Friday, November 25, 2011

చరిత్ర నిర్మాత కిషన్ జీ By-బి.ఎస్.రాములు



చరిత్ర నిర్మాతలు ప్రజలే. ఆ ప్రజలను ముందుకు నడిపే నాయకుడు చరిత్ర నిర్మాతగా నిలిచిపోతాడు. కిషన్‌జీ 40 ఏళ్ల భారతీయ సామాజిక ఉద్య మ నిర్మాణంలో ఒక చరిత్ర నిర్మాత. కోటేశ్వరరావుతో జ్ఞాపకాలు ఎన్నో. కలిసి పనిచేసిన క్రమంలో వ్యక్తిత్వం, స్వభావం, సిద్ధాంత గాఢత ఎదుగుతున్న తీరు గమనిం చే అవకాశం సహచరులకు, అనుచరులకే ఎక్కువ తెలుసు. తొలి నుంచీ ఉద్యమం లో పనిచేస్తున్న వారికి, ఉద్యమంలో ఎదిగివస్తున్న వారికి ఇంకాఎక్కువ తెలుసు. మిగతా ప్రపంచానికి కేవలం వారి ప్రాచుర్యం మాత్రమే తెలుసు. ఒక సత్తెన్న, చంద్రమౌళి, గణపతి, అల్లంనారాయణ, నారదాసు లక్ష్మణరావు, వరవరరావు, గద్దర్, డాక్టర్ గోపీనాథ్, జాప లకా్ష్మడ్డి వంటి వారికే కోటేశ్వరరావు ఎదిగివచ్చిన క్రమాలు వివరంగా తెలుసు. ఆయన తో కలిసి పనిచేసిన కాలంలో నేను గమనించిన అంశాలు అందులో కొన్ని మాత్రమే. జాప లకా్ష్మడ్డిని కరీంనగర్ ఉద్యమకారులందరూ ఆత్మీయంగా ‘బాపూ’ అని పిలిచేవారు. కిషన్‌జీకి పెద్దల పట్ల అపారమైన గౌరవం. నేను విస్తృత అధ్యయనం చేయడంలో కామ్రేడ్ ప్రహ్లాద్ పాత్ర మరువలేనిది. మేము కలిసి పనిచేసిన కాలంలో వయస్సులో నాకన్నా చిన్నవాడైనప్పటికీ అనుభవంలో, అవగాహనలో నాకు ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్‌గా స్ఫూర్తినిచ్చాడు. అతని కార్యదీక్ష, కమిట్‌మెంట్ నాలాగే ఎందరినో ఉత్తేజపరిచింది. 

కోటేశ్వరరావును మొదటిసారిగా 1977లో కరీంనగర్ పాత బస్‌స్టాండ్‌లోని ఒక హోటల్‌లో కలిశాను. ఆరోజు చాయ్ తాగుతూ యువకులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అందులో నారదాసు లక్ష్మణ్‌రావు, జీవగడ్డ విజయ్‌కుమార్ తదితరులు గుర్తున్నారు. కోటేశ్వరరావు తన వాదాన్ని బలంగా వినిపించాడు. యువకుడు చాలా షార్ప్ అనుకున్నాను. నేను అప్పుడు ఎలగందులలో ఉద్యోగం చేస్తున్నాను. ఆ తర్వా త యేడాదికి జగిత్యాల జైత్రయావూతలో కోటేశ్వరరావు, సాయిని ప్రభాకర్, కల్లూరి నారాయణ తదితరులు క్రియాశీల పాత్ర నిర్వహించారు. జగిత్యాల జైత్రయాత్ర ఉద్యమ చరివూతలో ఒక మైలురాయి. 
కిషన్‌జీ లేకుండా మూడు దశాబ్దాల విప్లవోద్యమ చరివూతను ఊహించలేము. చరివూతలో కొందరు చిరస్థాయిగా నిలిచిపోతారు. అలా చరివూతలో అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, చారుమజుందార్, సరోజ్‌దత్తా, లోహియా, కాన్షీరామ్‌లు చరివూతలో విడదీయలేని భాగం. వాస్తవాల మీద ఆధారపడి చరిత్ర పరిణామాలను, ఉద్యమాలను వాటి ప్రభావాలను విశ్లేషించాలనుకున్నప్పుడు కొండపల్లి సీతారామయ్య, కెజి సత్యమూర్తి, ఐవి సాంబశివరావు, బండయ్య మాస్టారు, డా. చిరంజీవి, పులి అంజయ్య, లింగమూర్తి, తరిమెల నాగిడ్డి, దేవులపల్లి వెంక చండ్ర పుల్లాడ్డి తదితరులు నిర్మించిన ఉద్యమాలను వాటి ప్రభావాలను పరిశీలించకుం డా చేసే సామాజిక విశ్లేషణ అసమక్షిగమైనది. 

