Friday, August 31, 2012

గిరిజన స్వేచ్ఛా గీతం కొమురం భీం ----కట్టగాని రవీందర్ర్



భారతదేశంలోని గిరిజన ఉద్యమాలన్నీ చరిత్రాత్మకమైనవే. మధ్యభారత దండకారణ్యంలోని మహారాష్ట్ర, ఒడిషా, మధ్యవూపదేశ్, నిజాం రాష్ట్రాల్లోని ఆదివాసీ సమూహాలతో కలిసి గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలనకంటే ముందే ఏర్పడింది. ఆదివాసీ నాయకుల పాలన క్రీ.శ 1240 నుంచి 1750 వరకు సాగింది. తర్వాత కాలంలో మరాఠీలు ఆంగ్లేయులతో ఒప్పందాలను చేసుకుని గోండ్వానా రాజ్యాన్ని తెల్లదొరలకు అప్పగించారు. మార్సీకోల్లా రాంజీగోండు తెల్లదొరల సామ్రాజ్య విస్తరణను అడ్డుకోవడానికి అసిఫాబాద్ కేంద్రంగా బ్రిటిష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్నాడు. వేయిమంది రోహిల్లాలు, గిరిజనులతోపాటుగా నిర్మల్ ఊడలమపూరికి 1860 ఏప్రిల్ 9న ఊరితీయ్యబడ్డాడు. ఉత్తర తెలంగాణ గడ్డమీద ఇతని పోరాట వారసునిగా కొమురంభీం 1900లో సంకెనపల్లిలో జన్మించాడు. తల్లిదంవూడులు కొమురం చిమ్నా, పొంబాయి.భీం వయసు 17 ఏళ్ళు ఉన్నప్పుడు అటవీ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించాడు. అడవిలో క్రూర మృగాలతో, పులులతో తెగించి పోరాడే గిరిజనులు జంగ్లాత్ సిబ్బందిని చూసి ఎందుకు హడలిపోతారో భీంకు అర్థం కాలేదు.

గిరిజనులు గుట్టల మీద ఎంతో శ్రమకోర్చి చెట్లను కొట్టి రాయిరప్పలను పెకిలించి చదును చేసి కాస్తు చేస్తే, నిజాం అనుయాయుడు సిద్ధిఖీ పట్వారీతో కలిసి దొంగ పట్టాలతో భూమిని ఆక్రమించుకునేవాడు. అమాయకులైన గిరిజనులను మరోచోట పోడు చేసుకొమ్మని చెప్పేవాడు. అందుకుగాను అప్పిచ్చి గిరిజనులను వెట్టి బానిసలుగా మార్చుకునేవాడు. ఒకవైపు మరాఠా సేట్లు గిరిజనులకు అప్పిచ్చి వడ్డిమీద వడ్డీ వసూలు చేసేవారు. పోలీసులు గిరిజనుల గూడాల మీద బడి కోళు,్ల గొర్రెలు ఎత్తుకుపోయేవారు. గోండు స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడేవారు. కొమురంభీం ఈ అఘాయిత్యాలను భరించలేకపోయాడు. నిజాం అనుచరుడు, దుర్మార్గుడైన సిద్ధిఖీని హత్యచేశాడు. భీం కోసం నిజాం పోలీసుల వేట మొదలైంది. గిరిజన గూడాలను జల్లెడ పట్టి భీం బంధువులను కుటుంబసభ్యులను చిత్రహింసలు పెట్టారు. 

భీం నిజాం పోలీసులకు చిక్కకుండా కొంతకాలం అడవుల్లో దాక్కున్నాడు. ఆతర్వాత చంద్రాపూర్, బల్లార్షా మీదుగా అసోం వెళ్ళి తేయాకు తోటల్లో పని చేశాడు. అక్కడ కూలీరేట్లు పనిగంటలకు సంబంధించిన ఉద్యమాల ద్వారా భీం చైతన్యవంతుడయ్యాడు. కొంతకాలం తర్వాత భీంకు ఇంటిపై ధ్యాస మళ్ళింది. ఆకలితో అలమటించే గిరిజనులు, అవకాశం దొరికితే సర్వం దోపిడీ చేసి అత్యాచారాలకు తెగబడే జంగ్లాత్ వాళ్ళు గుర్తుకొచ్చారు. తమ గూడెం వెళ్తే తననూ చంపివేయడమో, శిక్షించడమో జరుగుతుందని తెలిసి తెగించి సొంత గూటికి పయనమయ్యాడు. రహస్యంగా ఆసిఫాబాద్ దగ్గరి తన గూడెం చేరుకున్నాడు. తనవాళ్ళను కలుసుకున్నాడు. చావైనా రేవైనా మీతోనే అన్నాడు. మంచిర్యాల్ అసిఫాబాద్ అడవుల్లోని గిరిజన గూడాలు తిరిగాడు. జల్,జంగల్,జమీన్ ఎవరిదో గిరిజనులకు విడమర్చి చెప్పాడు.

అడవి బిడ్డల్లో చైతన్యం నిప్పులా రాజుకుంది. గిరిజనులు భీం పోరాటంలో భాగమయ్యారు. మేకపన్ను, నాగటిపన్ను, ఇంటిపన్ను బంచ్‌రాం, దూపపట్టి పేర్లతో వసూలు చేసే పన్నులు బంద్ అయ్యాయి. పన్నుల వసూలుదార్లు వచ్చినప్పుడు గోండుల తరఫున భీం పన్నులు నిరాకరిస్తున్నట్టు చెప్పాడు. పన్నుల నియంవూతణ తాలూక్‌దార్ చేతిలో ఉంటుందని వసూల్‌దార్లు చెప్పారు. భీం తన అనుయాయులను వెంటబెట్టుకొని అసిఫాబాద్ తాలూక్‌దార్ నాజంను కలుసుకున్నాడు. పన్నుల నిర్ణయాధికారం తనది కాదని, అది నిజాం, ప్రధాని ప్రభువుల పరిధిలో ఉందని చెప్పాడు.

భీం గిరిజనులందరితో చర్చించి యాభై మంది గిరిజనులతో జొన్నరొట్టె, సంకటికూడు, కారం మూటలు గట్టుకొని నిజాం ప్రభువు వద్దకు బయలుదేరారు. రెండురోజుల ప్రయాణం తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజులు నిజాం నివాసాల గేట్ల ముందు పడిగాపులు కాశారు. తెలంగాణ ప్రాంత ప్రజల రక్తమాంసాలకు విలువ, గుర్తింపు లేని ఆ రోజుల్లో గిరిజనుడైన భీంకు అతని అనుచరులకు నిజాం ప్రధాని అపాయింట్‌మెంట్ దొరకక పోగా అధికారుల నుంచి అవమానాలు ఎదురయ్యాయి.
గిరిజనులు తిరుగు ప్రయాణమయ్యారు. భీం రెండు రోజుల నడక తర్వాత అసిఫాబాద్ చేరుకున్నాడు. తర్వాత రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భీం శ్రీకారం చూడుతున్న ఈ పోరాట కార్యక్షికమానికి మంచిర్యాల నుంచి బొగ్గుగని ట్రేడ్ యూనియన్ నాయకులొచ్చారు. 

మూడు గంటలపాటు సమావేశం జరిగింది. అంతిమంగా భీం, గిరిజనులు ఈ అడవితల్లిపై హక్కు మాదని నినదించారు. జల్ జంగల్, జమీన్ పై హక్కులకు జంగ్ తప్ప మరోమార్గం లేదని భీం తేల్చిచెప్పాడు. గిరిజనులు దండుగట్టారు. తొడగొట్టి తుడుం మోగించారు. కొమురం సూరు, లచ్చు పటేల్ అనుయాయులుగా గిరిజనోద్యమం మొదలైంది. జోడేఘాట్ మొదలుకొని పట్నాపూర్ వరకు గల పన్నెండు గిరిజన గూడాలను భీం యుద్ధ కేంద్రాలుగా మార్చాడు. శత్రువు ఎటువైపు నుంచి వచ్చినా తుడుం మోతతో సమష్టిగా శత్రువుతో తెగబడి పోరాడేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నారు.

ఉప్పులు, పప్పులు సాగు అవసరమైన విత్తనాలు, సరుకులు ఇచ్చి జీవితాంతం బానిసలుగా చేసుకున్న మరాఠా సేట్లను గిరిజనులు జోడేఘాట్ గుట్టల సరిహద్దుల నుంచి పరుగులు పెట్టించారు. గిరిజన గూడాల్లో వడ్డీ వ్యాపారస్థులు, జంగ్లాత్ వాళ్ళు కనిపించకుండాపోయారు. భీం సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి సన్నద్ధమవుతున్న విషయం నిజాం ప్రభుత్వానికి తెలిసింది. ప్రభుత్వం ఆసిఫాబాద్ తాలూక్‌దార్‌ను సర్కార్ దూతగా పంపింది. చర్చలు విఫలమయ్యాయి. నిజాం సైన్యం దాడి గిరిజన గూడాలపై మొదలైంది. భీం గెరిల్లా వ్యూహాలతో సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు. పోరాటం క్రమంగా తీవ్రమైంది. భీం అనుచరులైన కొమురం సూరు, లచ్చుప నిర్బంధించబడ్డారు. నిజాం పోలీసు ఎరకు లొంగి కుర్దుప నమ్మక ద్రోహిగా మారాడు. 1940 సెప్టెంబర్1న పచ్చని అడవిపై వెన్నెల ప్రసరిస్తున్న అర్థరాత్రి సడీచప్పుడు చెయ్యకుండా దొంగదారిలో వచ్చిన వందలాది పోలీసులు జోడేఘాట్ అడవుల్లోని గుట్టల మీదున్న భీం అతని అనుచరులపై దాడికి దిగి కాల్పులు జరిపారు. ఈ పోరులో చివరికంటా పోరాడి భీంతో సహా 12 మంది అనుచరులు అమరులయ్యారు. కొమురం భీం ఒక గిరిజన స్వేచ్చాగీతం. ఆదివాసీ హృదయంలో రెపపలాడే రగల్ జెండా, విప్లవ చైతన్య ఉత్తుంగ తరంగం. సమస్త తెలంగాణ ప్రజాపోరాటాల దిక్చూచి.

ప్రొఫెసర్ క్రిస్టఫర్ హైమన్ డార్ఫ్ భీం మరణం తర్వాత ఆదిలాబాద్ వచ్చి గిరిజనుల జీవితాలతో కలిసిపోయారు. ఇతని సూచనల కారణంగా 1946లో ఆదివాసీ ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించారు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలోని 5,7 షెడ్యూల్డ్‌లో ఉన్న ఆదివాసీ అవాసాలు భూములకు సంబంధించి ఉన్న చట్టాల ఆధారంగా 1/70 చట్టం వచ్చింది. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు సంక్రమించిన అధికారాలను ప్రభుత్వాలు ఇంకా గుర్తించకపోవడం దారుణం. గిరిజన పోరాటాలు, త్యాగాల వల్ల సంక్రమించిన రాజ్యాంగంలోని చట్టాలను గిరిజనులకు నిర్దిష్టంగా వర్తింపచేయాలి. గిరిజన పోరాట వీరుడు కొమురం భీం పేరు మీద జిల్లాను విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.

-కట్టగాని రవీందగిరిజన స్వేచ్ఛా గీతం కొమురం భీం
భారతదేశంలోని గిరిజన ఉద్యమాలన్నీ చరిత్రాత్మకమైనవే. మధ్యభారత దండకారణ్యంలోని మహారాష్ట్ర, ఒడిషా, మధ్యవూపదేశ్, నిజాం రాష్ట్రాల్లోని ఆదివాసీ సమూహాలతో కలిసి గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలనకంటే ముందే ఏర్పడింది. ఆదివాసీ నాయకుల పాలన క్రీ.శ 1240 నుంచి 1750 వరకు సాగింది. తర్వాత కాలంలో మరాఠీలు ఆంగ్లేయులతో ఒప్పందాలను చేసుకుని గోండ్వానా రాజ్యాన్ని తెల్లదొరలకు అప్పగించారు. మార్సీకోల్లా రాంజీగోండు తెల్లదొరల సామ్రాజ్య విస్తరణను అడ్డుకోవడానికి అసిఫాబాద్ కేంద్రంగా బ్రిటిష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్నాడు. వేయిమంది రోహిల్లాలు, గిరిజనులతోపాటుగా నిర్మల్ ఊడలమపూరికి 1860 ఏప్రిల్ 9న ఊరితీయ్యబడ్డాడు. ఉత్తర తెలంగాణ గడ్డమీద ఇతని పోరాట వారసునిగా కొమురంభీం 1900లో సంకెనపల్లిలో జన్మించాడు. తల్లిదంవూడులు కొమురం చిమ్నా, పొంబాయి.భీం వయసు 17 ఏళ్ళు ఉన్నప్పుడు అటవీ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించాడు. అడవిలో క్రూర మృగాలతో, పులులతో తెగించి పోరాడే గిరిజనులు జంగ్లాత్ సిబ్బందిని చూసి ఎందుకు హడలిపోతారో భీంకు అర్థం కాలేదు.

గిరిజనులు గుట్టల మీద ఎంతో శ్రమకోర్చి చెట్లను కొట్టి రాయిరప్పలను పెకిలించి చదును చేసి కాస్తు చేస్తే, నిజాం అనుయాయుడు సిద్ధిఖీ పట్వారీతో కలిసి దొంగ పట్టాలతో భూమిని ఆక్రమించుకునేవాడు. అమాయకులైన గిరిజనులను మరోచోట పోడు చేసుకొమ్మని చెప్పేవాడు. అందుకుగాను అప్పిచ్చి గిరిజనులను వెట్టి బానిసలుగా మార్చుకునేవాడు. ఒకవైపు మరాఠా సేట్లు గిరిజనులకు అప్పిచ్చి వడ్డిమీద వడ్డీ వసూలు చేసేవారు. పోలీసులు గిరిజనుల గూడాల మీద బడి కోళు,్ల గొర్రెలు ఎత్తుకుపోయేవారు. గోండు స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడేవారు. కొమురంభీం ఈ అఘాయిత్యాలను భరించలేకపోయాడు. నిజాం అనుచరుడు, దుర్మార్గుడైన సిద్ధిఖీని హత్యచేశాడు. భీం కోసం నిజాం పోలీసుల వేట మొదలైంది. గిరిజన గూడాలను జల్లెడ పట్టి భీం బంధువులను కుటుంబసభ్యులను చిత్రహింసలు పెట్టారు. 

భీం నిజాం పోలీసులకు చిక్కకుండా కొంతకాలం అడవుల్లో దాక్కున్నాడు. ఆతర్వాత చంద్రాపూర్, బల్లార్షా మీదుగా అసోం వెళ్ళి తేయాకు తోటల్లో పని చేశాడు. అక్కడ కూలీరేట్లు పనిగంటలకు సంబంధించిన ఉద్యమాల ద్వారా భీం చైతన్యవంతుడయ్యాడు. కొంతకాలం తర్వాత భీంకు ఇంటిపై ధ్యాస మళ్ళింది. ఆకలితో అలమటించే గిరిజనులు, అవకాశం దొరికితే సర్వం దోపిడీ చేసి అత్యాచారాలకు తెగబడే జంగ్లాత్ వాళ్ళు గుర్తుకొచ్చారు. తమ గూడెం వెళ్తే తననూ చంపివేయడమో, శిక్షించడమో జరుగుతుందని తెలిసి తెగించి సొంత గూటికి పయనమయ్యాడు. రహస్యంగా ఆసిఫాబాద్ దగ్గరి తన గూడెం చేరుకున్నాడు. తనవాళ్ళను కలుసుకున్నాడు. చావైనా రేవైనా మీతోనే అన్నాడు. మంచిర్యాల్ అసిఫాబాద్ అడవుల్లోని గిరిజన గూడాలు తిరిగాడు. జల్,జంగల్,జమీన్ ఎవరిదో గిరిజనులకు విడమర్చి చెప్పాడు.

