Wednesday, January 25, 2012

ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందాంమనకు రాజ్యాగం సిద్ధించి 62 సంవత్సరాలు పూర్తయింది. ఈ 62 సంత్సరాలలో మన రాజ్యాంగ అమలు ప్రక్రియలో చాలా వొడిదుడుకులు ఎదుర్కొనడం జరిగింది. కానీ సుమారు వంద రాజ్యాంగ సవరణలు జరిగిన తరువాత కూడా మన రాజ్యాంగ స్ఫూర్తి చెక్కు చెదరకుండా ఉందంటే ఇది ఒక అద్భుతమని చెప్పవచ్చు. రాజ్యాం గ నిర్మాతలు ఈ రాజ్యాంగాన్ని ఒక జీవనదిలా సాగాలని అభిలాషించినారు. మనకు సంక్రమించిన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, స్వతంవూతాలు చాలా వరకు సద్వినియోగం అయిన కొన్ని విషయాలలో దుర్వినియోగం జరిగిన మాట వాస్తవం. ఈ హక్కులను దుర్వినియోగం చేసినప్పుడు ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందడం లేదనే అభివూపాయం ఏర్పడుతుం ది. 62 సంవత్సరాలలో పరిణామాలను విశ్లేషిస్తే కొన్ని ముఖ్య సంఘటనలను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు.

1975లో ఎమ్జన్సీ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసిన ప్రభుత్వ, అధికార దుర్వినియోగం, మేనకాగాంధీ కేసులో 1978లో సుప్రీం కోర్టు ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులకు సంబంధించిన కీలక తీర్పు, 1980 దశకం నుంచి చాలా ప్రాచుర్యం పొందిన పిఐఎల్ (పిల్), ఇప్పుడు ప్రతి పౌరునికి ఏదో విధంగా లాభం చేస్తున్న ధర్మాసన చైతన్యం, పంచాయితీరాజ్, మున్సిపాలిటీలకు సంబంధించిన 73 మరియు 74వ సవరణలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల నేపథ్యంలో ఇచ్చిన మండల కమిషన్ తీర్పు, 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో తెచ్చిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఈ మధ్య 2002 సంవత్సరంలో ప్రాథమిక హక్కుగా చదువుకునే హక్కును గుర్తించడం మొదలైనవి దేశ విదేశాలలోని అందరి దృష్టిని ఆకర్షించాయి.

సుప్రీంకోర్టు ఈ మధ్య అనేక కీలకమైన తీర్పులు ఇచ్చింది. రాంజెఠ్మాలానీ కేసులో (2011) నల్లడబ్బు వెతికితీత విషయమై, రిలయన్స్ కేసు లో కేజీ బేసిన్‌లో లభ్యమైన సహజ వాయువు నిక్షేపాల సద్వినియోగం గురించి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రయివేటు పోలీస్ వ్యవస్థ సల్వాజుడుం రాజ్యాంగ, న్యాయ వ్యతిరేక స్వభావం గూర్చి, పోలీసుల ద్వారా జరిగే నకిలీ ఎన్‌కౌంటర్‌లో మరణాల గూర్చి గుర్తించుకోదగిన తీర్పులు ఇచ్చిం ది. సమాచార హక్కుకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం దుర్వినియోగానికి సంబంధించి ఇచ్చిన తీర్పులు కూడా ప్రధానమైనవి.

అరుణా షాన్‌బాగ్ కేసులో- పరోక్షంగా కొన్ని ప్రత్యే క పరిస్థితులో స్పక్షుహాలేకుండా కేవలం వైద్య పరికరాల ద్వారా ఇచ్చే సహాయంతోనే బతికే వారు స్వచ్ఛందంగా మరణించే హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పులను ఇవ్వడం జరిగింది. అన్నా హజారే నాయకత్వంలో జరుగుతున్న అవినీతి వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో 2జీ స్ప్రెక్టమ్, కామన్ క్రీడలు, అక్రమ మైనింగ్, అక్రమ ఆస్తుల కేసుల విషయంలో కూడా సుప్రీం కోర్టు కొన్ని కీలకమైన తీర్పులను ఇవ్వడం జరిగింది. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పారదర్శక, జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వాలు శాసించాలనే సిద్ధాంతం కొంత వరకు ఈ తీర్పుల ద్వారా నెరవేరిందని చెప్పవచ్చు.

మన రాష్ట్రంలో ఉధృతంగా నడుస్తున్న తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం చేసినదంతా రాజ్యాం గ వ్యతిరేకమనేది అందరికీ తెలిసిన విష యం. సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి స్పష్టం గా ప్రకటన చేయడం, ఈ ప్రకటనకు ముందు రాష్ట్రంలోని దాదాపు అన్ని ముఖ్యమైన రాజకీయ పార్టీలు తమ సమ్మతిని ఇవ్వడం, ప్రకటన వచ్చిన పన్నెండు గంటల లోపల ప్లేట్ ఫిరాయించడం రాజకీయ దిగజారుడు తనానికి నిలు నిదర్శనం. రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడుకు సాధ్యమైనంత వరకు తప్పుడు అర్థం వచ్చేలా గోబెల్స్ ప్రచారం చేయడం కేంద్ర ప్రభుత్వానికి, నిబద్ధతలేని రాజకీయ స్వార్థ పరులకే చెల్లింది.

ఇవి పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక చర్య లు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్య్రం, ఇతర ప్రాథమిక హక్కులు భంగపడే విధంగా ఎంతో శక్తి వంతమైన పీడి యాక్ట్ లేదా జాతీ య భద్ర త చట్టాలను దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ వ్యతిరేకమే. ఏది ఏమైనా ప్రతి పౌరుడు, రాజకీయ నాయకుడు, అధికారి, ప్రతి ఒక్క రు మన గొప్ప రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించవల్సిన అవసరం ఎంతైన ఉంది. అలా జరగని నాడు కొన్ని ఇతర దేశాల మాదిరిగా మిలటరీ పాలనలో మగ్గవలసి వస్తుంది. 
-డాక్టర్ జీబీ రెడ్డి
ఓయూ లా కాలేజీ మాజీ ప్రిన్సిప
Namasete telangana news paper dated 26/1/2012 

No comments:

Post a Comment