Friday, August 17, 2012

మేధావి పర్యటనపై నిషేధమా? ----సయ్యద్ అలీ ముజ్తబా



mydral
యాన్ మిర్డాల్‌ను భారత్‌కు రాకుండా నిషేధించడం ఆశ్చర్యానికి గురిచేసింది. అతను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, మావోయిస్టులకు మద్దతుగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలతో.. అతన్ని భారత్‌లోకి రాకుండావూపభుత్వం నిషేధించింది. ఇంతకంటే.. బుద్ధిహీనమైన చర్య మరొకటి ఉండదు. అతన్ని భారత వ్యతిరేకిగా ముద్రవేస్తూ ప్రభు త్వం తీవ్రమైన చర్యలకు పాల్పడుతున్నది. విప్లవాత్మక భావాలున్నాయన్న కారణంతో అమెరికా కూడా యాన్ మిర్డాల్ పర్యటనలను నియంవూతించింది. అమెరికా కనుసన్నల్లోనే.. ఆ అడుగుజాడల్లోనే భారత్ కూడా మిర్డాల్ పర్యటనపై నిషేధం విధించింది. 

యాన్ మిర్డాల్ అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు గాంచిన, నోబెల్ బహుమతి గ్రహీతైన గున్నార్ మిర్డాల్ కుమారుడు. గున్నార్ ఇండియాలో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాలపై విశేష పరిశోధన చేశారు.‘ఆసియన్ డ్రామా’అనే ప్రఖ్యాత గ్రంథాన్ని రాశారు. 

ఇందిరాగాంధీ ఎప్పుడూ తన ప్రసంగాలలో ‘ఆసియన్ డ్రామా’ పుస్తకం నుంచే ఉటంకించేవారు. గున్నార్ మిర్డాల్ భార్య అల్వా మిర్డాల్ కూడా స్వీడన్ దేశపు రాయబారిగా ఢిల్లీలో పనిచేసింది. అలా మిర్డాల్ కుటుంబానిది ఇండియాతో.. విడదీయలేని సంబంధం. ఈ నేపథ్యంలోనే.. మిర్డాల్ దంపతులకు జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవగాహనా అవార్డు ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. కానీ.. నేడు ఆ కుటుంబం నుంచి భారత ప్రజల కష్టాలను, కన్నీళ్లను పట్టించుకున్న పాపానికి యాన్ మిర్డాల్‌ను భారత్ రాకుండా నిషేధించింది.
యాన్ మిర్డాల్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరుగుతూ..అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అనేక పుస్తకాలు రాశారు. కేవలం యాత్రా రచనల్లా గాకుండా.. ఆయా దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడి ప్రజల జీవన స్థితిగతులను, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసి శాస్త్రీయంగా వివరించారు. ఆయా సమాజాల సామాజిక మూలాల్లోకి పో యి విమర్శనాత్మకంగా ఎన్నో పుస్తకాలు రాశా రు. అందులో.. 

‘రిపోర్ట్ ఫ్రంమ్ ఎ చైనా విలే జ్’, ‘చైనా: ది రెవెల్యూషన్ కంటిన్యూడ్’, ‘కన్‌ఫేషన్స్ ఆఫ్ ఎ డిస్‌లాయల్ యూరోపియ న్’, ‘ఇండియా వేయిట్స్’ లాంటివి ఎన్నో పేరుగాంచిన పుస్తకాలున్నాయి. ఈ మధ్య రాసిన ‘రెడ్ స్టార్ ఓవర్ ఇండియా’(తెలుగులో ‘భారత్‌పై అరుణ తార’) దేశంలో మేధావులు, రచయితల ప్రశంసలందుకుంటున్నది. ఈ పుస్తకం ఇప్పటికే బెంగాలీ, హిందీ, పంజాబీ, తమి ళం, తెలుగు ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం చేయబడి పాఠకులతో విశేష ఆదరణ పొందుతున్నది. అలాగే.. ఇది యూరప్‌లోని అన్నిదేశాల్లో విశేషంగా అమ్ముడవుతూ.., జర్మ న్, ఇటాలియన్, నార్వేజియన్, స్వీడిష్ భాషల్లోకి కూడా అనువాదం చేయబడింది. ఇప్పు డు ‘రెడ్ స్టార్ ఓవర్ ఇండియా’ రెండో ముద్రణకు వచ్చింది. ఈ రెండో ముద్రణ పుస్తకావిష్కరణకు వస్తున్న సందర్భంగానే భారత ప్రభు త్వం మిర్డాల్ ఇక్కడికి రాకుండా నియంవూతి స్తూ.. నిషేధించింది. 