అడవి బిడ్డల్లో చైతన్యం నిప్పులా రాజుకుంది. గిరిజనులు భీం పోరాటంలో భాగమయ్యారు. మేకపన్ను, నాగటిపన్ను, ఇంటిపన్ను బంచ్‌రాం, దూపపట్టి పేర్లతో వసూలు చేసే పన్నులు బంద్ అయ్యాయి. పన్నుల వసూలుదార్లు వచ్చినప్పుడు గోండుల తరఫున భీం పన్నులు నిరాకరిస్తున్నట్టు చెప్పాడు. పన్నుల నియంవూతణ తాలూక్‌దార్ చేతిలో ఉంటుందని వసూల్‌దార్లు చెప్పారు. భీం తన అనుయాయులను వెంటబెట్టుకొని అసిఫాబాద్ తాలూక్‌దార్ నాజంను కలుసుకున్నాడు. పన్నుల నిర్ణయాధికారం తనది కాదని, అది నిజాం, ప్రధాని ప్రభువుల పరిధిలో ఉందని చెప్పాడు.

భీం గిరిజనులందరితో చర్చించి యాభై మంది గిరిజనులతో జొన్నరొట్టె, సంకటికూడు, కారం మూటలు గట్టుకొని నిజాం ప్రభువు వద్దకు బయలుదేరారు. రెండురోజుల ప్రయాణం తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజులు నిజాం నివాసాల గేట్ల ముందు పడిగాపులు కాశారు. తెలంగాణ ప్రాంత ప్రజల రక్తమాంసాలకు విలువ, గుర్తింపు లేని ఆ రోజుల్లో గిరిజనుడైన భీంకు అతని అనుచరులకు నిజాం ప్రధాని అపాయింట్‌మెంట్ దొరకక పోగా అధికారుల నుంచి అవమానాలు ఎదురయ్యాయి.
గిరిజనులు తిరుగు ప్రయాణమయ్యారు. భీం రెండు రోజుల నడక తర్వాత అసిఫాబాద్ చేరుకున్నాడు. తర్వాత రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భీం శ్రీకారం చూడుతున్న ఈ పోరాట కార్యక్షికమానికి మంచిర్యాల నుంచి బొగ్గుగని ట్రేడ్ యూనియన్ నాయకులొచ్చారు. 

మూడు గంటలపాటు సమావేశం జరిగింది. అంతిమంగా భీం, గిరిజనులు ఈ అడవితల్లిపై హక్కు మాదని నినదించారు. జల్ జంగల్, జమీన్ పై హక్కులకు జంగ్ తప్ప మరోమార్గం లేదని భీం తేల్చిచెప్పాడు. గిరిజనులు దండుగట్టారు. తొడగొట్టి తుడుం మోగించారు. కొమురం సూరు, లచ్చు పటేల్ అనుయాయులుగా గిరిజనోద్యమం మొదలైంది. జోడేఘాట్ మొదలుకొని పట్నాపూర్ వరకు గల పన్నెండు గిరిజన గూడాలను భీం యుద్ధ కేంద్రాలుగా మార్చాడు. శత్రువు ఎటువైపు నుంచి వచ్చినా తుడుం మోతతో సమష్టిగా శత్రువుతో తెగబడి పోరాడేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నారు.

ఉప్పులు, పప్పులు సాగు అవసరమైన విత్తనాలు, సరుకులు ఇచ్చి జీవితాంతం బానిసలుగా చేసుకున్న మరాఠా సేట్లను గిరిజనులు జోడేఘాట్ గుట్టల సరిహద్దుల నుంచి పరుగులు పెట్టించారు. గిరిజన గూడాల్లో వడ్డీ వ్యాపారస్థులు, జంగ్లాత్ వాళ్ళు కనిపించకుండాపోయారు. భీం సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి సన్నద్ధమవుతున్న విషయం నిజాం ప్రభుత్వానికి తెలిసింది. ప్రభుత్వం ఆసిఫాబాద్ తాలూక్‌దార్‌ను సర్కార్ దూతగా పంపింది. చర్చలు విఫలమయ్యాయి. నిజాం సైన్యం దాడి గిరిజన గూడాలపై మొదలైంది. భీం గెరిల్లా వ్యూహాలతో సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు. పోరాటం క్రమంగా తీవ్రమైంది. భీం అనుచరులైన కొమురం సూరు, లచ్చుప నిర్బంధించబడ్డారు. నిజాం పోలీసు ఎరకు లొంగి కుర్దుప నమ్మక ద్రోహిగా మారాడు. 1940 సెప్టెంబర్1న పచ్చని అడవిపై వెన్నెల ప్రసరిస్తున్న అర్థరాత్రి సడీచప్పుడు చెయ్యకుండా దొంగదారిలో వచ్చిన వందలాది పోలీసులు జోడేఘాట్ అడవుల్లోని గుట్టల మీదున్న భీం అతని అనుచరులపై దాడికి దిగి కాల్పులు జరిపారు. ఈ పోరులో చివరికంటా పోరాడి భీంతో సహా 12 మంది అనుచరులు అమరులయ్యారు. కొమురం భీం ఒక గిరిజన స్వేచ్చాగీతం. ఆదివాసీ హృదయంలో రెపపలాడే రగల్ జెండా, విప్లవ చైతన్య ఉత్తుంగ తరంగం. సమస్త తెలంగాణ ప్రజాపోరాటాల దిక్చూచి.

ప్రొఫెసర్ క్రిస్టఫర్ హైమన్ డార్ఫ్ భీం మరణం తర్వాత ఆదిలాబాద్ వచ్చి గిరిజనుల జీవితాలతో కలిసిపోయారు. ఇతని సూచనల కారణంగా 1946లో ఆదివాసీ ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించారు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలోని 5,7 షెడ్యూల్డ్‌లో ఉన్న ఆదివాసీ అవాసాలు భూములకు సంబంధించి ఉన్న చట్టాల ఆధారంగా 1/70 చట్టం వచ్చింది. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు సంక్రమించిన అధికారాలను ప్రభుత్వాలు ఇంకా గుర్తించకపోవడం దారుణం. గిరిజన పోరాటాలు, త్యాగాల వల్ల సంక్రమించిన రాజ్యాంగంలోని చట్టాలను గిరిజనులకు నిర్దిష్టంగా వర్తింపచేయాలి. గిరిజన పోరాట వీరుడు కొమురం భీం పేరు మీద జిల్లాను విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.

-కట్టగాని రవీంద

Namaseete Telangana News Paper Dated : 1/09/2012

Thursday, August 30, 2012

పోలీసు కట్టుకథల శిల్పం - వరవరరావు



ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటున్న వాళ్లను ముద్దాయిలుగా చూపడం, పరారీలో ఉన్నట్లు చూపడం పోలీసులకే చెల్లింది. ఇటువంటి కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టినందుకే ఏపీసీఎల్‌సీ కార్యకర్తలు తమ ఉద్యోగాలు కూడా కోల్పోయారు. వీటిలో కొన్ని యూఏపీఏ కింద పెట్టిన కేసులైతే, మరికొన్ని ప్రజాభద్రతా చట్టం కింద పెట్టినవి. 

నూతన ఆర్థిక విధానం అభివృద్ధి నమూనా అనే మాటలు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దాడికి ఆమోదం కలిగించే రూపాలు. ఈ దాడి ఆరంభమైన తొంభైలలోనే దీన్ని ఎదుర్కొనే క్రమంలో వైవిధ్యం గల రూపాన్ని ఎంచుకునే ప్రయత్నంలో తెలుగు కథ రూపవాదానికి గురై వస్తువును త్యాగం చేసేదాకా పోయింది. మొదటి నుంచి ఒకే వస్తుగత స్వభావాన్ని వివిధ రూపాలతో కథలతో చెప్పగలిగే నైపుణ్యం సంపాదించిన పోలీసులు మాత్రం తొంభై నుంచి మరింత వైచిత్రితో కూడిన కథలు రాస్తున్నారు. ఎన్‌కౌంటర్ కథల విషయంలోగానీ, అక్రమ కేసుల కథనాలను వ్రాసే విషయంలోగానీ ఒక తర్కబద్ధమైన క్రమాన్ని పాటిస్తున్నారు.

అటువంటి ఒక అక్రమ కేసు గురించినదే ఈ కథనం. ఇందులో పంచతంత్ర కథ కూడా ఉన్నది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన తంగిరాల అనిల్‌కుమార్ అనే 38 ఏళ్ళ వ్యక్తిని ఆగస్టు మొదటి వారంలో పోలీసులు పొన్నూరులో అరెస్ట్ చేశారు. ఆ గ్రామానికి తన కూతురు పెళ్లి కార్డులు పంచడానికి పోయాడు. మరి అయితే పెళ్లి అయిపోగానే వస్తావా? అని పోలీసులు అడగలేదు కానీ కూతురు పెళ్లి కనుక మానవీయంగా వదిలివేసినట్టు వదిలేశారు.

వదిలేస్తామని హామీ పడి ఈ లోపల ఏ ఆందోళనకు పూనుకోవద్దని కూడా వేడుకున్నారు. హైకోర్టులో రిట్ వేస్తే కేసు పెట్టాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. లేగదూడకు పాలు ఇవ్వడానికి వెళ్లిన ఆవును వదిలినట్లే వదిలారు. ఆవు అంతటి సత్యసంథతతో ఆయన తిరిగి రానక్కర లేకుండానే (బహిరంగంగా తిరుగుతున్న వాడు కాబట్టి పిల్లలు కలవాడు కాబట్టి) ఆగస్టు 19న ఆయనను అరెస్టు చేసినట్టు చూపారు. ఇక ఇక్కడ కథ మొదలవుతోంది. 

దానికి వేలూరు రోడ్డులో డైరీమెన్ కాలనీలో డొంక సమీపంలో నిర్మాణంలో ఉన్న వాటర్‌ట్యాంకు దగ్గర జరిగిన సంఘటనలు అని పేరు పెట్టారు. గస్తీ తిరుగుతున్న పోలీసులకు వేలూరు వైపు నుంచి చిలకలూరిపేటకు వెళుతూ కనిపించిన మధ్య వయస్కుడు పారిపోయేందుకు ప్రయత్నించగా అతడు పట్టదగిన నేరం చేసినవాడని వాళ్లకు అనిపించింది. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మొదట తబ్బిబ్బు పడ్డాడు కానీ తరచి అడగగా అతడు కూడా ఒక కథ చెప్పాడు.

మొదటిసారి అరెస్టు అయినపుడు కేవలం తంగిరాల అనిల్‌కుమార్ అన్న వ్యక్తికి అకస్మాత్తుగా మూడు అలియాస్‌లు వచ్చాయి శ్యాం, శ్రీరాం, శ్రీను అని. కారంచేడు సంఘటన, జేఎన్ఎం, దళిత మహాసభ ప్రజాసంఘాలు ఇటువంటి ప్రభావాల నుంచి - సెంట్రింగ్ పోస్టు పని, కూలి పని, వ్యవసాయ పని చేసుకునే తల్లిదండ్రులు లేని పిల్లవాడు రవి అనే పీపుల్స్‌వార్ మనిషి పరిచయంతో విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షింపబడ్డాడు. ఇక క్రమంగా పున్నారావు మొదలైన వారి పరిచయాలతో పార్టీ పరిచయాలకు వచ్చాడు. నవీన్, ఆర్‌సీ (రాంచందర్) మస్తాన్‌రావు, శాఖమూరి అప్పారావు మొదలుకొని సాంబశివుడు మొదలుకొని ఎందరో పార్టీ ప్రముఖుల పరిచయాలలోకి వెళ్లిపోయాడు. ఇందులో ఇతడు చెప్పినట్లుగా కథనాన్ని పట్టి చూస్తే ఇవన్నీ ఎప్పుడో మాంధాతల కాలంలో జరిగిన సంఘటనలుగా ఉంటాయి.

ఇందులో రామకృష్ణ (ఆర్.కె) తప్ప ఒక్కరూ జీవించిలేరు. అంతే కాదు అందరూ ఏ రెండు మూడేళ్ల క్రితమో ఎన్‌కౌంటర్లలో హతులైనవాళ్లు. అప్పుడు ప్రజాసంఘాల్లో పనిచేస్తున్న వాళ్లు కూడా పున్నారావు, మన్నెం ప్రసాద్ వంటి వాళ్లు అనారోగ్యంతో మరణించిన వాళ్లో, హతులో. మరెందుకు ఇప్పుడు ఇతనిపై వీళ్లందరినీ కలుపుతూ కేసు పెట్టినట్లు? నేరారోపణలు ఏమిటి? సాంబశివుడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు గిద్దలూరు నుంచి వేరే గ్రామానికి తీసుకుపోవడమనే ఒక నేరారోపణ, ఒకరు ఇచ్చిన డబ్బు మరొకరికి ఇవ్వడమనేది మరో నేరారోపణ.

ఈ సంబంధాలు, ఈ నేరారోపణలు నేరపూరిత కుట్ర యుద్ధానికి పూనుకోవడం (ఠ్చీజజీnజ ఠ్చీట) రాజద్రోహం అనే తీవ్రమైన సెక్షన్లతో పాటు 1997 ప్రజాభద్రతా చట్టాన్ని 1967 నాటి చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టాన్ని (యూఏపీఏ) ఆకర్షించేంత తీవ్రమైనవి. ఇందులో అనిల్‌కుమార్‌తో పాటు 15 మందిని ముద్దాయిలుగా చూపారు. వారిలో రవి, నవీన్, సంజీవ్, రాంచందర్, ఆర్.కె, మస్తాన్‌రావు, శాఖమూరి అప్పారావు, సాంబశివుడు వీళ్లంతా పార్టీ వాళ్ళు.

ఆర్.కె. తప్ప అందరూ అమరులు. మరి అయితే ఎందుకు కేసు పెట్టినట్టు? ఆర్.కె, అనిల్‌ల కోసమేనా? అక్కడే ఈ కేసు మలుపు ఉన్నది. ఒక అరడజను ప్రజాసంఘాలలో బహిరంగంగా పనిచేస్తున్న వాళ్లను పెట్టడానికే ఈ కట్టుకథల నేరారోపణ. ప్రథమ సమాచార నివేదిక వాళ్లు అనిల్‌తో పాటు పీడీఎం శ్రీను, దుడ్డు ప్రభాకర్, క్యాటరింగ్ రాజు, శ్యామల, నిర్మల. వీరిలో పీడీఎం శ్రీను విస్థాపన కమిటీ సభ్యుడు కూడా. కోస్టల్ కారిడార్ నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా మొదలుకొని విశాఖపట్నం వరకు సెజ్‌లకు వ్యతిరేకంగా ముఖ్యంగా మత్స్యకారుల, ఆదివాసుల నిర్వాసితత్వాన్ని వ్యతిరేకిస్తూ పనిచేస్తున్నవాడు. దుడ్డు ప్రభాకర్ కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు, దళితుల ఆత్మగౌరవ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నవాడు.

లక్షింపేట మాలల మారణకాండకు బాధ్యుడైన మంత్రినైనా సరే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక విశాల ఐక్య సంఘటనకు కన్వీనర్‌గా ఉన్న హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం నాయకత్వంలో పనిచేస్తున్నవాడు. క్యాటరింగ్ రాజు రైల్వే క్యాటరింగ్ ఉద్యోగం కూడా కోల్పోయి ప్రగతిశీల కార్మిక సంఘంలో పనిచేస్తున్నవాడు. సాంబశివుడి భార్య శ్యామల ఆయన అజ్ఞాతంలో ఉండగానే బయటకి వచ్చి అమరుల బంధుమిత్రుల సంఘంలో పనిచేస్తున్నది. 

