Monday, November 21, 2011

సమైక్యాంవూధలో సమిధపూవ్వరు? By - ఈ. ఆంజనేయగౌడ్సమైక్యాంవూధలో రంగాల వారీగా జరిగిన అన్యాయాల్ని అన్ని కోణాల్లో బట్టబయలు చేస్తున్న చారివూతక సందర్భమిది. సాగునీరు,. వ్యవసా య, రాజకీయ, ఉద్యోగ బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అశాస్త్రీయ పంపిణీ, వివక్షలను ఎండగడుతూ, విభిన్న కోణాల్లో వాస్తవాల్ని నిగ్గు తేలుస్తున్నారు. కానీ సమైకాంధ్ర ప్రదేశ్‌లో 60 శాతం ఉన్న బీసీలకు మూడు ప్రాంతాల్లోని (కోసాంధ్ర, సీమా, తెలంగాణ) మూడు అగ్ర కులాలు కుమ్మకై వివిధ రంగాల్లో చేస్తున్న అన్యాయాలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరముంది. ‘దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ అడుగుజాడల్లో ఉమ్మడి రాష్ట్రం వల్ల ఇరు ప్రాంతాల్లోని మెజార్టీ మాన వ సమాజానికి జరిగిన అన్యాయంపై వాస్తవాల్ని వెలుగులోకి తేవాల్సిన అవసరముంది. ‘మేకల్నే బలియిస్తారు’ అని అంబేద్కర్ అన్నట్లు రాజకీయ ప్రయోజనాల కోసము మెజా ర్టీ ప్రజలైన బీసీల్ని రాష్ట్రంలో నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు.

మగ్గాలు ఉరిపగ్గాలై.. సిరిసిల్ల నేత కార్మికుల్ని బలి తీసుకున్నా... నిలు తాటి చెట్లు గీత కార్మికులకు ఉరికంబాలైనా... గుంపుమాయమై గొర్లకాపర్లు గోడుమన్నా... ఊరి చెరువుపూండి ... చాకిరి రేవు బండలు వెక్కిరిస్తే.. రజకుల గుండెలు పగిలినా... ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయ అధిపత్యకులాల నాయకత్వానికి కనీసం కనీకరం కూడా కలగలేదు. ఈ అగ్రకుల నాయకత్వాలు ఒకరిపై ఒకరు పై ఎత్తులు వేసుకుంటూ రాజకీయ చదరంగంలో బీసీలను పావులుగా మార్చేశారు. రాజ్యాధికారం మాట దేవుడెరుగు కాయితాలకు... నోచుకోని బిక్షగాళ్ళుగా తయారు చేశారు. కేంద్రీకృత, పెత్తందారీ, ఆధిపత్య మనస్తత్వంతో ఎదిగిన డెల్టాంధ్ర, సీమ ప్రాంత అగ్రకుల నాయకత్వం, స్వార్థం, బాని స బుద్దులు, నిరంకుశ మనస్తత్వం కలిగిన తెలంగాణ అగ్రకుల నాయకత్వం సమష్టి కృషి నిర్మించిన ఆంధ్ర ప్రదేశ్‌లో అభివృద్ధి ఫలాలు వారి సొంతమయ్యాయి తప్ప, అట్టడుగు వర్గాలయిన బీసీలకు దక్కలేదు. 

15 మంది రెడ్డిలు, 4 కమ్మలు, 1 వెలమ జనాభా దామాషా ప్రకారం వాటాలు పంచుకొని సమైక్యాంవూధవూపదేశ్‌కు ముఖ్యమంవూతులు గా రాజ్యాధికారాన్ని చెలాయించారు. 60 శాతం పై బడిన బలహీన వర్గాలకు మాత్రము ఒక్కసారి కూడ ముఖ్యమంత్రి పదవి దక్కకుండా కూడబలుక్కొని అడ్డుకున్నారు. నిజానికి నేటి తెలంగాణ నినాదము, మానిపోని గాయాలు, మరువలేని అవమానాల చరివూతగా మిగిలిన ఈ ప్రాంత బలహీన వర్గాల ఆక్రందనమే. ఇదే వివక్షను, అణచివేతను, దోపిడీని అనుభవిస్తున్న సీమాంధ్ర బీసీలు కూడా వాస్తవాలను అర్థం చేసుకొని రాష్ట్రం విడిపోవడానికి సహకరించాలి. సహేతుకమయిన కారణాలతో మార్పును కోరుకుంటున్న వర్గాలు లోతు గా ప్రస్తుత స్థితిలో తమకు ఎదురైన అనుభవాలని పరిశీలించుకోనవలసిన అవసరం ఉంది. 53 సంవత్సరాల కేంద్రీకృత, అప్రజాస్వామిక ఆంధ్రవూపదేశ్ ప్రయోగం వల్ల అత్యధికముగా నష్టపోయింది బీసీలే.

