చంద్రబాబు మాంఛి ఊపుమీద ఉన్నడు. ఆదిలాబాద్‌లో, నిజామాబాద్‌లో ఆయన వాహనం మీద పడిన కోడిగుడ్లను ఆయన తూడ్చేసుకుని ఉంటడు. ముఖం మీద పడనందుకు సంతోషించి కూడా ఉంటడు. జక్రాన్‌పల్లిలో స్టేజీ మీదకు దూసుకొచ్చిన చెప్పు కూడా దగ్గరి దాకా రానందుకు ఆయన దాన్ని పట్టించుకొని ఉండడు. రైతుల గురించి ఆయన తెలియజేసుకున్న విషయాలను ఎంత మంది విన్నరన్న విష యం కానీ, ఎంత మంది ఆయన సభకు, యాత్రకు హాజరయ్యారన్నది కానీ ఆయన పట్టించుకునే మూడ్‌లో లేడు. ఆయనిప్పుడు పగటికలల్లో ఉన్నడు. అందుకే అసెంబ్లీలో మూడుగంటలు పైన మాట్లాడినా ఆయన నోటిపొంట పొరపాటున కూడా ఎత్తని మాట ఇవ్వాళ్ల పలికిండు. ‘నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు’ అనగలిగిండు.అంతమావూతానికే ఆయన వెంట పాదయావూతలో తిరుగాడిన తెలంగాణ ఎమ్మెల్యేల ఒళ్లు పులకరించి ఉంటుంది. ఉ అంటే ఉసిళ్ల పాపయ్య.
ఇంగ తెలంగాణ అని బాబు అన్నడు కదా అని వాళ్లు ఒళ్లూపై మరిచి పగటి కలలు కన్నట్టున్నరు. అతి ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు ఇక నేనొక్కణ్నే నాయకున్ని అని ప్రకటించేసుకున్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ కలిసిపోతుంది. కేసులు ఎత్తివేస్తే జగన్ కాంగ్రెస్‌లో కలిసిపోతడు. అటూ ఇటూ ఇంగ ఎవ్వరు? నేనే నంబర్‌వన్ ప్రతిపక్ష నాయకున్ని. కాంగ్రెస్ ఓడిపోతది. నేను గెలిచి మళ్లీ ముఖ్యమంవూతినయిత. అదీ చంద్రబాబునాయుడు సరికొత్త రాజకీయ సిద్ధాంతం. పనిలో పనిగా ఈ ఊపుమీద ఆయన రెండుకళ్ల సిద్ధాంతం మరిచిపోయి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడే ఛాంపియన్‌గా కూడా ప్రకటించుకున్నాడు. తెలుగుజాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్ కాలం నాటిదేమో కానీ, వర్తమానంలో అది కాలం చెల్లిందనే విషయం మాత్రం చంద్రబాబు మరిచారు. తెలుగుజాతి ఆత్మగౌరవం తర్వాత, ఈ అచ్చికాలు బుచ్చికాలకు తెలంగాణ ఏమైపోయిందో? ఏమి కోల్పోయిందో? తెలుసుకున్న తర్వాతనే తెలంగాణ ఉద్యమం తెరలేచింది.
అదిప్పుడు పాలు నీళ్లను, తెలుగుజాతి ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎట్లా మంటగలిపిందో? పదహారు సంవత్సరాల ఉద్యమం ప్రత్యక్షంగా అనుభవించింది. ఇంత జరిగినాక తెలుగుజాతి ఉద్ధారకుడుగా చంద్రబాబు మళ్లీ అవతారమెత్తాడు. పచ్చి తెలంగాణవాదిగా సవాళ్ల మీద సవాళ్లు విసిరే ఎర్రబెల్లి దయాకర్‌రావు చివరికి మేము తెలంగాణతో గెలవలేదు. అభివృద్ధి నినాదంతో గెలిచామని కూడా ప్రకటించేశారు. ఇక తన్నుకు చావండి. స్క్వేర్‌వన్. ఎవరైనా సరే. లక్ష చెప్పండి. ఇక వాళ్లు మారరు. తెలంగాణను పొరుకపోడు చేసి విధ్వంసం చేసిందే మీరు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చివరకు పేరు కూడా ఎత్తకుండా కట్టడి చేసి హరించిందే మీరు. మీ వల్లనే కదా ఇన్ని పుల్లెందలు అని అంటామనుకోండి. వాళ్లు నమ్మేలా లేరు.