అనిల్‌కుమార్ భార్య చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నది. అనిల్‌కుమార్ గతంలో ఏపీసీఎల్‌సీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడుగా పనిచేశాడు. మన్నెం ప్రసాద్ హత్య తరువాత భయపడి రాజీనామా కూడా చేశాడు. ఇక్కడి నుంచి ఆయన పార్టీలో చేరినట్లు జిల్లా కమిటీ సభ్యుడుగా కూడా ప్రమోట్ అయినట్లు కథ అల్లారు. పైన పేర్కొన్న ఐదుగురు ప్రజాసంఘాల కార్యకర్తలు, నాయకులు బహిరంగంగా, చట్టబద్ధంగా పనిచేస్తూ ప్రజల మధ్య మసలుకుంటున్న వాళ్లు. కొందరు నిత్యం మీడియాలో కూడా కనిపిస్తున్న వారు. వీళ్లందరినీ ఈ కేసులో నిందితులుగా చూపడానికే పోలీసులు ఈ కథ అల్లారు. వీరందరికీ మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉండిన, ఉన్న నాయకులతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు. 

అంతమాత్రమే కాదు వీళ్లందరూ కనిపించటం లేదని, పరారీలో ఉన్నారని వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా రాశారు. వివిధ ప్రజాసంఘాల్లో క్రియాశీలంగా, బహిరంగంగా చట్టబద్ధంగా పనిచేస్తున్న వాళ్లను అక్రమ కేసుల్లో ఇరికించి పారిపోయినట్లుగా చూపడమనేది పోలీసు సంప్రదాయమే. తిరిగి ఏప్రిల్ 22 ఆర్‌డీఎఫ్ మహాసభకు ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న 35 మంది ఆదివాసులను, చేతన నాట్యమంచ్‌ను, సత్యం అనే వ్యక్తిని అరెస్టు చేసి అతనిపై (్ఖఅ్కఅ) చట్టం కింద కేసు నమోదు చేశారు.

ప్రథమ సమాచార నివేదికలో అన్ని ప్రజాసంఘాల బాధ్యులను ఇరికించి ఇప్పటికే అరెస్టు అయి జైల్లో ఉన్న తెలంగాణ ప్రజాఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణపై ఈ కేసులో పీటీ వారంటును జారీ చేశారు. ఆ తర్వాత మే 9న కామ్రేడ్ ఆజాద్ సహచరి పద్మ, ఆమె వెంట ఉన్న వాళ్లను ఖానాపురంలో అరెస్ట్ చేసి, హన్మకొండలో ఉన్న అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, వరంగల్ జిల్లాలో తెలంగాణ ప్రజాఫ్రంట్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్న భారతిని కూడా ముద్దాయిగా చూపి అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

వీళ్లను అడవికి పంపుతున్నారన్న ఆరోపణతో అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటి ప్రసాదం, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య, నడుస్తున్న తెలంగాణ సంపాదకుడు సి.కాశీంలను ముద్దాయిలుగానే కాదు పరారీలో ఉన్నట్లు చూపారు. అమరుల బంధుమిత్రుల సంఘం మహాసభకు వచ్చిన ఆదివాసీ ప్రజలు చేతన నాట్యమంచ్‌కు చెందిన వాళ్లు స్త్రీలు, పిల్లలతో సహా 18 మందిని ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌లో అరెస్టు చేసి వాళ్లను తీసుకుపోవడానికి వచ్చిన ఏపీసీఎల్‌సీ కార్యకర్తలు నారాయణరావు, హన్మంతరావులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

ఇందులోనూ గంటి ప్రసాదం, పద్మకుమారి, విరసం వరవరరావు, ఏపీసీఎల్‌సీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, హైకోర్టు అడ్వకేట్ వి. రఘునాథ్‌లను కూడా ముద్దాయిలుగా చూపి పరారీలో ఉన్నట్లు చూపారు. ఈ మూడు కేసులు 1972 ప్రజా భద్రత చట్టం కింద చూపినవే. భద్రాచలంలో అరెస్టు అయిన బండి కిరణ్‌తో పాటు మళ్లీ గంటి ప్రసాదం, పద్మకుమారి, వరవరరావు, రఘునాథ్, నారాయణరావు, హన్మంతరావు, కాశీంలను కూడా ముద్దాయిలుగా చూపి పరారీలో ఉన్నట్లుగా చూపారు. చట్టబద్ధమైన బహిరంగ సభలు, ప్రజాహిత కార్యక్రమాలే కాకుండా తమ ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటున్న వాళ్లు, న్యాయవాదులు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, ఆసుపత్రుల్లో, ఆర్టీసీల్లో పనిచేస్తున్న వాళ్లు కావచ్చు, వాళ్లను ముద్దాయిలుగా చూపడం, పరారీలో ఉన్నట్లు చూపడం పోలీసులకే చెల్లింది.

ఇటువంటి కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టినందుకే ఏపీసీఎల్‌సీ కార్యకర్తలు తమ ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు అనిల్‌కుమార్ అరెస్ట్ సందర్భంగా పెట్టిన కేసు ఒక తాజా చేర్పు. అయితే వీటిలో కొన్ని యూఏపీఏ కింద పెట్టిన కేసులైతే, మరికొన్ని ప్రజాభద్రతా చట్టం కింద పెట్టినవి. కానీ అనిల్‌కుమార్ కేసు మాత్రం నేర శిక్షాస్మృతిలోని చటబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సాయుధంగా కూల్చే కుట్ర, యుద్ధ ప్రకటన, రాజద్రోహంతో పాటు ప్రజాభద్రతా చట్టం, యూఏపీఏను జోడించి పకడ్బందీగా పెట్టారు. దానికి కొసమెరుపు నిత్యం ప్రజాజీవితంలో కనిపించే ఐదుగురు ప్రజాసంఘాల కార్యకర్తలను పరారీలో చూపడం. ఇంత క్రమబద్ధంగా రచించగల అక్రమ కట్టుకథలను పోలీసులు తప్ప ఇంకెవరైనా అల్లగలరా?
- వరవరరావు

andhra jyothi news dated 31/08/2012

Tuesday, August 28, 2012

సబ్ ప్లాన్ సంక్షేమం---సంపాదకీయం



ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల చట్టబద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించడం హర్షించవలసిన పరిణామం. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలోని మంత్రి వర్గ ఉపసంఘం ఈ నెల 25న సమర్పించిన సిఫార్సులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నిధుల దారి మళ్ళింపునకు వ్యతిరేకంగా దళితులు, ఆదివాసులు, వివిధ ప్రజాస్వామిక వాదులు, పౌరసమాజం, రాజకీయ పార్టీలు ఉద్యమించడం వల్ల ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి దృష్టి సారించింది. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల, తెగల సర్వతోముఖాభివృద్ధి కోసం ఉద్దేశించిన ఉప ప్రణాళికల నిధుల దారి మళ్ళింపును అరికట్టడానికి ప్రత్యేక సాధికార సంస్థను ఏర్పాటు చే యాలని ఉప సంఘం సూచించడం ఆహ్వానించదగినది. ఎస్సీల కోసం 1,200 కోట్ల రూపాయలు, ఎస్టీల కోసం 800 కోట్ల రూపాయల బడ్జెట్ ప్యాకేజీలను సబ్‌ప్లాన్ కింద కేటాయించాలని కూడా ఉప సంఘం సూచించింది. 


రాజ్యాంగ నిర్దేశానికి అనుగుణంగా 1979లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రూపొందించిన ఎస్సీఎస్టీల ఉప ప్రణాళికలను రాష్ట్రాలు కూడా అనుసరించాయి. ఉప ప్రణాళికల కోసం బడ్జెట్లలో నిధుల కేటాయింపులు జరుగుతున్నప్పటికీ అవి సవ్యంగా ఖర్చు కాకుండా మురిగిపోవడ ం, ఇతర శాఖలకు, ఇతర కార్యక్రమాలకు ఖర్చు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరలించడం వంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. దళితుల కోసం ఉద్దేశించిన నిధులను కామన్ వెల్త్ క్రీడల కోసం ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి చిదంబరం పార్లమెంటులో అంగీకరించారు. రాష్ట్రంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి, హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు, ట్యాంక్‌బండ్ అభివృద్ధికి, భూగర్భ డ్రైనేజీ పనులకు, 

పులివెందుల అభివృద్ధికి ఈ ఉప ప్రణాళికల నిధులను పాలకులు బుద్ధిపూర్వకంగానే దారి మళ్లించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే సామాజిక పింఛన్లు, ఇందిరమ్మ గృహాల ఖర్చును, గ్రామీణ ఉపాధి హామీ చెల్లింపులను కూడా రాష్ట్ర సర్కారు ఉప ప్రణాళిక ఖాతాలో చేర్చడం అన్యాయం. అదే సమయంలో ఆ నిధుల వ్యయ నియంత్రణ కోసం నియమించిన నోడల్ సంస్థలను పాలకులు నిర్వీర్యం చేశారు. జనాభా దామాషా ప్రకారం నిధులను ప్రణాళిక బడ్జెట్లో కేటాయించి ఖర్చు చేయాలన్న రాజ్యాంగ విధిని రాష్ట్ర ప్రభుత్వాలు సుదీర్ఘకాలంగా నిర్లక్ష ్యం చేశాయి. పర్యవసానంగా అధికారిక లెక్కల ప్రకారం గత ఇరవై ఏళ్లలో ఎస్సీ ఉపప్రణాళిక నిధులు పదహారు వేల కోట్ల రూపాయలు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మూడువేల కోట్ల రూపాయలకు పైగా దారి మళ్ళాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పదివేల కోట్ల రూపాయలు దారిమళ్ళినట్లు అంచనా. 

రాష్ట్రంలో ఎస్సీఎస్టీల సంక్షేమం కుదేలయిందని, వారి అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులు ఏటేటా హరించుకుపోతున్నాయని, కేంద్రం విడుదల చేసిన నిధులను సైతం ఖర్చుచేయకుండా మురగబెడుతున్నారని నాలుగేళ్ళ క్రితం పార్లమెంటు స్థాయీ సంఘం తీవ్రంగా విమర్శించింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్రం మంజూరు చేస్తున్న నిధులను రాబట్టడంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, త మిళనాడు ప్రభుత్వాలు పోటీపడుతుండగా అధికారికంగా కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకుండా మన రాష్ట్ర ప్రభుత్వం మురగబెడుతోంది. ప్రతి ఏటా ఎస్సీల నిధులు 15 వందల కోట్ల రూపాయలు, ఎస్టీల నిధులు 5 వందల కోట్ల రూపాయలు మిగిలిపోతున్నాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించారు. 

ఇలా మురిగిపోయిన, దారి మళ్ళిన కోట్లాది రూపాయలు ఇన్నేళ్లుగా ఎస్సీఎస్టీల వ్యక్తిగత, సాముదాయక అభివృద్ధి కోసం ఖర్చు చేయకపోవడం వల్ల వారి జీవితాలు ఇప్పటికీ దుర్భరంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసంఖ్యకు అనుగుణంగా షెడ్యూల్డ్ కులాలకు 16.2 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 6.6 శాతం నిధులను బడ్జెట్‌లో కేటాయించాలని, వారికి కేటాయించిన నిధులలో సగం వారి వ్యక్తిగత లబ్ధికి, నలభై శాతం వారి సాముదాయక అవసరాల కోసం ఖర్చు చేయాలని ఉప సంఘం సూచించింది. 

ఉప ప్రణాళికల అమలును పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా అత్యున్నత కమిటీ ఏర్పడుతుంది. ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిటీతో సహా జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలలో పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా వివిధ స్థాయిలో నిధుల వినియోగాన్ని పర్యవేక్షించాలని ఉప సంఘం సిఫార్సు చేసింది. అయితే రాజకీయ పరిపాలనా వ్యవస్థకు బడుగు బలహీన వర్గాల దృక్పథం ఉంటేనే నిధుల దుర్వినియోగం, దారిమళ్లింపులను అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. 

ఒక ప్రణాళిక లేదా సంక్షేమ కార్యక్రమాన్ని రూపొందించడం కంటే దాని ఫలాలు లక్షిత ప్రజల్లో చివరి వరకు చేరడం చాలా ముఖ్యం. స్వాతంత్య్రం అనంతరం రూపొందించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, దళిత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో రూపొందించిన మహత్తర సంకల్పాల్లో మెజారిటీ భాగం ఇప్పటిదాకా కాగితాలకే పరిమితమైపోయింది. సంక్షేమ కేటాయింపులు లక్షిత ప్రజానీకానికి చేరకుండా ఆవిరి కావడం వల్ల దళిత, బడుగు బలహీన వర్గాల ప్రజలు పేదరికం, వెట్టిచాకిరీ ఊబిలో కూరుకుపోయి ఉన్నారని ఎనిమిదేళ్ళ క్రితం జస్టిస్ పున్నయ్య కమిషన్ నివేదిక వెల్లడించింది. దళిత, ఆదివాసీ ప్రజల రాజ్యాంగ విహిత హక్కులు, సంకల్పాల అమలుకోసం పౌరసమాజం, దళిత, ఆదివాసీ సంస్థలు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. ఉపప్రణాళికలకు చట్టబద్ధత కల్పించడం కాదు, ప్రభుత్వాలకు ఆ చట్టాల్ని అమలు చేసే నిబద్ధత ఉండాలి.

Andhra Jyothi News Paper Dated : 29/08/2012

దళితులకు దారేది? - సుజాత సూరేపల్లి



ఒక్క అట్రాసిటీ కేసు బుక్ చేయించడానికి పెద్ద ఎత్తున పైరవీలు, ఉద్యమాలు చేసే పరిస్థితి దాపురించింది. ఇక దౌర్జన్యపరుడికి శిక్ష పడేదెప్పుడు? సిద్ధాంత రాద్ధాంతాలతో సమయం గడిపే మేధావి వర్గం లక్షింపేటలు జరిగినప్పుడు మాత్రం స్పందిస్తాయి. కానీ జరగబోయే లక్షింపేటలు ఎలా ఆపేది? రైట్, లెఫ్ట్ అని విడగొట్టబడి ఉన్న దళితులని ఐక్యం చేసేదెవరు? ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఇంకెప్పటికీ శాశ్వత నిద్రే. 

లక్షింపేట, నిద్రించి ఉన్న దళితులను లేపిందో, నిద్రలో నడుస్తున్న దళిత ఆక్రందనలను బయట ప్రపంచానికి తెలిపిందో, రాబోయే లక్షింపేటలెన్నో ఎన్నెన్నో అని ఒక హెచ్చరికనిచ్చిందో కానీ ఎక్కడ చూసినా ఏదో ఒక రూపేణా దళిత పదం 'వినిపిస్తూనే' ఉంది. అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది కూడా. మొన్నటికి మొన్న అంబేద్కర్ కార్టూన్‌పై దుమారం సుదీర్ఘ చర్చలకు తావునిచ్చింది. ఇంకోవైపు ఎప్పటికీ తరగని దళితులపై అత్యాచారాలు, పుంఖాను పుంఖాలుగా దళిత సాహిత్యం వెలువడుతూనే ఉంది. 

దళిత ఉద్యమాలున్నాయని ఒకరంటే, లేవని మరికొందరు, ఒకవేళ ఉంటే కేవలం క్రైం రికార్డులు తయారు చేసి, సంవత్సరానికి ఎన్ని హత్యలు, అత్యాచారాలు, లూటీలు అని లెక్కలు వేసి, బాధితులను చూపించి, పబ్లిక్‌గా వారిని ఏడిపించి, డ్రమ్ముల కొద్దీ కన్నీళ్లు కార్పించి, రకరకాలుగా ఫోటోలు చిత్రించి, ముక్కలు ముక్కలైన అంగాంగాలు ప్రదర్శించి కార్యక్రమాలు నడిపించడం, చెట్లను చూపించి కాయలమ్ముకుంటూ ఉండేవాళ్ళు కోకొల్లలు. 

