(1940-190ల మధ్యకాలంలో భారతీయ ఆదివాసీ సముదాయాలను విస్తృత అధ్యయనం చేసిన జర్మన్ స్కాలర్ క్రిస్టాఫ్ పాన్ ఫ్యూరర్ హైమన్ డార్ఫ్ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలోని ఆదివాసులతో సహజీవనం చేశాడు. ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం దాకా విస్తరించిన ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అధ్యయనం చేశారు. ఆయన పరిశోధన, పరిశీలన నుంచి ఆదివాసీ జీవన స్థితిగతులను అనేక గ్రంథాల్లో వెలువరించారు. అందులో ‘ట్రైబ్స్ ఆఫ్ ఇండియా: ది స్ట్రగుల్ ఫర్ సర్వైవల్’ ఆధారంగా 2000 సంవత్సరంలో ‘మనుగడ కోసం పోరాటం’ పుస్తకం అనువదించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ, గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం ‘సమ్మక్క-సారలమ్మ’ జాత ర సందర్భంగా హైమన్‌డార్ఫ్ అనుభవాలను ప్రత్యేకంగా ఆయన మాటల్లోనే..)
ఆదిలాబాద్ జిల్లాలోని గోండులకుండే చాలా సమస్యలు, వరంగల్ జిల్లా పరిధిలోని కోయ ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. పరిస్థితుల్లో కొద్దిపాటి తేడాలున్నా సమస్యల సారాంశం ఒక్కటే. నిజానికి ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఒక అర్ధశతా బ్దం క్రితం వరకు ఆదివాసీ గ్రామాలు విస్తారంగా కనిపించేవి. పూర్తిగా ఆదివాసీ జనాభాతో కనిపించిన ఈ గ్రామాలన్నీంటిలోనూ కోయలు, గోండులు తదితర సమూహాలు జీవనం సాగిస్తుండేవారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోని కొండ ప్రాం తాల కారణంగా అక్కడి మైదాన ప్రాంత అభివృద్ధి చెందిన హిందూ కులాల ప్రజల నుంచి ఆదివాసీలు దూరంగా కనిపించేవారు. ఇదే పరిస్థితి కొద్దిపాటి మార్పులతో వరంగల్ జిల్లాలోని ములుగు, నర్సంపేట తాలూకాల్లోని దట్టమైన అటవీ ప్రాంతా ల్లో కనిపిస్తుంది.
అక్కడ భూములను కబ్జా చేసుకునే పేరాశ గల మైదాన ప్రాంత ప్రజల చొరబాటుకు వీలులేని విధంగా దట్టంగా అడవులు ఉండటం అక్కడి ఆదివాసీలకు వరంగా ఉండేది. దాదాపు రెండు వందల సంవత్సరాలు పాలించిన కాకతీయుల సామ్రాజ్య పతనం తరువాత ఏర్పడిన రాజకీయ సందిగ్ధం కారణంగా ఈ ప్రాంతంలోని మైదాన ప్రాంత హిందూ సముదాయాలన్నీ క్రమంగా వలస ఆ తరువాత కాలంలో ఈ ప్రాంతమంతా ఒకే రకంగా కోయల ప్రాబల్యం కింద ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా కోయ సముదాయాల ఆవాసంగానే కొనసాగుతూ వస్తున్నది. ప్రస్తుత వరంగల్ జిల్లాకు తూర్పున ఉన్న ఈ ప్రాంతంలోని ఆదివాసులూ, గోదావరి నదికి ఎడమవైపు తీర ప్రాంతంలో నివసిస్తున్నారు. గోల్కొండను ఔరంగజేబు వశం చేసుకున్న తరువాత మొఘల్ రాజ్య పరిధిలోకి ఈ రెండు జిల్లాలు (ఆదిలాబాద్, వరంగల్) వచ్చాయి. ఆ ఆక్రమణ ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసుల జీవితాలను ఛిద్రం చేయలేదు. మొఘల్ పాలన ఆదిలాబాద్‌లోని గోండుల జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపి, వారి జీవితాల్లో తీవ్ర పరిణామాలకు కారణమయింది.