సత్యాలను వక్రీకరించే వాల్లే నిజమైన చరిత్ర నిర్మాతలను వదిలేసి చరిత్ర పరిణామాలను రాస్తుంటారు. నక్సల్‌బరీ శ్రీకాకుళ భూస్వామ్య వ్యతిరేక గిరిజన రైతాంగ పోరాటాలు లేకుండా భూ సంస్కరణలు లేవు. కానీ చాలామంది ఈ వాస్తవాన్ని వదిలేసి చరివూతను, భూసంస్కరణలను గురించి రాస్తుంటారు. పీవీ నర్సింహారావు నక్సల్‌బరీ శ్రీకాకుళ ఉద్యమాల ప్రభావంతోనే భూసంస్కరణలు ప్రవేశపెట్టానని వ్యక్తిగతంగా చెప్పేవారు.1970లో ఆంధ్రవూపదేశ్‌లో సాగిన భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలకు ఓ ప్రత్యేక నేపథ్యం ఉన్నది. 1968లో ఉధృతంగా సాగిన శ్రీకాకుళ ఉద్యమం అణచివేయబడిన తర్వాత ఉద్యమాన్ని మరోచోట విస్తరించాలని ఉద్యమకారులు ఆలోచించారు. 1956లో ఏర్పడిన ఆంధ్రవూపదేశ్‌లో తెలంగాణ ప్రాంతం ఒక అంతర్భాగమైన తర్వా త తెలంగాణ అభివృద్ధి, ఉపాధి అవకాశాలను ప్రాంతేతరులు ఆక్రమించుకున్నారు. దానితో పెరిగిన అసంతృప్తి 1956 నుంచి అనేక రూపాలలో వ్యక్తీకరింపబడుతూ వచ్చింది. 1968లో ఆంధ్ర గోబ్యాక్ ఉద్యమం నేపథ్యం ఇదే. ఆ తర్వాత అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా, జై తెలంగాణ ఉద్యమంగా విస్తరించింది. లక్షలాది విద్యార్థి యువజనులు ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమ చైతన్యం పొందారు. 

అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉంటే ఆ ఉద్యమకారులంతా అస్సాం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులవలె ప్రజా ప్రతినిధులుగా, శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, ఉన్నతాధికారులుగా అభివృద్ధి పరిణామం వేగంగా సాగి ఉండేది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడకుండా అడ్డుకున్న వాళ్లు తెలంగాణలో నక్సలైట్ల ఉద్యమం ప్రారంభం కావడానికి కారకులయ్యారు. ఈ నేపథ్యం విప్లవోద్యమం 14 రాష్ట్రాల్లో విస్తరించడానికి పునాది అయ్యింది. అందువల్లే తెలంగాణ ప్రాంతం నుంచి ఎదిగిన నాయకత్వమే ఈ దేశాన్ని నూతన ప్రజాస్వామిక విప్లవంతో సమగ్ర సామాజిక వికాసాన్ని సాధించాలని కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి,యువజన వర్గాలతో దళిత బహుజన మహిళా సామాజిక వర్గాలతో కలిసి ఉద్యమించాలని అన్ని రంగాలను సామాజిక న్యాయం కోసం విప్లవీకరించాలని కలలుకన్నది. ఆ స్వప్నం సాకారం కోసం జరుగుతున్న పోరాటాలతో..వేలాది లక్షలాది కోట్లాది ప్రజలు,రచయితలు, కళాకారులు ఉత్తేజం పొందారు. ఉద్యమాలు నిర్మించారు. ప్రాణాలు అర్పించారు. అది తమ కర్తవ్యంగా భావించారు. 