మరికొందరు ఉద్యమాలు ఉవ్వెత్తున తరంగాల్లా లేచి పడుతున్నాయని అంటారు. వాటి రంగు రుచి వాసన ఎట్లా ఉంటుందో తెలుసుకోవడంలో ఇంకా మెథడాలజీలను కనుక్కొనేది మిగిలే ఉంది. మామూలు పరిశీలనా పద్ధతులు, పరిశోధనా అనుభవాలు ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి, అర్థం చేయించడానికి పనికిరావని చాలా వరకూ అర్థమైంది 

. అసలు దళిత అనే పేరు ఉండాలా వద్దా అని ఒక పెద్ద చర్చ. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎవరికీ స్వాతంత్య్రం, సమానత్వం అనే ప్రశ్నలు ప్రతి ఏటా వేసుకుంటూనే ఉన్నాం. భూమి కోసం, భుక్తి కోసం అని పొట్టచేతబట్టుకొని పశువుల కంటే హీనంగా అంగట్లో అమ్ముకొనే సరుకుగా తయారయిన దళిత ఒకవైపు, ఏసిీ రూముల్లో దళితులపై చర్చోపచర్చలు మరొక వైపు. ఒక విధంగా దళిత పేరు లేకుంటే ఇవ్వాళ ప్రభుత్వాలకు మనుగడ లేదు, స్వచ్ఛంద సంస్థలకు డబ్బులు రావు, అంబేద్కర్ బొమ్మలకు గిరాకీ ఎన్నడూ తగ్గదు. 

మూడు రంగుల కండువాలు, తెల్లటి ఖద్దరు చొక్కాలు, నుదిటి మీద ఎర్రని కుంకుమ బొట్లు, తళ తళ మెరిసే బ్రాస్లేట్లు, చైన్లు.. అంబేద్కర్ సంఘాలు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కమిటీలు.. మస్తీ మజాక్. యాభై ఆరు కులాలు, నూటొక్క సంఘాలు. ఈ మధ్య కాలంలో ఒక దళిత నాయకుడితో పెద్ద ఎత్తున దళితులతో ధర్నా చేయిద్దాం అంటే, ఇంకెక్కడి దళితులు మేడం, ఒక టీచర్స్ బాటిల్, ఏసిీ కార్, రెండు పూటల బిర్యానీ పెడితే గాని వచ్చే పరిస్థితిలో లేరు అన్నారు. 

దళితులకి సంబంధించిన ఏ అంశం తీసుకున్నా సమస్యే. గ్రామాలలో భూమిని నమ్ముకున్న దళితుల బతుకులు చితికిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా పేద రైతులు, భూమిని నమ్ముకుని, భూమి లేకున్నా దానిపై ఆధారపడ్డ రైతుల వెతలు తలచుకుంటే రాబోయే కాలంలో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో అని అనుమానం వస్తుంది. వాన్‌పిక్, కాకినాడ, రింగ్ రోడ్డు, ప్రాజెక్టులు, సెజ్‌లు ఇందు లేడు అని సందేహము వలదు, ఎక్కడ అభివృద్ధి పదం తీసినా ఒక దళితుడో, ఆదివాసీనో మొట్టమొదటగా బలి ఇవ్వబడును. 

ఎవడు అభివృద్ధి చెందుతున్నాడు అని లెక్కలు తీస్తే దోచుకునే వాడే ముందు ఉంటాడు. ఇదివరకు ఒక్కడు రోడ్ల మీద పనికిపోయి సంపాదిస్తే ఇపుడు మొత్తం కుటుంబం రోడ్ల మీదనే. భూమి విషయానికొస్తే, అసైన్డ్ ల్యాండ్ అనే చట్టం ప్రకారం దళితులకు ఇచ్చిన భూమి ఎప్పటికైనా ప్రభుత్వానిదే. ఒకడు సాయుధ పోరాటం అంటాడు. 

అంటే ఏమిటో అర్థం చేసుకునే లోపలే, ఆ సమస్య మాట్లాడిన వాళ్ళంతా విప్లవకారులైపోయి, హిట్ లిస్టులో ఉండి, పోలీస్‌స్టేషన్‌ల చుట్టూ తిరుగుతుండాలి. మరొకడు రాజ్యాధికారం అంటాడు. అందునా మాదిగలకే లేకపోతే మాలలకే ఓటు అని కూత పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. మరొకడు ఎంతొస్తే అంత చాలు, ప్రభుత్వ అండదండలతో ఉద్యమం నడపవలెను అంటాడు. అసలు ఉద్యమాలు ప్రభుత్వాలు నడపడం అనేది కొత్త కాన్సెప్ట్. 

కరీంనగర్/ఆదిలాబాద్ జిల్లాలో నా అనుభవంలో చూసినవి మచ్చుకి నాలుగు సంఘటనలు మీ ముందుచుతున్నాను. (1) గట్టు భూత్కూర్ గ్రామం. దాదాపు రెండు వందల మాదిగల ఇళ్లు. ఏ ఇల్లు చూసినా కూలిపోయి, పర్రెలు వాసి ఉన్నాయి. ఎవరి మొహం చూసినా పుట్టెడు దుఃఖం, కడుపు తరుక్కుపోతుంది. (2) గొల్లపల్లి, పెద్దపల్లి మండలం. గత ముప్పై ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమి, అందరూ మాదిగలే ఆ ఊర్లో. ఉన్నట్టుండి భూములకి ధరలు పెరిగాయి. 

ఒక రెడ్డి దొర ప్రత్యక్షమై దొంగ పత్రాలు సృష్టించాడు. (3) ఆదిలాబాద్, మంచిర్యాల, శ్రీరాంపూర్ గ్రామం. ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ వైబ్రేషన్‌తో ఇల్లు కూలి 9 ఏళ్ల పాప గత నెల జూలైలో చనిపోయింది. కంటి తుడుపుగా నాలుగు సంఘాల పర్యటన, నాలుగు ఫోటోలు, వార్తలు. సింగరేణి యాజమాన్యాన్ని అడిగిన దిక్కులేదు. (4) కరీంనగర్, ఆదిలాబాద్‌లలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద నిర్వాసితులు కానున్న దళితులూ కోకొల్లలు. ఎకరం కంటే తక్కువ భూమి ఉంటే దళితులకి పరిహారం లేదు, వస్తుందో రాదో తెలియదు. 

అటు చదువులేక, ప్రపంచ జ్ఞానం తెలియక, నాలుగు ముక్కలు చదువుకున్నోడు ఊరు బాగోగులు పట్టించుకోక అనాథలయ్యారు ఇవ్వాళ గ్రామాలలో ఉన్న దళితులు. అక్కడో ఇక్కడో ఒక్కడు ఒకవేళ పట్టించుకుంటే వాడు బతికి బట్ట కట్టడు. మాలలు, మాదిగలు ఇతర అన్ని చిన్న కులాల పరిస్థితి ఇంతే. అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాలు మాకొద్దు అని ప్రజలు మూకుమ్మడిగా చెబుతున్నారు. పెద్ద దళిత నాయకులు స్పందించరు. వారే కనుక ఖబడ్దార్! 

అని ఒక్క పిలుపునిస్తే దళితుల మీద ఇన్ని రకాల దోపిడీ జరుగుతుందా? కొత్తగా పంచే భూముల లెక్క తరువాత, కనీసం ఉన్న భూములు కాపాడుకోకపోతే ఈ ఉద్యమాలెందుకు? అటు తెలంగాణ సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, అందరూ ఆలోచించాల్సింది ఈ రోజు గ్రామాలలో దిక్కుతోచక బలైపోతున్న దళిత జీవితాలని. 

రకరకాల పేర్లతో వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న నాయకులు, అధికారులను హెచ్చరించలేని పరిస్థితిలో ఇవ్వాళ ఉద్యమాలు (ఉంటే) ఉన్నాయని మనం అనుకోవాలా? ఒక్క అట్రాసిటీ కేసు బుక్ చేయించడానికి పెద్ద ఎత్తున పైరవీలు, ఉద్యమాలు చేసే పరిస్థితి దాపురించింది. ఇక దౌర్జన్యపరుడికి శిక్ష పడేదెప్పుడు? సిద్ధాంత రాద్ధాంతాలతో సమయం గడిపే మేధావి వర్గం లక్షింపేటలు జరిగినప్పుడు మాత్రం స్పందిస్తాయి. కానీ జరగబోయే లక్షింపేటలు ఎలా ఆపేది? రైట్, లెఫ్ట్ అని విడగొట్టబడి ఉన్న దళితులని ఐక్యం చేసేదెవరు? ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఇంకెప్పటికీ శాశ్వత నిద్రే. 

దళితుల ఆత్మగౌరవం, సమానత్వం, హోదా గ్రామాలలో నిలబడాలంటే వారికి భూములు తప్పనిసరి. వారికి చదువులు తప్పనిసరి. మౌలిక సదుపాయాలు కలిగిన విద్యా వ్యవస్థ అవసరం. ముఖ్యంగా అసైన్డ్ భూములను కాపాడుకోకపోతే ఎంతో మంది దళితులు రోడ్లపాలవుతారు. ఇప్పుడున్న భూములను పట్టా చేసుకోలేకపోతే, మిగిలి ఉన్న భూములను పేద దళితులకి పంచకపోతే ఎన్ని ప్రభుత్వ పథకాలున్నా సున్నానే. జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించకపోతే జరిగేది పూడ్చలేని విధ్వంసం. 

ప్రతి గ్రామంలో దళాలుగా తయారయి మాల మాదిగ భేదాలు లేకుండా కలిసిపోయే సందర్భం, కష్టమే కావొచ్చు కాని అసాధ్యం మాత్రం కాదు. ఈ పేద దళిత కులాలతోటి కలిసి పోరాటం చేయకపోతే, ఇంక ముందుకు అడుగు వేసేది మాత్రం లేదు. ఎన్నికలప్పుడు వర్గీకరణలు, ఉద్యోగాలు అని ఓటు రాజకీయాలు కాకుండా దళితుల అభివృద్ధికి కృషిచేస్తూ ముందుకుపోకపోతే మరొక స్వత్రంత పోరాటం తప్పనిసరి అవుతుంది. 

నిజాయితీగా ఉన్న సంస్థలు లేవని కాదు కానీ ఒకటో రెండో ఉండడం వల్ల జరిగే నష్టాన్ని ఆపలేకపోతున్నాయి. పరిస్థితి ఈ విధంగా కొనసాగితే న్యాయం జరిగేది ఎన్నడు? ఎవరు బాధ్యత వహిస్తారు?
- సుజాత సూరేపల్లి 

Andhra Jyothi News Paper Dated : 29/08/2012

వికలాంగులు అభివృద్ధికి కృషి చేయాలి---పూల నాగరాజు



సమాజంలో అందరి కన్నా పేదవారు ఎవరైనా ఉన్నారంటే వారు వికలాంగులే. పాలక ప్రభుత్వాలు వారి అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజూ నాయకులు వికలాంగుల కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నా అవి ఎవరికి అందుతున్నాయి, వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతవరకు సాకారం అవుతున్నాయన్నది మాత్రం ప్రశ్నార్థకమే... చాలా సంవత్సరాలుగా వివక్షతకు, అన్యాయాలకు, ఆత్మన్యూనతా భావాలకు లోనై అనేక మంది వికలాంగులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. మహిళా వికలాంగులు అత్యాచారాలకు, హత్యలకు గురౌతున్నారు.

వికలాంగులు ఈ సమాజంలో మనుషులు కారా...? వారికి ఈ సమాజంలో స్థానం లేదా..? అంటే లేదనే సమాధనం చెబుతున్నాయి ఈ ప్రభుత్వాలు. ఒక వేళ స్థానం ఉంటే వికలాంగులను ఈ ప్రభుత్వాలు గుర్తించగలిగితే ఇప్పటికీ వికలాంగులు రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎంత మంది ఉన్నారో అధికారిక లెక్కలు చెప్పలేకపోతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు గడిచినా వికలాంగులు విద్యపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నారు. పాలకులు వికలాంగులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారు తప్ప వారి సంక్షేమానికి కృషిచేయడం లేదు.

వికలాంగులు చాలా సంవత్సరాలుగా కోరుతున్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రభుత్వ శాఖలో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండగా అది అమలు జరగడం లేదు. విద్యార్హతను బట్టి ఉద్యోగం, విద్యలేని వికలాంగులకు ప్రభుత్వం తరపున ఉపాధి చూపించి ధైర్యంతో జీవనం కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలి. వికలాంగుల న్యాయమైన డిమాండ్లు ముఖ్యంగా ఫించన్ రూ.2 వేలకు పెంచడంతో పాటు, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. వికలాంగుల శాఖకు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించి, ఐఏఎస్ కేడర్ అధికారిని కమిషనర్‌గా నియమించాలి.

వికలాంగులకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్లు 3 శాతం నుంచి 10 శాతం వరకు పెంచి పగడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికీ రెండెకరాల భూమి, గృహ వసతి, విద్యుత్, బియ్యం, రేషన్‌కార్డు అదితరాలు అందించాలి. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా వికలాంగులకు 150 రోజులు ఖచ్చితంగా పని కల్పించాలి. మహిళా సంఘాల మాదిరిగా వికలాంగులకు పావలా వడ్డీ రుణాలు అందజేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు వికలాంగులందరికీ అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
రా- పూల నాగజు

ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్

Andhra Jyothi News Paper Dated : 28/08/2012

వికలాంగుల వెతలు తీరేదెన్నడు ?----బిల్ల మహేందర్, బి. రాములు, లక్కిడ్డి సత్యం



handicapped
రాష్ట్రంలో వికలాంగుల సమస్యను గుర్తించి వారందరినీ ఐక్యం చేసిన ఘనత మందకృష్ణ మాదిగదే. వారి ఆధ్వర్యంలోనే హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం అనే మూడు నిర్దిష్ట లక్ష్యాలతో 2007 ఆగస్టు28న ‘వికలాంగుల హక్కుల పోరాట సమితి’ స్థాపించబడింది. నాలుగు నెల ల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా డివిజన్ స్థాయిలో పర్యటించి దాదాపు 151 వికలాంగుల చైతన్య సభలను నిర్వహించడం జరిగింది. అనంతరం సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో 2007 నవంబర్ 26న ‘వికలాంగుల మహాగర్జన’ బహిరంగ సభ విజయవంతమైంది. అదేరోజు వికలాంగుల మహాశక్తిని ఉద్యమ రూపంగా మలిచి జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద దాదాపు 15 గంటల పాటు ఆందోళన నిర్వహించారు. దీంతో మేల్కొన్న ప్రభుత్వం వికలాంగులను చర్చలకు ఆహ్వానించింది. వారి న్యాయమైన డిమాండ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో, ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించారు.

ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. దీంతో 2008 ఫిబ్రవరి 26న ‘వికలాంగుల విజృంభణ’ పేరుతో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం అదే రోజు తిరిగి చర్చలకు ఆహ్వానించింది. చర్చ ల్లో అన్ని డిమాండ్లపై సానుకూలత వచ్చినా, పెన్ష న్ పెంపుపై సందిగ్ధత నెలకొన్నది. దీంతో వికలాంగుల విజృంభణ పేరుతో 2008 మార్చి 31న వందలాదిమంది వికలాంగులతో పాటు మందకృష్ణమాదిగ కూడా దీక్ష చేపట్టారు. దీనిపై స్పందించిన వైఎస్ రాజశేఖర్‌డ్డి అసెంబ్లీ సాక్షిగా వికలాంగుల పెన్షన్‌ను 200 రూపాయల నుంచి వైకల్య శాతాన్ని బట్టి 500, 600, 700లకు పెంచుతూ ప్రకటన చేశారు. అయితే ప్రభుత్వం 600,700 రూపాయల పెన్షన్ అమలు చేయనేలేదు. పైగా క్యాంపు లు నిర్వహించి నకిలీ వికలాంగుల పేరుతో అర్హులైన లక్షలాదిమంది 500 రూపాయల పెన్షన్ ను కూడా రద్దు చేసింది. 

