Tuesday, January 17, 2012

మతాంతరీకరణంతో దళితులు మోసపోలేదా ?


క్రిస్టియన్‌ మతసంస్థలు మతాంతరీక రణ ప్రక్రియలో ముందుగా లక్ష్యం చేసేది హిందు మతంలోని వివక్షాపూరి తమైన విధానాలనే. వీటివల్లే మీరు అణగారి ఉన్నారు. అంటరానితనంవంటి ఘోరమైన సాంఘిక దురన్యాయానికి గురవుతున్నారు. మా మతం లో అందరూ సమానులే మా మతం స్వీకరిం చడంవల్ల మీకు జరిగిన సామాజిక దురన్యా యం తొలగిపోతుంది. ఇదే ప్రాతి పదికపై న వారి కార్యక్ర మాలు ప్రధా నంగా సాగా యి. సాగుతున్నాయి.హిందు జీవన విధానంలోని మతానుష్ఠానాలలో చాలా లోపాలున్నాయి. ఈ లోపాలను సంస్కరించడానికి ప్రతి కాలంలోను అంటే మధ్యయుగాలే కాదు ఇంకా అంతుకుముందు నుండే చాలామంది ప్రయత్నం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇందులో ఇంకా నేటి సమాజానికి సరిపడని విషయాలు చాలా ఉన్నాయి. 

వాటి పైన కూడా చాలా ప్రజాస్వామ్యబద్ధమైన చర్చ జరుగుతూనే ఉంది. హిందూ దేవుళ్ళని తిట్టి వారిపట్ల నిరసన చూపి లేదా తీవ్రంగా విమర్శిం చిన వ్యక్తులు, సంస్థలు కూడా చాలా క్షేమంగా జీవిక సాగిస్తారు. ఆ ప్రజాస్వా మ్య వాతావరణం ఇక్కడ ఉంది. అంతే కాదు నాస్తికవాదం, నిరీశ్వరవాదం, చార్వాకం వంటి వాదాలు హిందూ మత విధానాలని తీవ్రంగా విమర్శించిన తీరు చాలాకా లం క్రితం నుండే ఉంది. ఇలాంటి తీవ్రమైన విమర్శలు ఇతర మతాల పైన చేస్తే ఏం జరుగుతుందో చాలామందికి తెలుసు. ఒక్క సల్మాన్‌ రష్దీ పరిస్థితిని ఉదాహరణగా తీసుకుంటే చాలదా. 

హిందూ జీవనవిధానాన్ని తీవ్రంగా విమర్శించి దానిలో మార్పులు తేవాలనే ప్రయత్నంలోనే వీరశైవం వచ్చింది. 11 వశతాబ్దంలోనే ఇది అత్యంత విప్లవాత్మ కమైన సామాజిక పరిణామాన్ని తీసుకురాగలిగింది. బసవేశ్వరుడు తదితరులు ఈ సామాజిక విప్లవాన్ని తీసుకురాగలిగారు. పాల్కురికి సోమన ఇటు ఈ విప్ల వాన్ని అందిపుచ్చుకొని అటు కన్నడ ప్రాంతంలోను ఇటు తెలుగు ప్రాంతం లోను ఉండి పనిచేసాడు. తన గ్రంథాలలో శైవమత ప్రాశస్త్యాన్ని వివరించి రాసాడు. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర ఇలాంటి గ్రంథాలే. ఇందులో ఉన్నది శైవభక్తుల కథలే. ఈ భక్తులందరూ అణగారిన కులాలవారే.

ఇక్కడ వీరశైవం దళితులను, కింది కులాలవారిని అందరినీ ఆకర్షించగలిగిం ది. శివభక్తుడు శివుని కన్నా గొప్పవాడు అని చెప్పింది. అంతేకాదు శివభక్తుడైన వాడు మాలవాడైనా అతను అందరికన్నా గొప్పవాడు అన్ని కులాల కన్నా గొప్ప వాడు. శివ భక్తుడు కాని వానితో స్నేహమే చేయరాదు. శివభక్తుడు కాని వానిని భర్తగా అంగీకరించక భార్య అతనిని వదిలి వేసినా పాపం కాదు. ఇలాంటి సూత్రాలు చెబుతూ వీరావేశంతో వచ్చింది ఈ మతం. దళితులను కింది కులాల వారిని అందరినీ అక్కున చేర్చుకుంది. ఇలా శివభక్తులు అయినవారిని అందరినీ జంగములు అన్నారు. కానీ ఈ పరిస్థితి ఎంతకాలం ఉంది. వంద సంవత్సరాలు, ఇంకా కొంత కాలం. మన దేశంలో ఉన్న కులం బలం ఇంతటిది. ఈ వీరశైవం లోను కులాల విభేదీకరణం క్రమంగా ప్రవేశించింది. ఈ వీరత్వం పోయింది. చివరికి ఇందులోను అన్ని కులాలు ఏర్పడి జంగముడనేది కూడా ఒక కులంగా మారిపోయింది. కులాల అసమతుల్యత సామాజిక దురన్యాయాలు తిరిగి అలా గే నిలిచి పోయాయి.