నిజామాబాద్‌లో, ఆదిలాబాద్‌లో కోడిగుడ్లను, చెప్పులను, రాళ్లను, అడ్డంపడి జై తెలంగాణ అని నినాదాలు చేసిన మహిళలను వారు మరిచిపోయారు. ఒక నాయకుడొస్తే ఊరేగింపులు తీసే, వెంట నడిచే, సభలు క్రిక్కిరిసే కాలం కాదిది. చంద్రబాబు వస్తే తెలంగాణ సంగతేంది? అని అడిగే కాలం అని మరిచిపోయిండ్రు. వెంట వాహనాలు, ఇక్కడి నుంచే వెళ్లి న దండు, తోడు పోలీసులు, నినాదమిస్తే ఈడ్చేసి స్వామిభక్తి చాటుకునే సొంత భటులు, ప్రభుత్వ భటులు, స్వయంగా ‘జెడ్’ సెక్యూరిటీ పుణ్యం, ఒక నాయకునికి ఇంత కన్నా అవమానం ఉంటుందా? ఇంత పకడ్బందీగా, పోలీసు కాపలాలో పాదయావూతలు చేసే దుస్థితి ఎందుకేర్పడింది. ముక్కు తూ, మూల్గుతూ అయినా ఎందుకు? నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు అని ప్రకటించుకోవాల్సి వచ్చింది. ఇది పట్టించుకోవడం లేదు చంద్రబాబు. ఒక దండయావూతను ఆయన పాదయా త్ర అనుకుంటున్నరు. ఒక బలవూపయోగంతో ప్రజల్లోకి వెళ్లడాన్ని ఆయన విజ యం అనుకుంటున్నరు. సరే అట్లాగే.
చంద్రబాబు రాజకీయాలది ఒక ప్రత్యేక శైలి. ఇవన్నీ ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయనే తెలుసు.గురువింద గింజ లాగా ఆయన స్వయం గా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రపంచానికి నీతులు చెప్పగలడు. తెరచిన పుస్తకం లాంటి జీవితం అని చెప్పించగలడు. గంభీరంగా నటించగలడు. న్యాయమూర్తుల ‘నాట్ బిఫోర్ మీ’ ఆటలతో ఎక్కడా కనపడకుం డా కనీసం తమ కుటుంబ సభ్యులు పిటిషన్ దారులుగా లేకుండా, తన మీద సీబీఐ విచారణను నిలుపు చేయించుకోగలడు. చక్రం తిప్పగలడు. కిందపడ్డా నేనే నెంబర్ వన్ అనగలడు. కనీసం అలా నటించగలడు. గోబె ల్స్‌ని మించగలడు. ఆయన మీడియా మేడ్ మహా నాయకుడు. అవినీతి సంగతులు ఎవరూ మాట్లాడకుండానే అన్నా హజారే ఫోటో పెట్టి తమ్ముడు హజారే కాగలడు. జగన్ గురించో మరొకరి అవినీతి గురించో మాట్లాడేటప్పుడు ‘నీతి నిరూపించుకో..కోర్టుకు ఎందుకు వెళ్లడం’ అని ధర్మోపన్యాసం ఇవ్వగలడు.
తీరా తాను మాత్రం కోర్టుకు పోకుండా కాగల కార్యాన్ని గంధర్వులో, న్యాయమూర్తులో ఎవరో ఒకరితో తీర్చుకోగలడు. అన్నింటికన్నా ఎక్కువగా కాలేజీలకు, ఫంక్షన్లకు వెళ్లి విద్యార్థులకు నీతిబోధ చేయగలడు. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఉధృతంగా లేదనుకుని ఇటు చంద్రబాబు, అటు జయవూపకాశ్ నారాయణ నీతి బోధలతో తెలంగాణ మీద పడిపోవడం ఒకే గూటి పక్షుల్లా ఉండడం, కనీసం అగుపడడంలో తప్పేమీలేదు. దేశం అవినీతి మయమయింది నిజమే. కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న వారు ఎవరూ నీతిబోధలు చెయ్యరు. ఒక్క తమ్ముడు హజారే తప్ప. ఇదే ఆశ్చర్యం. జీవితంలో ఏ అవినీతీ చెయ్యజాలని , అవినీతికి కనీస ఆస్కారంలేని జనాలకు, సామాన్యులకు, విద్యార్థులకు వీళ్లెందుకు నీతిబోధలు చేస్తా రో? అర్థం కాని విషయమేమీకాదు.
వేల ఎకరాలు కబ్జా చేసినవాళ్లు , బంధు ప్రీతితో కోట్లు కొల్లగొట్టిన వాళ్లు , సామ్రాజ్యాలు నిర్మించుకున్న వాళ్లు సామాన్యులకు నీతిబోధ చెయ్యడం ఒక క్రూర పరిహాసం. ఇక చంద్రబాబు పాదయావూతలకు ఒక వర్గం మీడియా పరవశంతో పులకించిపోతున్నది. ఆయన అట్ల నడిచివస్తూ రైతుల కోసం తెలియజేసుకుంటున్న విషయాలను లైవ్‌లో చూపి మరీ నొక్కి వక్కాణిస్తున్నది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆ మీడియా కొన్నాళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. తాము అనుకుంటున్నట్టుగా, తమ తమ నాయకుల కోసం, తాము నిర్దేశించుకున్నట్టుగా తమ తమ ఎజెండాలను తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దడం మీడియాకు కష్టమైపోయింది. పూర్వపు స్వేచ్ఛ కోల్పోయినట్టుంది. తెలంగాణ విషయంలో ఎవరైనా అటా? ఇటా? తేల్చుకోవాల్సిన సందర్భాల్లో మీడియా, మరీ ముఖ్యంగా ఎలక్షిక్టానిక్ మీడియా అచ్చంగా చంద్రబాబు ఎదుర్కొన్న ఇబ్బందులనే ఎదుర్కొన్నది.