కానీ అదే మొఘల్ పాలన వరంగల్ జిల్లాలోని కోయల జీవితాలపై ప్రభావాన్ని చూపలేదు. 1724 తరువాత వరంగల్ నిజాం సంస్థాన పరిధిలోకి వచ్చినప్పటికీ నిజాం పాలనలోని చివరి అర్ధశతాబ్దంలోనే ములుగు, నర్సంపేట తాలూకాలోని అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వ అటవీ సంక్షేమ పథకాలు మొదలయ్యాయి. నేను మొట్టమొదటి సారి ఈ రెండు తాలూకాలను 1940లో పర్యటించాను. అప్పటికి ఇంకా తారురోడ్లు అంత విస్తారంగా లేవు. కోయలుండే ప్రాంతాలకు వెళ్లాలంటే కాలి నడక లేదా ఎడ్లబండి తప్ప మరో సదుపాయమే లేదు. ఆ అడవుల్లోని ఆదివాసీ భూమి హిందూ, ముస్లిం మతాలకు చెందిన ఆదివాసీయేతరుల హస్తగతం కావడం మొదలైంది. అప్పటికే పాలంపేట పరిసరాల్లోని గ్రామాల్లో నివసిస్తున్న నాయకపోండ్లకు, కోయలకు సెంటు సొంత భూమి కూడా లేదు.
వారంతా ఆదివాసీయేతరులు కబ్జా చేసిన భూ ముల్లో వ్యవసాయ కూలీలుగా, కౌలు రైతులుగా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆదివాసీ భూమిని కబ్జా చేసిన ఆదివాసీయేతరుల్లో ఎక్కువ శాతం రెడ్డి కులస్తులే. ఆదిలాబాద్ జిల్లాలో నిజాం ప్రభుత్వం చేపట్టిన ఆదివాసీ సంక్షేమ పథకాలను వరంగల్ జిల్లాలో కూడా అమలు చేశారు. 1946-1950 కాలంలో ప్రత్యేక సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు వేలాది ఎకరాలకు పట్టాలను కోయలకు, నాయక పోండ్లకు పంపిణీ చేశారు. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా నిజాం పాలనలోని ఆఖరి సంవత్సరాల్లోనే అమలయ్యాయి. ఆదిలాబాద్‌లో అమలైన కాలంతో పోల్చుకుంటే, వరంగల్‌లో ఈ పథకాలు అమలైన కాలం చాలా తక్కువని చెప్పాలి.
1960లో నేను ములుగు, నర్సంపేట తాలూకాల అటవీ ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆదివాసులకు నిజాం ఇచ్చిన పట్టా భూములన్నీ తిరిగి ఆదివాసీయేతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆదివాసీ భూముల్లోకి చొరబడిన ఆదివాసీయేతరుల్లో చాలా మంది గుంటూరు, ఇతర ఆంధ్రా జిల్లాల నుంచి వచ్చిన కమ్మకులస్తు లే. ముఖ్యంగా రోడ్డువైపున ఉండే చెల్వాయి, పస్రా లాంటి ఊళ్లలోనైతే గుంటూరు నుంచి వచ్చిన వాళ్లు ఎక్కువగా కనిపించేవారు. మొదట వీళ్లంతా చాలా ‘న్యాయసమ్మతంగానే’ ఆదివాసుల దగ్గర భూములను కొన్నారు. తరువాత ఆ ప్రాంతంలో కొంత నిలదొక్కుకోగానే ఆదివాసులను వారి భూముల నుంచి నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించేందుకు అన్ని రకాల పద్ధతులనూ ఉపయోగించారు.ఈ క్రమంలో ఎంతో మంది కోయలు అనతి కాలంలోనే భూమిలేని నిరుపేదలుగా మిగిలిపోయారు. ఈ భూములకు సంబంధించి తహసీల్దార్, పట్వారీ రికార్డుల్లో ఇంకా కోయ ‘యజమాని’ పేరే ఉన్నప్పటికీ, వాస్తవంగా అందులో సాగు చేసుకునేది గుంటూరు నుంచి వచ్చిన ఆదివాసీయేతరులే.