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల గురించి మాట్లాడే రాజకీయ నాయకులు వికలాంగుల సంక్షేమం గురించి మాట్లాడకపోవడం శోచనీయం. వికలాంగులను కేవలం ఓట్లుగానే పరిగణిస్తున్నారు. వారికి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో ప్రాధాన్యం కల్పించాలని ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించడం లేదు. దీంతో వారి సమస్యలపై చట్టసభల్లో గొంతెత్తే అవకాశం లేకుండాపోతున్నది. దీనితో వారి సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. సమస్యలను పట్టించుకున్న నాథుడు లేక సమస్యల వలయంలో వికలాంగులు విలవిలలాడుతున్నారు. సమాజంలో వికలాంగులు మిగతా వారితో సమానంగా, గౌరవం గా జీవించాలంటే ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్రాహం ఉండాలి. 

వారిని ఆదుకుంటామన్న భరోసా ఇవ్వాలి. కానీ ఆ దిశగా ప్రభు త్వం ఆలోచించిన దాఖలు కనిపించడం లేదు. అర్హులైన ప్రతి వికలాంగుడికి ఉచిత విద్య, వైద్యంతో పాటు గృహవసతి, విద్యుత్తు, ప్రయాణ తదితర సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. వాటితో పాటు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్‌ను 500 నుంచి 1500లకు పెంచాలి. అప్పుడే వారి జీవితాలు బాగుపడతాయి. జనాభా ప్రాతిపదికన వికలాంగులకు బడ్జెట్ కేటాయించి, ఆ మొత్తాన్ని వారి పురోభి వృద్ధికే ఖర్చుచేయాలి. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా వికలాంగ ఉద్యోగులకు ఉన్నత చదువుల కోసం వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలి. సమాజంలో వికలాంగులు వివక్షకు గురికుం డా అవమాన నిరోధక చట్టాన్ని అమలు చేయాలి. వికలాంగుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడమే కాదు, వాటిని చిత్తశుద్ధి తో అమలు చేయాలి. అలా చేసినప్పుడే వారు సమాజంలో మిగ తా వారితో సమానంగా సగౌరవంగా జీవించగలుగుతారు.

వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం మంత్రి సునీతా లకా్ష్మడ్డి అధ్యక్షతన ఏర్పడిన కమిటీ 19 సిఫార్సులతో కూడిన ఒక నివేదికను తయారు చేసి, ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో మహిళా వికలాంగులపై జరుగుతున్న వివక్షను అరికట్టడానికి అత్యాచార, అవమాన నిరోధక చట్టం తీసుకురావాలని సూచించింది. అర్హులైన వికలాంగులకు అసైన్డ్ భూములు ఇవ్వాలని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయినా ప్రభుత్వం వాటిని ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడుతూ.. వికలాంగులను నిర్ల క్ష్యం చేస్తున్నది. అంతేకాదు వీరి సమస్యలకు సంబంధించిన చర్చ లు నిర్దిష్టంగా జరగడం లేదు. దీనికంతటికి కారణం చట్టసభల్లో వికలాంగులకు తగిన ప్రాధాన్యం లేకపోవడమే. కాబట్టి వారికి చట్టసభల్లో ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలి.

రాజ్యాధికారంలో వికలాంగులకు సరైన భాగస్వామ్యం ఉన్నప్పుడే వారి సమస్యలు తర్వగా పరిష్కారమ య్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతి వికలాంగు డు కదం తొక్కాలి. ఈ న్యాయమైన ఉద్యమంలో రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకు లు, ప్రజాసంఘాలు, మేధావులు, మీడి యా వికలాంగులకు అండగా నిలవాలి. అప్పుడే వికలాంగుల సమక్షిగాభివృద్ధి సాధ్యమవుతుంది. వికలాంగుల న్యాయమైన హక్కులను సాధించుకోవడానికి చేసే ఈ మహోద్యమంలో అన్ని వర్గా ల వారు వికలాంగులకు తోడ్పడాలి. వారి పురోభివృద్ధికి చేయూతనివ్వాలి. వికలాంగులు సమాజంలో ఇతరులతో సమానంగా అన్ని రకాల గౌరవ ప్రాధాన్యాలు పొందా లి.వారు చేయగలిగే అవకాశమున్న ఉద్యోగాలలో వికలాంగులకే ప్రథమ ప్రాధాన్యమిచ్చి ఉపాధి కల్పించాలి. వికలాంగుల కోసం కొన్ని ప్రత్యేక ఉద్యోగాలను కేటాయించాలి. 
-బిల్ల మహేందర్, బి. రాములు, లక్కిడ్డి సత్యం
వికలాంగుల హక్కుల పోరాట సమితి
(నేడు నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ‘వికలాంగుల రాజ్యాధికార యాత్ర సభ’ సందర్భంగా)

Namasete Telangana News Paper Dated : 28/08/2012

అసోం హింసలో కుల కోణం - జిలుకర శ్రీనివాస్



కుల, మతాలకు అతీతంగా పౌరులకు రక్షణ కల్పించే బాధ్యతను రాజ్యాంగం ప్రభుత్వానికి అప్పగించింది. కానీ ఆధిపత్య కులాలే పాలనలో ఉండే చోట రాజ్యాంగం అమలు కాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే శక్తులకే ముస్లింలు, ఇతర మైనార్టీలు పట్టం కడితే వారికి ఎప్పటికీ రక్షణ దొరకదు. రాజ్యం విఫలమైన చోట ప్రజలు ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం నిలబడితేనే రాజ్యాంగం అమలవుతుంది. 

ప్రపంచంలోనే అత్యధిక పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకొనే మన దేశంలో కింది కులాలకే కాదు, ముస్లింలకూ విలువ లేదనీ రక్షణ లేదనీ గ్రహించటం చాలా సులువు. వలస పాలన కాలంలోనూ, వలసానంతర కాలంలోనూ పారుతున్న రక్తపుటేరులూ కోల్పోతున్న హక్కులూ గమనిస్తే ముస్లింలూ 'ప్రజాస్వామ్య బాధితు'లన్నది బోధపడుతుంది. అసోంలో ఉన్నది ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రభుత్వం. 

కేంద్రంలో అధికారం నెరుపుతున్నది కూడా ప్రజాస్వామ్య చట్రంలో ఎన్నుకున్న ప్రభుత్వమే. అసోంలో ముస్లింల ఊచకోత విషయం మీద అబద్ధాలదే పైచేయి. ఆ అబద్ధాలను సంఘ్‌పరివార్ మాత్రమే ప్రచారం చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ, కేంద్ర నిఘా సంస్థలూ, పాలక ప్రతిపక్ష పార్టీలూ మూకుమ్మడిగా కలిసి ప్రచారం చేయటమే అసోం మారణకాండ నేపథ్యంలో ఆవిష్కృతమైన భయంకరమైన దృశ్యం. అసోంలో పదేళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 

ఈ కాలంలోనే ముస్లింల మీద సుమారు మూడుసార్లు పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఆస్తుల విధ్వంసం, అమాయకుల ఊచకోత, నిరాశ్రయుల ఆక్రందనలన్నీ అంతిమంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఉపకరించాయి. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా, లేదా ముస్లింల మీద దాడులు జరిగినా అక్కడ బిజెపి కన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ లాభపడుతోంది. ముస్లింలను బుజ్జగించటం ద్వారా మస్లిం ఓట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ చూస్తుందని బిజెపి విమర్శించేది. 

అల్లర్లు జరగడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించటం ద్వారా ముస్లిం వ్యతిరేకతను ప్రదర్శించటం వల్ల కాంగ్రెస్ ఇతర మతాల ప్రజల ఆమోదాన్ని పొందుతుంది. అసోంలో గత మూడు దఫాలుగా పాలక కులాల నుంచి వచ్చిన తరుణ్ గొగొయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. కేవలం రెండు శాతం ఉన్న బ్రాహ్మణులు అసోంను ఇన్నేళ్ల నుంచి పాలించటం మత కలహాల - ఇతర కారణాలెన్ని వున్నా - వల్లే సాధ్యమైంది. మతతత్వాన్ని పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీని ముస్లింలు ఇంకా విశ్వసించటమే ఆ పార్టీకి బలం. 

అసోంను పాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అల్లర్లు జరగ్గానే శాంతి భద్రతలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సింది ఆ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం. అలాంటి చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహించటంలో ఆ పార్టీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ పాలకవర్గ స్వభావాన్ని ప్రదర్శించాడు. అల్లర్లను అణచివేసేందుకు తగిన సైనిక బలగాల్ని పంపాల్సిందిగా కేంద్రాన్ని ఆయన అభ్యర్థించిన నాలుగు రోజులకు గానీ రక్షణ దళాలు అసోం చేరుకోలేదు. 

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే సైన్యం రావటం ఆలస్యం అయిందనీ ఈలోగా జరగాల్సిన నష్టం భారీగానే జరిగిందని ఆయన అంగీకరించారు. తరుణ్ గొగొయ్ వాదన ప్రకారం దేశ ప్రధాని సకాలంలో స్పందించలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అసోం ఊచకోతల నుంచి ఏవో ప్రయోజనాలను ఆశించింది. అందుకే నేటికీ దాడులు కొనసాగేందుకు సహకరిస్తుంది. ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడైనా శాంతిని పునరుద్ధరించే యంత్రాంగం ఉన్న దేశంలో నెల రోజులుగా యథేచ్ఛగా మారణకాండ కొనసాగుతూ ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లిప్తంగా వ్యహరిస్తున్నాయి. పాలక కులాల ప్రయోజనాలే దీనికి కారణం. 

ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రచార ప్రణాళికను ప్రవేశపెట్టింది. అందులో అబద్దాలకే పెద్ద పీట వేసింది. అసోంలో స్థానికులకూ బంగ్లాదేశ్ నుంచి పెద్ద సం ఖ్యలో చొరబడిన అక్రమ వలసదారులకూ మధ్య ఘర్షణ జరుగుతుంది. కాబట్టి దీన్ని మతాల మధ్య సంఘర్షణగా చూడరాదు. ఈ అబద్ధాన్ని కాంగ్రెస్ చెబితే ఎవరూ నమ్మరు. అసోంలో ఎల్‌కే అద్వానీ నోటివెంట ఈ అబద్ధాన్ని పలికించారు. మీడియా దీనికి విస్తృత ప్రచా రం కల్పించింది. కేంద్ర నిఘాసంస్థలూ దీనికి వత్తాసు పలికాయి. 

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రజల వల్లే సమస్య తలెత్తితే, దాని గురించి మాట్లాడే బాధ్యత ఆ దేశ పాలకుల మీద ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ ప్రభుత్వం తన పౌరుల రక్షణ గురించి ఎలాంటి విన్నపమూ చేయలేదు. కాబట్టి ఇది అక్రమ, సక్రమ చొరబాటుదారులు/వలస వచ్చిన వారికి సంబంధించిన సమస్య కాదు. కోక్రఝార్ జిల్లా పశ్చిమ బెంగాల్‌కు సరిహద్దు జిల్లా. బంగ్లాదేశ్‌తో ఈ జిల్లాకు ఉన్న సరిహద్దు కూడా కొండలూ గుట్టలతో నిండి ఉంటుంది. పైగా సరిహద్దు జిల్లాలో నిఘా చాలా పటిష్టంగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే అసోంలో ముస్లింల ఊచకోత గురించి ఎస్ఎంఎస్‌ల రూపంలో జరిగిన ప్రచారాన్ని పాకిస్తాన్ కుట్రగా వక్రీకరిస్తూ కేంద్రం అమాయక ముస్లిం యువకులను అరెస్ట్‌చేసి చిత్రహింసల పాల్జేస్తోంది. 

వాస్తవానికి అసోంలో ఏం జరిగింది? జూలై 19న కోక్రఝార్ జిల్లాలో ఒక దళిత యువతి మీద అత్యాచారం చేసి హతమార్చారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ ముస్లింలూ, దళితులూ ఆందోళనకు దిగారు. ఆ తర్వాత అది హింసాత్మక రూపం తీసుకుంది. బోడోలాండ్ ఉద్యమం గిరిజనులు చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. కాని, బోడోలాండ్ ఉద్యమం అగ్రకులాలది. ముఖ్యంగా బ్రాహ్మణవాదుల నాయకత్వంలో నడిచిన ఈ ఉద్యమం బిటిసి ఏర్పాటుకు దారితీసింది. 

బిటిసి పరిధిలో ఉన్న బోడోల సంఖ్య కేవలం 20 శాతమే. కానీ బిటిసి పరిధిలోని ప్రజల జీవితాన్ని ఈ సాయుధ ముఠా నియంత్రిస్తుంది. బ్రాహ్మణవాదుల ప్రయోజనాలు నెరవేర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ సంస్థ ముస్లిం వ్యతిరేకతతో నిండిపోయింది. అగ్రకుల ఆధిపత్యాన్ని అసోంలో 40 శాతం పైగా ఉన్న ముస్లింలు, 9 శాతం పైగా ఎస్సీలు కలిసి ఎదిరిస్తున్నారు. ముస్లింలు, ఎస్సీల మధ్య సామాజిక, రాజకీయ సంబంధాలు బలంగా పెనవేసుకొని ఉన్నాయి. 

ఈ రాజకీయ ఐక్యత బిజెపికి పెద్ద సవాలుగా మారింది. మనువాద కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం బిటిసి అన్ని విధాల పనిచేయటం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముస్లిం, ఎస్సీల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీస్తే తప్ప కాం గ్రెస్ పార్టీతో సహా సంఘ్‌పరివార్ ఆర్ధిక, మతరాజకీయ ప్రయోజనాలు నెరవేరవు. అందుకే ముందు ఎస్సీ అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేశారు. ఆ సంఘటనను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ముస్లిం, ఎస్సీల మీద సామూహిక నరమేధాన్ని ప్రారంభించారు. 

అసోంలో జరుగుతున్న రాజ్య ప్రాయోజిత (స్టేట్ స్పాన్సర్డ్) దమనకాండను వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో ముస్లింలు నిరసనకు దిగితే గుర్తు తెలియని అల్లరి మూకలు హింసకు దిగారు. పోలీసులే అలాంటి హింసాత్మక కార్యక్రమానికి దిగారని ఆరోపణలు వస్తున్నాయి. ముస్లింలను బద్నాం చేసేందుకే ముంబై పోలీసులు శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని హింసాత్మకంగా మార్చారని సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ ఆరోపిస్తోంది. 

తెలంగాణ ఉద్యమంలోనూ మఫ్టీలో ఉన్న పోలీసులు అలాంటి సంఘటనలకు ఎన్నో మార్లు పాల్పడ్డారు. కాబట్టి వారి ఆరోపణలను కొట్టిపారేసే వీలు లేదు. దేశ వ్యాప్తంగానూ, మన రాష్ట్రంలోనూ వివిధ సంఘాలూ పౌరసమాజమూ అసోం మారణకాండ మీద స్పందించక పోవడానికి కుహానా దేశభక్తి కారణం. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, వలసవాదులు అనే భ్రమలో వుండటం ఆ కుహాన దేశభక్తికి మూలం. బంగ్లాదేశ్ నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చిన వారిలో కేవలం ముస్లింలు మాత్రమే ఉన్నట్టు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. అధికారికంగా వలస వచ్చిన వారిలోనూ, అక్రమంగా వలస వచ్చిన వారిలోనూ ముస్లింయేతరులు పెద్దసంఖ్యలో ఉన్నారు. 

