Monday, December 12, 2011

వివాదంలో జాతీయ మీడియా



ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్ జస్టిస్ మార్కండేయ ఖట్జూ ప్రతిపాదిస్తున్న ‘మీడియా నియంవూతణ’ వాదం వివాదస్పదం అవుతున్నది. ఈ మధ్య ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ పిబీ సావంత్ వేసిన వందకోట్ల రూపాయాల పరువు నష్టం దావాతో ‘పవూతికా స్వేచ్ఛ’ చర్చనీయాంశమైంది. భారత రాజ్యాంగం పౌరులకు హమీ ఇచ్చిన ప్రాథమిక హక్కులలోని భావ ప్రకటనా స్వేచ్ఛ (ఆర్టికల్ 19(1)ఎ) లో భాగంగా ‘పవూతికా స్వేచ్ఛ’ను అనుభవిస్తు న్న మీడియాకు ఈ మధ్యకాలంలో జరుగుతున్న వరస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

‘మీడియాలో పనిచేస్తున్న వారిలో మేథో స్థాయి చాలా తక్కువగా ఉంద’ న్న ఖట్జూ వ్యాఖ్యలు దుమారాన్ని లేపుతున్నాయి. అలాగే.. ‘మీడియాకు ఎలాంటి నియంవూతణ లేకపోవడం సమ్మతం కాద’ని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎలక్షిక్టానిక్ మీడియాపై నియంవూతణ లేకపోవడం కారణంగానే విశృంఖలత్వానికి కారణమవుతున్నదని కూడా అంటున్నారు. ‘ప్రెస్‌కౌన్సిల్’ ను ‘మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ గా మార్చి ‘ఎలక్షిక్టానిక్ మీడియాను కూడా దాని ‘నియంవూతణ’లోకి , పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉంద’ ని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి ఇతర మూడు మూల స్తంభాలైన శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలపై కచ్ఛితమైన అంచెలవారి నియంవూతణ వ్యవస్థలున్నప్పుడు నాలుగో స్తంభంగా పిలుస్తున్న ‘మీడియా’ పై మాత్రం నియంవూతణ వ్యవస్థలు లేకపోవడమేమిటని ఖట్జూ ప్రశ్నించారు.

మీడియాలో పనిచేస్తున్న వారి మేథోస్థాయిపై,మీడియాపై కచ్చితమైన ని యంవూతణ వ్యవస్థ అవసరంపై నిర్దిష్ట అభివూపాయాలు వ్యక్తం చేసిన ఖట్జూ మీడియాకు చురకలు పెట్టాడనే చెప్పాలి. జస్టిస్ ఖట్జూ వ్యాఖ్యలపై ఊహించిన విధంగానే మీడియా వర్గాలు భగ్గుమన్నాయి. మీడియాను నియంవూతించడానికి , పర్యవేక్షించడానికి ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసినా అది ‘మీడియా స్వేచ్ఛ’ కు వ్యతిరేకమని వాదిస్తున్నారు. ఐతే.. మీడియా స్వేచ్ఛను ఎవరి స్వేచ్ఛగా భావించాలి? కేవలం మేనేజ్‌మెంట్ల స్వేచ్ఛ మాత్రమేనా? అన్నది కూడా చర్చనీయాంశమవుతున్నది. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలై నా..పార్లమెంటుకు పిలిపించి అభిశంసన చేస్తు న్న సమయంలో.. మీడియాకు మాత్రం జవాబు దారీతనం లేకపోవడం ఏమిటనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎలక్షిక్టానిక్ మీడియాపై ఎ లాంటి నియంవూతణ లేకపోవడంతో.. అశ్లీలత, అనైతిక వ్యాపార కార్యక్షికమాలు మితిమీరుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి.