197లో నేను తిరిగి ములుగు వెళ్లేటప్పటికీ భూకబ్జాలు మరింత ఎక్కువయ్యా యి. ఒకప్పుడు చెల్వాయి మహా అయితే 20 కోయ కుటుంబాలున్న ఒక చిన్న ఆదివాసీ గ్రామం. కానీ ఇప్పుడది ఆదివాసీయేతరులున్న పెద్ద గ్రామం. పెద్ద డాబా ఇళ్లు, అంగళ్లు, ఒక హిందూ దేవాలయం, ఒక సినిమా హాలు చెల్వాయిలో వెలిశా యి. అప్పటికి ఉన్న 50 కుటుంబాల్లో కేవలం 15 కుటుంబాలకు మాత్రమే సొంత భూమి ఉన్నది. ఇక్కడ 1940లో చాలా మందికి ప్రభుత్వం పట్టా భూములను పంపిణీ చేసింది. అవన్నీ క్రమంగా ఆదివాసీయేతరులు కోయలకిచ్చిన అప్పుకింద జప్తు చేసుకున్నారు. నిజానికి చెల్వాయిని ప్రభుత్వం ఆదివాసీ గ్రామంగా ప్రకటించినా, అక్కడి ఆదివాసీ భూ బదిలీలను చట్ట వ్యతిరేకం చేసినా భూకబ్జాలను ఆపలేకపోయింది. ‘ఆదివాసీ భూ బదిలీ నిరోధక చట్టం’ కింద కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. అందులో మూడు కేసుల్లో ఆదివాసీలకు భూమి తిరిగి అప్పగించాలని తీర్పు కూడా వచ్చింది. ఆదివాసీయేతరులు తమ పలుకుబడిని ఉపయోగించి హైకోర్టు నుంచి ‘సే’్ట ఆర్డర్లు తెచ్చుకొని ఆ భూముల్లో సాగు చేసుకుంటున్నారు.
అడవి దట్టంగా ఉన్న ప్రాంతాల్లో లక్నవరం సరస్సు నీటిని మళ్లించి భూములను గిరిజనులు సాగులోకి తీసుకొచ్చారు. ఆ భూములన్నీ ఇప్పుడు ఆదివాసీయేతరుల హస్తగతమైపోయాయి. పస్రా చుట్టు పక్కల గ్రామాల్లో ములుగు-ఏటూరునాగారం లను కలుపుతూ వేసిన తారురోడ్డు పొడుగునా ఉన్న భూముల్లో కూడా ఇదే పరిస్థి తి. ఆదివాసీయేతరులు ఈ భూములను కబ్జా చేసుకుని స్థిరపడ్డారు. తారు రోడ్డు కు దూరంగా ఉన్న కోయ గ్రామాలు మాత్రం ఈ కబ్జాలకు గురికాలేదు. కమరం గ్రామంలోని 52 కుటుంబాలకు ఇప్పటికీ సొంత భూమి ఉంది. ఈ గ్రామ పట్వారీ ఒక కోయ. అతనికి 30 ఎకరాల దాకా సొంత భూమి ఉంది. కొన్ని భూములకు సంబంధించిన వివాదాలు మాత్రం కోయలు, ఆదివాసీయేతరుల మధ్య 197 వరకూ అపరిష్కృతంగానే ఉన్నాయి.
కోయల కింద ఉన్న 350 ఎకరాల్లో దాదాపు 150 ఎకరాలు సాగులో ఉన్నది. ఏటూరు నాగారం, ములుగు మధ్య వేసిన తారురోడ్డుకు కొన్ని మైళ్ల దూరంలో ఉన్న చిన్నబోయినపల్లి గ్రామంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఒకప్పుడు ఇది పూర్తి ఆదివాసీ గ్రామం.197 కల్లా అక్కడ పరిస్థితి తారుమారైంది. గ్రామంలో కోయలవి కేవలం 20 కుటుంబాలయి తే, దాదాపు 0 ఆదివాసీయేతర కుటుంబాలు కనిపించాయి. ఈ ఆదివాసీయేతరులంతా ఒక పదేళ్లలో నల్లగొండజిల్లాలో తమకున్న కొద్దిపాటి భూమిని అమ్మేసుకుని ఇక్కడికి వచ్చి కోయల దగ్గర్నుంచి ఎకరా 200-300 రూపాయలకు కొనుక్కున్నారు. నిజానికి 197లో ఎకరాకు మార్కెట్ విలువ 3000-5000 రూపాయలు పలికేది. కేవలం ఆరు కోయ కుటుంబాలే తమ భూమిని ఎవరికీ ఇవ్వకుండా కాపాడుకున్నాయి.
మూడు కుటుంబాలు మొత్తం భూమిని అమ్మేసుకోగా, మరో 11 కోయ కుటుంబాలు ఏదో కొద్దిపాటి భూమిని మాత్రం మిగుల్చుకుని తక్కినదంతా అమ్మేసుకున్నారు. ఇలా కోయలు తమ భూముల్లో బావులు తవ్వించుకోవ డం, చావులు, పెళ్లిల్ల ఖర్చుల కోసం, దిన కోసం ఏదో ఒక ధరకు అమ్ముకున్నారు. సాంప్రదాయ పద్ధతుల నుంచి వాణిజ్య పంటలవైపు వ్యవసాయం పరిణామం చెందిన క్రమంలో తలెత్తే పరిస్థితులను, పర్యవసానాలను ఎదుర్కోలేకపోవడమే కోయల దుస్థితికి ప్రధాన కారణం. స్థానిక అధికారులు, ప్రభుత్వం కూడా ఆదివాసీ భూ బదిలీలను నిరోధించేందుకు చేసిన చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయకపోవడం, ఒకవేళ అందుకు ప్రయత్నించినా రాజకీయ నాయకులు ఆదివాసీయేతరుల పక్షం వహించి అడ్డుకోవడం వల్ల ఆదివాసీలు పూర్తిగా చితికిపోయారు.
