Saturday, August 11, 2012

బంజారాల అభివృద్ధి అంతా మిథ్యే..!--డాక్టర్ జె. రాజారాం


బంజారాల అభివృద్ధి అంతా మిథ్యే..!
రిజర్వేషన్ కల్పించదలచినప్పుడు మైదాన ప్రాంత గిరిజనులైన లంబాడీలను రాజ్యాంగం ‘లంబాడీస్’గా వ్యవహరించింది. ‘లంబాడీ’అనేది వ్యవహారంలో పిలువబడుతున్న సాధారణ పదం. లంబాడీలు సమాజం నుంచి బయటికి వచ్చిన శిష్టులు లంబాడీ పదానికి బదులు సాహితీపరమైన ‘బంజార’ పదాన్ని ప్రచారంలోకి తేదలుచుకున్నారు. కాబట్టి ఈ వ్యాసంలో లంబాడీలను బంజారాలుగానే సంబోధిస్తాను.ఇటు గ్రామాలకు, అటు ఆదివాసీ సమాజానికి మధ్య ఉన్న పెద్ద సమా జం బంజార సమాజమే. నేడు వ్యవసాయం చేస్తున్న బంజారాలు పూర్వం వ్యాపారం చేసేవారని, ఆ వ్యాపారం సంచారంగా (బిడారి) ఉండేదని చరివూతకారుల అభివూపాయం. అది వాస్తవం కూడా. ఏ సమాజంలోనైనా మానవ జీవితానికి తొలి మెట్టు వ్యవసా యం అయితే దాని పైమెట్టు వ్యాపారం అవుతుంది. పూర్వం నుంచి బంజారాలు వ్యవసాయం చేయలేదు. వ్యవసాయానికి పైమెట్టు అయిన వ్యాపారమే చేశారు.

బంజారాల పెద్ద పెద్ద వ్యాపార కార్వాన్‌లను చూసి విదేశీయులు ఆశ్చర్యాన్ని ప్రకటించారని ప్రఖ్యాత చరివూతకారిణి రోమిలా థాపర్ తన ‘తరతరాల భారతదేశ చరివూత’ లో పేర్కొన్నారు. చారివూతక ఆధారాలను బట్టి జంగినాయక్, భంగినాయక్‌లకు లక్షా ఎనభైవేల పశుసంపద ఉండేది. ఈ పశు సంపద ఆధారంగానే వారు వ్యాపారం నిర్వహించేవారు. కాబట్టి ఇంతటి పశుసంపదతో కూడిన పెద్ద స్వదేశీ బంజారా వ్యాపార కార్వాన్‌లను చూసి విదేశీయులు ఆశ్చర్యాన్ని ప్రకటించి ఉంటారు. వ్యాపారం దేశీయంగా అభివృద్ధి చెంది ఉంటే బంజారాలు దేశంలో బలమైన వర్తక వర్గంగా అభివృద్ధి చెందేవారని చరివూతను ఆర్థికనశమ)దృష్టి కోణంతో నిర్వచించిన ప్రసిద్ధ చరిత్ర రచయిత డి.డి కోశాంబి అన్నారు. ఈ ఉదాహరణలు గతంలో బంజారాలు వ్యాపారం చేశారనడానికి నిరూపణ అంశాలు.

అన్ని రంగాల్లో స్వదేశీ పరిజ్ఞానాన్ని కాపాడలేని భారత పాలకుల అసమర్థత కారణంగా బంజారాల వ్యాపారం మీద విదేశీయులు ముఖ్యంగా బ్రిటిష్‌వారు దాడి చేశారు. బ్రిటిష్ పాలన కాలంలో 19వ శతాబ్దం చివరి వరకు బంజారాలు వ్యాపారం చేశారు. వస్తువులను అమ్ముకోవడానికి బ్రిటన్‌కు భారత్‌లాంటి మార్కెట్ కావల్సి వచ్చింది. వ్యాపారం చేసుకోవడానికి వచ్చి రాజ్యాధికారం హస్తగతం చేసుకున్న బ్రిటిష్ వర్తకులు భారతదేశంలో తాము తప్ప ఎవరూ వ్యాపారం చేయడానికి వీలులేదని శాసించారు. అప్పటికే ఈ దేశంలో నిత్యావసర సరుకులను గ్రామక్షిగామానికి అందించే సంచార వ్యాపారంలో బంజారాలు ఉన్నారు. గ్రామాలలో ఏది దొరికినా దొరకకపోయినా ఉప్పు, ఇనుము దొరికేవి కావు. ఉప్పును తీర ప్రాంతాల నుంచి, ఇనుమును తయారీ ప్రాంతాల నుంచి తెచ్చి గ్రామాలకు సరఫరా చేసేవారు. వ్యాపారంలో మోనోపలి (ఈనాటి గుత్త వ్యాపార సంస్థల్లాగ) కాదలుచుకున్న బ్రిటిష్ ప్రభుత్వం బంజారాల వ్యాపారాన్ని నాశనం చేయాలనుకున్నది.

కానీ వ్యాపారులైన బంజారా ప్రజల మీద నాటి గ్రామ సమాజానికి అపారమైన నమ్మకముండేది. ముందుగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ నమ్మకం మీద దెబ్బతీయాలనుకున్నది. 1896లో ఒక నల్ల చట్టాన్ని తీసుకువచ్చి బంజారాలను నేరస్తులుగా, దొంగలుగా ప్రకటించింది. అధికారికంగానే క్రిమినల్స్‌గా, దొంగలుగా ప్రచారం చేయడంతో గ్రామ సమాజం బంజారాలను అనుమానించడం మొదపూట్టింది. దానితో గ్రామ ప్రజలు బంజార వ్యాపారుల నుంచి సరుకులు కొనడం మానేశారు. సరకులు అమ్ముడు పోకపోవడంతో బంజారాల వ్యాపారం దెబ్బతిన్నది. కేంద్ర ప్రభుత్వం 1961లో నిర్వహించిన జనాభా లెక్కల సందర్భంగా లంబాడీల మీద ప్రచురించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నది.

