Sunday, December 11, 2011

చెరుకు నిర్బంధం-చేదు నిజాలు!


‘Ignorance of law is not excuse and it is not a defence’అనే విషయం అందరికీ తెల్సిందే. ముఖ్యంగా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బాగా తెలుసు. ఎందుకంటే వారు పాలిస్తున్న ప్రజలకు కిందిస్థాయి ఉద్యోగులకు తరచూ చేసే వ్యాఖ్య కనుక. కానీ డాక్టరు చెరుకు సుధాకర్ అరెస్టు విషయంలో ఆ జిల్లా కలెక్టర్, పోలీస్‌బాస్‌కు డిసెంబర్ 6న సెలవు దినం అయినప్పటికీ హడావుడిగా ‘జీవో’ జారీ చేసి చెరుకు సుధాకర్‌ను 12 మాసాలు జైల్లోనే నిర్బంధించాలని ఉత్తర్వులు జారీ చేసిన ఈ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి రాజ్యాంగం, ప్రాథమిక హక్కుల గురించి ప్రాథమిక జ్ఞానం లేదనే విషయం బయటపడింది. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కూమార్‌రెడ్డికి నల్లచట్టాలపైనే మక్కువ ఎక్కువ ఉన్నట్లుంది. గురువారం నాడు హైకోర్టు చెరుకు సుధాకర్ విషయంలో ఇచ్చిన ఉత్తర్వులు చూస్తుంటే ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. 

telanganana02-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema


భారత రాజ్యాంగంలోని ఆర్టిక ల్ 12 నుంచి 35 వరకు గల అధికారణాలలో పౌరుల ప్రాథమిక హక్కుల గురించి పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా ఆర్టికల్ 19 లో ప్రతి పౌరునికి ఆరు రకాల స్వాతంవూత్యాలున్నాయనీ పేర్కొన్నారు. ఈ అధికరణలోని ఆరురకాల హక్కులు చెరుకు సుధాకర్ నిర్బంధం విషయంలో హ రించబడ్డాయి. ఆర్టికల్ 21 ప్రకారం ఏ వ్యక్తి ‘జీవించే హక్కును’ కాల రాయరాదు. రాజ్యాంగంలోని 86వ సవరణ ద్వారా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 50 ప్రకారం ఏ ఒక్క వ్యక్తిని కారణం తెలుపకుం డా నిర్బంధంలోకి తీసుకోరాదు. నిర్బంధంలోకి తీసుకునే ముందు తన భార్యాపిల్లలకు లేక సమీపబంధువులకు అరెస్టుకు గల కారణాలను రాత పూర్వకంగా తెలుపుతూ నోటీసు జారీ చేయాలి. మరి రాజ్యాంగంలోని, చట్టంలోని ఈ పద్ధతులను పోలీసులు పాటించారా? అస్సలు పాటించలేదు. పైగా ఉల్లంఘించారు. చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు మరిక్కడ ఎవరు? శాంతియుతంగా నాలుగున్నర కోట్ల ఆకాంక్ష మేరకు ఉద్యమిస్తున్న డాక్టర్ సుధాకరా? లేక నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శా? ఎవరు దోషులు?



1980లో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చాక 1971లో ఇందిరా ప్రభుత్వం తెచ్చిన ‘మీసా’ ను జనతాపార్టీ ప్రభుత్వం రద్దు చేస్తే మళ్లీ ‘ నాసా’ తెచ్చింది. ఈ జాతీయ భద్రతాచట్టం(నాసా) రాష్ట్రంలో ప్రయోగించిన సంద ర్భం లేదు. ఈ బూజుపట్టిన పాత చట్టాన్ని దుమ్ముదులిపి, మొదట అజ్ఞానంగా ‘పీడీ’ చట్టం పెట్టి మళ్ళీ నాలుక కర్చుకొని రద్దుచేసి ఒక ప్రజావైద్యుడు, కవి, రచయిత, సౌమ్యుడైన చెరుకు సుధాకర్‌పై ‘నాసా’ఎందుకు ప్రయోగించారు? నల్లారి కిరణ్‌కుమార్‌డ్డి నల్లచట్టాలను తెలంగాణవాదులపై ఉక్కుపాదం మోపుతున్నాడనే సందేశాన్ని అందరికీ తెలపడానికేనా? ఆ ప్రయోగం చెరుకు పై చేస్తే, ముఖ్యమంవూతికి చేదు అనుభవమే ఎదురైంది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ చెంపచెల్లుమనిపించింది. కనీస సహజ న్యాయ సూత్రాలను పాటించని ఈ ఫాసిస్టు ప్రభుత్వ ఆగడాలకు హైకోర్టు చెక్‌పెట్టింది. ఆ అత్యున్నత న్యాయస్థానానికి వేలాది దండాలు. 



తెలంగాణ వాదులు ఎవరూ రోడ్డుపైకి రావద్దు అస్సలు బయటికే రావద్దు. ఖానూన్ గీనూన్ జాంతానై ! నక్రాల్ జేస్తే నడ్డివిరగ గొడ్తం’ సంసారానికి పనికి రాకుండా చేస్తాం! జాగ్రత్త బిడ్డ నీపై కూడా పీడీ ,నాసా పెట్టాలని రివ్యూ జరుగుతుంది. పైకెళ్లి ఆర్డర్! పక్కలిరగ తంతం, జైల్లోపెడ్తం, ఇదీ.. నేడు తెలంగాణ పది జిల్లాల్లో ప్రతి ఉద్యమకారునిపై వాడే.. భాష?!



