Saturday, April 21, 2012

తెలంగాణ అస్తిత్వం-సమస్యలు--అల్లం నారాయణ,



తెలంగాణ భావనకు ఒక చారివూతక పునాది ఉన్నది. ప్రాంతీయ చైత న్యం, ఉమ్మడి అస్తిత్వం, ఉమ్మడి గతం, ఉనికి, సంస్కృతీ విశిష్ట త, వర్తమానం, పరాయీకరణ పొందడం, వలసాధిపత్యం వల్ల అసమ సమాజంగా విస్తరించడం తెలంగాణ ఇప్పటి మౌలికాంశాలు. తెలంగాణవాదం కానీ, ఆ వాదంపై రూపుదిద్దుకున్న ఉద్యమం కానీ బహిర్గతంగా వెల్లడవుతున్న, ఉద్యమ రూపాలు, రాజకీయ నిర్మాణాలు కానీ మౌలి క విశ్వాసాలపై అవగాహన ఉన్నవే. తెలంగాణ దక్కన్ పీఠభూమిలో ఒక ప్రత్యేక వ్యక్తి త్వం, ఉన్నత సంస్కారం, సాంస్కృతిక పరిణామంపై ఆధారపడిన ఒంటరి సమాజం. కానీ ఉత్తరాది సంస్కృతీ మిశ్రమం, ప్రత్యేకంగా ఇతరులతో జీవించిన నేపథ్యం వల్ల తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ ‘సమ భావన సంస్కృతి’(COSMOPOLITAN)కి చిహ్నంగా మారింది. గంగా జమునా తెహజీబ్ అదే.

తెలంగాణ ఉద్యమం రెండుసార్లు ఉధృతంగా ముందుకు వచ్చిన రెండు సందర్భాలు వేరువేరు అయినప్పటికీ ఈ రెండు ఉద్యమాల్లోనూ ప్రధాన అంశం, ప్రత్యేక విశిష్ట చారివూతక, సంస్కృతీ అంశాల ఆధారంగా ఏర్పరుచుకు న్న అస్తిత్వ భావనలే మూలం. నిజానికి తెలంగాణ సమాజానికి ఒకే అస్తిత్వం ఉందా? ఉంటే ఇతర తెలుగు మాట్లాడే ఆంధ్ర ప్రాంతానికీ, ఇక్కడి తెలుగు మాట్లాడే ప్రాంతానికీ ప్రధానమైన తేడాలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్న మొట్టమొదటి 1969 నాటి ఉద్యమంలోనే ఎదురైన ప్రశ్న.
1969 ఉద్యమం ప్రధానంగా కొలువుల దోపిడీ, కొలువుల్లో వివక్ష మీద ఎక్కుపెట్టిన అస్త్రంగా కనపడినప్పటికీ అప్పటికే విలీనానికి ముందు జరిగిన గైర్‌ముల్కీ ఉద్యమం కానీ, ఆంధ్రవూపదేశ్‌లో విలీనం చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా తొంభైశాతం మంది తెలంగాణ ప్రజానీకం నుంచి వచ్చిన వ్యతిరేకత కానీ తెలంగాణ సమాజం ప్రత్యేకమైందనే అస్తిత్వ స్పృహ నుంచి వచ్చిందే.

దానితో పాటు ఆంధ్రులు వారు అప్పటికే మిగులు పెట్టుబడులు సమకూర్చుకోగలిగిన, వాటిని విస్తరించి వ్యాపార దృష్టి అవలంబించగలిగిన, పారిక్షిశామిక విప్లవానంతర అభివృద్ధి ఫలాల సంగతులు ఎరుకలో ఉన్న ఒక సమాజం కనుక, అప్పటికి రాచరిక, ఫ్యూడల్ సంబంధాల్లో ఉన్న, భౌగోళికంగా ‘ఒంటరి సమాజంగా ఉన్న తెలంగాణ భయపడింది. ఈ భయంలో తమ అస్తిత్వానికి వచ్చే ముప్పు ప్రధానమైంది. ఆ విధంగా ఒకరకంగా తెలంగాణ ఉద్యమం సాంస్కృతికాంశాల ప్రాధాన్యతగా ముందుకొస్తున్నదీ, ఉద్యమం పొడవునా సాంస్కృతికాంశాల వివక్షపై పోరాటంగా వెల్లడవుతున్నదీ అందుకే. అంటే తెలంగాణ ఉద్యమాన్ని ముందు ఏ అస్తిత్వ ప్రమాణాల నుంచి చూడాలి. అభివృద్ధి చెందిన ఆంధ్రా సమాజం వ్యవహారిక విజయాల (Wardly Success) పై అప్పటికే పట్టు సాధించి ఉన్నది.