కామ్రేడ్ ప్రహ్లాద్‌గా, రాష్ట్రకమిటీ కార్యదర్శిగా ఒక మహోజ్వలమైన చారివూతక దశకు నాయకత్వం వహించిన కోటేశ్వరరావు భారత సామాజిక ఉద్యమ చరివూతలో ఒక చెరగని సంతకం. బెంగాల్, బీహార్, ఒరిస్సా, దండకారణ్యం, ఈశాన్య రాష్ట్రాలలో కిషన్‌జీ ఒక జాతీయ నాయకుడిగా మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్టుగా ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. గొప్ప నాయకుడు స్ఫూర్తినిస్తే ప్రజలు ఎంత గొప్పగా ఉద్యమిస్తారో చెప్పడానికి 40 ఏళ్లుగా కొడిగట్టి సాగుతున్న బెంగాల్ విప్లవోద్యమం కిషన్‌జీ నాయకత్వంలో లాల్‌గఢ్ వంటి పోరాటాలతో ప్రజలు ఎన్ని త్యాగాలకైనా ఎలా ముందుకొస్తారో, ఎలా చరిత్ర నిర్మిస్తారో రుజువవుతున్నది. కొందరు మైనపు బొమ్మల్లో జీవిస్తారు. కొందరు రాతి విగ్రహాల్లో జీవిస్తారు. కోటేశ్వరరావు లాంటి విప్లవకారులు ప్రజల హృదయాల్లో జ్యోతులై వెలుగుతారు. సామాజిక చరిత్ర నిర్మాణంలో చరిత్ర నిర్మాతలుగా మందు తరాలకు స్ఫూర్తి దాతలుగా కొనసాగుతుంటారు. 2009లో కిషన్‌జీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రానికి ఒక ఉత్తమమైన ముఖ్యమంవూతిగా ఎదిగే అవకాశాలున్నాయని ప్రశంసించినట్లు కలకత్తా నుంచి వెలువడే ‘ఆనంద్ బజార్’ పత్రిక పేర్కొంది. ఎవరు అవునన్నా, కాదన్నా మావోయిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన ప్రజా ఉద్యమాలు వాటి చైతన్యం, వారి మద్దతు లేకుండా మమతా బెనర్జీ బెంగాల్‌లో అధికారం చేపట్టడం అసాధ్యమైన విషయం. కానీ విషాదకరమైన విషయమేమంటే మమతా బెనర్జీ ముఖ్యమంవూతిగా పదవిలోకి వచ్చిన వెంటనే కిషన్‌జీని పట్టుకొని హత్యచేయ డం జరిగింది. 

మమతా తాను ఎవరి మద్దతుతో అధికారంలోకి వచ్చిందో.. వారినే మట్టుపెట్టి తన వర్గ స్వభావాన్ని క్రూరత్వాన్ని తొందరగానే స్పష్టం చేసుకుంది. చరివూతలో ఇలాంటి విషాదాలు మొదలు కాదు. 1980లో ఇరాన్‌లో ఫ్యూడల్‌పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కమ్యూనిస్టు విప్లవకారులు, అయతుల్లా ఖొమేనీ వంటి మతవాదులు కలిసి పనిచేశారు. ఉద్యమం విజయవంతమైన తర్వాత ఖొమే నీ అధికారం చేపట్టి 35 వేలమంది కమ్యూనిస్టు విప్లవకారులను చంపించాడు. అలాగే పంజాబ్ రాజకీయాల్లో అకాలీదళ్‌కు వ్యతిరేకంగా బింద్రన్‌వాలేను ప్రోత్సహించిన ఇందిరాగాంధీ, బింద్రన్‌వాలేను 1984లో సైన్యం సాయంతో మట్టుపెట్టింది. వేలాది మంది సిక్కుయువకులను ఊచకోత కోయించింది. 

ప్రజల చరివూతలో సామాజిక పరిణామాల చరివూతలో విప్లవకారుల చరిత్ర మహోన్నతమైనది. వారి చిత్తశుద్ధి మచ్చలేనిది. వారిని స్వార్థపూరిత అధికార కాంక్షతో అందలాలు ఎక్కి వేల కోట్లు మెక్కి, ప్రజాపోరాటాలను రక్తపుటేరుల్లో ముంచిన పార్లమెంటరీ రాజకీయ నాయకులతో పోల్చడం పొరపాటు. ఒకరు స్వార్థం కోసం పనిచేస్తే, మరొకరు నిస్వార్థంగా సమాజం కోసం పనిచేస్తారు. సైద్ధాంతికంగా ఎన్ని విభేదాలున్నప్పటికీ వారి చిత్తశుద్ధిని శంకించలేము. అలా శంకించే వారి చిత్తశుద్ధినే శంకించాల్సి ఉంటుంది. కిషన్‌జీ నాలుగు దశాబ్దాల భారతీయ చరివూతలో ఒక మహోన్నతమైన చరిత్ర నిర్మాతగా నలిచిపోతారు. ప్రజలనుంచి ఎదిగి ప్రజానాయుకుడిగా మహోన్నతమైన మేధావిగా ఎలా ఎదుగుతారో చెప్పడానికి కిషన్‌జీ ఒక గొప్ప ప్రతీక. నా జీవితంలో బలమైన ముద్రవేసిన వారిలో కిషన్‌జీ ఒకరు.
Namasete Telangana News Paper Dated 26/11/2011


No comments:

Post a Comment