Friday, December 7, 2012

స్ర్తీలకు కుర్రుకాల్చి వాత పెట్టే తెలంగాణ? -- Gosula Srinivas Yadav



పని కట్టుకొని ఈ నెల 11న తెలంగాణ జెఎసి కన్వీనర్‌ కోదండ రామిరెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్య మంత్రికాగలిగే అర్హతలున్న పస్తుత సీనియర్‌ మంత్రి డా గీతారెడ్డికి ‘కర్రుకాల్చి వాత పెట్టా’లన్నా రు. తెలంగాణకోసం వీరోచితపారాటం చేసిన ఆమె తల్లి ఈశ్వరీ బాయి ప్రస్తావనతెచ్చి ఈశ్వరీబాయిని కించపరిచారు. కొద్దిరోజులక్రితం మరో మంత్రి శ్రీధర బాబును- తండ్రి ని చంపినట్లు ఈయన ను కూడా చంపాలన్నా రు. మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ,ఎస్టీ, బీసీల మీదనే తీవ్రమైన దాడులు జరిగాయి. 

ఇప్పడు స్త్రీ జాతిని కర్రుతోవాత బెట్టే ప్యూడల్‌ పద్ధతులకు తెలంగాణ రాష్ట్రం రాక ముందే శ్రీకారం చుడుతున్నారు.కోదండరామిరెడ్డి జానారెడ్డి మద్దతుతో, కెసిఆర్‌ అంగీకారంతో జెఎసి కన్వీనర్‌అయ్యారు. తర్వాత ఒక పద్ధతి ప్రకారమే ఎస్సీ, ఎస్టీ, బీసీలను అధోగతిపాలుచేసే విధానాన్ని అనుసరిస్తున్నారు. టాంక్‌బండ్‌మీద కేశవరావు, ఇందిరా పార్కుదగ్గర అనిల్‌, మధుయాష్కి, వరంగల్‌లో జయశంకర్‌ శవంసాక్షిగా రాజయ్యమీద దాడిచేయించారు. మహా బూబాబా ద్‌లోకూడా కొండా మురళి, సురేఖ తదితర బిసినేతలమీద రాళ్ళవర్షం కురిపించారు.

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే చదువుకునే ప్రభుత్వ యూని వర్సి టీలను, కాలేజీలను, స్కూళ్ళను గతమూడేళ్ళుగా మూయించి, ఈ ప్రాంత పు విద్యారంగాన్ని కుప్పకూల్చారు. కోదండరామిరెడ్డి చుట్టూ కొంత మంది బిసిఉద్యోగులు, ఎస్సీ మేధావులలో ఒకవర్గం కెసిఆర్‌ను, ఆయన కుటుం బాన్ని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నది. మరోవర్గం జెఎసిని, కొదండరామిరెడ్డిని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు. కాని తెలంగాణ ప్రాంతంలో ఏనాడైన ఎవరైనా ఒక ఎస్‌సి మంత్రిని కర్రుతో కాలుస్తాననే ‘భూస్వామ్యభాష’లో మాట్లాడారా, మాట్లాడగలరా? కోదండరామి రెడ్డి పౌరహక్కులఉద్యమంలో ఉన్నంతకాలం ఆయన దళత,బహుజన ఉద్యమాలతో ఎన్నడూ మమేకం కాలేదు. కారంచేడు ఉద్యమం నడుస్తున్నప్పు డు బాలగోపాల్‌, కంచ ఐల్లయ్య, కన్నాబిరాన్‌ దళితుల పక్షాన నిలబడ్డారు. 

కాని కోదండరామిరెడ్డి ఆ ఉద్యమాన్ని సమర్థిస్తూ ఒక్కవ్యాసంకూడా రాసిన దాఖలాలు లేవు.ఈ క్రమంలోనే కోదండరామిరెడ్డి జయశంకర్‌ అండతో కెసిఆర్‌ క్యాంపులో చేరి తెలంగాణలో ‘విద్యావంతుల వేదిక’ అధ్యక్ష అవతారమెత్తారు. దళితుల్ని నమ్మించడానికి పేరుచివర ‘రెడ్డి’ని తొలగించి మీడియా ముందు ‘కోదండరాం’ గా మారారు. జెఎసి నాయకత్వ ప్రాబల్యంతో తన ప్యూడల్‌నిజరూపాన్ని రోజుకో తీరుగ చూపించనారంభించారు. ప్రధానంగా తెలంగాణ బీసీ, ఎస్సీ మంత్రుల ఇండ్లను టార్గెట్‌ చెయ్యడం, రాజకీయ నాయకుల ఇండ్లను టార్గెట్‌ చెయ్యడంతో రోజూ మీడియా అటెన్‌షన్‌ లభిస్తోంది. 

మూడేండ్ల ఉద్యమం ఒక తెలంగాణ మాయా జూదమైంది. తెలంగాణ ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అని ఈయన, కెసిఆర్‌ ప్రకటనలీయడం, ప్రజలంతా వారిద్దరి చుట్టూ పరుగులెత్తడం ఒక విచిత్ర వీరంగంగా మారింది. తెలంగాణ రాకముందే ఈయన స్త్రీలందరికీ కర్రుకాల్చి వాతలు పెడితే, కెసిఆర్‌ బడుగులను కులం పేరుపెట్టి తిడుతున్నారు. ఒక భూస్వామి పార్టీ నడిపితే, మరో భూస్వామి ఉద్యమం నడుపుతున్నారు. ఇంత జరిగినాకూడా వచ్చేది ‘సామాజిక తెలంగా ణయే’ అని నమ్మే ఉద్యమకారులు కూడా ఉండనే ఉన్నారు. 

ఈ క్రమంలోనే రహస్య అగ్రకుల సమీకరణలు మొదలయ్యాయి. బిజెపితో సహా తెలంగాణలో రెడ్డి కుల ఐక్యతకు పునాదులు వేశారు. ఒక దశలో వెలమ టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో ఒక రెడ్డిపార్టీ పెట్టాలని, దానిలోకి అన్నిపార్టీల్లోని రెడ్లను సమీకరించాలనే ఆలోచన జరిగింది. తెలంగాణ వెలమల కంటే- రాజకీయాల్లో ఎదుగుతున్న బీసీ, ఎస్సీలు ఎక్కువ ప్రమాదకర మని వారి ఎదుగుదలను ఆపాలనే భావనతో కోదండరామిరెడ్డిని తెరమీదికి తెచ్చారు. 

srinu
ఒకప్పుడు తెలంగాణలో బలంగాఉన్న నక్సలైట్‌ ఉద్యమం నుంచి బతికి బయట పడిన బీసీ, ఎస్సీ, ఎస్టీలవారు ఇప్పుడు ఇతర రంగాల్లో బలమైన నాయకులుగా ఎదుగుతున్నారు.ఈ వర్గాలనుండి మేధావులుకూడా ఎదుగ నారంభించారు. ఈ క్రమం రాజకీయ అధికారం వైపుకు పయనించే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమం పేరుతో ఆశక్తులనన్నిటిని వెనక్కినెట్టారు. రాజకీయ రంగంలో ఎదిగిన నేతలపై పథకం ప్రకారం దాడి చేస్తున్నారు. గీతారెడ్డి పై దాడి అందులో భాగమే.


- రచయిత గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి రాష్ర్ట అధ్యక్షుడు
Surya Telugu News Paper Dated: 8/12/2012

No comments:

Post a Comment