస్‌మార్‌ఖాన్‌ల లెక్కన, ఢిల్లీకి వెళ్లిన మన కాంగ్రెస్ నేతలను ఇప్పుడు అడగవలసి ఉన్నది. చూడుచూడు మా సుతారం అని ఆజాద్‌ను బతిమాలి, ప్రణబ్‌ను గీమాలి, సోనియమ్మ దర్శనం కూడా దొరకక ఆగమైపోయి. మైకుల ముందర వీరాలాపానలు ప్రవచించే తెలంగాణ కాంగ్రెస్ నాయకులారా! ఇప్పుడిక మాట్లాడండి. ఏం మాట్లాడ్తారో?మాట్లాడండి. ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేస్తున్న మీ పార్టీ నాయకత్వం మీద తిరగబడి, రాజీనామాలు అర్పించుకుని మందిల కలుస్తరా! లేదా! ఊరూరా.. జరుగుతున్న చెప్పులదాడి, కత్తుల కోలాటానికి కరుసై పోతరా! తేల్చుకోవలసింది మీరే. ఇకచాలు. కాంగ్రెస్ పార్టీ ఒక మోసకారి. తెలంగాణకు మొదటి ద్రోహం చేసినవాడు నెహ్రూ. పండిట్ పిల్లలని ప్రేమించాడు. కానీ తెలంగాణను బలవంతంగా విలీనం చేసి ఇప్పుడు తెలంగాణ పిల్లల ఉసురు తీసుకోవడానికి కారణమయ్యాడు. ఆయన కూతురు ఇందిరమ్మ మున్నూటా డ్బై మంది ప్రాణాలు బలిగొన్న ఏలిక. ఒక్కనాడూ తెలంగాణ అరిగోసను పట్టించుకోలేదు కాంగ్రెస్.

మన్‌మోహన్‌సింగ్‌లు, మాంటెక్‌సింగ్ అహ్లూవాలియాలు, చిదంబరంలు వేదాంతాలు వల్లిస్తున్నా రు. కానీ ఈ వేదాంతాల చిలుకపలుకులు ఆంతర్జాతీ య పెట్టుబడులవి. సమ్మెలను ఏ ప్రభుత్వమూ సమర్థించదు. రైల్‌రోకోలను ఏ ప్రభుత్వమూ ఇష్టపడదు. నిజమే. కానీ చిదంబరం నువ్వాడిన మాటను తప్పి, ఏడేండ్ల కింద, ఏడేండ్ల తర్వాత ఒకేమాట వినపడినప్పుడు, ఒకే తీరు ప్రకటన వెలువడినప్పుడు. ఏమి చెయ్యాలి తెలంగాణ. నీ సంప్రదింపులకు అగ్గిదల్గ. ఇక్కడ మా ప్రాణాలుపోతున్నయి. మీ ముచ్చట్లు పాడుగాను ఇక్కడ మా బతుకుల్ల చీకట్లు కమ్ముకుంటున్నయి. ఏదో ఒకటి తేల్చండి. జ్వరమాని బద్దలవుతున్నది. ఉష్ణం పెరుగుతున్నది. ఇక చాలు. కట్టిపెట్టండి. మీ కోర్ కమిటీల నాటకాలు. సంప్రదింపులు ఇప్పుడొక అసహ్యకరమైన మాట. కమిటీలు చూసినం. సంప్రదింపులు చూసినం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందనుకునే పార్లమెంటులో ప్రకటనలూ చూసినం. ఇక వశం కాదు. కనుకనే సకల జనులం సమ్మెకట్టినం. ఇక చాలు.

తెలంగాణ అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులారా! ముఖ్యంగా కాంగ్రె స్ ప్రతినిధులారా! ఈ నాటకాలు వద్దు. ఇచ్చుడు.., తెచ్చుడు.. అయిపోయిం ది. ఎనిమిదవ ఛాప్టర్ ఓపెన్ అయిన ఈ క్షణాన చచ్చుడు ఛాప్టర్‌లు మిగి లినయ్. మీరిక బరిగీసి నిలిచిన తెలంగాణ సమాజం వైపా? మీమీ అధినాయకుల వేపా? తేల్చుకోండి? ఇది నాలుగున్నర కోట్ల జన సమరం. ఆత్మలు మేల్కొన్నాయి. ఇక ఆగకూడదు. చావో రేవో.. ఉన్నదొక్కటే దారి. తెలంగాణ పోరాటం కొనసాగుతుంది. పండగపూట మనం పస్తులుంటున్నప్పుడు.. పండుగపూట మనం పీడకలలు కంటున్నప్పుడు.. ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా.., ఇంత ఏక పక్షంగా వ్యవహరిస్తున్న పెత్తందారీ కాంగ్రెస్‌కు సమాధి కట్టడమే ఇక దారి. ఇక్కడి దాకా వచ్చాం. ఇన్ని త్యాగాలనూ, బలిదానాలనూ చవిచూశాం. ఇంకా పోయేదేముంది పోరాడితే.. బానిస సంకెళ్లు తప్ప. తెలంగాణ వారసత్వం పిడికివ్లూత్తి ఇక ఒకే నినాదం. ‘జీనా హైతో మర్‌నా సీఖో కద మ్ కదమ్ పర్ లడ్‌నా సీఖో..’ ఊరేగింపు సాగుతున్నది. వాళ్లు ఇచ్చేదేంది తెలంగాణ పోరాడి తెచ్చుకుందాం.. తెలంగాణ.
-అల్లం నారాయణ

No comments:

Post a Comment