Wednesday, November 23, 2011

‘బహుళజాతి’కే పోల‘వరం’-అమర్


కనాడు సస్య విప్లవ లక్ష్యంతో ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించబడ్డ భారీ నీటి ప్రాజెక్టులన్నీ రాను రాను కొరకరాని కొయ్యలని తేలిపోతున్నాయి. ఇవి భావి తరాలకు ఇంకా భారంగా పరిణమించే మాటెలా ఉన్నా, పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు మాత్రం బహుళజాతి సంస్థలకు బంగారు గుడ్లు పెట్టే బాతుగా నిర్దేశించబడింది. విశాఖ-విజయవాడల ప్రత్యేక ఆర్థిక మండలి కోస్టల్ కారిడార్‌లకు అపార జలరాశులను, చౌక విద్యుత్‌ను అందిస్తూ బహుళజాతి సంస్థలకు మౌళిక సదుపాయాలు కల్పించే కల్పతరువుగా మారనుంది. కరువు ప్రాంతాలను విస్మరించి, లక్షలాది ప్రజలను నిర్వాసితుల్ని చేసి; రెండు లక్షల ఎకరాల సాగుభూములను, అడవులను, పాపికొండల వైల్డ్ లైఫ్ సాంక్చువరి (పులుల అభయారణ్యాన్ని)ని, కడకు భద్రాదిని కూడా నీట ముంచనుంది.


ఈ ప్రాజెక్టు సరికొత్తగా సృష్టించే ఆయకట్టు కేవలం 15,000 ఎకరాలు మాత్రమేనని రిటైర్డ్ ఇంజనీర్స్ ధర్మారావు, ప్రభాకర్‌రావు లాంటి నిపుణులు లెక్కలతో సహా తేల్చిచెప్పారు. ఈ విధ్వంసాన్ని తగ్గించడానికి గోదావరినదిపై చిన్న చిన్న ఆనకట్టలు, చిన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టడం ద్వారా ఏడాది పొడుగునా నీటిని భద్రపరిచి, నిర్వాసిత సమస్యేలే రాకుండా చేయవచ్చని అనేకమంది ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల డెల్టా ప్రాంతంలో భూగర్భ జల సామర్థ్యం పెరిగి గోదావరి, కృష్టా డెల్టాల స్థీరీకరణ జరిగి, దాదాపు మూడువందల టీఎంసీల నీటిని వినియోగంలోకి తేవచ్చని స్పష్టం చేస్తున్నారు. సీలేరు నది నుంచి మళ్లింపు ద్వారా ఆయకట్టు ప్రాంతానికి చేరకముందే 500 అడుగుల నీటి ప్రవాహం, 500 మెగావాట్ల విద్యుత్ సాధ్యమవుతుందని నిర్దిష్ట ప్రత్యామ్నాయాన్ని సూచిస్తున్నారు.



తెలంగాణ ప్రాంత అసమానతల జోలికి వెళ్లకుండానే నష్ట నివారణకు చేసే ప్రత్యామ్నాయాలను, అంతర్ రాష్ట్రీయ న్యాయవివాదాలను పట్టించుకోకుండా అర్ధరాత్రి టెండర్లకు, హడావిడి ప్రయత్నాలకు ఆంతర్యమేమిటి? ప్రాంతీయ అసమానతల కోణం నుంచే కాకుండా, విధ్వంసకర ప్రపంచబ్యాంకు అభివృద్ధి నమూనా నుంచి పోలవరాన్ని పరిశీలించినప్పుడే ప్రత్యామ్నాయ ప్రజానీటి పారుదల వ్యవస్థకు దారి వేసుకోగలము.
బ్రిటీషు కాలం నుంచి పోలవరం పరిశీలనలో ఉన్నా ప్రజావ్యతిరేకత వల్ల దీన్ని నిర్మించడానికి వారు సాహసించలేదు. మొదటి యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి 1966-76 నాటి మొదటి హరిత విప్ల వం కొరతలు, వైఫల్యాలు అధిగమించడానికి, రెండో హరిత విప్లవం చేపట్టాలని పిలుపునిచ్చారు.