వాటి లాభాలను మరిగి ఉన్నది. పెట్టుబడుల విస్తకరణ, వాటివల్ల చేజిక్కే వనరుల స్పృహ కలిగి ఉన్నది. కానీ తెలంగాణ సమాజం అప్పటికే ఏండ్ల తరబడి ఏలిన ముస్లింల సంస్కృతి, కొంత ఆరాం, దర్బారు సంస్కృతి, మానవ సంబంధాల ఉత్సవంగా, సంపాదనల కోసం బతకడం కన్నా, బతకడం కోసం సంపాదనలు అనే సంస్కృతికి చిహ్నం గా ఉన్నది. అందువల్ల సహజంగానే కోస్తాంధ్ర పెట్టుబడుల విస్తరణ, వారి జీవ న విధానాల పట్ల, భాష పట్ల, మర్యాద, మప్పితాల పట్ల, కట్టుబొట్టు పట్ల ఒకరకమైన ఏవగింపును కూడా కలిగి ఉన్నది.

ఈ భయం వల్లనే వెనుకబడిన సమాజపు ఆత్మగా తెలంగాణ విలీనాన్ని గంపగుత్తగా వ్యతిరేకించింది. తెలంగాణ అస్తిత్వాన్ని చర్చించేటప్పుడు, దాని మూలా లను, అది ఏర్పడిన తీరును, దాని ప్రతీకలను, తత్ఫలితంగా ఏర్పడిన సంస్కృతీ చిహ్నాలను పరిగణనలోకి తీసుకోకుండా మనం నిర్వచించడం కష్టం. ముస్లింల పరిపాలన, ఉర్దూ రాజభాష, ప్రభావాల ఫలితంగా ఏర్పడిన జీవన రీతులు, ప్రవర్తనలు ఒకవేపు, తెలుగు సమాజంగా, ఆంధ్రులలో సంపర్కాల ఫలితంగా అంతకు ముందరి కొద్దికాలమైనా ఉమ్మడి జీవితం వలన ఏర్పడిన అస్తిత్వ భావన మరొకటిగా అనుకున్నప్పుడు తెలంగాణది ‘ద్వంద్వ అస్తిత్వంగా’ కూడా చెప్పుకోవచ్చు. అందువల్లనే తెలంగాణ ఉద్య మం ఒక ఉమ్మడి అస్తిత్వ భావనగా, ఒకే అస్తిత్వంగా రూపొందాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ముస్లింల ప్రాధాన్యత చాలా ఎక్కువ.

ముస్లింల సంస్కృతీ, భాష మిశ్రమంగా దీన్ని చూసినప్పుడు సమభావన సంస్కృతి తెలంగాణ ప్రత్యేక లక్షణం అందువల్లే తెలంగాణ ఆకాంక్ష లు, చరిత్ర, సంస్కృతి, విశిష్టతల గురించి చర్చించినప్పుడు ముస్లింల గురించిన చర్చలేకుండా అది సంపూర్ణం కాదు. ఇలాంటి స్థితి మరే సమాజంలోనూ ఉండని ప్రత్యేక స్థితి. అందువల్ల తెలంగాణ ఉద్యమం మస్లింలను తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చెయ్యకుండా, వారి పాత్ర లేకుండా అది పాక్షిక ఉద్యమమే అవుతుంది. ఈ అవగాహన నేపథ్యంలోనే మహబూబ్‌నగర్ ఎన్ని కల అనంతరం ఇవాళ్టి మస్లింల భయాలకు సమాధానం వెతకాలి. మరీ ముఖ్యంగా మొదటి ఉద్యమం తర్వాత పదహారేళ్లుగా నడుస్తున్న ఇప్పటి తెలంగాణ ఉద్యమం నక్సల్బరీ రాజకీయాల అనంతరం నడుస్తున్నది. ఎన్నో ప్రజాస్వామీకరణ ప్రక్రియల కొనసాగింపుగా అది మెరుగ్గా ఉంటుందన్న ఆశ అందరికీ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవ్వాళ్ల ముస్లింల ప్రశ్నలను, బహుజనుల ప్రశ్నలను చూడవలసి ఉన్నది.

ఒక్క మహబూబ్‌నగర్ ఎన్నిక ఫలితాన్ని ఆసరా చేసుకుని సాగుతున్న విశ్లేషణలు పాక్షికత ప్రమాణికంగా నడుస్తున్నాయి. తెలంగాణ గడిచి వచ్చిన చారివూతక విశిష్టత, సంస్కృతీ ప్రత్యేకతలను ఈ విశ్లేషణలేవీ ప్రతిఫలించడంలేదు. కొందరికేమో తక్షణ ఆగ్రహం వల్ల కలిగిన మనస్తాపం హ్రస్వదృష్టిని ప్రసాదిస్తే, మరికొందరు ఇతర అస్తిత్వాల ముసుగులో పచ్చి తెలంగాణ వ్యతిరేకత, నడుస్తున్న ఉద్యమంపైన తీవ్ర విద్వేషం, తప్పుడు అంచనాలు, ప్రాతిపదికలేని సూత్రీకరణలను విషం కక్కేందుకు ఆయుధాలుగా మలుచుకుంటున్నారు. మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలో భారతీయ జనతాపార్టీ విజయం పరిశీలించి, తెలంగాణ సమాజం జాగ్రత్తలు తీసుకోవలసిన అంశమే. అక్కడ మైనారిటీ అభ్యర్థి లేకపోయినా, నిజామాబాద్‌లో మైనారిటీలు కొందరు ఓటు వేసి, మరికొందరు ఓటుకు దూరంగా ఉండి భారతీయ జనతాపార్టీ అభ్యర్థినీ తెలంగాణ వాదం కోసం గెలిపించకపోయినా ఇది పట్టించుకోదగిన చర్చకు తగిన అంశం కాకుండాపోయేది.