అయితే.. మిర్డాల్ గత జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే.. భారత్‌లోని ప్రముఖ నగరాలు, కోల్‌కతా, హైదరాబాద్, లూథియానా, ఢిల్లీలో పర్యటించాడు. ఈ పట్టణాల్లో పుస్తకావిష్కరణ సభల్లో తన అనుభవాలను మేధావులు, రచయితలు,విద్యార్థులు, జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు, హక్కుల కార్యకర్తలతో పంచుకున్నాడు. తాను రాసిన పుస్తకం ‘రెడ్‌స్టార్ ఓవర్ ఇండియా’ విశేషాలను, విషయాలను ప్రజలతో పంచుకున్నా డు. భారత్‌లో తన పర్యటనలో తాను చూసిన విషయాలను, భారత ప్రభుత్వ తీరును, స్పందనను తప్పుపట్టాడు.

ప్రజా ఉద్యమాలు, ముఖ్యంగా మావోయిస్టు ఉద్యమంపై ప్రభుత్వ అణచివేతను నిరసించాడు. ఎప్పటికైనా.. ప్రజా ఉద్యమాలు విజయవంతం కాక తప్పవని చెబుతూ.., ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని సూచించాడు. లేకుంటే పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించాడు. అయితే.. మిర్డాల్ పర్యటనను, చేసిన ప్రసంగాలను కేంద్ర హోంమంవూతిత్వశాఖ భారత వ్యతిరేకమైనవిగా, మావోయిస్టుపార్టీ రాజకీయ ప్రచారంగా ముద్ర వేస్తోంది. దీనినే భారత వ్యతిరేక వైఖరిగా ప్రచారం చేస్తున్నది. దీనిని మిర్డాల్ తీవ్రంగా వ్యతిరేకించాడు. తన అభివూపాయాలను వ్యక్తీకరించడాన్ని తప్పుపట్టడం అసమంజసమని నిరసించాడు. 

తాజాగా ‘రెడ్ స్టార్ ఓవర్ ఇండియా’ రెండో ముద్రణను విడుదల చేయడం కోసం మిర్డాల్ భారత్ రావాలనుకుంటున్నాడు. దీనికోసం నెల రోజుల పర్యటనకు అనుమతించాల్సిందిగా వీసా కోసం భారత్‌ను కోరాడు. కానీ.. భారత ప్రభుత్వం అతని రాకను నిషేధించింది. దీంతో.. భారత ప్రజలకు నేను రాజకీయ సలహాలు ఇచ్చేంతస్థాయిలో లేనని తనవి రాజకీయ అభివూపాయాలు మాత్రమేనని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన పర్యటనపై విధించిన నిషేధాన్ని తొలగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాడు. 

అయితే.. మిర్డాల్ కచ్చితమైన రాజకీయాభివూపాయాలున్న వాడు. మొదటి నుంచీ మావో సిద్ధాంతాలతో ఉత్తేజితుడై మావో సిద్ధాంత అనుచరుడుగా పేరుగాంచాడు. అలాగే ఇతని రచనలతో ఇండియాలోని మావోయిస్టులు కూడా ఉత్తేజితులయ్యారు. ఈ క్రమంలోనే మిర్డాల్ భారత్‌లో అనేక పర్యాయాలు పర్యటించాడు. భారతీయ సమాజ స్థితిగతులను లోతుగా అధ్యయనం చేశా డు. భారతీయ సమాజ మార్పుకోసం జరుగుతున్న పోరాటాలపై నిర్దిష్టమైన అభివూపాయాలు కలిగి ఉన్నాడు. చాలామంది విదేశీ పర్యాటకుల మాదిరిగానే భారత్‌లో పర్యటించాడు. తనదైన అభివూపాయాలను ఏర్పరుచుకున్నాడు. అయితే.. అంతమావూతాన అతనిని తప్పు పట్టడం సమంజసమేనా? మిర్డాల్ రాకను నిషేధిస్తే... మావోయిస్టు సమస్య పరిష్కారం అవుతుందా? మిర్డాల్ రాకతోనే మావోయిస్టు ఉద్యమం పెరుగుతుందా?అభివూపాయాల వ్యక్తీకరణనే ప్రభుత్వం ప్రమాదంగా భావించవచ్చా? ఇక్కడనే ఒక విషయం చెప్పుకోవాలి. 190లో మిర్డాల్ భారత్, అంధ్రవూపదేశ్‌లో విస్తృతంగా పర్యటించి ‘ఇండియా వేయిట్స్’అనే పుస్తకం రాశాడు.

