Monday, November 21, 2011

మాయావతి ప్రకటన తెలంగాణపై బీజేపీ వెనుకడుగు! By Chalasani Narendhra



bjp-leaders
ఉత్తర ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం- ఆ రాష్ట్ర రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపినా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇక్కడ జరుగుతున్న ఆందోళన తీవ్రతను తగ్గించడానికి కాంగ్రెస్‌ పార్టీకి ఆయుధం అందించినట్లయినది. కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలోకి వస్తే మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచినప్పుడు హామీ ఇచ్హిన బీజేపీ అగ్రనేతలు ఎల్‌.కె. అద్వాని, సుష్మ స్వరాజ్‌ వంటి వారి నోటికి తాళం పడినట్లయింది.


కేంద్రంలో అధికారంలోకి రావాలంటే, దేశంలోనే అతి పెద్దరాష్ట్రం, 80 ఎంపీ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో పాగా వేయడం కీలకం. అందుచేత 2014 ఎన్నికలలో కేంద్రంలో అధికారం చేపట్టాలని కలలు కంటున్న రాజకీయ పార్టీలకు, నాయకులకు ఈ ఎన్నికలు కీలకంగా పరిణమించాయి. బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌ కంటె ఉత్తర ప్రదేశ్‌లో పాగా వేయడం కీలకం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతగా మద్దతు ఇచ్చినా ఇక్కడ వారు గెలుపొందే స్థానాలు ఒకటి, రెండుకు మించి ఉండవు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు కనిపిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్‌, వామపక్షాలు మినహా- మిలిగిన అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వక తప్పదు.

తమ రాజకీయ మనుగడ కోసం టీఆర్‌ఎస్‌, తెలుగు దేశం, వైఎస్‌ఆర్‌ ఆర్‌ కాంగ్రెస్‌ వంటి పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తే బీజేపీతో సన్నిహితంగా మెలగక తప్పదు. అందుచేత తెలంగాణ అంశంపై పట్టుదలకు పోవడంకన్న వారికీ ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలపై దృష్టి పెట్టడం ప్రధానం. ఇంతవరకు చిన్న రాష్ట్రాల ఏర్పాటు తమ విధానం అంటూ వచ్చిన బీజేపీ ఇప్పుడు మాట మార్చింది. మాయావతి ప్రకటన అనంతరం ఉత్తర ప్రదేశ్‌ విభజన కోసం తాము మద్దతుఇస్తే, ఖ్యాతి అంతా ఆమెకే దక్కుతుందని బీజేపీ, కాంగ్రెస్‌లు భయపడుతున్నాయి. అందుచేత మాయావతి ప్రకటనను రాజకీయ అవకాశవాదంగా కొట్టి పారవేసి, ఉత్తర ప్రదేశ్‌ విభజనకు తమ వ్యతిరేకతను వెల్లడి చేయక తప్పలేదు.

బీజేపీఅగ్ర నాయకుడు మురళి మనోహర్‌ జోషి, ఉత్తర ప్రదేశ్‌ విభజనను వ్యతిరేకిస్తామంటూ చిన్న రాష్ట్రాల ఏర్పాటు ప్రయోగం విఫలమైనట్లు స్పష్టం చేశారు. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజనాథ్‌ సింగ్‌, ప్రస్తుత అధ్యక్షుడు నితిన్‌ గడ్కారిలతో పాటు అగ్రనేత అద్వాని సైతం తొందర పాటుతో రాష్ట్రాల విభజన చేయ కూడదని హెచ్చరించారు. అయితే తెలంగాణ అంశం ప్రత్యేకం అని అంటున్నా, చివరకు పార్లమెంట్‌లో తెలంగాణ అంశంపై బిల్లు పెట్టాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తే బీజేపీ మద్దతు ఇచ్చే అంశం నేడు ప్రశ్నార్ధకంగా మారింది.

