Saturday, November 5, 2011

పేదలను గుర్తించడానికి ఇంకెన్నాళ్లు? By -వకుళాభరణం కృష్ణమోహన్‌రావు



ఐదు దశాబ్దాలుగా అమలవుతున్న పంచవర్ష వూపణాళికల ద్వారా కూడా దేశంలో ‘పేదరికం’ రూపుమాపడం సాధ్యంకాలేదు. ఇంకా ఎంతకాలం పడుతుందో చెప్పలే ని పరిస్థితి. ప్రస్తుతం 12వ పంచవర్ష ప్రణాళికల రూపకల్పనకు జాతీయ ప్రణాళి కా సంఘం కసరత్తును మొదలుపెట్టింది. పట్టణాలలో 32, గ్రామాలలో 26 రూపాయ లు ఇంతకుమించి రోజుకు ఖర్చుచేయగలిగే వారంతా దారివూద్యరేఖకుపైన ఉన్న వారు గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ధారణ ప్రస్తుతం వివాదస్పదం అవుతోంది. ప్రస్తుత జాతీయ ప్రణాళికా సంఘం పేదోళ్ళను గుర్తించడానికి ఆరేళ్లు తీసుకుంది. విస్తృతస్థాయిలో చర్చోపచర్చలు, మేధోమథనం, కసరత్తు చేసింది. 950 సివిల్ సొసైటీల అభివూపాయాలు సేకరించింది. అన్ని వర్గాల ప్రజావూపతినిధులు, సంస్థల సూచనలను కూడగట్టింది. ఇందుకు లక్షలాది రూపాయాలను ప్రజాధనాన్ని ఖర్చుపెట్టింది. తీరా చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందమే అయ్యింది. 

‘పేదరికం’ నిర్ధారణకు 2005 డిసెంబర్ 2న ప్రముఖ ఆర్థికవేత్త సురేశ్ టెండూల్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ప్రణాళిక సంఘం నియమించింది. ఫిబ్రవరి 2006 లో మధ్యంతర నివేదికను, ఏడాదిలోపు తుది నివేదికను ఇవ్వాలని చూచించింది. అయితే ఈ కమిటీ తుది నివేదికను నవంబర్ 2009న సమర్పించింది. ప్రణాళిక సంఘం దీన్ని 2010లో అమోదించింది. ఈ నివేదిక ప్రకారమే దారివూద్యరేఖను నిర్ణయించింది. ఈ విషయాన్ని కరాఖండిగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫడవిట్‌లో స్పష్టం చేసింది. 2004- 2005 ధరల ప్రకారం వినియోగదారుల ఆర్థికస్థితిగతులను, ఖర్చుపెట్టే స్థోమతను గుర్తించడానికి నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్.ఎస్.ఎస్.ఓ) నిర్వహించిన 61వ రౌండ్ హౌజ్‌హోల్డ్ సర్వే ప్రకారం సురేశ్ టెండూల్కర్ కమిటీ నెలకు 447 రూపాయలు నిత్యావసరాలకు సరిపోతాయని నిర్ణయించింది. అంటే రోజుకు సగటున 15 రూపాయలు ఖర్చును మించితే దారిద్య్ర రేఖ పైకి చేరినట్టుగా నిర్ధారించింది. అయి తే ఈ నిర్ధారణలో హేతుబద్ధతలేదని ప్రణాళిక సంఘం తీరుపై విమర్శలు వచ్చాయి. ఒక దశలో జాతీయ అడైజ్వరీ కౌన్సిల్ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడడంతో నాలుక కర్చుకున్నది ప్రణాళిక సంఘం. దీనిపై కేంద్రమంత్రి జైరాం రమేష్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అహ్లూలివాలియాలు వివరణ ఇచ్చుకున్నారు.