అందువల్ల ఇన్నాళ్లకైనా పరవశంతో, ఉత్సాహంతో చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టి ఆగమాగం తిరుగుతున్నట్టుగానే, మీడియా కూడా ఇప్పుడు సంబ్రమంలో ఉంది. ‘థాట్ పోలీసింగ్’ దాని నైజం. తెలంగాణను అణచిపెట్టి, ఇక్కడి ప్రజలను గులాములుగా, బానిసలుగా, చిరకాలం ఒక వలస ప్రాంతంలో ఉండే ఇన్ఫీరియర్‌గా మలిచే పని చేసింది మీడియానే. తొలినాళ్లల్లో అది సినిమా మాధ్యమంగా ప్రారంభమై తెలంగాణ బౌద్ధిక ప్రపంచం మీద దాడి చేసింది. కేవలం వినోదమే ప్రధానంగా సినిమా తెలంగాణ మీద దాడి చేయలేదు. అంతకన్నా గాఢంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, వ్యవహారాలు, జీవన విధానాలు, ఆర్ధికత, సామాజికతల మీద సినిమా మీడియా ముప్పేట దాడి చేసింది. చివరకు భాషను కూడా అవహేళన చేసేస్థాయికి అది ఎదిగింది. తెలంగాణ తన స్వంత అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి తెచ్చింది కూడా సినిమాయే. పండుగలు, పబ్బాలు, భాష విషయంలో తెలంగాణ ప్రజలను సినిమాలు న్యూనతలోకి నెట్టాయి.
ఆ తర్వాత కోస్తానుంచి పెట్టుబడులు, ప్రింట్, ఎలక్షిక్టానిక్ మీడియా విస్తరణ అన్నీ తెలంగాణ ప్రజల మీద ఆలోచనల మీద ఒక దండయాత్ర చేశాయి.
తెలుగు రాష్ట్రంలో కొంత మీడియా, చంద్రబాబునాయుడు, జయవూపకాశ్ నారాయణలు ఒక్క తెలంగాణ అంశంలో తప్ప అన్ని అంశాల్లో స్వరూప స్వభావాల్లో ఒక్కటిగా ఉండడమే ఇప్పటి వాస్తవం. వాళ్లది ఒక్కటే రాగం. అది తెలంగాణ వ్యతిరేక రోగం. వీరికి వ్యతిరేకంగా ‘ఏది నిజం’ మీడియా మరో రకం. అది ఏకభజనతో పులకిస్తూ ఉంటుంది. జయశంకర్ సార్ చెప్పి న మాటల్లోనే కోస్తాం ధ్ర ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం, దానికి దన్నుగా దళారీ పెత్తందారులు, వీరి ప్రయోజనాల కోసం పనిచేసే మీడియా ఈ రెండు వ్యవస్థల్లో అటు కిరణ్‌కుమార్, ఇటు చంద్రబాబులకు రక్షణ కవచాలు. చంద్రబాబుకు తెలియని రహస్యం ఒకటి తెలంగాణ గర్భంలోనే దాగి ఉంది. అది చరిత్ర. విశిష్టత. నలభై రెండు రోజుల సమ్మెతో తెలంగాణ రాలేదు. కానీ అది చారివూతాత్మకమైంది. ఒకటి సుదీర్ఘంగా జరగడం రెండు రాజకీయ డిమాండ్ కోసం జరగడం. ఆ సమ్మెకు ఒక విజయం ఉంది.
అదే తెలంగాణ రాజకీయ బానిసల స్వరూపాన్ని అది బట్టబయలు చేసింది. ప్రజలు, సమ్మె కట్టిన కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సకల జను లు ఒకవైపు, రెండు కళ్లూగల చంద్రబాబు తొత్తులైన ముపె్పైమంది తెలంగా ణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లో ఉన్న తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సారాంశంలో ఆంధ్ర ఆధిపత్యానికి బానిసలని తేల్చేసింది. వారి నిజస్వరూపాన్ని బాంచెతనాన్ని సమ్మె లోకానికి వెల్లడించగలిగింది. అది చాలు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌లు పగటి కలలు కనక్కరలేదు. ఎవరేమిటో ఇప్పటి తెలంగాణకు తెలుసు.అదీ సమస్య..దూద్‌కా దూద్.. పానీకా పానీ...
-అల్లం నారాయణ
Namasete Telangana News Paper Dated 18/12/2011
No comments:
Post a Comment