అందులో భారత గ్రామీణ సమాజంలో ఉన్న దోపిడీ పీడనలను, అణచివేతలను వివరించాడు. ఈ అణచివేతలు, దోపిడీలకు వ్యతిరేకంగా రైతాంగం సంఘటితమై సాయుధ పోరుకు సన్నద్ధమవుతున్న తీరును ‘ఇండియా వేయిట్స్’లో వివరించాడు. అప్పుడు భారత ప్రధాని ఇందిరాగాంధీ మిర్డాల్‌ను పిలిచి ‘గ్రామీణ అశాంతిని రూపుమాపేందుకు ఏమి చర్యలు తీసుకోవాలో సూచించాల్సింది’గా కోరారు. కానీ.. కొద్ది కాలంలోనే ఆ ‘అమ్మ’ అకాల మరణం చెందారు. ఆ అమ్మ కొడుకులుగా, ఆమె వారసులుగా.. చెప్పుకుంటూ నేడు మిర్డాల్ ఆలోచనలను తప్పుపడుతూ.. దేశమే రావద్దని నిషేధం విధిస్తున్నారు. మిర్డాల్ ఆలోచనలకు భయపడుతున్నారు. ఇలాంటి ఆలోచనలతోనే గ్రీన్‌హంట్ పేరుతో ప్రజలను వేటాడుతున్నారు. చంపుతున్నారు. 

భారత పాలకులు అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలకు ఎర్ర తీవాచీ పరిచి స్వాగతా లు పలుకుతున్నారు. ఎన్‌రాన్, డౌ కెమికల్స్, పోస్కో, మాన్‌సాంటో, వేదాంత లాంటి ఎన్నో కార్పొరేట్ కంపెనీలను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వీటికి అండగా ఉంటున్న జిందాల్, మిట్టల్, ఎస్సార్, టాటా, అంబానీ కంపెనీలకు దేశాన్ని అప్పజెప్పి ప్రజలను సమిధలుగా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తరతరాలుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న ఆదివాసులు తమ బతుకైన భూమికోసం, సహజ వనరుల తరలింపుకు వ్యతిరేకంగా పోరా డుతున్నారు. బహుళజాతి కంపెనీలు అడవి లో ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. వనరుల తరలింపును, దోపిడీని వ్యతిరేకిస్తున్న ఆదివాసులపై భారత ప్రభుత్వం గ్రీన్‌హంట్ ఆపరేషన్ పేరుతో హత్యాకాండను సాగిస్తున్నది. ప్రజలపై సాగిస్తున్న దమనకాండను నిరసించే మిర్డాల్ లాంటి రచయితల పర్యటనలను అడ్డుకుంటున్నది. అయితే.. రచయితలు, కళాకారులను నిర్బంధాలకు గురిచేయడం కొత్తేమీ కాదు. ఎంతోమంది తప్పుడు కేసులతో అక్రమంగా జైళ్లల్లో నిర్బంధింపబడ్డారు.

జూలై ఒకటి 2010న ఢిల్లీకి చెందిన హేమచంవూదపాండే అనే జర్నలిస్టును ఆంధ్రవూపదేశ్ పోలీసులు ఎదురుకాల్పుల పేరిట ఆదిలాబాద్ జిల్లాలో కాల్చి చంపారు. బీహార్‌లో జీతన్ మరాండీ అనే కళాకారున్ని తప్పుడు కేసుల్లో ఉరిశిక్ష వేశారు. దేశవ్యాప్తంగా ఈ శిక్షకు వ్యతిరేకంగా నిరసనలు రావడంతో కోర్టు ఉరిశిక్షను రద్దుచేశారు. ప్రఖ్యాత రచయిత అరుధంతీరాయ్‌పై కూడా కాశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతు పలికినందుకు దేశవూదోహ నేరం మోపారు. ఈ మధ్యనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంవూతిపై కార్టూన్ వేసినందుకు ప్రొఫెసర్ అభిషేక్ మహాపావూతపై కేసులు పెట్టి నిర్బంధించారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యలపై నిలదీసినందుకు వారిని మావోయిస్టు సానుభూతిపరులంటూ కేసులు పెట్టి వేధించారు. ఇలాం టి నిర్భంధాలతో ప్రజల అభివూపాయాలను అణచాలనుకోవడం అప్రజాస్వామి కం. ఆలోచనలను ఆణచలేరన్న చారివూతక సత్యాన్ని పాలకులు గుర్తిస్తే మంచిది. 

యాన్ మిర్డాల్ రాకుండా భారత ప్రభుత్వం నిషేధించడం సిగ్గుమాలిన పని. ప్రభుత్వ నియంతృత్వ చర్యను ప్రజలు , ప్రజాస్వామికవాదులు,మేధావులు తీవ్రంగా ఖండించాలి. మిర్డాల్‌కు మద్దతుగా నిలవాలి. అప్పుడే దేశంలో ప్రజల హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛలను బతికించుకోగలుగుతాము. 

-సయ్యద్ అలీ ముజ్తబా 
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్స్ అలయెన్స్)

NamaSete TELANGANA  News Paper Dated : 17/08/2012 

No comments:

Post a Comment