అట్లాగే భారతీయ జనతాపార్టీ పనిగట్టుకొని నిలబడి, టీఆర్‌ఎస్ అభ్యర్థి అయినప్పటికీ, టీఆర్‌ఎస్ తెలంగాణ కోసం మాత్రమే పనిచేస్తున్న రాజకీయ పార్టీ అయినప్పటికీ అభ్యర్థి మైనారిటీ అయినందుకు, కులా న్ని, మతాన్ని ఎన్నికల్లో వాడుకోకపోయినా, రజాకార్ల రాజ్యం లాంటి విద్వేష ప్రచారాన్ని బీజేపీ చేయకపోయినా మహబూబ్‌నగర్ ఎన్నిక ఫలితం ఎవరినీ ఆకర్షించకపోయ్యేది. కానీ, ఇవన్నీ జరిగినవే. అందువల్లనే తెలంగాణ ఉద్య మం ముస్లింలు, భవిష్యత్‌లో తెలంగాణ ముస్లింలను ఏరకంగా చూస్తుంది. రాజకీయ భాగస్వామిగా, అధికారం ఎట్లా పంచుకోబోతున్నది. బీజేపీ మత స్వభావం భవిష్యత్‌లో ముస్లింలను బతకనిస్తుందా? దాకా చర్చ సాగుతున్నది. కొందరు తెలంగాణ ఉద్యమాన్ని ప్రాంతీయ ఉద్యమంగా మాత్రమే చూసేవాళ్లు, మందునుంచీ వెర్రి వేదాంతంగా, పిచ్చి సిద్ధాంతంగా ప్రచారం చేస్తూ, ఏది తోస్తే దానికి ముడివేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న అన్ని శక్తులపైనా సినికల్ అంచనాలు చేస్తూ ప్రచారం చేస్తున్న వాళ్లకు ఇది ఆయుధం అయింది. అది ప్రమాదకరం.

కానీ తెలంగాణ ఉద్యమంతో పాటే ఉంటూ, ముస్లింలు మహబూబ్‌నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో, పెద్దకూర పండుగ నేపథ్యంలో అడుగుతున్న ప్రశ్నలకు తెలంగాణ ఉద్యమం సమాధానం చెప్పవలసే ఉన్నది. తెలంగాణ ఉద్యమానికి ఆ సమాధానాలు ఆటంకం కాబోవు. విడివిడి అస్తిత్వాలను పరిరక్షించుకుంటూనే ఉమ్మడి, బహుళ అస్తిత్వంగా ముందుకు వచ్చిన తెలంగాణ ఉద్యమానికి వచ్చిన ఏ సెక్షన్‌లయినా, ముస్లిం లు, దళితులు ఆడుగుతున్న ప్రశ్నలకు ఉద్యమం ఏదో రూపకంగా సమాధానా లు చెప్పాలి. తప్పదు. నిజమే తెలంగాణ సర్వ అనర్ధాలకు, సర్వసమస్యలకు పరిష్కారం కాదు. కానీ మెరుగైన సమాజాన్ని, మరింత ప్రజాస్వామీకరణను ఉద్యమంనుంచి కోరుకోవడంలో ఎలాంటి తప్పూ ఉండదు. ముస్లింలను కానీ, ఒక అస్తిత్వాలను కానీ ఉమ్మడి అస్తిత్వం సంలీనం చేసుకునేటప్పుడు పడే ఘర్షణను ఉద్యమం ఇప్పుడు అనుభవిస్తున్నది.

అందువల్ల తెలంగాణ ఉద్యమం మొత్తంగా ముస్లింల, దళితుల, ఇతర సామాజిక వర్గాల సమస్యల పై చర్చన్నా జరపగలగాలి. ప్రధాన స్రవంతి ఉద్యమంలో ఇది నిరంతరం జరగాలి. ఆవశ్యం. ఇప్పటి తక్షణ కర్తవ్యం. తెలంగాణ రావడం, ఇప్పుడు ప్రధా నం. ఎందుకంటే తెలంగాణ ఆలస్యమైన విపరిణామాలు, విషాద మరణాలు గా అనుభవిస్తున్నాం. కానీ ఈ క్రమంలో ప్రశ్నలకు సమాధానాలూ, అవగాహనలూ ముఖ్యమే. జై తెలంగాణ. 


-అల్లం నారాయ
Namasete Telangana News Paper Dated : 2012 

No comments:

Post a Comment