Saturday, December 8, 2012

అందరికి ఆదర్శం హైదరాబాద్ అంబేద్కర్ ---బి. విశ్వనాథంకా ర్యసాధకులకు ధైర్యముండాలి. తాము సాధించాలనుకున్న విషయాల పట్ల చిత్తశుద్ధి, సఫలం చేయాలనే పట్టుదల, దానికి తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి. అటువంటి వాళ్ళనే విజయం వరిస్తుంది. అనుకున్నది సాధించగలుగుతారు. అటువంటి ఉక్కు మనిషి, తెలంగాణవాడు, హైదరాబాద్ ముద్దుబిడ్డ ‘రావ్ సాహెబ్’ బి.ఎస్ వెంకవూటావు కావడం గర్వించదగ్గ విషయం. బత్తుల సాయన్న వెంకవూటావు సరిగ్గా 1900 డిసెంబర్ 11న సికింవూదాబాద్‌లోని న్యూబోయిగూడలో సాయన్న, ముత్తమ్మ కొడుకుగా జన్మించారు. వెంకవూటావు ఎనిమిదవ తరగతి వరకు చదివినప్పటికీ, ఆయన సొంత ప్రతిభతో నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖా మంత్రిగా పనిచేశారంటే ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు.

బి.ఎస్. వెంకవూటావు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బతుకు దెరువుకోసం పూనా వెళ్ళి అక్కడ శిల్పిగా పనిచేశారు. యుద్ధానంతరం హైదరాబాద్ తిరిగివచ్చి నిజాం ప్రభుత్వంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో చేరి నిజాంసాగర్ ప్రాజెక్టులో అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ ఆఫీసర్‌గా చేరారు. దళితుల సమస్యలపై పోరాటం సాగించడానికి ఉద్యోగం అడ్డురావడంతో రాజీనామా చేసి సివిల్ కాంట్రాక్టరుగా మారారు. హైదరాబాద్‌లోని మాదరి భాగ్యడ్డి వర్మ, మహారాష్ట్రతో సహా దేశంలో అంటరాని కులాల తరఫున పోరాడుతున్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో హైదరాబాద్ రాష్ట్రంలో కుల వివక్షకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం సల్పిన మేధావి బి.ఎస్. వెంకవూటావు. కులవివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించడమే కాకుండా అప్పటి పరిస్థితుల్లో ప్రజల బతుకుల్లో వెలుగు నింపడానికి తన వద్ద ఉన్న అన్ని శక్తులను ఒడ్డి పోరాడిన సమరశీలి. మేధాసంపత్తి,సామాజిక ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించడం, దళితులను ఆదుకొని ఆత్మస్థైర్యాన్ని పెంచేవారు.

నిజాం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జోగిని వ్యవస్థను నిషేధించేటట్టు వెంకవూటావు చేయగలిగారు. హైదరాబాద్ రాష్ట్రంలో అనేకమంది నాయకులతో కలి సి ఎన్నో సంఘాలను స్థాపించారు. మరెన్నో సంఘాలతో కలిసి పనిచేశారు. అందులో అది హిందూ సోషల్ సర్వీస్ లీగ్, స్వస్తదళ్ యువజన సంఘం, హైదరాబాద్ దళిత జాతి సంఘం, అరుంధతీయ యువజన సంఘం ముఖ్యమైనవి. వీటన్నింటిని బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలోని ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్వాస్ట్ ఫెడరేషన్‌లో విలీనం చేశారు.
బొంబాయి మహర్ సదస్సుకు 1936 మే 30న అధ్యక్షత వహించిన అరుదైన గౌరవం వెంకవూటావుకు దక్కింది. దేశ వ్యాప్తంగా పదివేలమంది దళితులు ఈ సభకు హజరయ్యారు. ఇందులో ముస్లిం, సిక్కు ప్రతినిధులు కూడా పాల్గొనడం విశేషం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్వయంగా దాదర్ రైల్వేస్టేషన్‌కు వచ్చి స్వాగతం పలికి రైల్వేస్టేషన్ నుంచి ఆయనను ఏనుగు అంబారిపై తీసుకెళ్ళారు. ఆసభలో బి.ఎస్. వెంకవూటావు ఉర్దూలో చేసిన ప్రసంగం ఎంతో మందిని ఆకట్టుకున్నది. 