ఈ మధ్య మీడియా ధోరణులు చూస్తే.. కనీ స విలువలు పాటిస్తున్న దాఖలాలు లేవన్న విమర్శలు వెల్లు రాజకీయ ప లుకుబడికి, పవర్ కారిడార్లలో రెడ్ కార్పెట్ స్వాగతాలకు ‘మీడియా ఓనర్‌షిప్’ దగ్గరి దా రిగా మారింది. దీంతో..దేశంలో మీడియా ఛా నళ్లు వందలాదిగా పుట్టుకొచ్చాయి. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి దేశంలో 746 టీవీ ఛా నళ్లున్నాయి. వీటిలో 366 న్యూస్, కరెంట్ అఫేర్స్ ఛానళ్లున్నాయి. ఇంకా కేంద్ర ప్రభు త్వం దగ్గర మరో 300 ఛానళ్ల కోసం దర ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో కనీ సం మరో 100 న్యూస్ ఛానళ్లున్నాయి. ఇప్పు డు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న ఛానళ్లన్నింటికి అనుమతులు ఇస్తే దేశంలో ఛా నళ్లు 1000 కి మించుతాయి. వచ్చే సాధారణ ఎన్నికలు 2014 నాటికి మరో 500 ఛానళ్లు రావడానికి అవకాశం ఉందని తెలుస్తోంది.
మీడియాలో అత్యంత ప్రభావ శీలమైన, శక్తివంతమైన ఎలక్షిక్టానిక్ మీడియా పై నియంవూతణ లేకపోవడం మూలంగా అనేక అనర్ధాలు ఉంటున్నాయని కేం ద్రం భావిస్తోంది. దీంతో.. టీవీ ఛానళ్ల అనుమతులలో కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే అప్‌లింకింగ్, డౌన్‌లింకింగ్ కోసం ‘నెట్‌వర్త్’ మొత్తాన్ని మూడు కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయలకు పెం చింది. అదనపు ఛానల్‌కు మరో ఐదు కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. ఈ నిబంధనలన్నింటినీ చూస్తే.. ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న ఛానళ్లను నియంవూతించడానికేనని తేటతెల్లమవుతుంది. కొత్త ఛానల్ తీసుకురావాలంటే.. కనీసం వంద కోట్ల రూపాయలు ఉంటే తప్ప ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. 

ప్రభుత్వ విధానం ఇలా ఉంటే.. ఖట్జూ వ్యాఖ్యలు కూడా మీడియాను కలవర పెడుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ‘టైమ్స్ నౌ’ ఛానల్ వందకోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవడం కూడా తీవ్ర కలకలం రేపుతోంది. ‘టైమ్స్ నౌ’ ఛానల్ యజమాని సునీల్ లల్లాకు ఈ పరువు నష్టం దావా విషయంలో కోర్టులో కూడా చుక్కెదురు కావడం సంచలనం రేపుతోంది. ఒక కుంభకోణం కేసులో పొరపాటుగా జస్టిస్ సావంత్ ఫోటో చూపామని, దానికి క్షమాపణ చెబుతూ ఛానల్‌లో వివరణ కూడా ఇచ్చామని ఎంత మొత్తుకున్నా కోర్టు ముం దట ఫలితం లేకుండా పోయింది. సుప్రీంకోర్టు కూడా తీర్పు విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పడంతో.. ై‘టెమ్స్ నౌ’ ఛానల్ బొంబాయి హైకోర్టులో 20 కోట్లు డిపాజిట్ చేసింది. మిగతా 80 కోట్లకు పూచీకత్తు ఇచ్చింది. ఈ విషయం జాతీయ మీడియాలో తీవ్ర సంచలనమై.., చర్చనీయాంశమవుతోంది. దీంతో... ప్రసారాల విషయంలో.. కచ్చితత్వాన్ని పాటించాల్సిన అవసరం ఉందని యాజమాన్యాలకు హెచ్చరిక చేసినటె్లైంది.