సరిగ్గా అసోంలో ముస్లింల మీద దాడులు జరుగుతున్న సందర్భంలోనే మరో వాదనను మీడియా చర్చకు పెట్టింది. పాకిస్తాన్‌లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయనీ, యువతులను అపహరించి బలవంతంగా మతమార్పిళ్లు చేసి వివాహం చేసుకుంటున్నారనే వదంతులను జాతీయ మీడియా ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ నుంచి హిందువులు ఇండియాకు వచ్చి సిర్థపడేందుకు శాశ్వత వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారనీ, కృష్ణాష్టమి సందర్భంగా ఇండియాకు వస్తున్న హిందువులను నిర్భంధించారని ఇంగ్లీషు మీడియా చర్చలు నిర్వహించింది. 

కరాచీ నుంచి వచ్చిన ఒక యువతితో టీవీలో మాట్లాడించారు. కరాచీలో ముస్లింయేతరులకు ఎలాంటి ఇబ్బందులు లేవనీ, హిందూ మహిళల మీద దౌర్జన్యాలు జరగటం లేదనీ, బలవంతపు మత మార్పిళ్లు గానీ, అపహరణలు గానీ జరగటం లేదనీ ఆ యువతి చెప్పటంతో టీవీ చర్చలో పాల్గొన్న వారందరూ తెల్లబోయారు. ఈ విధంగా జాతీయ మీడియాలోనూ ప్రాంతీయ మీడియాలోనూ ఒక్కసారిగా పాకిస్తాన్‌లో హిందువుల సమస్యను చర్చకు తీసుకురావడంలో అస్సాం హత్యాకాండను సమర్ధించుకొనే ఎత్తుగడను బ్రాహ్మణ పాలక వర్గం అనుసరిస్తుంది. 

బోడోలాండ్ స్వయం ప్రతిపత్తి గురించి కూడా ఇప్పుడు చర్చ తీవ్రమైంది. బిటిసిని రద్దుచేయాలనే డిమాండ్ కూడా తెరమీదకు వచ్చింది. బోడోలు ఒకే ఒక తెగ కాదు. అనేక తెగల సమాహారం. నిజానికి బోడోలను ఒక తెగగా పరిగణించాలా లేదా అనే విషయం మీద శాస్త్రీయమైన అధ్యయనం జరగాలి. బోడోలు బ్రాహ్మణ ధర్మాన్నే ఆచరిస్తారు. ఆచార వ్యవహారాలు, ఇంటి పేర్లు చాలా వరకు కుల వ్యవస్థను పోలి ఉంటాయి. బోడో లిబరేషన్ టైగర్స్ చేసిన సాయుధ పోరాటం కేంద్ర ప్రభుత్వంతో ఒక రాజీకి దారితీసింది. 

అదే బోడోలాండ్ టెర్రిటరీ కౌన్సిల్ అనే సంస్థ ఏర్పాటుకు దారితీసింది. బోడోల జన సంఖ్య బిటిసి పరిధిలో 20 శాతానికి మించి లేదు. వలస పాలన కాలం నుంచి కూడా బోడోయేతరులదే ఆధిక్యం. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం అసోం షెడ్యూల్డ్ ఏరియాలో ఉండటం కూడా బోడోలాండ్ డిమాండ్‌కు తోడ్పడింది. బిటిసి ఏర్పాటులో ప్రభుత్వం అశాస్త్రీయ పద్ధతులు అనుసరించటం, బోడోయేతరులు అధిక సంఖ్యలో ఉన్న జిల్లాలను కూడా బిటిసి పరిధిలోకి తీసుకురావడం, అధిక సంఖ్యలో ఉన్న బోడోయేతర కులాలకూ మతాలకూ బిటిసిలో చోటులేకపోవడం, వారి రాజకీయ హక్కులన్నీ నియంత్రణకు గురికావటం దీర్ఘకాలిక సమస్యలకు మూలమైంది. 

దీనికి తోడు బోడో లిబరేషన్ టైగర్స్ నుంచి ఆయుధాలు జప్తు చేయకపోవటం బోడోయేతర సమూహాలకు పెద్ద ప్రమాదంగా మారింది. అలాంటి పరిస్థితిని ఆ రాష్ట్రంలోని పాలక కులాలు పెంచి పోషిస్తున్నాయి. బిటిసి పరిధిలో ఉన్న ప్రాంతాల్లో గిరిజన సంస్కృతిని కాపాడే ఎలాంటి చర్యలూ చేపట్టకపోగా బ్రాహ్మణ ధర్మాన్ని హిందూ మతం పేరుతో విస్తృతంగా వ్యాపించే చర్యలు చేపట్టింది. ఈ వైఖరి వల్ల మనువాద తీవ్రవాద సంస్థలు బిటిసి పరిధిలో ఉన్న గిరిజనులను ముస్లిం, ఎస్సీ వ్యతిరేకులుగా మార్చే కార్యక్రమాలు చేపట్టాయి. 

ప్రభుత్వ సహకారంతో వాటి ప్రభావం విస్తరించింది. లక్షలాది మంది నిరాశ్రయులు కావడానికీ ఎంతో మంది చనిపోవడానికీ కారణమైంది. తెలంగాణ ఉద్యమానికి బోడోలాండ్ పట్ల సానుభూతి ఉంది. రేపు తెలంగాణలోనూ బోడోలాండ్ పునరావృతం కాదనే నమ్మకమేమీ లేదు. తెలంగాణవాదులు కూడా అసోం ఊచకోతపై మౌనం వెనుక అర్థమేమిటో ముస్లింలకు సులువుగానే బోధపడుతుంది. 

కుల, మతాలకు అతీతంగా పౌరులకు రక్షణ కల్పించే బాధ్యతను రాజ్యాంగం ప్రభుత్వానికి అప్పగించింది. కానీ ఆధిపత్య కులాలే పాలనలో ఉండే చోట రాజ్యాంగం అమలు కాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే శక్తులకే ముస్లింలు, ఇతర మైనార్టీలు పట్టం కడితే వారికి ఎప్పటికీ రక్షణ దొరకదు. రాజ్యం విఫలమైన చోట ప్రజలు ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం నిలబడితేనే రాజ్యాంగం అమలవుతుంది.
- జిలుకర శ్రీనివాస్
బహుజన్ అకడమిక్స్ అండ్ రీసెర్చ్ సెంటర్

Andhra Jyothi News Paper Dated: 28/08/2012

Saturday, August 25, 2012

లక్షింపేటా..! - డా.సి.కాశీం


లక్షింపేట.. లక్షింపేట
నిన్నేమని పిలువాలి తల్లీ
కళ్ళు తెరిచినా మూసినా
దృశ్యం చెదిరిపోవటం లేదు
కలత నిద్రలోంచి- చావు వాసన వస్తుంది
కనుగుడ్లు చిమ్మిన రక్తంతో
నీ మట్టి గడ్డ కట్టింది
మునివేళ్లతో మట్టిని తాకుదామంటే
మానవ కంకాళాలు కన్పిస్తున్నాయి
నీతో సంభాషించాలంటే
కత్తుల భాషను చూసి భయమేస్తుంది
నీ గర్భంలో పాతిపెట్టుకున్న నమ్మకాన్ని
వేకువజాము కోయిల పాట సాక్షిగా నరికివేసారు
కత్తి మొనకు నిప్పులు రాలుతుంటే
మాల తల్లుల చెంపల మీద
సముద్రాలు పారుతున్నాయి
ఇక్కడ భూమి కడుపులో
కళ్లు పెట్టి చూడటమే నేరమైంది!
లక్షింపేటా..!
నేను లేగదూడ కంటిలో దుఃఖాన్ని చూసాను
చెట్టుపై వాలిన కాకి శోకాన్ని విన్నాను
అపుడే ప్రసవించిన మేకపిల్ల- అరుపు ఆగిపోయింది
తల్లికోడి రెక్కల చాటున దాగిన
కోడిపిల్లల భయాన్ని కనుగొన్నాను
వంశధార నది అలలపై
పారుతున్న రక్తాన్ని చూసి
సూర్యుడు మూర్ఛపోయాడు
బొడ్డులో దిగిన బాకుపోటు నుంచి తేరుకొనక ముందే
కనుపాపలు కత్తికి వేలాడుతున్నాయి
మరణ వాంగ్మూలం- పెదాలకు చేరకముందే
నాలుక తెగిపోయిన దృశ్యం
లక్షింపేటా..! నీ జ్ఞాపకాల సందు నుంచి
ఒక దుఃఖం పొగిలి పొగిలి నడుస్తుంది
చరిత్ర పాన్పు మీద
తగలబడుతున్న భర్త కోసం భార్య
జీవిత మాన్యాల మీద- వాలిపోయిన బిడ్డ కోసం తల్లి
గొడ్డలి కొస నుంచి
కారుతున్న అన్న రక్తంబొట్టు కోసం చెల్లి
మాంసం ముద్దలను పోల్చుకోలేక
పిచ్చివాళ్లలా తిరుగుతున్నారు
మొగలిరేకుల లక్షింపేట వనంలో
నాలుగు మొండాలు వేలాడాయి
పుట్టిన తారీఖులు లేని వాడని తల్లీ
ఈ నేల మీద ఎన్నిసార్లు- చంపబడ్డానో
చార్వాకుడి నుంచి సంగమేసు వరకు- చరిత్రే సాక్ష్యం
మూడు దశాబ్దాల క్రితం
నేను కారంచేడును
ఇప్పుడు- నెత్తుటి ముగ్గేసిన లక్షింపేటను
ఎన్నిసార్లు చంపినా
నేనొక ఫీనిక్స్‌ను

- డా.సి.కాశీం
97014 44450

Friday, August 24, 2012

గిరిజనం ఐక్యతే విముక్తికి బాట ----గటిక విజయ్ కుమార్



సరిగ్గా పదిహేడేళ్ల కిందట హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బీఎస్పీ బహిరంగసభలో అప్పటి ఆ పార్టీ అధ్యక్షుడు కాన్షీరాం పాల్గొన్నారు. పెద్దగా ప్రచారం లేకున్నా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులు పెద్ద సంఖ్యలో ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్‌లాగే, దక్షిణ భారత దేశం లో ముఖ్య రాష్ట్రమైన ఆంధ్రవూపదేశ్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆ సభ విజయంతో అనిపించింది. 

బహుజనులకు రాజ్యాధికారం నినాదంతో కాన్షీరాం దేశవ్యాప్తంగా తిరిగారు. ఉత్తర ప్రదేశ్‌లో ఆయన శిష్యురాలు మాయావతి ప్రకంపనలు సృష్టించారు. అగ్రవర్ణాలను కాదని 1995 జూన్‌లో మాయావతి యూపీ 
ముఖ్యమంత్రి అయ్యారు. దానికి కొద్ది నెలల ముందే ఇటు ఆంధ్రవూపదేశ్‌లో ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నన్నాళ్లూ కమ్మలు, అదీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులదే అధికారమని జనం నిర్ధారణకు వచ్చారు. అంతకుముందు ఐదేళ్లు పాలించిన కాంగ్రెస్‌పై కూడా బహుజనులకు నమ్మకం పోయింది. కాంగ్రెస్ అయితే రెడ్లకు, తెలుగుదేశం అయితే కమ్మలకు అధికారం అనే భావన ఏర్పడింది. ఈ సమయంలోనే కాన్షీరాం ప్రయోగం యూపీలో విజయవంతం కావడంతో బహుజనులకు, ముఖ్యంగా దళితులకు రాజ్యాధికారం దక్కించుకుంటామనే నమ్మకం ఏర్పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలిస్తే అధికారం చేజిక్కించుకోవచ్చనే కాన్షీరాం మాటలకు ప్రాధాన్యం ఏర్పడింది. 

సరిగ్గా అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. దళితులు రాజకీయశక్తిగా మారుతున్న సమయంలోనే వర్గీకరణ అంశం ముందుకు రావడం అప్పటి పాలకుల కుట్ర అనే అనుమానాలు, విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఏదిఏమైనా మాల, మాదిగల మధ్య విభేదాలు పెరిగాయన్నది నిజం. దళితులు రెండు వర్గాలు గా చీలిపోయారు. దీంతో ‘దళితులకు రాజ్యాధికారం’ అనే నినాదమే కనుమరుగైపోయింది. సమీప భవిష్యత్‌లో కూడా బహుజన ఎజెండాతో ఓ రాజకీయ పార్టీ మనుగ డ సాధించే అవకాశాలు కనిపించడం లేదు. 

పదిహేడేళ్ల కిందట రిజర్వేషన్ అనుభవించే విషయంలో మాల, మాదిగలకు గొడవ వచ్చిన విధంగానే, ఇప్పుడు ఎస్టీ తెగల్లో కూడా విభేదాల విష బీజం నాటుకుంటోంది. ఇది పెరిగితే రాష్ట్రంలో దళితశక్తి బీటలు వారినట్లే, గిరిజనశక్తి కూడా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉన్నది. 2008 డీఎస్సీ ద్వారా ఏజెన్సీలో టీచర్ల నియామకాలు, హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ విషయంలో వివాదం ఉన్నది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు ఇవ్వాలనే నిబంధనలున్నాయి. అయితే ఎవరు స్థానికులు అనే అంశంపై ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా చెప్పినప్పటికీ లంబాడాలు, కోయల్లో ఈ విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. 

1950కి ముందు నుంచి ఏజెన్సీలో ఉన్న వారే స్థానికులని జీవో3 చెబుతుంది. కాబట్టి ఇతరులు ఎస్టీలు అయినప్పటికీ వారు ఈ పోస్టులకు అర్హులు కాదన్నది ఒక తెగ వాదన. ఎస్టీ రిజర్వేషన్‌పొందే విషయంలో తెగల పట్టింపు ఉండాల్సిన అవసరంలేదని మరో తెగ అభివూపాయం. ఈ వివాదం రెండు తెగ ల మధ్య చిచ్చు పెట్టింది. కోయలు, లంబాడాలు పెద్ద సంఖ్యలో ఉన్న వరంగల్ లాంటి జిల్లాలో అయితే పరిస్థితి విషమిస్తోంది. ఒక తెగకు వ్యతిరేకంగా మరో తెగ రోడ్డెక్కుతున్నది. లంబాడాలను ఎస్టీల జాబితా నుంచే తొలగించాలని కోయలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గిరిజనుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్న జీవోలను రద్దు చేయాలని లంబాడాలు కోరుతున్నారు. కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లోనే షెడ్యూల్ తెగల జాబితా ఉన్నది. 1976లో మన రాష్ట్రంలోని లంబాడ, యానాది, ఎరుకల కులస్తులను కూడా ఎస్టీలలో చేర్చారు. తద్వారా ఎస్టీలకు రాజ్యాంగం కల్పిస్తున్న అన్ని అవకాశాలు, హక్కులు ఈ కులాలకు కూడా సంక్రమించాయి. దేశవ్యాప్తంగా 620 జిల్లాల్లో 574 తెగలకు సంబంధించిన దాదాపు పదికోట్ల మంది గిరిజనులున్నారు. తెగలు వేరైనా వీరంతా షెడ్యూల్డ్ తెగల గొడుగు కింద ఉండబట్టే సంఖ్యా బలాన్ని చూసైనా ప్రభుత్వం వీరికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల్లో గిరిజనులే ముఖ్యమంవూతులవుతున్నారు. మన రాష్ట్రంలో కూడా తెగలన్నీ కలవడం వల్ల గిరిజనుల సంఖ్య ఎక్కువైంది. ఫలితంగా 19 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాదాపు 80 నియోజకవర్గాల్లో ఎస్టీలు నిర్ణయాత్మకశక్తిగా ఉన్నారు. ఐక్యత దెబ్బతింటే అది సాధ్యం కాదు. 

ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలవుతాయి కాబట్టి ఒక తెగ మరో తెగకు పోటీ కాదు. ఇప్పుడున్న ప్రజావూపతినిధుల్లో సైతం అందరూ ఒకే తెగవారు లేరు. అయినా సరే వారందరూ ఎస్టీల్లోని అన్ని తెగలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లా ములుగులో కోయలు, లంబాడీలు దాదాపు సమంగా ఉంటారు. అక్కడ లంబాడీ, కోయ నాయకులను ఎన్నుకున్న చరిత్ర ఉంది. అలాగే రాష్ట్రంలోని చాలాచోట్ల లంబాడ, కోయ, కొండడ్లు ఇలా తెగల తేడా లేకుండానే ఎస్టీలలోని ఏ తెగ అయినా సరే గిరిజనం వారిని తమ ప్రతినిధిగా ఎన్నుకుంటోం ది. అంతెందుకు... వరంగల్ జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువ కావడం వల్ల జనరల్ సీట్లలో కూడా గిరిజనులు ప్రాతినిధ్యం వహించారు. వరంగల్ ఎంపీ స్థానం జనరల్‌గా ఉన్నప్పుడు చందూలాల్, రవీంవూదనాయక్ గిరిజనేతరులపై గెలవగలిగారు. జనరల్ స్థానమైన డోర్నకల్ ఎమ్మెల్యేగా డీఎస్ రెడ్యానాయక్ నాలుగుసార్లు గెలవడానికి కార ణం గిరిజనుల మధ్య ఐక్యతే. ఇప్పుడు చిన్ని చిన్న అంశాలపై ఉన్న విభేదాలు తెగల మధ్య అంతరం పెంచితే ఈ ఐక్యత దెబ్బతింటుంది. తద్వారా గిరిజనులకు రావాల్సిన అవకాశాల శాతం తగ్గుతుంది. తెగల మధ్య ఐక్యత పెంచుకుని ప్రభుత్వం నుంచి మరిన్ని అవకాశాలు పొందేలా, హక్కులను కాపాడుకునే విధంగా గిరిజనులు ఐక్యంగా ముందుకు సాగాలి. 

స్థానికత విషయంలో కూడా ఎక్కువ రాద్ధాంతం చేస్తే అది 1/70 చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మేలు కలుగుతుంది. అనాదిగా అడవిని నమ్ముకున్న గిరిజనులకే అవకాశాలు రావాలని, గిరిజనులందరికీ అన్ని అవకాశాలు రావాలనడంలో తప్పులేదు. స్థానికత విషయంలో నిబంధనలను మార్చితే ఆంధ్రవూపాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా భవిష్యత్తులో వారే స్థానికులని చెప్పుకొనే ప్రమాదం ఉన్నది. అప్పుడు అడవిపైనే కాదు, గిరిజనులు బతుకుపై కూడా హక్కులు కోల్పోతారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మైదాన ప్రాంత ఐటీడీఏ ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు పెరిగేలా చూడాలి. తెగల మధ్య విభేదాలు వస్తే వీరి ఉనికికి కూడా ప్రమాదమ నే విషయం గమనించాలి. వలసవాదులంటూ ఒక తెగ మరోతెగను విమర్శించుకునే బదులు గోదావరి వెంట గిరిజనుల భూములను ఆక్రమించుకున్న సీమాంధ్ర వలసవాదులకు వ్యతిరేకంగా పోరాడాలి. మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో గిరిజనులకు సంబంధించిన అన్ని తెగలు పాల్గొంటున్నాయి. వీరి మధ్య చిచ్చుపెట్టడం ద్వారా మెజారిటీ సెక్షన్‌ను నిర్వీర్యం చేయడం సీమాంవూధుల లక్ష్యం గా కనిపిస్తున్నది. దానికి ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం కూడా ఉన్నది. 

ప్రవీణ్ నాయక్ నుంచి భోజ్యానాయక్ వరకు 50 మందికి పైగా గిరిజన యువకులు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటే శ్రీకృష్ణ కమిటీ నివేదిక దాన్ని గుర్తించలేదు. కాపీ చాలాకొద్ది మంది మాత్రమే మన్యసీమ రాష్ట్రం డిమాండ్ చేస్తే, శ్రీ కృష్ణ కమిటీ నివేదికలో గిరిజనులు తెలంగాణ కోరుకోవడం లేదని రాశారు. అంటే చిన్న విభేదాన్ని కూడా వలస పాలకులు తమకు అనుకూలంగా మలుచుకోగలరనే విషయం గుర్తెరగాలి. గిరిజనుల మధ్య చిచ్చుపెట్టి ప్రయోజనం పొందాలని ప్రభుత్వం, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే పెత్తందారులు కాచుకు కూర్చున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్, కొమురంభీం, సమ్మక్క సారల మ్మ వారసులైన గిరిజనులు దోపిడీదారులకు ఆ అవకాశం ఇవ్వద్దు. ఐక్యంగా పోరాడి విముక్తి వైపు పయణించాలి.

-గటిక విజయ్ కుమార్
టీన్యూస్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్

Namasete Telangana News Paper Dated : 25/08/2012 

Other Articles

Thursday, August 23, 2012

సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..---డి మార్కండేయ


సోని సోరి.. రాజ్యహింసకు పరాకాష్ఠ..
‘యువరానర్! ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ పుణ్యమే. తగిన సమయంలో మీరు జోక్యం చేసుకున్నందునే పోలీసు చిత్రహింసల గాయాల నుంచి నేను కోలుకున్నాను. అయితే, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి తిరి గి వచ్చిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.రాయ్‌పూర్ జైలులో నాపై వేధింపులు, చిత్రహింసలు రెట్టింపయ్యాయి. నగ్నంగా కూర్చోబెడుతున్నారు. తనిఖీల పేరుతో శరీరభాగాలను తడుముతున్నారు. బూతులు తిడుతున్నారు. ఆకలితో మాడ్చుతున్నారు. మందులు తేవడం లేదు. ఆస్పవూతికి తీసుకెళ్లడం లేదు. చిత్రవధ చేస్తున్నారు. నా మానమర్యాదలను మంటగలుపుతున్నారు. నేనేం తప్పు చేశాను యువరానర్? నా హక్కుల రక్షణకై గొంతెత్తడమే నేర మా? పోలీసుల అకృత్యాలను మీ దృష్టికి తేవడమే ద్రోహమా? ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి నాపై ఎందుకింత కక్ష? ఇంతకంటే మీరు నాకు మరణశిక్ష వేసి నా బాగుండు.. ఇక్కడ నన్ను చంపేటట్టున్నారు.. కాపాడండి!’

పోలీసుల దౌష్ట్యానికి బలైన ఆదివాసీ మహిళ సోని సోరి జైలు నుంచి సుప్రీంకోర్టుకు ఇటీవల రాసిన లేఖ సారాంశమిది. పది నెలలకు పైగా ఛత్తీస్‌గఢ్ పోలీసుల చేతుల్లో నరకయాతన అనుభవిస్తున్న ఈ ప్రభుత్వోపాధ్యాయురాలిపై 2011 సెప్టెంబర్ చివరలో మావోయిస్టు పార్టీకి కొరియర్‌గా పనిచేస్తోందన్న ఆరోపణలను పోలీసులు నమోదు చేశారు. మేనల్లుడు లింగారాం కొడిపె తదితరులతో కలిసి మైనింగ్ కంపెనీ ఎస్సార్ నుంచి ఆమె రూ. 15 లక్షలు స్వీకరించి నక్సలైట్లకు చేరవేసిందని కేసు పెట్టి వారంటు జారీ చేశారు. తనకే పాపం తెలీదన్న సోని మొరను ఎవరూ ఆలకించకపోవడంతో జాతీయ మీడియాను ఆశ్రయించింది. పోలీసులు మోపిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని మొత్తుకుంది. కొందరు మిత్రుల సలహా మేరకు ఢిల్లీ వెళ్లింది. ఛత్తీస్‌గఢ్ పోలీసుల నుంచి రక్షణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయ సిద్ధమైంది. ఈ లోపలే ఉప్పందుకున్న ఆ రాష్ట్ర పోలీసులు దేశ రాజధానిలో అక్టోబర్ 4న ఆమెను అరెస్టు చేశారు. కోర్టులో పోలీసు కస్టడీ కి అనుమతి పొంది దంతేవాడకు తీసుకువచ్చారు. రెండురోజుల పాటు లాకప్‌లో నిర్బంధించి తీవ్రమైన చిత్రహింసలకు గురి చేశారు. లైంగికదాడికి పాల్పడ్డారు.

జననాంగంలోకి బలవంతంగా లాఠీలను, రాళ్ల ను చొప్పించారు. కరెం టు షాకులిచ్చారు. తిండి పెట్టకుండా ఆకలికి మాడ్చారు. సుప్రీంకోర్టు కు వెళతావా అంటూ దంతేవాడ ఎస్పీ అంకిత్ గార్గ్ ఆమెపై విరుచుకుపడ్డాడు. బట్టలు విప్పించి బూతు పదజాలం తో అవమానించాడు. తీవ్ర గాయాలతో నడవలేని స్థితిలో ఉన్న సోనిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్న ట్లు, ఎలాంటి గాయాలు లేనట్లు ప్రభుత్వాస్ప త్రి వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్నే మేజిస్ట్రేట్ నమ్మారు. రాయపూర్ జైలుకు పంపారు. 

చేయని నేరానికి తనకీ శిక్ష ఏమిటంటూ, థర్డ్ డిగ్రీ పద్ధతులను ప్రయోగించిన పోలీసుల పాశవికత్వాన్ని నిరసిస్తూ సోని అక్టోబర్ 11న జైలులోనే ఆమరణదీక్ష ప్రారంభించింది. పోలీ సు హింస, ఆమరణ దీక్ష సోనిని మృత్యువు అంచుల్లోకి తీసుకెళ్లాయి. చివరకు కోర్టు ఆదేశాల మేరకు అదే నెల 26న ఆమెను జైలు అధికారులు కోల్‌కతా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్ట ర్లు ఆమె జననాంగంలో, రెక్టమ్‌లో మూడు రాళ్లను గుర్తించి తొలగించారు. వెన్నెముకపై, ఇతర శరీరాంగాలపై గాయాలను కనుగొన్నారు. నెల రోజుల చికిత్స అనంతరం తిరిగి సోని రాయ్‌పూర్ జైలుకు చేరింది. అయితే, ఛత్తీస్‌గఢ్ సర్కారు ఆదేశాల మేరకు జైలు అధికారులు ఆమె ను హింసించడాన్ని కొనసాగించారు. తిండి పెట్టకుండా, మందులు అందించకుండా చీటికి మాటికి నక్సలైటువంటూ వేధించారు. నెల తర్వాత కోల్‌కతా కు తీసుకెళ్లాల్సివుండగా పట్టించుకోలేదు. తీవ్ర రక్తవూసావమవుతున్న పరిస్థితుల్లో సోని ఫిబ్రవరి 8న మరోసారి ఆమరణ దీక్షకు పూనుకుంది. 19 రోజులు కొనసాగిన ఈ దీక్ష ఫలితంగా దంతేవాడలోని సెషన్స్ కోర్టు స్పందించింది. రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆస్పవూతిలో చికిత్స అందించాలని ఆదేశించింది. విషాదకరమైన విషయమేమిటంటే ఇదే ఆస్పత్రి వైద్యులు అక్టోబర్ 10న తీవ్రగాయాలతో పోలీసులు సోనిని తీసుకువస్తే, ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని, నొప్పినటిస్తోందని నివేదికలిచ్చారు. ఈసారి కూడా వాళ్లు పోలీసుల సూచనలనే పాటించారు. సోనికి అరకొర వైద్యం చేసి జైలుకు పంపించారు.

బాహ్య ప్రపంచంలో అప్పటికే సోని ఉదంతం ప్రాచుర్యంలోకి వచ్చింది. వివిధ కోర్టులకు, మానవ హక్కుల కమిషన్‌కు ఆమె పెట్టుకున్న పిటిషన్లు వాస్తవాలను బహిర్గతం చేశాయి. అక్టోబర్‌లోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించగా, ఈ విషయంలో దేశ ప్రధాని చొరవ చూపాలని హ్యూ మన్ రైట్స్ వాచ్ కోరింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం సోనిని బంధించడం ఆలోచనలను బంధించడమేనని వ్యాఖ్యానించింది. బేషరతుగా ఆమెను విడుదల చేయాలంటూ ఉద్యమించాల్సిందిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చింది. సోని ఆరో గ్య పరిస్థితి క్షీణిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ చామ్‌స్కీ, అరుంధతీరాయ్ సహా 250 మంది మేధావులు, సామాజిక కార్యకర్తలు మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. సోని విడుదలను డిమాండు చేస్తూ దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నిరసన ఫలితంగా చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పవూతికి ఆమెను తరలించాల్సిందిగా ఆదేశించింది. అలా మే 10న ఎయిమ్స్‌లో చేరిన సోని తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఐదు వారాల పాటు చికిత్స చేసి రాయ్‌పూర్‌కు పంపించారు. అయితే, జైలులో సీన్ మళ్లీ రిపీటవుతోందనడానికి సోని సుప్రీంకు తాజాగా రాసిన పై లేఖే సాక్ష్యం.

సోనిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎందుకు కక్షగట్టింది? బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటోన్న ఇద్దరు పిల్లలున్న ఓ ఆదివాసీ మహిళను ఎందుకు వేధిస్తోంది? కోర్టుల ఆదేశాలను, జైలు మాన్యువల్స్‌ను తుంగలో తొక్కి అమానవీయ పద్ధతులు ఎందుకు అవలంభిస్తోంది? మావోయిస్టులకు సహకరిస్తున్నాడంటూ ఆమె భర్తను ఏడాదిగా జైలులో ఎందుకు పెట్టింది? మేనల్లుడిపై నేరస్తుడి ముద్ర ఎందుకు వేసింది? మావోయిస్టులు ఇన్ఫార్మరువంటూ తండ్రి ని కాల్చిగాయపర్చితే, తన అరెస్టుతో తల్లిని సైతం కోల్పోయిన సోని చేసిన నేరం ఏమిటి? ఇవన్నీ అంతుచిక్కని ప్రశ్నలు. అంతం లేని వ్యథలు. 

ఇలాంటి వ్యథలను అనుభవించడంలో సోని ఒంటరి కాదు. మధ్యభారత వనరులను బహుళజాతి కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టడాన్నిఅడ్డుకుంటున్న మావోయిస్టులను నిర్మూలించే లక్ష్యంతో ఆపరేషన్ గ్రీన్‌హంట్ ప్రారంభమైనప్పటి నుంచీ రాజ్యం బాధితులు పెరిగారు. ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, బెంగాల్, మహారాష్ట్రలలో మానవ హక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడింది. లక్షకు పైగా బలగాలను దించి నక్సల్స్ వేట ముసుగులో డజన్ల కొలదీ అమాయకుల ప్రాణాలను హరిస్తున్నారు.బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారు. బాసగూడెం లాంటి మారణకాండలకు పాల్పడుతున్నారు. దొరికిన వారిని చితకబాదుతున్నారు. కేసులు పెట్టి జైళ్లు నింపుతున్నా రు. సల్వాజుడుంను సుప్రీం నిషేధిస్తే కోబ్రా బెటాలియన్‌గా మార్చి జనం పైకి వదిలారు.ఈ అకృత్యాలను వెలుగులోకి తెస్తుందనే భయం తో మీడియానూ నిషేధించారు.

ఇక మిగిలింది హక్కుల సంఘాలు, కార్యకర్తలు.. వీరిని నయానో భయానో అదుపులో పెట్టకపోతే మానవహక్కుల ఉల్లంఘనంటూ గొంతు చించుకుని అరుస్తారని, అంతర్జాతీయ సమాజం దృష్టిలో భారత్ ప్రతిష్ఠను దిగజారుస్తారని రాజ్యం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే హక్కుల నేత బినాయక్‌సేన్‌పై అక్ర మ కేసులు బనాయించి జైలు కు పంపారు. కళాకారుడు జీతన్ మరాండికి చేయని నేరం అంటగట్టి ఉరిశిక్ష విధించారు. జర్నలిస్టు సీమా ఆజాద్‌కు, ఆమె భర్త విశ్వవిజయ్‌కు యావజ్జీవ కారాగారం విధించారు. రాజ్యం కర్కశత్వానికి ఇవి కొన్ని ఉదహరణలు మాత్రమే. సోని వ్యథాభరిత గాథ వెనకాల కారణమూ ఇదే. జాబెలి గ్రామంలో స్కూలుటీచర్‌గా ఉంటూ పోలీసుల, కోబ్రా బలగాల అరాచకాలను ప్రశ్నించింది. వనరుల దోపిడీకై తిష్టవేసిన కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న స్థానిక నేతల వైఖరిని ఎండగట్టింది. అదే పాలకుల కంటగింపునకు కారణం.

