దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు అయినా గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నారు. దీని వెనుక అనేక పాలకుల నిర్లక్ష్యం, కుట్రలు, కుతంవూతాలు ఉన్నాయి. గిరిజన ప్రజానీకానికి ఎన్నికల ముందు పాలకులు చేస్తున్న వాగ్దానాలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. ఇన్నేళ్ల ప్రజాస్వామ్య పాలనలో పాలకులు ఇచ్చిన వాగ్దానాలేవీ అమలుకు, ఆచరణకు నోచుకోలేదు. అన్ని పార్టీల మానిఫెస్టోల్లోనూ ‘ఆదివాసుల అభివృద్ధికి పాటుపడతామ’ని చెబుతున్నారు తప్ప, ఏపార్టీ చిత్తశుద్ధితో పాటుపడిన దాఖలాలు లేవు. అన్ని పార్టీలు గిరిజనుల సంక్షేమం విషయంలో విఫలమయ్యాయి. 2004, 2009లోనూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో 500 పైగా గిరిజన జనాభా ఉన్న గిరిజన తండాలను అన్నింటినీ పంచాయితీలుగా చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
గిరిజనుల అభివృద్ధికి రాజ్యాంగబద్ధంగా అనేక చట్టాలు, సంస్థలు ఉన్నాయి.ITDA, MADA, IFD, GCC, TRICOR, PTG, DTG, TRIPCO, TRIFED, NSTFDE ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే గిరిజన ప్రాంత అభివృద్ధి కొరకు SCA & Article 275(1పకారం నిధులు మంజూరు చేయాలి. ఆరోగ్య రక్షణకు WHO, CARE, UNICEF లాంటి సంస్థల ద్వారా మార్గదర్శకాలు, భారత ప్రభుత్వం ద్వారా వేల కోట్ల నిధులు విడుదల అవుతున్నా అభివృద్ధి మాత్రం కానరావడం లేదు. గిరిజనాభివృద్ధికి ఏర్పాటు చేసిన సంస్థలన్నీ కేవలం ప్రచారం కోసం మాత్రమే ఉన్నాయి. కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. దీంతో.. రాష్ట్రంలోని ఆదివాసుల జీవితాలు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా తయారయ్యాయి. అడవి నుంచి కట్టెలు కొట్టి అమ్ముకునే జీవితాలు .. తమ కన్నబిడ్డలను అమ్ముకుని బతికే పరిస్థితులు వచ్చాయి.
కనీస పౌష్టికాహారం, ఆరోగ్య వసతులు లేక ఎందరో గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. గుక్కెడు మంచి నీళ్ల కోసం కిలోమీటర్ల మేర నడిచి తెచ్చుకునే పరిస్థితి ఉంది. రక్షిత మంచి నీరు, ఆరోగ్య వసతులు లేక ప్రతియేటా గిరిజనులు సీజనల్ వ్యాధులకు బలిఅవుతున్నారు. మలేరియా, జాండిస్, డయేరియా లాంటి వ్యాధులతో యేటా వందలాది మంది చనిపోతున్నారు. అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఊరుకుంటున్నాయి కానీ.. కనీస నివారణ చర్యలు తీసుకోవడం లేదు. అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనుల పాలిట పాలకుల విధా నాలు శాపాలుగా మారాయి. అటవీ ప్రాంతంలో విస్తారంగా ఉన్న ఖనిజ సంపదే గిరిజనులకు ముప్పు అయ్యింది.ఈ ఖనిజ సంపదను వెలికి తేసే పేరి ట గిరిజన ఆవాసాలను ఖాళీ చేయిస్తున్నారు. దేశంలో.., రాష్ట్రంలో ఖనిజ సంప దను వెలికి తీసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో అధికంగా నష్టపోతున్నది గిరి జనులే.
వాకపల్లి మొదలు మన్యం ప్రాంతంలో బాకై్సట్ తవ్వకాల పేరుతో గిరి జనులను నిర్వాసితులను చేస్తున్నారు. అడవినుంచి తరిమేసే చర్యలతో నిర్వాసితులవుతున్నారు. గిరిజనుల రక్షణకోసం ఉన్న 1/70 చట్టాన్ని కనీసం అమలు చేయకుం డా.. గిరిజనేతరులకు ప్రభుత్వం అండగా ఉంటోంది. దీంతో.. గిరిజనేతరులు గిరిజనుల భూములను కాజేసి ఆదివాసులను నిలువనీడ లేకుండా చేస్తున్నారు.