తర్వాత వచ్చిన వైష్ణవంలోను ఇదే జరిగింది. వీరవైష్ణవం వీరా వేశంతో ప్రచారం చేసే దశలో విష్ణుభక్తుడే సర్వాధికుడు అతనికి కుల భేదం లేదు అనే ప్రచారం జరిగింది. ఈ ఉద్యమంలో కూడా కింది కులాలు దళితులు అందరూ వైష్ణవులైన వారు సమాన గౌరవంపొందారు. రామానుజాచార్యులువారు సర్వ కుల సమత గురించి పాటుపడినట్లు ఈ వైష్ణవ మత ప్రచారానికి జీవితాన్ని అర్పించుకున్న అన్నమయ్య వంటి భక్తులు వాగ్గేయకారులు ఈ సర్వకుల సమత గురించి పాటుపడ్డారు. కాని ఈ వైష్ణవమతం కూడా కుల భేదాలతో నిండి పోవడానికి ఎంతోకాలం పట్టలేదు. వైష్ణవం ఫలితంగా చివరికి వైష్ణవులు, సాతా నులు, దాసులు దాసరులు అనే కులాలు అధికంగా హిందూ జీవనంలో స్థిరపడ్డా యి. ఇక్కడా మతంకన్నా కులమే బలాన్ని స్థాపించింది. 

ఆధునిక కాలంలో వచ్చిన క్రిస్టియన్‌ మతాంతరీకరణం కూడా చివరికి ఇలాగే పరిణమించింది. కుల వ్యవస్థతో సంబంధంలేని ఈ మతం కులవ్యవస్థలోని అసమ తుల్యత హీనంగా జీవించడం వంటి సమస్యలు లేని జీవితాన్ని సాంఘిక స్థితిని మా మతం కల్పిస్తుంది అని నమ్మబలికి మతాంతరీకరణం చేస్తున్న ఈ మతం పరిస్థితి చివరికి భారత దేశంలో ఎలా పరిణమించిందో తెలుసుకోవాలి. కులభేదాలను వ్యతిరేకించిన ఈ మతంలో కులభేదాల వర్గీకరణం రాలేదా. ఈ మతానికి ఆకర్షించబడి అందులోని నెట్టబడ్డవారు లేదా పోయినవారి సాంఘిక పరిస్థితి ఈ రోజు ఏమిటి. వారి సాంఘిక స్థితి ఏమైనా ఉన్నతీకరించబడిందా. కులాల అసమతుల్యత వారిలో పోయిందా. 

హిందూ మతంలో దేవుళ్లకు తాము దూరమయ్యామని లేదా తాము అపరిహార్యమైన సామాజిక వివక్షకు గురయ్యా మని క్రిస్టియానిటినీ కౌగలించుకున్న కింది కులాలవారిలోను దళితులలోను సామాజిక ఉత్థానం జరిగిందా. వారు ఈ మతంలోనికి చేరిన తర్వాత కూడా దళి తులుగా మిగిలి పోలేదా. వారు ఈ మతం వల్ల సామాజిక ఉన్నతిని పొంది ఊరు చివర ఉన్న గూడెం విడిచి గ్రామం మధ్యలోనికి రాగలిగారా. ఒక గ్రామంలో ఉన్న దళితులు ఇతర కులాల వారు క్రిస్టియన్‌ మతంలోనికి పోయినప్పుడు గ్రా మంలోను గూడేలలోను చర్చిలు ఉన్నప్పుడు అందరూ సమానంగా ఒకే చర్చి లో ప్రార్థనలు చేయగలుగుతున్నారా. 