శివపురం, గోగుపల్లి గ్రామాల్లో మాత్రం కోయ లు తమ భూములను, ఇతర కోయ గ్రామాలతో పోల్చుకుంటే కొంత మేరకు నిలుపుకోగలిగారు. ఈ రెండు గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. పైగా ఇక్కడ ఆదివాసీయేతరులు కోయల భూమిని కబ్జా చేసిన కొన్ని కేసుల్లో కోయల పక్షం తీర్పు వచ్చి తిరిగి ఆ భూములను ఆదివాసీలకే అప్పగించారు. ఈ గ్రామాల్లో కోయలు, ఇతర ఆదివాసీయేతరులు ఇప్పు డు సహజీవనం సాగిస్తున్నారు. అప్పుడప్పుడు ఒకరి భూముల్లో మరొకరు కూలీపని చేసుకోవడానికి కూడా వెళ్తుంటారు. ఆదివాసీయేతరులు కోయ ల భూముల్లో పనిచేయడం అరుదు. ఈ పరిస్థితుల్లో భూ బదిలీ నిరోధక చట్టాన్ని అమలు చేయడంలో స్థానిక అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదివాసీయేతరులను సమర్థించే రాజకీయ నాయకులు ఆదివాసీయేతరుల ఆర్థిక పరిస్థితి కోయల ఆర్థిక పరిస్థితి కన్నా మెరుగ్గా లేదన్న వాదన ముందుకు తీసుకువస్తుంటారు. పైగా ఇద్దరి జీవితాలూ ఒకే స్థాయిలో ఉన్నప్పుడు కోయలకు మాత్రం ప్రత్యేక చట్టాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం ఎందుకని కూడా దబాయిస్తారు.
ఏటూరు నాగారం ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఇతర జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో వచ్చిన వలసలను గమనించవచ్చు. ఖమ్మం జిల్లాలోని గోదావరినదికి ఇరువైపులా ఉన్న భూ భాగాలన్నింటిలోనూ ఈ ఆక్రమణ విచ్చలవిడిగా కొనసాగింది. ఏడాదిలో కొంత కాలమే అయినప్పటికీ గోదావరి నదిలో పడవ ప్రయాణం ప్రధాన రవాణా మార్గంగా ఉండే అవకాశం ఉండటం వల్ల కూడా కొత్త వాళ్ళంతా ఆదివాసీ ప్రాంతాలకు చాలా సులభంగా వలసవచ్చే వీలుండేది. ఆదివాసీ భూ బదిలీలను నిరోధిస్తూ కేవలం చట్టం తయారు చేసి ఊర్కోవడం వల్ల కూడా కొత్తవాళ్ళంతా ఆదివాసీ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. ఆదివాసీ భూ బదిలీలను నిరోధిస్తూ కేవలం చట్టం తయారు చేస్తే సరిపోదన్న విషయం, మనకు ఆదివాసీ ప్రాంతాల్లో తిష్టవేసుకు కూర్చున్న ఆదివాసీయేతరులకు అండగా నిలిచే రాజకీయ నాయకుల పరపతిని చూస్తే అర్థమవుతుంది. అందుకే నైతిక పరమైన, ఆచరణాత్మకమైన సమర్థనను ఆదివాసులకు అందజేయడం వల్ల మాత్రమే వారికి బయటి, చొరబాటు దారులను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వగలుగుతామని అనిపిస్తున్నది.