‘పేదరికం అంచనాకు ప్రణాళికసంఘం తుది నిర్ణయానికి రాలేదని, త్వరలోనే నిపుణుల కమిటీ వేసి నిర్ణయిస్తామ’ని చెప్పారు. మళ్ళీ కథ మొదలవుతుంది. ‘కొత్త నిపుణుల కమిటీ’ ఎన్నేళ్లు తన వ్యాపకాన్ని కొనసాగిస్తుందో, తుదిరూపం ఎప్పుడు వస్తుం దో, పేదల బతుకులు ఎప్పుడు మారతాయో! పేదరికం అంటే తెలియనివాళ్ళు, ఆకలిబాధలు భరించని వాళ్లు, నిపుణులుగా, ఆర్థికవేత్తలుగా ప్రణాళికలు రూపొందించి అమ లు చేయడం, పేదల బతుకులలో పురోగతికి సాధ్యం అవుతుందని భావించడం అత్యా శే. ఇలాంటి ప్రణాళికలు పేదలను ఉద్ధరించడానికి ఏమాత్రం ఉపయోగపడవని తేలిపోయింది. ఇంత రచ్చ జరిగినా ‘సుప్రీంకోర్టు’ అఫడవిట్‌లో పేర్కొన్న నిర్ధారణను పక్కనపెడతామని మాత్రం ప్రణాళిక సంఘం స్పష్టం చేయలేదు.

సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామంటున్న మన రాష్ట్రం విషయానికి వస్తే ప్రణాళికా సంఘం ‘నిర్ధారణ’తో ఈ రాష్ట్రంలో దారివూద్యరేఖ దిగువన ఎవ్వరు లేనట్టుగా నిర్ణయించుకోవాలి. ఇక్కడ తెల్లరేషన్‌కార్డు దారు నుంచి మొదలు, ‘ఆరోగ్య శ్రీ’ ఇతర అన్ని ప్రయోజనాలు పొందడానికి ‘బిపిఎల్’ పరిమితియే లక్షరూపాయలు ఉంది. అంటే ప్రణాళికా సంఘం ‘పేదరికం అంచనా’ను పరిగణనలోకి తీసుకుంటే పేదలు ఈ రాష్ట్రంలో లేన ఇలా దేశం మొత్తానికి ఆపాదిస్తే, దేశంలో పేదలు లేన్నట్లు గా తేలిపోతుంది. దీంతో ఈ దేశం అభివృద్ధి చెందిన లేదా ధనిక దేశాల సరసన నిలబడిన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, ఇతర ప్రయోజనాలు కల్పించడం ద్వారా పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు వెచ్చిస్తున్న ప్రజాధనాన్ని తప్పించడానికి ప్రణాళిక సంఘం ఈ విధంగా ఎత్తుగడలు వేసిందా? సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 

అయితే ధనిక దేశాల సరసన నిలబడే నిమిత్తం కృతిమ ప్రణాళికలు రూపొందించ డం సహేతుకం కాదు. వాస్తవాలకు దూరంగా క్షేత్ర పరిశీలనలతో నిమిత్తం లేని ‘ఊహా పత్రాల’ రూపకల్పనతో పేదల బతుకులను మరింతగా చిందరవందర చేయ డం తప్ప! ఈ ప్రయత్నాలు ఆదర్శం కానేరవు. దేశంలో అక్రమంగా సంపాందించి న బడాబాబుల వద్ద ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తే.. ఎనిమిదేళ్ల పాటు ఏ పన్నులేకుం డా, ధరలు పెంచకుండా, పేదవాడి జీవన చిత్రాన్ని సమూలంగా మార్చేయవచ్చని పలు అధ్యయన సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. పేదల కడుపుగొట్టి, ధరలు పెంచి, బ్లాక్ మార్కె ట్‌ను విస్తరింపచేసి వేలకోట్ల రూపాయాల ప్రజాధనాన్ని కొల్లగొట్టి అక్రమార్జనతో, ‘నల్లధనాన్ని’ కూడబెట్టుకుంటున్న ‘చీకటి సామ్రాజ్యం’ ను పటాపంచలు చేయకుండా ‘పేదరికం’ నిర్మూలించడం ఎలా సాధ్యం?
జనాభా లెక్కలు చేసేటప్పుడే సామాజిక, ఆర్థికస్థితిగతులను సక్రమంగా లెక్కగట్టి, సేకరించే వీలున్నా ఆ పని చేయడం లేదు. ‘మేమేంత మందిమో మాకంత వాటా’ అనే డిమాండ్ బలం పెరగడంతో ఈ ప్రక్రియ మొదలుపెట్టడానికి అంగీకరించి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ, ఈ కార్యక్షికమం ఆరంభానికి నోచుకోలేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 97 శాతం వైట్ మనీ చలామణీలో ఉంటే, భారత్‌లో 25 శాతం వైట్ మనీ మాత్రమే చలామణీలో ఉంది. ఇంత లోపభూయిష్టంగా ప్రభుత్వ విధానా లే అక్రమాలు చేసుకోవడానికి తావు కల్పిస్తుంటే ‘పేదరికం’పెరగక మరేమవుతుంది? అన్నా హజారే, రాందేవ్‌బాబాలు చేస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమం తర్వాత ప్రభుత్వ వ్యవహర సరళి వివాదాస్పదం అయ్యింది.