సభలోనే బి.ఎస్. వెంకవూటావును ‘హైదరాబాద్ అంబేద్కర్’గా కొనియాడారు. హైదరాబాద్ రాష్ట్రంలో దళిత ఉద్యమానికి మూల పురుషుడిగా భావిస్తున్న భాగ్యడ్డి వర్మ ఆయన స్థాపించిన ‘ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్’ తరఫున బి.ఎన్. వెంకవూటావుకు ‘వీరరత్న’ బిరుదును’ ఇచ్చి సత్కరించారు. నిజాం ప్రభుత్వం ఆయనను ఖుస్రూ-ఎ- దక్కన్ అనే అరుదైన బిరుదులతో సన్మానించింది.అంబేద్కర్‌లాగానే బి.ఎస్. వెంకవూటావు కూడా దళితుల విద్యపైన అమితమైన శ్రద్ధ కనబరిచారు. బి.ఎస్. వెంకవూటావు నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి హాస్టల్‌ను స్థాపించారు. 1947లో లాయక్ అలీ మంత్రివర్గంలో చేరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. ఆనాడే ఒక కోటి రూపాయలను దళితుల విద్యకు ప్రభుత్వం చేత కేటాయింపజేశారు. అందులో నుంచే ఔరంగాబాద్‌లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్థాపించిన మరాట్వాడా విశ్వవిద్యాలయానికి పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సహయాన్ని అందచేశారు. స్థలాన్ని కూడా నిజాం ప్రభుత్వం చేత వెంకవూటావు ఇప్పించారు.

దళితుల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ అధికారంలో భాగం కావడం ముఖ్యమని భావించారు. ఆక్రమంలోనే 1937లో కంటోన్మెంట్ బోర్డు సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన పోరాటం వల్ల హైదరాబాద్ శాసనసభలో అయిదు స్థానాలను నిజాం ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు రిజర్వు చేసింది. హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడారు. శత్రువు ఎవరో తెలుసుకొని, దానిని ఎదుర్కొవడానికి స్నేహం ఎవరితో చేయాలో తెలిసిన గొప్ప వ్యక్తి. దానివల్ల ఆయన రాజకీయాల్లో ఉన్న తక్కువ కాలంలో దళితుల సంక్షేమానికి ఉపయోగించగలిగారు. హైదరాబాద్‌లో జరిగిన భారత సైన్యం మిలటరీ యాక్షన్‌లో గృహ నిర్బంధాని కి గురయ్యారు. ఆ తర్వాత మళ్లీ 1951లో ఇండిపెండెంట్‌గా రాజ్యసభకు ఎన్నికయ్యారు. బి.ఎస్. వెంకవూటావులో అన్నింటికి మించిన లక్షణం స్వార్థంలేని వ్యక్తిత్వం.

ప్రస్తుతం న్యూబోయిగూడలోని కీస్ బ్లాక్స్ ఇళ్ళ నిర్మాణానికి ఆయనే కృషి చేశారు. అల్వాల్ సమీపంలో తన స్థలాలను పేదలకు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం దానిని ‘వెంకటాపురం’గా పిలుస్తున్నారు. ఆయనకు స్వంతంగా 12 భవనాలు ఉండేవి. అయితే నిజాం ప్రభుత్వం లో విద్యాశాఖమంవూతిగా ఉన్న సమయంలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడానికి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకుంటే నిజాం అనుమతితో తన సొంత ఇళ్ళనన్నింటిని కుదువబెట్టి డబ్బు తెచ్చారు.

ఆయన 1953 నవంబర్ 4వ తేదీన ఆయన స్వర్గస్థులయ్యారు. బి.ఎస్. వెంకవూటావు జీవితం, ఉద్యమం, విజయాలు నేటి దళిత ఉద్యమానికి, నాయకులకు, కార్యకర్తలకు ఒక పాఠం. లక్షలాది మంది దళిత ఉద్యోగులు రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొంది కూడా సొంత జాతిని పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది. ఎంతోమంది ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నా కిందికి, చూడలేని స్థితి. బి.ఎస్ వెంకవూటావు లాంటి వాళ్ళును ఆదర్శంగా స్వీకరిద్దాం. ప్రస్తు తం న్యూబోయిగూడలో రెండు చిన్నగదులలో ఆయన కుమారులు, కోడలు, నివాసం ఉంటున్నారు. పేదరికంతో ఆర్థికంగా కష్టాలలో ఉన్న ఆ మహానుభావుడి స్ఫూర్తిని కొనసాగించాలనే తపనతో బి.ఎస్. వెంకవూటావు మెమోరియల్ స్కూల్‌ను ఆయన వారసుడైన బి.వి.చంద్రమోహన్ నిర్వహిస్తున్నాడు. ‘హైదరాబాద్ అంబేద్కర్’గా ఖ్యాతిగాంచిన బి.ఎస్. వెంకవూటావు 112వ జయంతిని డిసెంబర్ 11 తేదీన ‘దళిత ప్రజా సమితి’ నిర్వహిస్తున్నది. ఈ కార్యక్షికమంలో ఆ మహానీయునికి నివాళిలర్పించి ఆయన ఆశయ సాధనకు అంకితమవుదాం.

-బి. విశ్వనాథం 
దళిత ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు 
(డిసెంబర్ 11న బి.ఎస్. వెంకవూటావు జయంతి)

Andhra Jyothi News Paper Dated : 9/12/2012 

No comments:

Post a Comment