ఏటూరు నాగారానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న కోయ గ్రామం బుట్టారం. ఈ గ్రామాన్ని సమగ్ర ఆదివాసీ అభివృద్ధి సంస్థ తన మూల క్షేత్రంగా ప్రకటించింది. ఇక్కడే ‘ఐటీడీఏ’ తన ఆదివాసీ సంక్షేమ పథకాలను అమలు చేయాలనుకున్నది. ఈ పథకంలో భాగంగానే అక్కడ కోయల కోసం 2 పక్కా ఇళ్ళను నిర్మించి ఇవ్వడంతోపాటు, మేలు రకం విత్తనాలను అందజేయడం, 25 పాడి పశువులను సగం ధరకే ఇచ్చి వ్యవసాయం విషయంలో వారికి అవసరమైన సూచనలను అందజేసేందుకు ఒక స్థానిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆదివాసీ సంక్షేమ శాఖలోని అధికారుల నిరంతర పర్యవేక్షణ, నిఘాల వల్ల ఆ ప్రాంతాల్లో ఆదివాసీయేతరుల చొరబాటును సమర్థవంతంగా ఆపగలిగారు. 197లో అక్కడ ఉండిన 32 కోయ కుటుంబాల్లో సగటున ప్రతి ఒక్కరికి రెండెకరాల మాగాణి, ఒక ఎకరా మెట్ట భూమి ఉండేది.
వాళ్ల భూముల్లో పండే పంటలతో వాళ్ల ఆహార అవసరాలు తీరకపోయినప్పటికీ వారంతా అటవీ ఫలసాయాన్ని సమీప సంతల్లో అమ్ముకోవడం, పక్క ఊర్లలో కాంట్రాక్టర్ల దగ్గర కూలీ పనిచేయడం ద్వారా వచ్చే ఆదాయంతో ఆలోటును భర్తీ చేసుకునేవారు. ప్రభుత్వం కట్టించి ఇచ్చిన పక్కా ఇళ్లను తమ ధాన్యాలను భద్ర పరచుకునేందుకు గిడ్డంగులుగా ఉపయోగించుకుని వాటి పక్కనే తమ సంప్రదాయ కోయ పద్ధతిలో పాకలు నిర్మించుకుని అందులోనే నివసించేవారు.
బుట్టారానికి నడక దూరంలో ఉన్న ఓ మోస్తరు పెద్ద గ్రామం రోహిర్. అక్కడ ప్రభుత్వ పథకాలేవీ అమలు కావ డం లేదు. ఆ లోటు అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రోహి ర్ ఆదివాసీ గ్రామంగా ప్రభుత్వం గుర్తించినా.. ఆదివాసీ గ్రామ జాబితాలో లేదు. అక్కడ 35 కోయ గడపలు, 25 నాయకపోండ్ల గడపలున్నాయి. తక్కిన 15మంది ఆదివాసీయేతరులు అంతా వలస వచ్చి స్థిరపడినవారే. దాంతో రోహిర్ ఆదివాసీయేతర గ్రామమైపోయింది. గ్రామంలోని భూమి అంతా హిందూ కులాలకు చెందిన ఆదివాసీయేతర హరిజన కులాల వారి చేతిలోనే ఉంది. కోయలు, నాయకపొండ్లలో ఒకరిద్దరికీ ఉన్న ఒకటి అరా ఎకరా భూమి తప్ప దాదాపు అందరూ ఏ భూమిలేనివారే. అక్కడే 12 కోయ కుటుంబాలు అడవిని నరికి సాగుయోగ్యంగా మలచుకుని వ్యవసాయం చేసుకున్నా ,1967లో ఆ భూములన్నీంటినీ ఆదివాసీయేతర భూస్వాములు కబ్జా చేసుకున్నారు.
ఏటూరునాగారంలో నివాసముండే ఈ భూస్వాములు భూములను చూసుకునే వెసులుబాటులేక కొన్ని పొలాలను గ్రామంలో స్ధిరపడ్డ హరిజన కుటుంబాలకు అమ్ముకున్నారు. భూస్వాములు తాము కబ్జా చేసుకున్న భూములను ఆదివాసీ గ్రామాల్లో స్ధిరపడ్డ హరిజన కుటుంబాల వారికి అమ్ముకోవడం ఆదిలాబాద్ జిల్లాలో అంతటా కనిపిస్తుంది. అడవిని సాగుయోగ్యం చేసుకోవడం ఆదివాసీలవంతు. ఆ భూముల్లో ఏ కాస్త పండినా వెంటనే బలవూపయోగంతోనో, పలుకుబడితోనో కబ్జా చేసుకోవడం భూస్వాముల వంతు అన్నట్టుంటుంది.