త్వరలో దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతామంటున్న ‘ఆధార్ కార్డు’ లో ప్రధాని నుంచే ఆస్తుల వివరాలు, పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరుస్తూ ప్రకటిస్తే, ఒకేసారి 100 కోట్ల జనాభాకు వివరాలు తెలుస్తాయి. దీంతో నీతివంతమైన సమాజం సమీప భవిష్యత్తులోనే ఆవిష్కృతం అవుతుంది. ప్రతికోనుగోలు, అమ్మకాలలో ఆధార్‌కార్డు నెంబర్ వేయడం తప్పనిసరి చేస్తే కూడా అక్రమ సంపాదనను, నల్లధనాన్ని నిరోధించవచ్చు. పన్నులు సక్రమంగా వసూలు అవుతాయి. ఈ చర్యల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. పేదరికం తగ్గుముఖం పడుతుంది. ద్రవ్యోల్బణం వలన అందరికన్నా ఎక్కువగా నష్టపోయేది పేద ప్రజలే. ఎందుకంటే సంఘటిత రంగంలోని ప్రజలకు జీత భత్యాలు పెంచుకోవడానికి వీలుంటుంది. అదే అసంఘటిత రంగంలోని పేద ప్రజలు, కూలీలు, కార్మికులకు ఈ అవకాశం ఉండదు. గ్రామీణ ప్రాంతాలలోని రైతు కూలీలు, అన్ని వృత్తి ఆధారిత కులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కూలీలకు కూలిరేట్లు పెరగవు. దీంతో ఈ వర్గాలు అభివృద్ధిలోకి రాలేక పేదలు నిరుపేదలుగానే బతుకులీడుస్తున్నారు.
దేశంలో అత్యధిక సంఖ్యాకులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చకుండా, దారివూదరేఖ దిగువ నుంచి పైకి తీసుకురాకుండా దేశం వెలిగిపోతుందని ఎలా ప్రకటించుకోగలం? నల్లధనం బ్లాక్‌మ్కాట్ విస్తరణనే ఈ దేశంలోని మెజారిటీ ప్రజలను నిరుపేదలుగా దారిద్య్ర రేఖకు దిగువకు నెట్టి వేస్తున్నాయి. ఈ వాస్తవాన్ని గమనించి కఠిన చర్యలకు పూనుకోవాలి. అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతుంది. 

ప్రణాళికా సంఘం పేదరికాన్ని అంచనా వేసే బాధ్యతను చేపడుతున్న ఈ నేపథ్యం లో దేశ ప్రతిష్ఠ, సర్వమానవ శ్రేయస్సును కాంక్షించి ముందుకు సాగాలి. వాస్తవాలకు దగ్గరగా తన పనితీరును మార్చుకోవాలి. కొత్తగా వేసే నిపుణుల కమిటీలో సామాజికవేత్తలకు, దశాబ్దాలుగా సామాజిక సమస్యలపై పనిచేస్తున్న ఉద్యమకారులకు చోటు కల్పించాలి.‘బ్లాక్ మార్కెట్ చేసే వారిని ఉరితీయాలి’ అని ఈ దేశ మొదటి ప్రధాని నెహ్రూ ఏనాడో ప్రకటించారు. ఇన్నేవూ్లైనా ఈ బ్లాక్ మార్కెటీర్లపై కఠిన చర్యలు తీసుకోలేదు. పైగా ఇది అడుగడుగునా విస్తరించింది. దీంతో.. దేశంలో అవినీతి సర్వత్రా వ్యాపించి , పేదరికం కూడా పెరిగిపోతోంది. అవినీతిని రూపుమాపిన నాడే.. పేదలులేని దేశంగా వెలుగుల బాటలో పయనిస్తుంది. 

-వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు Namasete Telangana News Paper Dated 06/11/2011

No comments:

Post a Comment