రాంగోపాల్ వర్మ 1993 ప్రాంతంలో ‘గాయం’ అనే పేరుతో సినిమా తీశారు. సాదా సీదా సినిమా యాక్టర్లతో తీసిన ఆ సినిమా సంచలనం అయ్యింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పదవిలో ఉన్న ముఖ్యమంవూతిని గద్దె దింపడానికి(హైదరాబాద్‌లో)మతకలహాలను రేపి ప్రయోజనాలు పొందే కథాంశంతో ఆ సిని మా తీశారు. అప్పట్లో అది సంచలనం. ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు అనుకరణగా తీసిన సినిమా అని చెప్పుకున్నా.. అది పెద్ద చర్చకు తావిచ్చింది. సమకాలీన రాజకీయ విధానాలను కళ్లకు కట్టిన చిత్రంగా ఆకట్టుకుంది.
సినిమా సంగతి ఎలా ఉన్నా.. హైదరాబాద్‌లో కూడా అలాంటి మతకలహాలకు ఎన్నింటికో సాక్షిభూతంగా నిలిచింది. 1990-92 మధ్యకాలంలో ముఖ్యమంవూతులను దించేయడం కోసం పలుమార్లు హైదరాబాద్‌లో మత కలహాలు జరిగాయి. కాంగ్రెస్‌లోని బలహీన ముఖ్యమంవూతుల కారణంగా.., ముఠాలకు నెలవైన కాంగ్రెస్‌పార్టీలోని గ్రూపులు ముఖ్యమంత్రులను దించేందుకు హైదరాబాద్ లో మతకలహాలను సాధనంగా చేసుకున్నాయి. ఇది ఇక్కడితోనే ఆగలేదు, 1980-83 ప్రాంతంలోనూ ఇదే తీరుగా మతకలహాలు చెలరేగాయి. ఇవన్నీ కాంగ్రెస్‌లోని అసమ్మతివాదుల రాజకీయాల పుణ్యమేనని అప్పటి రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఈ కాంగ్రెస్ ముఠా తగాదా లు, గ్రూపు రాజకీయాల నేపథ్యంలో ఢిల్లీ అధిష్ఠానం తీసుకున్న చర్య లు, ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ ముఖ్యమంవూతుల నియామకం తీరుతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ వ్యతిరేకత పాదుకొల్పబడింది. 1984లో ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు జరిగిన కుట్రలో కాంగ్రెస్ పాత్ర, హైదరాబాద్‌లో మతకలహాలు రాజకీయ ప్రేరేపితాలుగానే జరిగాయి.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవాడిగా.. నాకు ఆరోజుల్లో కర్ఫ్యూ అంటే.. దూరదర్శన్‌లో వచ్చే ప్రకటనగానే తెలుసు. అంతకుమించి.. కర్ఫ్యూ ఉన్నదంటే... స్కూలుకు సెలవులుగానే బోధపడేది. పాఠశాలకుపోయినా.. ఎప్పుడు ఏ సమయంలో కర్ఫ్యూ ప్రకటిస్తారో తెలియక.. దూరదర్శన్ ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉండేవాళ్లం. లేదా తరగతులు మాని స్కూల్ గ్రౌండులో ఆటలాడుకుంటూ.. కర్ఫ్యూ వార్తలకోసం గుండెలు గుప్పిట్లో పెట్టుకుని చూసేవాళ్లం. ఈ సమయంలోనే అప్పుటి మా గణితం టీచర్ ఉదంతం గుర్తు కు వస్తోంది. మతకలహాలు జరిగినప్పుడు ఆయన 20 ఏళ్ల హిందూ యువకుడు అయినందుకు గణితం చెప్పే మా మాస్టారును టెర్రరిస్టు కేసు పెట్టి జైళ్లో పడేశారు.
చాలా ఏళ్ల తర్వాత ఈ మధ్య మరోసారి హైదరాబాద్ మతకలహాలకు నెలవు అయ్యింది. విశ్వహిందు పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా నగరానికి వచ్చి పోయిన తర్వాతనే మతకలహాలు రేగాయని కొంతమంది చెప్పుకొస్తున్నారు. నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయాలను చూస్తే బలహీన ముఖ్యమంత్రి కారణంగానే, కాంగ్రెస్‌లో ని ముఠా రాజకీయాల నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. మరోసారి ప్రజాపునాదిలేని ముఖ్యమంత్రి ఉంటే.. రాష్ట్రం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒకటికి మించి బలంగా ఉన్న కాంగ్రెస్ గ్రూపులు, ఒకటి మరోదాన్ని దెబ్బతీయడం కోసం చేస్తున్న చర్యల్లో భాగంగా ఈ అస్థిరత, మతకలహాలు అని చెప్పక తప్పదు. నేతల వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ బల సమీకరణలు పోటాపోటీగా సాగుతున్నాయి. సీబీఐ దాడులతో వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటున్న నేతలు అస్థిరతకు కారణమవుతున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్, ఎంఐఎం రాజకీయ సమీకరణాల నేపథ్యం కూడా ప్రస్తుత రాజకీయ అనిశ్చితి, గందరగోళానికి కారణం.