1940లో పూర్తిగా ఆదివాసీ గ్రామాలనదగిన చాలా గ్రామాలు వరంగల్ అడవు ల్లో దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఏ బాదరబందీలేక హాయిగా ఉండేవి. 197కల్లా ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆదివాసీయేతరుల కంట పడని కోయ గ్రామాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఎక్కడో మూలన ఒకటీ అరగా ఉన్నా అలాంటి కోయ గ్రామాలను చేరుకోవడం కూడా చాలా ప్రయాసతో కూడుకున్న పని. చాలా దూరాలు కాలినడకన, అతికష్టమైన ఎడ్లబండి మార్గాల్లో వెళితే కానీ చేరుకునే పరిస్థితి ఉండేది కాదు. వర్షాకాలంలో చేరే నీటి వల్ల ఏర్పడే కాలువలు కోయ గ్రామాలను వలసల నుంచి కాపాడే రక్షణ కవచంలాగా ఉండేవి. ఆదివాసీయేతరుల కంట పడ్డా కూడా ఆ కాలంలో మాత్రం కోయల భూములను కబ్జా చేసుకునే వీలులేదు. అయితే ఈ కాలువల మీద ఎప్పుడైతే చిన్న చిన్న వంతెనలు కట్టారో అప్పటి నుంచి వలసలు విపరీతంగా ఈ గ్రామాలకు కూడా విస్తరించాయి. ఈ వంతెనలే ఆదివాసీ సాంప్రదాయ జీవనానికి గండిలా పరిణమించాయి.
197లో నేను మూడు కోయక్షిగామాలను సందర్శించా ను. అక్కడ ఇంకా కోయల సాంప్రదాయ జీవితం తాలూకు ఆహ్లాద వాతావరణం కనిపించింది. ఈ మూడు గ్రామాల్లో కొర్సెల అనే ఊరును 1940లో చూశాను. మళ్లీ ఇప్పుడు. 1940లో అక్కడ గ్రామంలో 15 కోయ గడపలు, ఒక మాది గ కుటుంబం ఉండేవి. 197లో సహజ పెరుగుదలతో పాటు ఇతర పల్లెల్లో ఉన్న కోయలు, ఇక్కడి కోయల బంధువులూ వచ్చి స్థిరపడటం మూలానా మొత్తం కోయ కుటుంబాలు 42 అయ్యాయి. ఇటీవలే (197) సమగ్ర ఆదివాసీ అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఇక్కడ 5,35,600 రూపాయల వ్యయంతో ఒక చెరువును నిర్మించింది. ఈ చెరువు కింద దాదాపు వంద ఎకరాలు సాగులో ఉన్నది. అటవీ శాఖ రిజర్వ్ అడవిలోనుంచి వంద ఎకరాలు ఆదివాసులకు ఇస్తే వాటికి కూడా ఈ చెరువు నీరు సరిపోతుంది.
కోయల ఇళ్లన్నీ వరి భూములు, కూరగాయల తోటలకు మధ్య ఉండేవి. ఇక్కడ నివసించిన కోయలకు చొరబాటుదారుల భయం ఏ కోశాన ఉండేది కాదు. చుట్టు పక్కల ఉన్న అడవుల్లో తమకు కావాల్సిన అటవీ ఫలసాయాన్ని గడ్డలు తదితర ఆహారాన్ని అవసరమొచ్చినప్పుడల్లా పోయి తెచ్చుకునేవారు. పొలం దున్నేందుకు దాదాపు అందరూ ఎద్దులను ఉపయోగించేవారు. ఎద్దులు లేని ఒకటి రెండు కుటుంబాలు మాత్రం ఆవులతో దున్నేవారు. అక్కడ ఒక కోయ ఉపాధ్యాయుడు నడుపుతున్న ఒక ఆశ్రమ పాఠశాల కూడా ఉండేది. అందులో 65మంది విద్యార్థులుండేవారు.
ములుగు తాలూకాకు పక్కన ఉన్న నర్సంపేట తాలూకాలో కూడా కోయల పరిస్థితిలో దాదాపు ఇదే రకమైన ప్రగతి చూడవచ్చు. ఎక్కడైతే రోడ్లు పడ్డాయో ఆ ప్రాంతాల్లోని కోయల భూములన్నీ అన్యాక్షికాంతమైపోయాయి. ప్రధానంగా హిందూ అగ్రకులాలకు చెందిన వారు ఈ భూములన్నీ ఆక్రమించుకున్నారు. కొన్ని సందర్భాల్లో బంజారాలు కూడా కోయ భూములను ఆక్రమించుకున్నారు. ప్రధానంగా ఈ వలసలన్నీ కూడా 1960-70ల మధ్య కాలంలోనే విచ్చలవిడిగా జరిగా యి. ఈ వలసల తీవ్రతకు నిలువుటద్దంగా సీతనగరంలో జరిగిన మార్పులనే ఉదహరించవచ్చు. అక్కడ కూడా తక్కిన కోయ గ్రామాల్లాగే తమ పూర్వీకుపూవరో అడవిని నరికి సాగుయోగ్యం చేసుకుని వ్యవసాయం సాగించిన భూములను ఆధా రం చేసుకునే కోయలున్నారు. అయితే నిజాం కాలంలో అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తికి ఈ గ్రామం తాలూకు ‘మఖ్తా’ ఇచ్చారు.