అలాగే.. గిరిజనులను సామాజికంగా ఆదుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన 7.5, 6.5 శాతం రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగ నియామకాలలో అమలు చేయడంలేదు. దీంతో ఉద్యోగాలలో ఎస్టీ ఉద్యోగాలు బ్యాక్‌లాగ్ పోస్టులుగా మిగిలిపోతున్నాయి. ఇలా రోజు రోజుకూ పెరిగిపోతున్న గిరిజన సమస్యలపై లంబాడ, గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలు, తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం అనేక పోరాటాలు చేసి, ప్రభుత్వానికి ఎన్నిసార్లు మహజర్లు సమర్పించినా.. పట్టించుకున్న పాపానపోవడం లేదు.
కేవలం గిరిజనులను ఓటు బ్యాంకుగా చూస్తూ.. వాగ్దానాలు గుప్పిస్తూ అందలం ఎక్కుతున్నారు. గిరిజన తండాలను పంచాయితీలుగా చేస్తామన్న ఏలికల మాటలు గాలి మాటలుగానే మిగిలిపోతున్నాయి. గిరిజన తండాల్లోనూ గిరిజనేతరులదే ఇష్టారాజ్యంగా అయిపోయింది. దీంతో.. గిరిజనులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలేవీ గిరిజనులకు చేరడం లేదు. ఇప్పటికైనా.. ప్రభుత్వం గిరిజన తండాలను గ్రామ పంచాయితీలుగా గుర్తించి వారి అభివృద్ధికి తోడ్పడాలి.
సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఏవిధంగా అన్యాయాల కు, దోపిడీకి, వివక్షకు గురిఅవుతున్నారో.. అదే విధంగా గిరిజనులు కూడా బలి అవుతున్నారు. ఆత్మగౌరవంతో కూడిన స్వయంపాలన ఉన్నప్పుడే సత్వర అభివృద్ధి జరుగుతుంది. గిరిజనుల అభివృద్ధికూడా తండాలను పంచాయితీలుగా చేసినప్పుడే సాధ్యమవుతుంది. అలాగే.. రాజ్యాంగంలోని 11వ షెడ్యూలులోని అంశాలను ప్రభుత్వం అమలు చేయాలి. తెలంగాణ ప్రాంతంలో గిరిజనులు 16 శాతానికి పైగా ఉన్నారు. రాష్ట్రంలో 25వేలకు పైగా గిరిజన తండాలున్నా యి. నాగరిక సమాజానికి దూరంగా కొండల్లో, కోనల్లో అభివృద్ధిఫలాలకు దూరంగా గిరిజనులు ఉన్నారు.
సమాజంలో అన్ని వర్గాల కంటే.. ఎక్కువగా దోపిడీ పీడనలకు గురిఅవుతున్నది గిరిజనులేనన్నది కాదనలేని సత్యం. కనీస రవాణా సదుపాయాలు, ఆరోగ్య, విద్యా సదుపాయాలు నామమావూతంగాకూడా లేక గిరిజనులు తరతరాలుగా అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజనుల అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే సాధ్యమవుతుందని గిరిజనులు నమ్ముతున్నారు. స్వయం పాలనతోనే గిరిజనుల అభివృద్ధి ముడిపడి ఉందని నమ్ముతున్న గిరిజనులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం కూడా పోరాడుతున్నారు. సాగుతున్న ఉద్యమంలో గిరిజనులు ముందుండి పోరాడుతున్నారు. ఇన్నాళ్లూ సమైక్య రాష్ట్రంలో అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురిఅయిన గిరిజనులు తెలంగాణ రాష్ట్రంలోనే తమ వికాసం ఉంటుందని భావిస్తున్నా రు. ‘మా తండాల్లో మారాజ్యం’ నినాదంతో పోరాడుతున్న గిరిజనులు ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న తెలంగాణ పోరాటంలో అంతర్భాగం అవుతున్నారు.
అనాదినుంచీ.. పోరాటానికీ, త్యాగానికీ మారు పేరుగా నిలిచిన ఆదివాసులు నేడూ పోరాటంలో అగ్రభాగాన నిలుస్తున్నారు. నాటి రాంజీ గోండు, కొమురం భీం, మన్యం పోరాటంలో అసువులు బాసిన గంటం దొర, మల్లు దొర మొదలు.. ఆదిలాబాద్ ఇంద్ర పోరాటం దాకా.. గిరిజనుల చరి త్ర అంతా పోరాటాల, త్యాగాల చరిత్ర. ఈ పోరాటాల, త్యాగాల సాలులో.. నేడు ‘మా తండాల్లో మా రాజ్యం’ కోసం సాగుతున్న పోరాటాన్ని కూడా గిరిజనులు తుది వరకు కొనసాగిస్తారు. విజయం సాధిస్తారు. గిరిజనులను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులకు బుద్ధి చెబుతారు. స్వయం పాలన సాధిస్తారు.
-జి. శంకర్‌నాయక్
తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి Namasete Telangana Paper Dated 11/12/2011
No comments:
Post a Comment