వ్యాపారం దెబ్బతినడంతో దానినే వృత్తిగా కలిగిన బంజారాలకు ఏ పనిచేసి బతకాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. బంజారాలకు ఆనాటికి బతకడానికి వ్యవసాయ మే ప్రత్యామ్నాయ జీవనాధారంగా కనబడింది. దీంతో బంజారాలు వ్యాపారం అనే పైమెట్టు నుంచి కిందికి దిగి గత్యంతరం లేక వ్యవసాయంలోకి రావాల్సి వచ్చింది. వీరికి వ్యవసాయం ఎటువంటిది అయిందంటే, వ్యాపారశాస్త్రంలో నిష్ణాతుడైన వ్యక్తిని రసాయనశాస్త్రం గురించి చెప్పమంటే ఎంత ఇబ్బందికి గురవుతాడో బంజారాలకు వ్యవసాయం అట్లా అయింది. అయినా అనుమానాలు, అవమానాలు, అష్టకష్టాలకు ఓర్చి సాగు నేర్చుకున్నారు. నాటికి విస్తారంగా అడవులు ఉండేవి. కాబట్టి అడవులు నరికి భూమిని సాగులోకి తెచ్చుకున్నారు. వ్యవసాయం వైపు మళ్ళినంత మాత్రాన వారి మీద మోపిన నల్లచట్టం ఎత్తివేయలేదు. ఆ చట్టం అలాగే కొనసాగింది. బ్రిటిష్ వారు నాడు చేసిన నల్లచట్టం దెబ్బకు బంజారా జాతి నేటికీ కోలుకోలేదు.

అంబేద్కర్ భారత పీడిత తాడిత ప్రజల నాయకుడిగా ఎదిగి రాజ్యాంగ రచన చేయ డం ద్వారా ఆ చట్టాన్ని (1950)రద్దు చేశాడు. ఇంతటి క్రూరమైన సామాజిక నిర్బంధానికి గురైన బంజారాల దుస్థితి గురించి నాడు ఏ ఒక్క జాతీయ నాయకుడు మాట్లాడలేదు. అయితే అంటరాని, అణగారిన ప్రజల గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో అంబేద్కర్ గిరిజనుల గురించి మాట్లాడాడు. అంబేద్కర్ కంటే ముందు సావివూతిబాయి పూలే, జ్యోతిరావు పూలేలు బంజారాల గురించి ఏంతో పోరాడారు.

బ్రిటిష్ వారి కనుసన్నలలో 1911నుంచి 1948 వరకు పాలన సాగించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ బ్రిటిష్ వారి నల్లచట్టాన్ని తెలంగాణలోని బంజారాల మీద అమలు చేశాడు. నేరస్తులుగా ముద్రవేయబడ్డ వారికి పాస్‌లు ఇచ్చాడు. పాస్‌లు చూపించని వారిని అరెస్టు చేసే అధికారాన్ని పోలీసులకు ఇచ్చాడు. తన ప్రత్యక్ష పర్యవేక్షణలోకి తీసుకురావడానికి అడవికి సమీపంలో ఉండే తండాలను గ్రామాలకు దగ్గరగా తరలించాడు. తెలంగాణలోని బంజారాలు నిజాం సంస్థానంలో ఉండడంవల్ల రిజర్వేషన్లు వారికి అందకపోగా, నల్లచట్టం వారికి ఆశనిపాతంలా మారింది. జాటోత్ ఠాణు నాయ క్ సాయుధపోరులోకి దిగడానికి భూస్వామ్య వ్యవస్థతోపాటు తెలంగాణలో బంజారాల విషయంలో అమలవుతున్న బ్రిటిష్‌వారి నల్లచట్టం కూడా ఒక కారణం. 1948 లో సైనిక చర్య జరిగి తెలంగాణ భారతయూనియన్‌లో కలిసిన తరువాత కూడా బం జారాలకు రిజర్వేషన్ అందలేదు. వారు డీ నోటిఫైడ్ ట్రైబ్ అనే గుర్తించబడ్డారు. 

1975లో ఎమ్జన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన రావడంతో ఇందిరాగాంధీ దాన్ని ఎత్తివేసింది. ఎమ్జన్సీ మరకను తుడిచేసుకొని ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఇందిరా గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, ఇరవై సూత్రాల పథకం వంటి పథకాలను ప్రకటించింది. అందులో భాగంగా తెలంగాణ బంజారాలకు రిజర్వేషన్ ప్రకటించింది. తెలంగాణ బంజారా ప్రజలకు రిజర్వేషన్ రావడం వెనుక రవీంవూదనాయక్ కృషి కూడా ఉన్నది. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక 26 ఏళ్లకు తెలంగాణ బంజారాలకు రిజర్వేషన్ వచ్చింది. అయితే ఇవ్వాళ బంజారా ప్రజలు సుభిక్షంగా ఉన్నారా అనేది పరిశీలించాలి. బంజారాలు బాగుపడ్డారని బాధపడేవారుపై విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

-డాక్టర్ జె. రాజా
Namasete Telangana News PAPER dATED : 12/08/2012

No comments:

Post a Comment