ఉత్తర ప్రదేశ్‌లో గతంలో సొంత బలంపై ప్రభుతాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ చాలా కాలం అతి పెద్ద పార్టీగా ఎన్నికలలో గెలుస్తూ వస్తున్నది. అయితే అక్కడ పార్టీలో అంతర్గత తగాదాల కార ణంగా ఆ పార్టీ బలం తగ్గుతూ వచ్చింది. గత లోక్‌ సభ ఎన్నికలలో నాలుగో స్థానంలోకి వచ్చింది. అయితే గత రెండు సంవత్సరాలుగా బీజేపీఉమ్మడి కృషి చేయడం ద్వారా నేడు ఆ పార్టీ పరిస్థితి మెరుగు పడు తూ వస్తున్నది. వివిధ నమునా సర్వే ఫలితాలను గమనిస్తే, జరగనున్న శాసనసభ ఎన్నికలలో పోటీ ప్రధా నంగా బీఎస్పీ, బీజేపీల మధ్య ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సమాజ్‌ వాది పార్టీ, కాంగ్రెస్‌- మూడవ, నాలుగవ స్థానాల కోసం పోటీ పడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.

ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్న తరుణంలో, తెలంగాణ అంశం కన్న ఉత్తరప్రదేశ్‌లో బలం పెంచుకోవడమే బీజేపీకి ప్రధానంగా తయారయినది. అందుచేత ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు పూర్తయే వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురంచి పార్లమెంట్‌లో బిల్లు రావడానికి బీజేపీ సిద్ధంగా లేదు. బీజేపీలో వచ్చిన ఈ పరిణామం ఒక విధంగా- తెలంగాణపై ఎటువంటిమాట చెప్పలేక తికమక పడుతున్న కాంగ్రెస్‌ అధిష్ఠానానికి వరప్రసాదంగా మారనున్నది. తెలంగాణ అంశంపై కేంద్రం కఠినంగా వ్యవహరించడం ఈ సమయంలోనే ప్రారంభంకావడం గమనార్హం. మారుతున్న రాజకీయ పరిణామాలను గమనించిన తెలంగాణ ప్రాంతంలోని రాజకీయ నాయకులు కొంత మెత్త పడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

మారుతున్న రాజకీయ పరిస్థితుల్ని గమనిస్తే, కేంద్రంలో వచ్చే ఎన్నికల అనంతరం బీజేపీ అధర్యంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చినా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తుత సంకీర్ణ రాజకీయాలలో ఎంతవరకు సాధ్యం అన్న ప్రశ్న ఎదురవుతున్నది. గతంలో ఒక ఒటు, రెండు రాష్ట్రాలు అనే నినాదం ఇచ్చిన బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, ఆ సమయంలో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటుచేసినా తెలంగాణ అంశం పై ముందడుగు వేయక పోవడానికి నాడు ఎన్‌డీఏకి మద్దతుగా ఉంటూ రాష్ట్రంలో అధికారంలోఉన్న తెలు గు దేశం పార్టీ అభ్యంతరమే కార ణం కావడం గమనార్హం. తెలం గాణ రాష్ట్రం ఏర్పాటు కన్న చాల ముందు నుండే మహారాష్ట్రలో విదర్భ రాష్ట్రం ఏర్పాటు కోసం బీజేపీఆందోళన చేస్తూ వస్తున్నది.