బ్రిటిష్ ఆర్మీ ఇంజనీరు సర్ అర్థార్ కాటన్ నాయకత్వంలో కృష్ణా, గోదావరి డెల్టాలలో వరద నివారణ, నీటి పారుదలను పెంచే చర్యలను చేపట్టడము వల్ల ఆ ప్రాంతములో కొత్త భూసంబంధాలు, ఆధిపత్యశక్తులు ఏర్పడ్డాయి. 77 శాతం సాగుభూమిని ఆధీనములో ఉంచుకున్న కోసాంధ్ర, కమ్మ, రెడ్డి కులాలు, ఆర్థర్ కాటన్ సాగునీటి అభివృద్ధి చర్యల వల్ల ఆర్థికంగా బలపడి రాజకీయ ఆధిపత్య శక్తులుగా తయారయ్యాయి. దీనితో మద్రాస్ రాష్ట్రములో రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించేందుకు శతవిధాల ప్రయత్నించాయి. కానీ తమిళనాడులో ద్రవిడ ఉద్యమంలో ఎదిగిన నిమ్న బీసీ కులాల చైతన్యము ముందు వీరి ఎత్తుగడలు పారలేదు. దీనితో చారివూతక ముందుచూపుతో ‘తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని ప్రారంభించిన స్వంత ఆధిపత్య రాష్ట్రాన్ని కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేసుకోవడములో విజయం సాధించారు.
అదేసమయంలో తెలంగాణ ప్రాంతములో వేలాది ఎకరాలని, గ్రామాలను గుప్పెట్లో ఉంచుకొని నైజాం రాజుకు జమీందారులుగా, జాగీర్దార్లుగా చెలమణి అవుతూ, దౌర్జన్యాలకు పాల్పడుతున్న రెడ్డి, వెలమ నాయకత్వం తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటము వల్ల కమ్యూనిస్టులు తరిమితే పట్టణాలకు, రజాకార్లు వెంటపడితే విజయవాడ, నాగ్‌పూర్‌లకు పరారయ్యారు. 1948లో పటేల్ నాయకత్వంలో నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమయిన తర్వాత, 1952లో జరిగిన ఎన్నికలలో పరారయిన భూస్వాములు, జాగీర్దార్లు కాంగ్రెస్ టోపీలు ధరించి తిరిగి వచ్చారు. దీనితో మూడు ప్రాంతాల్లోని అగ్రకుల నాయకత్వం ‘ఉమ్మడి ప్రయోజనాల ఒప్పందాలలో భాగముగా’ ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీనితో 1956, నవంబర్ 1 నుంచి నేటి దాకా వారి ‘రహస్య రాజకీయ చీకటి సఖ్యత’ బీసీలకు ప్రతి దినము యమగండముగా నిలిచింది. 56 ఏళ్లుగా రాష్ట్ర బడ్జెట్‌ను సంపాదన వనరులుగా మార్చుకున్న అగ్రకుల రాజకీయ నాయకత్వం బీసీలకు సంక్షేమానికి మాత్రము కనీస శ్రద్ధ వహించలేదు. 

ఈ విధంగా సమైక్యాంవూధలో మూడు ప్రాంతాల్లోని బీసీలకు చరిత్ర పొడుగు నా అవమానాలే మిగిలాయి. 1966లో ఏర్పడిన అనంతరామన్ కమిషన్ నుంచి మొదలుకొని నేటి దాళ్వ సుబ్రహ్మణ్యం నాయకత్వంలోని బీసీ కమిషన్ వరకు సిఫార్సులన్నీ బుట్టదాఖలయ్యాయి. స్కాలర్‌షిప్‌లు, ఫీజులు లాంటి రాయితీ పథకాలకు సైతం తూట్లు పొడుస్తున్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కుల కార్పొరేషన్లు పూర్తిగా కుంటుపడ్డాయి. ఆదుకోవాల్సిన బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు లేక కడు పేద సంస్థగా మిగిలింది. వృత్తులు విధ్వంసమై బతుకులు ఛిద్రమయ్యాయి. అన్ని రంగాల్ని ఆక్టోపస్‌లా ఆక్రమించి మూడువూపాంతాల్లోని మూడు అగ్రకుల రాజకీయ నాయకత్వం బీసీలను రథం కింద నడిచే శునకాలుగా మార్చారు.