వాస్తవంగా 1929 నాటి పెట్టుబడిదారీ ఉత్పత్తి సంక్షోభపు మహా ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి కీన్స్ ఆర్థిక సిద్ధాంతం ఆధారంగా రూపొందిన అమెరికన్ న్యూడీల్ భారీ ప్రాజెక్టుల పథకాన్ని, రష్యన్ ప్రణాళికబద్ధ సోషలిస్టు భారీ వ్యవసాయోత్పత్తులను యాంత్రికంగా అనుసరించడమే మొద టి సస్య విప్లవం లోపాలు అనే విమర్శలున్నాయి. గోదావరి నది పై నిర్మించి శ్రీరాంసాగర్ (పోచంపాడు) భారీ నీటి ప్రాజెక్టు రెండో దశ పూర్తికాకుండానే యాభై ఏళ్లలో అరవై శాతం ఇసుల మేటలతో నిండిపోయింది. వృథాగా పోతున్న వరద నీళ్ల కోసం మరో వరద కాలువ నిర్మించాల్సిన పరిస్థితి నేటి తరం కళ్ల ముందు సజీవ తార్కాణంగా ఉన్నది. తుంగభద్ర డ్యాంతో పాటు రాష్ట్రంలోని ఏ భారీ ప్రాజెక్టు ఇందుకు మినహాయింపు కాదు.



కృష్ణా-గోదావరి డెల్టాలకు నీళ్లందిస్తున్న ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం ఆనకట్టలు ఇసుక మేటలు నివారించి, మూడో పంటను స్థిరీకరించడం కూడా పులిచింతల, పోలవరంల ఒకానొక లక్ష్యం కావడం గమనిస్తున్నదే. అందుకే కేంద్ర జలవనరుల సంఘం, గిరిజన కౌన్సిల్, అటవీ, పర్యావరణశాఖ, ప్రణాళిక సంఘం అనుమతి లేకుండానే పోలవరం పను లు ప్రారంభించారు. గ్రామసభల అభివూపాయాలను తోసిరాజని కాల్వల నిర్మాణ పనులకు అనేక ప్యాకేజీలు ప్రకటించి 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట నేతలు, కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారు. ఇప్పటికే 3,500 కోట్ల ఖర్చుతో 80 మీటర్ల వెడల్పుతో కాల్వలు పూర్తి చేయడం వెనుక కాకినాడ-పాండిచ్చేరి కాలువ వ్యాపార అవసరాలు పూర్తి చేయడం ముఖ్య ఉద్దేశంగా కనబడుతున్నది.



దీనిలో భాగంగానే కొన్నేళ్లుగా కొనసాగుతున్న విశాఖ స్పెషల్ ఎక్స్‌పోర్టు జోను ను, విశాఖ నుంచి విజయవాడ వరకు స్పెషల్ ఎకానమిక్ జోన్‌గా మార్చారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా విస్తరించి ఉన్న 960 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కోస్టల్ కారిడార్‌గా ప్రకటించారు. తీరం పొడుగునా 20కిపైగా వస్తున్న ఐదు నక్షవూతాల హోటళ్లు, ఎకో టూరిస్టు కేంద్రాలు, ఫార్మాసిటీ, మెగా కెమికల్ కాంప్లెక్స్, బ్రాండిక్స్ లాంటి ఎన్నో సిరామిక్ కంపెనీలు, షిప్ బ్రేకింగ్ యూనిట్లు, బయో డిజిల్ కంపెనీలు, గంగవరం లాంటి పోర్టులు ఎన్నో అనుమతి పొందాయి.



ప్రత్యేక ఆర్థిక మండళ్లలో బహుళజాతి సంస్థల వాటా 97 శాతం వరకు ఉంది. ఈ విధంగా తెలంగాణ నుంచి వందల కిలోమీటర్లు ప్రవహిస్తూ పశ్చిమగోదావరి జిల్లా పోలవరం దాకా అందివస్తున్న గోదావరి జలాలన్నీ విదేశీ-స్వదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు వంటింట్లోకి వస్తున్న కుందేలులాగా సంతోషదాయకంగా ఉంది. 



పోలవరం కంటే ఎంతోముందు ప్రారంభించాలన్న ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా 85 టీఎంసీల జలాలను పొందే అవకాశాన్ని, ముంపునకు గురయ్యే పొరుగు రాష్ట్రా ల అభ్యంతరాల పేరిట మూలకు పడేశారు. అదే అభ్యంతరాల ఆధారంగా 1977-78లో గోదావరి ట్రిబ్యునల్ వద్ద ఒప్పందం కుదిరి, ‘పొరుగు రాష్ట్రాల సమ్మతితోనే పోలవరం డిజైన్‌ను సిడబ్ల్యూసి అనుమతించాలని’ ఉన్న నిబంధనను మాత్రం బేఖాతరు చేస్తున్నారు. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా నదికి తరలించే 85 టీఎంసీల నీళ్ల వలన, తెలంగాణ ప్రాంతం కృష్ణానది ట్రిబ్యునల్ ద్వారా పొందిన 35 టీఎంసీల వాటాను కోల్పోతుంది. 