అతను స్థానికంగా నివాసముండక పోయినా కోయలను తమ తమ భూముల్లోనే కొనసాగిస్తూ నామమావూతమైన కప్పం వసూలు చేసేవాడు. హైదరాబాద్ సంస్థానం విలీనం తరువాత, వరంగల్ జిల్లాకు చెందిన కొద్ది మంది రెడ్లు, తెలగ కులానికి చెందినవారు అబ్దుల్ అజీజ్ దగ్గర సీతనగరంలోని భూములను కొన్నారు. మూడు తరాల నుంచి సాగు చేసుకుంటున్న కోయల ను ఏ మాత్రం పట్టించుకోకుండా అబ్దుల్ అజీజ్ ఆ భూములను అమ్మాడు. అయితే కొద్ది మంది కోయలు తమ భూములను నిలబెట్టుకునేందుకు అప్పో సప్పో చేసి అబ్దుల్ అజీజ్ దగ్గరి నుంచి తిరిగి కొనుక్కున్నారు. నిజానికి అప్పటికున్న నిబంధన ప్రకారం కోయలు ఆ భూమికి ‘శిఖ్మేదారులు’. అంటే వాటాదారులు. ఆ కారణంగా ఎవ్వరికీ పైసా కూడా చెల్లించకుండానే వాళ్ళకు పట్టాలొచ్చేవి.
కానీ వాళ్లకు ఈ లొసుగులు తెలియకపోవడం, స్థానిక రెవెన్యూ అధికారులు చెప్పకపోవడం వల్ల ఉత్తి పుణ్యానికే అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాక సొంత భూములనే ఎవరి దగ్గరో కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితికి నెట్టివేయబడ్డారు. చివరికి కొంత కాలం తరువాత తమ భూములను నిలబెట్టుకునేందుకు రెడ్ల దగ్గర్నుంచి తెచ్చిన అప్పును తిరిగి చెల్లించలేకపోవడంతో భూములన్నింటినీ జప్తు చేసుకున్నారు. ఇలాంటి అనేక అన్యాయాల పర్యవసానంగా 197 కల్లా 44చోట్ల కుటుంబాలకు మొత్తం 1240 ఎకరాల భూమిలో కేవలం 53 ఎకరాలే మిగిలింది. తక్కిన భూములన్నీ 62 రెడ్డి కుటుంబాలు, 30 తెలగ కుటుంబాలు, మిగతా ఇతర ఆదివాసీయేతర కులాల వశమయ్యాయి. ఈ గ్రామం ఆదివాసీ గ్రామంగా గుర్తించబడినప్పటికీ ఇక ఇప్పుడు ఇది మఖ్తా గ్రామంగా ఉన్న కారణంగా ‘ఆదివాసీ భూ బదిలీల చట్టం’ అమలు చేసేందుకు చాలా తిరకాసులు ఎదురయ్యాయి.
పక్కనే ఉన్న చిన్న ఐలాపురంలో కోయల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. అక్కడ కూడా తాతల కాలం నుంచి వస్తున్న భూముల్లోనే సాగుచేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ సంస్థానపు ఆదివాసీ భూ నియంవూతణ చట్టం, దాదాపు అదే కాలంలో వచ్చిన ‘ఆంధ్ర భూ బదిలీ చట్టం’ అమలులోకి వచ్చిన 20 ఏళ్ల కాలంలో గొల్ల కులానికి చెందిన వాళ్లు కోయ ల భూములన్నీ ఆక్రమించుకున్నారు. 197లో కేవలం కోయ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. వారికి కూడా సగటున అర ఎకరం మాత్రమే ఉండిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఒక్క నర్సంపేట తాలూకాలోనే, అదీ తారు రోడ్లు పడని మారుమూల ప్రాంతా ల్లో మాత్రమే కోయలు తమ భూములనూ, స్వేచ్ఛనూ నిలుపుకోగలిగారు. ఖమ్మంజిల్లాలోని యెల్లనాడు తాలూకా సరిహద్దులను ఆనుకుని ఉన్న మాదాగూడెం, గంగారం లాంటి గ్రామాల్లోనయితే ఉన్న భూములన్నీ కోయలే కలిగిఉన్నారు. వారి పక్కా ఇళ్లు కూడా కోయల మెరుగైన ఆర్థిక పరిస్థితికి సూచికలుగా ఉంటాయి. ఆదివాసీయేతరుల కబ్జాలకూ ముందున్న స్వేచ్ఛ, హోదా అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పాకాల, ఎల్లనాడులను కలుపుతూ ఒక తారు రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం పథకమొకటి తయారు చేసిందట. అదే కనుక జరిగితే కోయలకు గడ్డు రోజులు దగ్గర పడినట్టే లెక్క.