ఏం సార్! రాజ్యాంగం రద్దయిందా? దాన్ని తెలంగాణలో తగులపెట్టారా? ఈ రాష్ట్రంలో మేం రెండవ శ్రేణి పౌరులమా? రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు- ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించే గాంధేయమార్గంలో నిరసన తెలిపే కనీస హక్కులు కూడా లేవా? తెలంగాణోళ్లం మనుషులం కాదా? ఈదేశ పౌరు లం కాదా? ఈ దేశ రాజ్యాంగ హక్కులు మాకు వర్తించవా? మేం ఐఎస్‌ఐ తీవ్రవాదులమా? రాత్రి తీసుకొచ్చి లాకప్‌లో పడేసిండ్రు? దోమలు, పురుగులు తిండి సంగతి అటుంచండి.. కనీసం మంచినీళ్లు లేవు. ఏం నేరం, ఏపాపం చేసినాం సార్ మేము? తెలంగాణ గడ్డమీద పుట్టిందే మా పాపమా? నీల్లుపాయె, నిధులు పాయె, నౌకర్లు పాయె, ఉపాధిపాయె.. చివరికి జీవితాలే పాయె. కనీసం ప్రాణాలతోనైనా బతకనియ్యరా? ఇవీ నిత్యనిర్బంధంలో దుర్భ ర బతుకుల తెలంగాణ వాదుల ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు బదులేది? బందూకులే జవాబులా? 



‘నేరమే అధికారమై - అమాయక ప్రజలను వేటాడి వెంటాడి చంపుతుంటే చూస్తూ కూర్చున్న ప్రతివాడూ నేరస్తుడే’ అన్నాడు ఓ కవి. 



అందుకే మాలాంటి వాళ్ళమంతా వయస్సును లెక్కచేయకుండా ఉన్న సీమాంధ్ర పార్టీలను, మాట తప్పిన అధినాయకత్వాలను ధిక్కరించి తెలంగాణ ఉద్యమంలో చేరాం. శాంతియుతంగా, గాంధేయమార్గంలో ఉద్యమిస్తున్నాం. అహింసాపద్ధతిలో, శాంతియుతంగా ఉద్యమించాలని తెలంగాణ వాదులకు ప్రతిసందర్భంలో పిలుపునిస్తున్నాం. కానీ ఈ సీమాంధ్ర సర్కార్ కవ్విస్తున్నది. చేతగాని దద్దమ్మలారా గాంధీమార్గం ఏంట్రా? అని అవహేళ న చేస్తున్నది. గాంధీ బొమ్మల సాక్షిగా గాంధేయవాదాన్ని అవమానిస్తున్నారు.కవ్వించి, నిర్బంధించి, అవమానించి, అవహేళ న చేసి ఈ శాంతియుత గాంధేయ ఉద్యమాన్ని ఎటు తీసుకపోవాలనుకొంటోంది ఈ సీమాంధ్ర సర్కార్? ఏం చేద్దామనుకొంటుంది ఈ నాలుగున్నర కోట్ల మందిని? ఈ ప్రశ్నలకు జవాబులు వెతకాలం భయం వే స్తోం ది. ఈ సర్కార్ గాంధేయ వాదులదా? గాడ్సేవాదుల దా? అర్థం కాని శేష ప్రశ్న!



మాటలు తప్పిన ఛీటర్లు నేటికీ లీడర్లుగా చలామణి అవుతున్నరు. మాట తప్పినోడు మోసగించినోడే నిజమైన ఛీటర్ (సెక్షన్ 420ఐపీసీ) అని ఈ చట్టం నిర్దేశిస్తుం ది. కానీ దురదృష్టవశాత్తు ఈ ఛీటర్లే నేటిమేటి నాయకులయ్యిండ్రు, వారికి మరింత కట్టుదిట్టమైన అంచెలవారి భద్రత, సర్కార్ సొమ్ముతో మరింత ప్రచార ఏర్పాట్లు... ఏందీ వ్యవస్థ. ఎందుకీ అవస్థ!?



నేటి తెలంగాణ ప్రజలు తెలివి లేనోల్లు కాదు. రజాకార్లపై రణం చేసి నియంతృత్వానికి గోరికట్టిన వాళ్ళు. నాటి నుంచి నేటివరకూ పోరాటం వారి ఇంటిపేరు. త్యాగాలు వారికి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి. తాతకు దగ్గు, చేపకు ఈత నేర్పినట్లు.. కిరణ్‌కుమార్‌డ్డి కిరి కిరి చేష్టలను, నల్లారి నల్లచట్టాలను ఎట్లా ఎదుర్కోవాలో తెలంగాణ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్యే! అందుకే.. ఆగడాలకుపోకుండా.. ఆధిపత్యం ఆపి, అహం వీడి అంబేద్కర్ ఆలోచనా విధానంతో సాగుతున్న ఆడబిడ్డ దళిత పులి మాయావతి మార్గంలో నడవండి. మీరూ .. మేము తెలుగు వాళ్లమే. సర్వేజనః సుఖినోభవంతు. 

-ఏపీ జితేందర్‌డ్డి
మాజీ పార్లమెంటు సభ్యుడు Namasete Telangana News Paper Dated 11/12/2011

No comments:

Post a Comment