హైదరాబాద్‌లో జరిగిన మత ఘర్షణలను కేవలం హైదరాబాద్‌కే సంబంధించినవి గా చూడరాదు. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని సంగాడ్డిలోకూడా మత ఘర్షణలు జరిగాయి. వీటన్నింటిలో కూడా ప్రయత్న పూర్వకంగా మత పరమైన పవి త్ర స్థలాలను అపవిత్రం చేశారని ప్రచారం జరిగింది. ఇరు వర్గాలూ ఇదే భావనతో.. ఉడికిపోయారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోశారు. ఇదిలాఉంటే.. ముస్లింల ప్రతినిధిగా, రక్షకునిలా చెప్పుకుంటున్న ఎంఐఎం ఈ మతఘర్షణలకు ఇటీవలి కాలంలో బీజేపీ మతవాద పార్టీ చేస్తున్న చర్యలే కారణమని అంటోంది. ఇటీవల తెలంగాణలో ముఖ్యంగా మహబూబ్‌నగర్ ఉప ఎన్నికల తర్వాత బీజేపీ గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా మత ఘర్షణలకు కారణమవుతున్నదని ఎంఐఎం ఆరోపిస్తున్నది.
తెలంగాణ సమస్యతో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తెలంగాణ ప్రాంతంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వా త మొదటిసారిగా మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ కోరుకుంటున్న పార్టీల మధ్యన పోటి ఏర్పడింది. తెలంగాణ కోరుకుంటూ ఉద్యమిస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడ్డాయి. కానీ బీజేపీ తన సర్వశక్తులను ఒడ్డి కొద్ది ఓట్ల తేడాతో మహబూబ్‌నగర్ సీటును గెలిచింది. దీంతో ముస్లిం శక్తులు, ఎంఐఎం తెలంగాణవాదం బలంగా ఉన్నదంటున్న తరుణంలో బీజేపీ గెలవడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈనేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రా ప్రాంతంలో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుందని నేను గతంలోనే చెప్పాను. తెలంగాణ ఉద్యమం తర్వాత అన్ని పార్టీలు రెండుగా చీలిపోయిన తరుణంలో, బీజేపీ సీమాంధ్ర ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని నడపడంలో విఫలమైంది. దానికి సంబంధిం చి నాయకత్వాన్ని కూడా ముందుంచలేకపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌డ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ద్వారా, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు ఎలా మేలు జరుగుతుందో వివరిస్తూ 14 పేజీల పుస్తకాన్ని విడుదల చేశారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇదే మంచి సదావకాశమని బీజేపీ ఆ బుక్‌పూట్‌లో వివరించింది. అయితే.. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో తెలంగాణ ఏర్పాటుకు ఏమేరకు మద్దతు కూడగట్టగలుగుతారనేది ఆయన నాయకత్వ ప్రతిభకు, చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది.
మహబూబ్‌నగర్ ఫలితమే రాబోయే కాలం లో తెలంగాణ భవిష్యత్తుకు సంకేతమని చెప్పడం తొందరపాటు అవుతుంది. ఒకటి మాత్రం నిజం. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి పరమ అధ్వాన్నంగా తయారైంది. పార్టీ ప్రయోజనాలు పక్కకు పెట్టిన నేతల చేష్టలు, బలసమీకరణలు, గ్రూపు రాజకీయాలతో రాష్ట్ర కాంగ్రెస్ లుకలుకలాడుతున్నది. మరోవైపు తెలంగాణపై ఎటూ తేల్చని విధానంతో చంద్రబాబు నాయుడు ఎటూ పాలుపోలేని స్థితిలో కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిల కొట్టుకుంటున్నారు. టీడీపీ మునుపెన్నడూ లేని క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒక రకంగా ఉనికికే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నది. ఇదే గాక ఎన్టీఆర్ ఫ్యామిలీ పార్టీపై ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా టీడీపీకి గొడ్డలిపెట్టుగా తయారయ్యాయి.
ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి సంక్లిష్టంగా తయారైంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు అతి ఎక్కువ సంఖ్యలో ఎంపీలను అందించిన రాష్ట్రంగా తన ప్రాభవాన్ని చూపలేకపోతోంది. నిర్ణయాలు చేయడంలో, ప్రయోజనం పొందడంలో ప్రభావాన్ని కలగజేయలేకపోతోంది. ఈ స్థితి లో బీజేపీ ఎంత మేరకు లాభపడుతుందో కాలమే తేల్చాలి. అలాగే.. యువ నాయకుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌డ్డి తనదైన రాజకీయ చతురత, పట్టుదలతో ఇరువూపాంతాల్లో పార్టీకి ప్రయోజనం, ప్రజలకు మేలు చేసే విధంగా ఏ మేరకు నిర్ణయా లు తీసుకుంటారు? అందులో విజయాలు సాధిస్తారా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న! తెలంగాణకు మద్దతుగా ఆ కార్యాచరణ మాత్రమే ఆయన రాజకీయ పనితనానికి, విజయానికి గీటురాయిగా నిలుస్తాయి.
-డాక్టర్ గౌతమ్ పింగ్లే
డైరెక్టర్ సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ అండ్ గవ్న
Namasete Telangana News Paper Dated : 1/05/2012
No comments:
Post a Comment