సొంత ప్రజలపైనే యుద్ధానికి తెగబడిన విధానాలకు యూపీఏ సర్కారు ఇకనైనా స్వస్తి పలకాలి. ఆదివాసుల హననానికి కారణమవుతున్న గ్రీన్‌హంట్‌ను నిలిపేయాలి. బూటకపు ఎన్‌కౌంటర్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. హక్కుల కార్యకర్తలపై వేధింపులు ఆపాలి. సోనిసోరిని జైలు నుంచి విడుదల చేసి మెరుగైన వైద్యచికిత్స అందించాలి. ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే స్వతంత్ర విచారణకు ఆదేశించాలి. లేనిపక్షంలో ఈ దేశంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యం కాదని, బహుళజాతి కంపెనీల సేవలో తరించే నియంతృత్వ ప్రభుత్వమే ఇక్కడ రాజ్యమేలుతున్నదని ప్రజలు భావిస్తారు.

-డి మార్కండేయ
dmknamaste@gmail.co

Namasete Telangana News Paper Dated : 24/08/2012 

మళ్లీ నిషేధ రాజకీయాలు ----ప్రొఫెసర్ హరగోపాల్



మన రాష్ట్రంలో రెవల్యూషనరీ డెమొక్షికాటిక్ సంస్థ (ఆర్‌డీఎఫ్)ను నిషేధించడం తొందరపాటు చర్యే. రాజకీయ విశ్వాసాలను, ఆ విశ్వాసాలున్న సంస్థలను నిషేధించడం మన రాష్ట్రానికి కొత్తేమీ కాదు. విప్లవ ఉద్యమాలు ముందుకు తీసుకవచ్చిన మౌలిక ప్రజా సమస్యలను పరిష్కరించలేని రాజకీయ వ్యవస్థ, ఆ మౌలిక సమస్యలను లేవనెత్తుతున్న రాజకీయాలను నిషేధించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. విప్లవ పార్టీలనే కాక పార్టీల పట్ల సానుభూతి కలిగిన సంస్థలను, వాటికి ఫ్రంట్ ఆర్గనైజేషన్ అని పేరుపెట్టి, వాటి సాహిత్యాన్ని, పుస్తకాలను నిషేధించే ఒక అప్రజాస్వామిక సంస్కృతి రాష్ట్రంలో ఉంది. నిషేధ రాజకీయాలు భూస్వామ్య, వలసవాద పద్ధతులు. ఇలాంటి పద్ధతులకు వ్యతిరేకంగా స్వాతంవూత్యోద్యమం నడవడం వల్ల ఆ ఉద్యమంలో ముందుకు వచ్చిన ప్రజాస్వామ్య ఆకాంక్షల వెలుగులో భారత రాజ్యాంగం రూపొందించబడింది. దాదాపు రెండున్నర సంవత్సరా ల కాలం మేధోమథనం చేసి అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ రూపకల్పన జరిగింది. 

స్వతంత్ర దేశంలో ప్రజలే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటార ని, ప్రజలు స్వేచ్ఛగా స్వతంవూతంగా తమ సమస్యలు చెప్పుకోవచ్చని, సంఘటితంగా సంఘాలు పెట్టుకోవచ్చని, ఉద్యమాలు చేపట్టవచ్చని రాజ్యాంగం హామీ ఇచ్చి, హక్కులు కల్పించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర ఉంది. సోక్రటీస్, జీసస్, గెలీలియో కోపర్నికస్, భ్రూనోల సాహసం నుంచి, లక్షలాది ప్రజల పోరాటాల నుంచి భావ ప్రకటనా స్వేచ్ఛ ఒక వ్యవస్థీకృతమైన ప్రజాస్వామ్య విలువగా మానవ చైతన్యం లో భాగమైంది. పైన ఉదహరించిన సాహసవంతులు తమ స్వేచ్ఛ కోసం, తాము నమ్మిన విశ్వాసాల కోసం, తాము సత్యమనుకొని నమ్మిన సత్యాన్ని అప్పటి పాలకవర్గాలకు కంటగింపుగా ఉన్నా ప్రపంచానికి చాటారు. ఈ అంశం మీద నేను చాలా సందర్భాల్లో పేర్కొన్న జేఎస్ మిల్ స్వేచ్ఛ మీద రాసిన గ్రంథం ప్రామాణికం గా పరిగణింపబడుతున్నది. మానవాళి సత్యాన్వేషణలో ఉన్నప్పుడు ఎలాంటి భావాలను నిరోధించినా అది మానవ నాగరికత పరిణామ క్రమానికి ప్రమాదమని స్వేచ్ఛా సిద్ధాంతం భావిస్తుంది.

స్వాతంవూత్యోద్యమ కాలంలో మన దేశంలో ఈ విలువ చాలా ప్రసవవేదన తర్వాతే పుట్టిం ది. గాంధీ రాసిన ‘హింద్ స్వరాజ్’ను అప్ప టి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అలాగే రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమమే జరిగింది. ఈ కాలంలోనే భిన్న భావాలు ముందుకు వచ్చాయి. మార్క్సి స్టు సిద్ధాంతం, ఎంఎన్ రాయ్, లోహియా, డాక్టర్ అంబేద్కర్, జయవూపకాశ్ నారాయణ, అలాగే హిందూమత ఛాందసత్వానికి చెందిన సావర్కర్, గోల్వాల్‌కర్ రచనలు కూడా వచ్చాయి. మనం అన్ని భావాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ భావా లు చెప్పే స్వేచ్ఛ వాళ్లకుండాలి. అంతిమంగా ప్రజలు ముఖ్యంగా శ్రామిక జనం దేన్ని విశ్వసించి పోరాడితే ఆ విలువలు సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి. ఈ మొత్తం వారసత్వం ఏమైంది? ఎక్కడ మునిగిపోయిందో అడగవలసిన అగత్యం ఏర్పడింది.

మన రాష్ట్రంలో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి నిషేధ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నక్సల్బరి పోరాటాన్ని పాలకులు ఎప్పు డూ ఇది కేవలం శాంతి భద్రతల సమస్య అని భావించలేదు. పాలించే వాళ్ల కు దీని మూలాలు ఎక్కడ ఉన్నాయో అని తెలియక కాదు. అది వాళ్లకు పూర్తి గా తెలుసు కాబట్టే ఇంత భయం. సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానత ల నుంచి, అణచివేత నుంచి ఈ ఉద్యమాలు పుట్టాయని ఏలిన వారికి తెలు సు. తెలిస్తే అసమానతలు తగ్గించవచ్చు కదా, భూమిని పంపిణీ చేయవచ్చు కదా, ఆదివాసీల హక్కులను గుర్తించి, రాజ్యాంగ స్ఫూర్తితో వాళ్ల వనరులు వాళ్లకే దక్కేలా చూడవచ్చు కదా. ఇది చేయడం స్వప్రయోజన పరులకు ఇష్టం ఉండదు. అశాంతిమయమైన హింసా ప్రపంచంలో అభవూదతతోనైనా జీవిస్తారు. కానీ కొన్ని ప్రయోజనాలనైనా వదులుకొని ఒక సజీవ శాంతియు త సమాజంలో జీవించాలనే స్పృహ వాళ్లకుండదు. విపరీతమైన ఆస్తికాంక్ష, లాభాల వేటలో ఉండే వాళ్లలోని మనిషి మాయమైపోయి ఉంటాడు. అందు కే వాళ్లు బలవూపయోగాన్ని, హింసను కోరుకుంటారు. హింసద్వారా ప్రజల ఆకాంక్షలను అణచివేయాలనుకుంటారు. అక్కడే ఆగరు. ఆ ఆలోచనలనే తుంచి వేయాలనుకుంటారు.

నిజాయితీగా ప్రశ్నలడిగే వారు చాలా భయంకరంగా కనిపిస్తారు. రోజు వాస్తవాలను వక్రీకరించే మీడియాను సృష్టించుకుంటారు.వాళ్లు రోజూ ప్రచారం చేస్తున్న సమాచారం నిజమని భ్రమింప చూస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా , అంతిమంగా మనిషి తన సామాజిక అనుభవం నుంచి వాస్తవాలను గ్రహిస్తాడు. ఆ అనుభవపు వెలుగులో ముందుకుపోతుంటాడు. ఆలోచనలను, భావాలను, సంస్థలను నిషేధించ డం వల్ల మార్క్స్ అన్నట్లు.. అవి పాలకులు ఆశించిన ప్రయోజనాలకు భిన్నంగా మనిషి చైతన్యాన్ని మరింత పదును చేస్తాయి. ఒక పుస్తకాన్ని నిషేధించడం వల్ల ఆ పుస్తకం చదవాలి అనే ఆసక్తి పెరుగుతుంది. ఒక సంస్థను నిషేధిస్తే, ఆ సంస్థ గురించి పట్టించుకోని వారు కూడా ఈ సంస్థను ఎందుకు నిషేధించారు అని చర్చించుకుంటారు. నిషేధాలు ఎప్పుడూ పాలకుల ప్రయోజనాలకు వ్యతిరేకంగానే పనిచేస్తాయి.

మన రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు రాజకీయాలను ప్రవేశపెట్టిన వారిలో వెంగళ్‌రావు ఆద్యుడు. ఆ రోజుల్లో సమర్థవంతమైన ముఖ్యమంత్రి అని చాలా ప్రచారం చేశారు. ఎన్‌కౌంటర్లను ప్రోత్సహిస్తే పాలక వర్గాలు సంబరపడ్డాయి. ఆయన అణచాలన్న రాజకీయాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నా యి. అది దేశ భద్రతకే పెద్ద ముప్పు అని భావించేదాకా ఎదిగాయి. కానీ వెంగళ్‌రావును ఎవరు గుర్తు పెట్టుకున్నారో మనకు తెలియదు. ఆణచివేతను కొనసాగించినా, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చినందుకు ఎన్టీఆర్‌ను గుర్తుపెట్టుకున్నారు. కొంచెం వెసులుబాటు కల్పించినా జ్ఞాపకం పెట్టుకునే ఈ ప్రజల మీద దాడులు అణచివేతలు చేయడం పాలకుల అజ్ఞానం.

మన రాష్ట్రంలో నక్సలైట్ పార్టీలకు, ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరిగాయని ప్రభుత్వం మరిచిపోయినా, ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ఇది ‘పౌర సమాజం’ చొరవ మీద ఏడు, ఎనిమిది ఏళ్ల నిరంతర కృషి మేరకు జరిగింది. అడవి నుంచి అగ్రనాయకులు హైదరాబాద్‌లో ప్రభుత్వ అతిథులుగా ఉండి, కొన్ని మౌలికమైన అంశాలను చర్చకు పెట్టారు. అందులో ముఖ్యంగా ప్రజాస్వామిక హక్కుల మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. రాజకీయాలను, విశ్వాసాలను ప్రచారం చేసుకునే హక్కు పరిధి పెంచాలని, పాలకులు తాము రాసుకున్న రాజ్యాంగాన్నైనా గౌరవించాలని, ఆ హక్కులు ప్రజలు అనుభవించాలంటే ఒక రాజకీయ పరిస్థితిని కల్పించాలని డిమాండ్ చేశారు. పౌరస్పందన వేదిక ప్రజాస్వామ్యచోటు పరిధి పెరిగితే హింస తగ్గుతుందని చాలా బలంగా విశ్వసించి అంత పెద్ద ప్రయత్నం చేసింది. ఇంత పెద్ద ప్రయోగం జరిగిన రాష్ట్రంలో మళ్లీ రెవల్యూషనరీ డెమోక్షికటిక్ ఫ్రంట్ లాంటి జాతీయ జాతీ య సంస్థను ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ కింద నిషేధించడమేమిటి? ఇప్పుడు మన రాష్ట్రంలో అంత బలమైన నక్సలైట్ ఉద్య మం లేదు కదా, నక్సలైట్లు అభివృద్ధికి ఆటంకం అని ప్రచారం చేసిన వారు, ఇప్పుడు తాము పదేపదే చెబుతున్న అభివృద్ధిని చేపట్టవచ్చుకదా! ఆర్‌డీఎఫ్ లాంటి ప్రజాస్వామిక సంస్థ ముందుకు తెచ్చిన వాదనలకు జవాబు చెప్పవచ్చు కదా.

మన రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమం పూర్తిగా సమసిపోయింది అని కేంద్ర హోం మంవూతికి చెబుతున్నా మన ప్రభుత్వానికి కొందరు కవులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు నిరాయుధంగా రాజకీయా లు మాట్లాడుతుంటే అంత భయమెందు కు? ఉద్యమం మళ్లీ పుంజుకోవచ్చు అని అనుకుంటే అది మళ్లీ రావలసిన అవసరం లేని పరిస్థితులు కల్పించవచ్చుకదా. నిషే ధం ప్రజల అవసరాలకు, అంతరాలకు జవాబు ఎలఅవుతుంది. ప్రపంచీకరణ సామ్రాజ్యవాద ప్రేరిత అభివృద్ధి నమూనాను అమలు చేసినంత కాలం ఉద్యమాలు ఏదో రూపంలో జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో వాల్‌స్ట్రీట్ ఆక్రమించుకోండి అన్న ఉద్యమం వెనక ఏ నక్సలైట్లు ఉన్నారు? అది శాంతియుత పోరాటం అని భావిస్తే, అమెరికాలో ప్రతి పౌరుడి దగ్గర ఆయుధముంది. వాళ్ల రాజ్యాంగంలోనే ఆయుధాన్ని కలిగి ఉండే హక్కును రాసుకున్నారు. అమెరికన్ ప్రజల సహనం నశిస్తే, అది సాయుధ పోరాటం గా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. 

నిజానికి ఆర్‌డీఎఫ్ మన రాష్ట్రం లో గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ఒక సభ జరిపింది. సభలో మాలాంటి వాళ్లం పాల్గొన్నాం. ఛత్తీస్‌గఢ్‌లో కలెక్టర్ అపహరణ సందర్భంలో ఈ దుర్మార్గాన్ని గురించి అడిగితే అక్కడి ముఖ్యమంత్రి గ్రీన్‌హంట్ అనేటువంటి చర్య తమ రాష్ట్రంలో లేనేలేదని అన్నాడు. లేకపోతే దాని గురించి మాట్లాడేవారి విశ్వసనీయత దెబ్బతింటుంది కదా. ఆర్‌డీఎఫ్ అలాంటి సభ ఒకటి ఢిల్లీలో పోలీసుల అనుమతితో పార్లమెంటు స్ట్రీట్‌లో పెట్టింది. ఆ సభ కు హాజరైన వారిలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, ప్రజాస్వామికవాదులు, అలాగే న్యాయమూర్తి రాజేంద్ర సచార్ మాట్లాడారు. ఇంత పారదర్శకంగా పాలకులు అంటున్న ప్రజాస్వామ్య గొడుగు కింద పనిచేస్తున్న సంస్థను నిషేధించడమనేది చరివూతకు వ్యతిరేకంగా ప్రయాణించడమే. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం ఒక రాజకీయ స్పృహతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని, అలా ఒత్తిడి తేవడానికి తెలంగాణ కోసం పోరాడుతున్న రాజకీయ శక్తులు కూడా కృషి చేస్తాయని ఆశిద్దాం.

ప్రొఫెసర్ హరగోపాల్
Namasete Telangana News Paper Dated : 23/08/2012