అయితే అక్కడ నాడు అధికారంలో ఉన్న మిత్రపక్షం శివసేన అభ్యం తరం కారణంగా మూడు రాష్ట్రాల తో పాటు విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయ లేదు.నేడు తెలంగాణ రాష్ట్రం కోసం నినదిస్తున్న బీజేపీ విదర్భ రాష్ట్రం ఏర్పాటు గురంచి మాట్లాడక పోవడం గమనార్హం. మహరాష్టల్రో శివసేన ఇంకా మిత్రపక్షంగా ఉండటమే అందుకు కార ణం. అంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో ఉండే మిత్ర పక్షా ల అభిప్రాయాలకు అనుగుణంగానే బీజేపీ వ్యవహరించక తప్పదని స్పష్టం అవుతున్నది. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా వచ్చే ఎన్నికల అనంతరం మమతా బెనర్జీ, జయలలిత, చంద్రబాబు నాయుడు వంటి వారు తిరిగి బీజేపీకి మద్దతు ఇవ్వక తప్పదు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ప్రధాన అడ్డంకి యూపీఏ భాగస్వామ్య పక్షలయిన మమతా బెనర్జీ, శరద్‌ పవార్‌, కరుణానిథి వంటి వారి నుండి వస్తున్న అభ్యంతరాలేనని మరువలేము. రేపు బీజేపీ అధికారంలోకి వచ్చినా అటువంటి సమస్యలు ఎదురు కాక మానవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తమ రాష్ట్రాలలో సైతం ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమాలు తీవ్రతరం అవుతాయని అనేక రాష్ట్రాలలో నాయకులు ఆందోళన చెందుతున్నారు. మరో వంక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తాము ఎంతగా మద్దతు ఇస్తున్నా, ఈ ప్రాంతంలో ఆశించినరీతిలో బలం పొందలేక పోతున్నామని, ఆ ఖ్యాతి ప్రధానంగా టీఆర్‌ఎస్‌కు దక్కుతున్నదని బీజేపీ వర్గాలలో ఆందోళన వ్యక్తం అవుతున్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి కాంగ్రెస్‌ ఒక ప్రకటన చేస్తే, తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామనే సంకేతాలను కూడా టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఇస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదంటూ ప్రకటన ఇచ్చిన ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ పట్ల టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌ రావు పరుష పదజాలం ఉపయోగించినా, టీఆర్‌ఎస్‌ నాయకులెవరూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని విమర్శించక పోవడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకోవలసినది ఆమె మాత్రమే అని ప్రధాన మంత్రి, హోమ్‌ మంత్రి పి.చిదంబరం, ఆర్ధిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వంటి వారు అనేక పర్యాయాలు స్పష్టం చేశారు. అయినా ఆమెను కలసి ఈ విషయంపై నిలదీయడానికి టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్ధ పడడం లేదు.

chalasani
చిన్న రాష్ట్రాలు తమ విధానంగా చెప్పుకుంటూ వస్తున్న బీజేపీ నాయకులు ఈ విషయంపై ఏనాడూ బీజేపీలో గాని, ఆ పార్టీ పూర్వ రూపం జనసంఘ్‌లో గాని తీర్మానం చేయలేదని మరచి పోతున్నారు. బీజేపీ తోలి నుండి బలమైన కేంద్రం ఉండాలని కోరుతున్నది. పంజాబ్‌ రాష్ట్ర విభజన పట్ల సహితం ఆ పార్టీ అస్పష్టమైన విధానం అవలంబించిది. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రాంత బీజేపీ నాయకులు ఇస్తున్న మద్దతు పట్ల సీమంధ్ర ప్రాంతంలోని ఆ పార్టీ కార్యకర్తల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.రాష్ట్రంలో బీజేపీసొంతంగా 4 లోక్‌ సభ స్థానాలు గెలుపొందిన సమ యంలో వాటిలో రెండు తూర్పు గోదావరి జిల్లాలో కాగా, తెలంగాణ ప్రాంతం నుండి రెండు మాత్రమే ఉన్నాయి. తొలి సారిగా జనసంఘ్‌ మూడు శాసనసభ స్థానాలలో 1967లో గెలుపొందిన సమయంలో తెలంగాణ ప్రాంతం నుండి గెలిచిన స్థానం ఒక్కటి మాత్రమే కావడం గమనార్హం. కేవలం తెలంగాణ ప్రాంతంలోని మద్దతుతో బీజేపీ బలమైన పా

Surya News Paper Telugu Dated 22/11/2011

No comments:

Post a Comment