ఎలక్షిక్టానిక్ మీడియా రంగంలో రోజు రోజుకూ పెరుగుతున్న పోటీ.., రేటింగ్‌ల కోసం పరుగులు పెడుతున్న తీరు అనారోగ్య పోటీ మూలంగానే.. ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. అలాగే.. ఓ సినిమా నటి కాన్పు సమయంలో.. మీడియా చూపిన అత్యుత్సాహం బ్రాడ్ కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ మీడియా పాటించాల్సిన కనీస పది సూవూతాలను గుర్తు చేయాల్సి వచ్చింది. ‘ఓ సినిమా నటి కి పుట్టబోయే బిడ్డ ఆడా, మగా’ అని కోట్లాది రూపాయల బెట్టింగ్ జరగడానికి మీడియా చూపిన అత్యుత్సాహమే కారణమని ఆరోపణలున్నాయి. మొత్తం మీద ఈ మధ్య మీడియా పై వస్తున్న ఆరోపణలు, వివాదాలు ‘మీడియా స్వేచ్ఛ’ పై అనుమానాలు రేకెత్తించాయి. మీడి యా పాటిస్తున్న ‘స్వీయ నియంవూతణ’ డొల్ల తనాన్ని మీడియా విశ్లేషకులు ఎత్తిపొడుస్తున్నారు. 
ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మార్కండేయ ఖట్జూ ఎలక్షిక్టానిక్ మీడియా స్వీయ నియంవూతణలో నిబద్ధతో పనిచేస్తే నీరారాడియా కుంభకోణం ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తున్నారు. అలాగే.. పెచ్చు మీరిన స్వేచ్ఛ, ఒక వార్తా కథనంతో సెలవూబిటీలుగా మారిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు.ఎలక్ట్రానిక్ మీడియా కొంత మంది హిందీ, ఇంగ్లీష్ జర్నలిస్టులకు కల్పించిన ‘ఇన్‌స్టంట్ ఫేమ్’ వారిని సెలబ్రిటీలుగా మార్చి వేసింది.ఇక వారు అధికార కేంద్రాలతో మమేకమై లాబీ యిస్టులుగా ముదురు తున్నారు. బర్కాదత్, వీర్ సంఘ్వీ లాంటి పేర్లు కుంభకోణాల్లో ఎం దుకు ప్రస్తావనకు వచ్చాయని ప్రశ్నించారు. ఈరోజు మీడి యా చెప్పుకుంటున్న ‘స్వీయ నియంవూతణ’ అనేది నియంవూతణే కాదని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పుతున్నారు.

దేశంలో సామాన్యులు సకల సమస్యలతో సతమతమవుతుంటే.. ఛానళ్లు వినోదం పేరిట ప్రజలను పరిహసిస్తున్నాయి. మరో వైపు క్రైం, ఫ్యాషన్, సినిమా, కబుర్లు, తమాషా వార్తలు, గేమ్‌లతో ఎలక్షిక్టానిక్ మీడియా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ప్రజలను పట్టించుకోకుండా..,ఊ హాలోకాల్లో విహరించే ‘సెలవూబిటీ జర్నలిజం’ ఎక్కువ కాలం మనుగడ సా గించదు. ఇంద్రలోకం అన్న అమెరికా.. ఇప్పు డు ఆర్థిక పతనం అంచున కొట్టుమిట్టాడుతుంటే మీడియా ఏం సమాధానం చెబుతుం ది? ప్రజల పక్షాన నిలబడి, సామాన్యుడు కేం ద్రంగా జర్నలిజం పని చేసినప్పుడే.., ‘వార్త’ కు సామాన్యుని కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు వస్తువులైప్పుడే మీడియా సామాజిక బాధ్యత నిర్వహించినట్లు అవుతుంది.
ఓ సినీ నటుడు ఇచ్చిన విందులో ఎన్నిరకాల వంటకాలున్నాయన్నది ఒక వార్త అయితే.., ఓ హిరో కొడుకు పెళ్లి కుదిరితే..అదే వార్త అయి కూసుంటే.. దానినే వార్తలుగా ప్రసారం చేస్తే.. వాటిని తప్పకుండా ప్రజలు ప్రశ్నిస్తారు.ఇలాంటి అసంబద్ధ విషయాలను వండి వార్చి జనంపై రుద్దితే..వాటిని తప్పక వ్యతిరేకిస్తారు. కన్నీటిని కూడా ‘సై్పసీ’ గా చెప్పడానికి ప్రయత్నిస్తే..అలాంటి వార్తా కథనాలను తిరస్కరిస్తారు. అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి ఉంది. లండన్ నుంచి వెలువడే 150 ఏళ్ల పత్రిక ‘న్యూస్ ఆఫ్ ది వరల్డ్’ మూసివేత, న్యూయార్క్‌లోని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’, ముంబాయిలోని ‘టౌమ్స్ నౌ’ అన్నీ మీడియా పతనానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. ‘స్వీయ నియంవూతణ’ ను నిజమైన స్ఫూర్తితో పాటించినప్పుడే మీడియా గౌరవం ద్విగుణీకృతం అవుతుంది. 

-కంకట రాజారామ్ 
జర్నలిజం అధ్యాపకులు తెలంగాణ విశ్వవిద్యాలయం
Namasete Telangana Telugu News Paper Dated 13/12/2011

No comments:

Post a Comment