అగ్రవర్ణాలు అని అగ్రకులాలు అని తీవ్ర విమర్శకు గురయ్యే కులాలు దళి తులను క్రిస్టియానిటీ కారణంగా సమానంగా భావించగలుగుతున్నారా. చివరికి కులాలకు అతీతమైన క్రిస్టియన్‌ మతంలో కూడా కులాలు ఏర్పడ్డాయి కదా. కమ్మ క్రిస్టియన్‌, రెడ్డి క్రిస్టియన్‌, దళిత క్రిస్టి యన్‌ ఇంకా కొన్నికులాల పేర్లతో విభేదాలతో కూడిన వర్గాలు కొత్త కులాలు ఏర్ప డినాయి కదా. ఈ వాస్తవాన్ని క్రిస్టియన్‌ సంస్థలు గుర్తించలేకపోతున్నాయా లేదా అంగీకరించలేకపోతున్నా యా. అగ్రకులాలలోని వారు క్రిస్టియన్లుగా మతాంతరీ కరణం పొందినవారు దళిత కులాల నుండి క్రిస్టియన్లుగా మారినవారిని సమానంగా గౌరవించి వారితో వివాహ సంబంధాలు కలుపుకుంటున్నారా. 

ఎక్కడైనా కొన్ని ఇటువంటి అరుదైన సంఘటనలలో కొందరు అగ్రకుల క్రిస్టియన్లు దళిత క్రిస్టియన్లను వివాహం చేసుకొని ఉండవచ్చు. కాని మొత్తం సమాజ స్థితిలో జరుగుతున్నదేమిటి. క్రిస్టి యన్‌ మతానికున్న అంతర్జాతీయ నేపథ్యం సర్వసమాన లక్షణం ఇక్కడ పనిచే యకపోగా ఇక్కడున్న కులం బలం దీని బలంకన్నా ఎక్కు వై ఇక్కడ కొత్త కులాలు ఏర్పడ్డాయే కాని దళితుల ఇంకా ఇతర అణగారిన కులాల వారి సాంఘిక హోదా ని ఏమైనా మార్చి వారికి ఉన్నత మైన సామాజిక స్థితిని క్రిస్టియన్‌ మతం ఇవ్వగ లిగిందా అని యదార్థస్థితిని విశ్లేషిస్తే అలా జరగలేదనే సమాధానం వస్తుంది. అంతే కాదు దళితులు వారికి లభించే సామాజిక వరం రిజర్వేషన్‌. వీరు మతాం తరీకరణం పొందడంవల్ల ఇటు రిజర్వేషన్‌కి కూడా దూరమయ్యారు కదా. 

కాని చాలామంది మతాంతరీకరణం పొందిన వారు ఆ విషయాన్ని దాచి రికార్డులలో హిందు మాదిగ, హిందూ మాల వగైరా లేఖనాలతో రిజర్వేషన్‌ సౌకర్యాన్ని పొం దుతున్నారనే విషయం కాదనగలిగేదేనా. కాదు. ఇందుకే కదా మతాంతరీ కరణం పొందిన దళితులకు కూడా రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించాలనే ఒక సామాజికవాదం వచ్చింది. కొన్ని రాజకీయపార్టీలు ఈ విష యాన్ని కూడా పావుగా వాడుకుంటున్నాయి. అంతేకాదు క్రిస్టియానిటీ పుచ్చుకున్న అగ్రకులాల వారుకూడా రాజకీయాలలో ప్రవేశించి పెద్ద పదవులు ఆశించిన వారు తమ పేరు హిందు పేరుగానే ఉంచుకుంటారు. అటు క్రిస్టియన్‌గా ఉంటూ కూడా క్రిస్టి యన్‌గా రాజకీయాలలో తమను చూపించుకోరు. 

కారణం అధిక సంఖ్యాకులైన హిందువుల ఓట్లు పోతాయనే భయం. ఇక్కడ మత ప్రాతిపదిక కన్నా కుల ప్రాతి పదిక గట్టిగా ఉందని తెలుసుకోవడం కష్టం కాదు.ఈ విధంగా దళితులు ఇతర బడుగు వర్గాల కులాలు మతం మార్పిడితో క్రిస్టి యన్లు కావడం వల్ల తమకు ఏ సామాజిక హోదా వస్తుందని అనుకున్నారో అది రాక శైవం, వైష్ణవం విషయంలో ఎలా జరిగిందో అలాగే హతాశులయ్యారని ఒక రకంగా మరోసారి మోసపోయారని చెప్పడానికి వీలుంది.మనుషులు చేసే దుష్కృత్యాలవల్ల సామాజిక వైరుద్ధ్యాలు, సామాజిక అసమా నతలు వచ్చాయే కాని రాళ్ళ రూపంలో ఉన్న దేవీ దేవతల వల్ల ఇది జరగలేదు. భగ వంతుడనే భావన చుట్టూ ఇంత సాహిత్యాన్ని పురాణాలను ఆచారకాండను సృష్టిం చినది మనిషే. 