ఇవే కాకుండా హైదరాబాద్‌లో కూల్చబడిన చెరువులతోపాటు, తెలంగాణ భూములు తడపాల్సిన ఈసి, మూసి, మంజీర, కృష్ణా నదుల నీళ్లు నగరంలోని భాగ్యవంతులను ముంచెత్తుతున్నా యి. ఇవి చాలదన్నట్టు హైదరాబాద్ తాగునీరు మూడో స్కీముకు దాదాపు మూడువేల కోట్లతో గోదావరి నదీ జలాల ను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ని విధాలుగా తెలంగాణ ప్రజలు పంటలు నష్టపోతూ, అందిస్తున్న నీళ్లు తాగుతూ, తిరిగి హైదరాబాద్‌లో నూ మాకు వాటా కావాలంటూ మాట్లాడడం తిన్నింటి వాసాలు లెక్కబెట్టడమే కదా!



ఆదివాసుల జీవనాన్ని, సంస్కృతిని జల సమా ధి చేసే కుట్ర సాగుతోంది. దీంతోపాటు 1980 అడ వి సంరక్షణ చట్టం, 1986 పర్యావరణ చట్టం, 1/70 రెగ్యులేషన్లను, జీవో 64 కింద మార్గదర్శకత్వాలన్నింటిని తుంగలో తొక్కారు. 1996 పంచాయితీ గిరిజన ప్రాంతాల విస్తరణ చట్టం (పెసా) ప్రకారం 73 రాజ్యాంగ సవరణతో సంక్రమించిన ఆదివాసుల స్వయం నిర్ణయాధికార గ్రామాలను జీవో 68తో నీట ముంచజూస్తున్నారు.



అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 అనుసరించి గ్రామసభ అనుమతుల్లేకుండానే తప్పుడు సమాచారంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి 2010 జూలై 28న ఫారెస్ట్ క్లియన్స్ అనుమతులు తెచ్చా రు. దీనిని ఖండి స్తూ ఆదివాసీ గ్రామసభలు తీర్మా నం చేసి పంపుతున్నాయి. ఆందోళన బాట పడుతున్నాయి. 



7 ఆగస్టు, 2010 రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తీసిన ఉపక్షిగహ చాయాచిత్రం ఆధారంగా 28.50 లక్షల క్యూసెక్కుల వరదనీటిలోనే 369 గ్రామాలు మునిగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది. నిజంగా యాభై లక్షల క్యూసెక్కు ల కంటే ఎక్కువ వరద వస్తే చెప్పలేనంత విలయం సంభవించవచ్చు. ప్రాంతాల మధ్య మరింత అసమానతలు సృష్టిస్తుండడమే సామ్రాజ్యవాదులు ఘనంగా చాటుతున్న అభివృద్ధి నైజమని సులభంగా గ్రహించవచ్చు. దేశ వ్యాప్తంగా నిర్వాసితులైన కోటిమంది ఆదివాసులను చూస్తే ప్రజావ్యతిరేక భారీ ప్రాజెక్టులపై ప్రజలు పోరాడక తప్పదని చరిత్ర నిరూపిస్తున్నది. రాజ్యాంగం, చట్టం ప్రజాభివూపాయాల ను కాలరాస్తున్నప్పుడు ఇంతకం లేదు.



కేరళలోని సైలెంట్ వ్యాలీ, గుజరాత్‌లోని హెరాన్ ప్రాజెక్టులను తీవ్రమైన ప్రజావూపతిఘటన తర్వాతనే పాలకులు రద్దు చేశారు. ప్రాంతీయ అసమానతల తొలగింపు, విధ్వంసకర అభివృద్ధి నమూనాలను అడ్డుకునే ఐక్య ఉద్యమాలను రెండు తెలుగు రాష్ట్రాల నిర్మాణానికి, జలవనరుల పంపిణీలో సమాన న్యాయాన్ని పాటిస్తూ పునర్‌నిర్మాణానికి సరికొత్త ప్రజాభివృద్ధికి ప్రాతిపదికను సృష్టిస్తాయి. ప్రపంచ జీవావరణ దశాబ్దం(2011-2021) ప్రారంభంలో ‘ప్రకృతి మనిషి అవసరాలను తీర్చగలదే గానీ, అత్యాశలను తీర్చలేదన్న’ గాంధీజీ హితోక్తి. పోలవరంతో లబ్ధి పొందాలనుకున్న బహుళజాతి సంస్థల కు అచ్చంగా సరిపోగలదు. 

Namasete Telangana News Paper Dated 24/11/2011

No comments:

Post a Comment