గంగమ్మ అనే కవిత సంకలనంలో ‘మీకు పంట భూములున్నాయా? అని అడిగితే లేదు సమువూదముంది’ అని బెస్తవారికున్న బతుకు ధైర్యాన్ని కవి వెంకట్ గర్వంగా ప్రకటిస్తాడు. కానీ ఇవాళ సముద్రం సైతం సెజ్‌ల తాకిడికి చిన్నబోయింది. చారివూతక విద్రోహాల సమష్టి అనుభవాల్ని పంచుకొని రాష్ట్ర విభజన ఉద్యమానికి తెలంగాణ, సీమ, ఆంధ్ర ప్రాంతాల్లో ని మేధోవంతులైన బీసీలు ఉద్యమింకపోతే ఈ అగ్రకుల ఆధిపత్య దోపిడీ చరిత్ర స్థిరీకరించబడుతుంది. ప్రపంచ ప్రసిద్ధ కమ్యూనికేషన్ సిద్ధాంతకర్త ‘డెనిస్ మాక్వెల్’ యథాపూర్వక పరిస్థితుల్లో లబ్ధి పొందుతున్న వర్గాలు, తమ స్వార్థం కోసం మార్పును వ్యతిరేకిస్తున్నాయి. ఆ స్థితిలో నిరంతరాయంగా నష్టపోతున్న సమూహాలు మార్పు కోసం పోరాడుతాయి’ అని సూత్రీకరించారు. ఈ ఆలోచనల్ని రాష్ట్రంలోని బీసీలు అర్థం చేసుకోవాలి.

56 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన విద్రో హ పూరిత అనుభవాలతో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ‘చిన్న రాష్ట్రాల ఏర్పాటు అణగారిన వర్గాలకు మేలు చేస్తుందన్న’ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ ఆలోచన వెలుగుల్లోంచే ఈ ప్రాంత బడుగులు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న నుంచి మొదలుకొని.... శ్రీకాంతాచారి, యాదయ్యల దాకా తెలంగాణ నేల నలు చెరుగులా నెత్తుటి త్యాగాల్ని విరభూయిస్తున్నారు. పాటల ప్రవాహం అయిన బెల్లి లలిత దేహాన్ని రాజ్యం పదిహేడు ముక్కలుగా నరికినా.. ఆగని జన నినాదమై ‘డప్పుల దరువేసి, తెలంగాణ పాట పాడరా’ అంటూ విమలక్క గొంతులో మార్మోగుతోంది. ఈ సుదీర్ఘ పోరాటం ఆంధ్ర, సీమ పాలక కులాల దోపిడీ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే ఆగదు. అంతర్గత ప్రాంతీయ దోపిడీదారి, కుల, వర్గ విషకౌగిళ్ల నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి సాధించే దాకా కొనసాగుతుంది.

25 సెకన్లలో నాలుగు రాష్ట్రాలు..
ఉత్తరవూపదేశ్ ముఖ్యమంత్రి మాయావతి మాట నిలబెట్టుకున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం, అభివృద్ధికోసం విశాల ఉతరవూపదేశ్ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేశారు. అస్త్ర శస్త్రాలతో సభకు వచ్చిన ప్రతిపక్షాలకు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే సభ ప్రారంభమైన 25 సెకన్లలోనే యూపీ విభజన తీర్మానాన్ని ఆమోదింపచేసి సభను నిరవధికంగా వాయిదా వేశారు. పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవధ్ ప్రదేశ్, పశ్చిమ్‌వూపదేశ్ కావాలన్న ప్రజల చిరకాల వాంఛను తీర్చారు. 

మాయావతిపై కారాలు మిరియాలు..
యూపీని విభజన చేయాలన్న తీర్మానంపై ప్రతిపక్షాలు ఇరుకునపడ్డాయి. ఇంకా మూడు నెలల్లో ఎన్నికల వేళ మాయావతి చర్య ను ఏమనాలని? సమాజ్‌వాద్ పార్టీ నేత ములయాం సింగ్ ‘ప్రభు త్వం అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజలదృష్టి మల్లించేందుకు మాయావతి ఈ చర్యకు దిగార’ని నిప్పులు చెరిగారు. మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు మాయావతి రాజ్యాంగవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.


రీసెర్చ్ స్కాలర్, తెలంగాణ బీసీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు Namasete Telangna News Paper Dated 22/11/2011

No comments:

Post a Comment