మీరెంతో మేమంత – మీకెంతో మాకంత
Posted By భూమిక on October 1, 2011
జె.సుభద్ర
ఆకాశంలో సగం భూమ్మీద సగం గ్లోబులో సగం పోరులో సగం. పేరుకే యీ సగాలు. భాగమనేటప్పటికి ఎక్కడినోల్లక్కడేే మూతబడ్తయి.
ప్రతోల్లు ఆకాశంలో సగం అనేది నాగరికమైన ష్యాషనైంది. అందని ఆకాశంలో సూడని సుక్కల మైదానంలో సగం అని అనడం మహిళలకు ఏమి సంతోషం? ఏమి లెక్క? మాకు లెక్కల్తో పాటు పక్కా భాగస్వామ్యాలు కావాలి. మీరెంతో మేమంత. మీకెంతో మాకంత రావాలి. ఒక సగం ప్రపంచాన్ని దాని వాటాల్ని, భాగస్వామ్యాల్ని పక్కకు బెట్టే రాజకీయాలే యింకా కొనసాగుతున్నయి. యీ పక్కకు పెట్టె పన్నాగాలు ఒక్క ఆధిపత్యా కులాల మగ ప్రపంచమే కాదు సమ న్యాయం సమాన భాగస్వామ్యం కోరుతున్న అణగారిన కులాలు కూడా వారి సమూహంలోని సగాల్ని పక్కన పెడ్తున్నరు. పంపకాల న్యాయాల్లో వారి సగాన్ని అనాచ్చం చేస్తున్న దుర్మార్గాల్ని నేటి ఉద్యమాల్లో చూస్తున్నాం.
యిపుడు నడుస్తున్న తెలంగాణ ఉద్యమంలో నాయకత్వాలు ఆధిపత్య కులాలున్నాయని రేపటి తెలంగాణలో సామాజిక న్యాయాల వాటా తేల్చాలని ఒక చర్చ జరుగుతోంది. అణగారిన కులాల నుంచి అయినా తెలంగాణ ఉద్యమ నాయకత్వంలో వున్న ఆధిపత్య కులాలకు పేనుబార్తలేదు, సీమకుడ్తలేదు. అట్లా వుండడంగూడ పెద్ద రాజకీయమే. దళిత బహుజన మేధావులు భౌగోళిక తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ కావాలి అంటున్నరు. గడిచిన అనేక ఉద్యమాల్లో సామాజిక న్యాయాలకు సంబంధించిన ఒప్పందాలు జరుగుతానే వున్నయి. అవి ఆధిపత్య కులాలకు, అణచబడిన కులాలకు మధ్య ప్రతి ఉద్యమ సందర్భంగా ఒప్పందాలు జరుగుతునే వున్నయి. విషాదమేంటంటే ఆ ఒప్పందాల్లో ఆ యిరువర్గాల్లో మహిళలు లేకపోవడం.
జాతీయోద్యమం నుంచి, ప్రత్యేకాంధ్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యమాలకు సంబంధించి 1952, 1969 ఉద్యమాల్లో ఒప్పందాలు జరుగుతూనే వున్నవి. జాతీయోద్యమంలో అంబేద్కర్ నాయకత్వంలో నిమ్నకులాలకు సమాన భాగస్వామ్య వాటాలు, సామాజిక న్యాయాల ఒప్పందం జరిగింది. కానీ హిందూగాంధీ సమాన భాగస్వామ్యాలు దళితులకా! అమ్మో! యింకేముంది వాల్లు మన నెత్తి మీద వుంటారు అట్లా జరగనీకి వీల్లేదని బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసి నిమ్నకులాలను ఓడించాడు. అటు గాంధీ వర్గాల్లో- యిటు అంబేద్కర్ వైపు జరిగిన ఒప్పందాల్లో, వైఫల్యాల్లో మహిళలు వారి ప్రాతినిధ్యాలు, భాగస్వామ్యాలు కనిపించవు- అత్యధికంగా అణచివేతకు గురైన మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలి. యీ మహిళలకు చరిత్రలో కోల్పోయిన అవకాశాలకు యుద్ధ పరిహారం కల్పించాలి. ఆంధ్ర రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరిగిన పెద్ద మనుషుల ఒప్పందాలు తర్వాత చెల్లని పైసలే అయినయి. యీ పెద్ద మనుషుల్లో దళితులు మహిళలు లేరు. మొత్తం ఉద్యమ చరిత్రలన్నింటిని చూస్తే మహిళలు గుంపు గుర్తుగా, గుంపుల ముంపుగానే మిగిలిపోయిండ్రు.