ఎందుకంటే అంత వరకు ఆదివాసీయేతరులు ప్రవేశించడానికి వీలులేని ఈ ప్రాంతాలన్నీ ఒక్కసారిగా అందుబాటులోకి వస్తాయి. తారు రోడ్డు పడిన ప్రతి చోటికి ఆదివాసీయేతరులు ప్రవేశించి స్థిరపడటం మొత్తం అన్నిచోట్లా జరుగుతున్న పరిణామమే.
ఈ ఉదాహరణలన్నీ ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ గ్రామాలన్నీంటినీ నేను 1940లో మొదటిసారి, 7లో రెండవసారి సందర్శించాను. ఈ మధ్య కాలంలోఆదివాసీ భూ బదిలీ నిరోధక చట్టం, ఆదివాసీ సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఎన్ని అమలైనా ఆదివాసీ భూముల కబ్జా మాత్రం అంతకంతకు పెరిగింది. అన్యాక్షికాంతమైన ఆదివాసీ భూములను తిరిగి అప్పగించేందుకు ఆదిలాబాద్ జిల్లాలో అధికార యంత్రాంగాన్ని నియమించినప్పటికీ వీటిని ఆపలేదు. భూమిని ఆదివాసీలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఒక డిప్యూటీ కలెక్టర్‌ను నియమించింది. ములుగు నర్సంపేట తాలూకాలో డిప్యూటీ కలెక్టర్‌ను సహకరించేందుకు గాను ఒక్కొక్క తాలూకాకు ఒక్కో డిప్యూటీ తహసీల్దారునూ నియమించారు. ఇంత చేసినా అధికార గణాంకాలు మాత్రం యథేచ్ఛగా సాగిన భూ బదిలీలతో పాటు చట్టాల, అధికారుల ‘సమర్థత’ను చెప్పకేనే చెబుతున్నాయి.
ప్రస్తుతం నవంబర్ 1975 వరుకు జరిగిన పరిణామాలకు సంబంధించిన అధికార గణాంకాలు లభ్యమవుతున్నాయి. లెక్కల ప్రకారం 5,025 మంది ఆదివాసీయేతరులు అక్రమంగా 32,790 ఎకరాల ఆదివాసీ భూమిని ఆక్రమించుకున్నారు. భూ బదిలీ నియంవూతణ చట్టంలోని సెక్షన్ 3 (2)కింద దాదాపు 3,244 ఎకరాల ఆదివాసీ భూమికి సంబంధించి 1924 కేసులు నమోదయ్యాయి. 2,35 ఎకరాలకు సంబంధించిన 1,494 కేసుల్లో ఆదివాసుల పక్షం తీర్పు చెప్పినప్పటికీ, వాస్తవంలో 1,313 ఎకరాల భూమి మాత్రమే ఆదివాసీలకు తిరిగి అప్పగించబడింది. ఈ లోపాలన్నీంటికీ మూల కారణం చట్టంలో ఉన్న అస్పష్టతే. హైదరాబాద్ సంస్థా నం ఉన్న రోజుల్లో తయారైన ఆదివాసీ ప్రాంతాల నియంవూతణ చట్టం, విలీనం తరువాత వచ్చిన ఆంధ్రవూపదేశ్ (షెడ్యూలు ప్రాంతాల) భూ బదిలీ చట్టంగా రూపాంత రం చెందే క్రమంలో అందులోని చాలా విషయాలు గందరగోళంగా తయారయ్యా యి. ఈ అస్పష్టతతో పాటు అధికారుల్లో అలసత్వం అన్నింటికీ మించి రాజకీయ నాయకులు ఆదివాసీయేతరుల పక్షం వహించి, తమ పరపతి, అధికారాలతో ఆదివాసీ సంక్షేమం కోసం రూపొందించిన అన్ని చట్టాలనూ తుంగలో తొక్కారు.
(సేకరణ : నూర శ్రీనివాస్, టీన్యూస్ ప్రతినిధి-వరంగల్)
Namasete Telangana News Paper Dated 30/1/2012
No comments:
Post a Comment