అసలైన దేవుడనే భావనలో ఈ సామాజిక వివక్ష ఉండదు. ఇది అన్ని మతాలను చూచినా తెలుసుకోవచ్చు. మతంలో ఉండే విలువలు, అనుష్ఠానాలు మనం చేసే ఆరోపణలతో అంటే వాటిలో మనుషులు తెచ్చే మార్పు లు చేర్పులతో అవి మంచిగా కాని దుష్టంగా కాని తయారవుతాయి. సామాజిక వివక్ష ను కలిగించడంలో కొన్ని సామాజిక వర్గాలను అణగతొక్కడం అనేది జరిగింది ఒక్క హిందుత్వంలోనే కాదు అది క్రిస్టియానిటీలో కూడా జరిగింది. అక్కడున్న మతాధికారులు పాపకృత్యాలు చేయడం పాప పరిహారపత్రాల లాంటివి అమ్మడం చేయలేదా. అక్కడ క్రిస్టియన్‌ ఛాందసవాదం పైన తిరుగు బాట్లు జరగలేదా ప్రొటెస్టెంట్లు చేసింది ఏమిటి. ఈ సాంఘిక అసమతుల్యత వివక్ష అన్నిదేశాలలోను అన్ని జీవనవిధానాలలోను మత విధానాలలోను జరిగింది. 

ఈ సాంఘిక అసమతుల్యత ఏ మతంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించవలసిందే. దానిపైన పోరాటం చేసి అందరికీ సమామైన సామాజిక న్యాయం జరిగే ఒక వ్యవ స్థకోసం పాటుపడవలసిందే. హిందు మత విధానంలో కాలక్రమంలో ఎన్ని సంస్కరణలు వచ్చిన ఇంకా చాలా లోపాలున్నాయని వీటిని ఇంకా సంస్కరించ వలసిందేనని నమ్మి పని చేసే పెద్దలు ఇంకా ఉన్నారు. మితిమీరిన విగ్రహారాధన పెరగడం తత్త్వం వెనుక బడిపోయి అనవసరమైన తంతు ఆచారకాండ ప్రబలి పోవడం దైవాన్ని కొలవడం, దరిచేరడం మొక్కులు తీర్చడం కూడ క్రమంగా చా లా ఖరీదైన ప్రక్రియ కావడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌లో వినాయక చవితి ఎలా జరిగేదో ఇప్పుడు వినాయక చవితి ఎలా జరుగుతూ ఉందో గమనిస్తే తంతు ఎలా పెరిగిందో తత్త్వం ఎలా వెనక్కు పోతుందో చెప్పవచ్చు. బాబాలు, స్వాములోర్లు, హైటెక్‌ స్వాములు సమాజంలో ఎలా ఏ విధమైన పాత్ర పోషిస్తున్నారో సమాజం గమనిస్తూనే ఉంది. 

pulikonda subbachari
కాని హిందు మతంలో మార్పులు తనకై తానే తెచ్చుకోగలిగే అంతర్గత శక్తి ప్రజాస్వామిక నిర్మితి దానిలో ఉన్నాయి. హిందుమతం ఇవ్వలేని సామాజిక న్యా యాన్ని మా మతం ఇస్తుంది అని నమ్మబలికిన మతాలు చివరికి అవి ఏమై పోయా యో తెలుసుకోవలసిన సామాజిక పరిస్థితి ఈనాడు ఉంది. భారతీయ సామాజిక ప్రగతికి మనుషులు సమన్యాయంతో ఉండలేక పోవడానికి కులం అనే దుర్మార్గపు వ్యవస్థే కారణమన్నది ఒక తిరుగులేని వాస్తవం నిజమే కాని దీనికి ప్రత్యామ్నాయం, పరిష్కారం విదేశీ మతాలు కాదు అనేది కూడా ఈనాడు రుజువైన సత్యం. ఈ రెండు సత్యాలను గమనించి దళితులు అణగారిన అన్ని కులాల వారు వీటికి ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించుకోవలసి ఉంది. వీరు తిరుగులేని ఏకీకృత రాజకీయ శక్తిగా మారడం ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకం కావడం దీని సాధన మార్గాలలో ఒకటి
Surya News Paper Dated 18/01/2012

No comments:

Post a Comment