యిప్పుడు నడుస్తున్న తెలంగాణ ఉద్యమంలో గూడ మహిళల్ని పక్కన బెడ్తున్నరు. యిదివరకు భాగస్వామ్యాలకుగాక కనీసం ఉద్యమాల్లో, వూరేగింపులో ధర్నాల్లో, హర్తాల్లో, కోరస్ నినాదాలకో ముందు నిలుచో బెట్టేవారు. కాని టీవీ ఛానల్ల రాకతో మహిళల్ని వెనక్కు తోసి మగ మహానాయకులే ముందుంటుండ్రు. మమ్మల్ని రానియ్యట్లేదని ఏ మహిళ అయినా అడిగితే ‘వస్తే వద్దంటున్నమా’ అనే పడికట్టు, చేతికి మట్టంటని మాటలు మాట్లాడ్తున్నరు. కాని రానియ్యని లోతుపాతుల జెండర్ రాజకీయాల్ని చర్చ చేసే వేదికలు సమూహాలు, సందర్భాలు లేకుండా పోతున్నయి.
ఇక్కడ చెప్పొచ్చేదేమంటే సామాజిక తెలంగాణ అని , సామాజిక ఒప్పందాలు జరగాలని వాదిస్తున్న చర్చిస్తున్న దళిత బహుజన మేధావులు తెలంగాణలో సగం ప్రపంచంగా వున్న మహిళల సామాజిక న్యాయవాటాలను విస్మరిస్తున్నరు. బహుజన, దళిత సామాజిక పునాదులమీద తెలంగాణ రాష్ట్రం నిర్మాణం కావాలంటున్నారేగాని జెండర్ సమన్యాయాల గూర్చి సమవాటాల గూర్చి పల్లెత్తు మాట, పదం ఒలకడంలేదు. తెలంగాణలోని ఆధిపత్య కుల రాజకీయ పార్టీలకు ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీలకు మధ్య సామాజిక ఒప్పందాలు జరగాలనడం బాగానే వుంది. యీ కులాలకు జనాభా ప్రాతిపదికన విద్య ‘ఉద్యోగ, ఉపాధి’ రంగాల్లో దామాషా ప్రాతినిధ్యంగా వుండాలని ఒప్పందాల ప్రతిపాదనలు మహిళలక్కూడా చేయాలి అనీ, వారి జెండర్ అన్యాయాల్ని, అసమానతల్ని ఏ ఒక్క మేధావి దళిత బహుజనులనుంచి లేవనెత్తలేదు. ఎస్సీలకు యీ న్యాయాలు, ఎస్టీలకు ఫలానాన్యాయాలు, అట్లనే బీసీలకు, మైనారిటీలకు కావాలని నిర్దిష్టంగా వుండాలని గొంతు చించుకుంటున్న వాల్లు మహిళలకు కూడా సమన్యాయాలు, భాగస్వామ్యాలు కావాలని, వుండాలని ప్రతిపాదించలేదు. అట్లాంటి వాల్లను సామాజిక మేధావులని, న్యాయనిర్ణేతలని ఎట్లా లెక్క కడతారు.
ఇది అస్తిత్వాలయుగం. అన్ని అస్తిత్వాలు ఉద్యమిస్తున్న సందర్భమిది. కులం, మతం, జెండర్, ప్రాంతం వేటి అస్తిత్వాలు వాటికున్నయి. సామాజికంగా. కులం, మతం, ప్రాంతాల అస్తిత్వాల గురించి చర్చిస్తున్నవాల్లు జెండర్ అస్తిత్వాల గురించి కూడా చర్చించాల్సిన సామాజిక బాధ్యత అందరిదీ. ఒక సగం ప్రపంచం జనాభా దామాషా వాటాల్ని అవాచ్యయం చేయడం సామాజిక న్యాయాలు అనబడవు

No comments:
Post a Comment