Tuesday, January 24, 2012

బీసీల లెక్కలు ఎందుకు తీయరంటే .


.
కులాలవారీగా ఎవరి జనాభా ఎంత అనే అం శంపై ఇటీవల మీడియాలో చర్చ మొదలైంది. ‘మరక మంచిదే’ అని సబ్బుల కంపెనీ వారి నినాదం, తలాగా చర్చ మంచిదే అని దళితబహుజన వర్గాలు అనుకుంటున్నాయి. కాని పాలకవర్గాలైన పైకులాల వారు ఇంకొకందుకు ఈ చర్చను లేవదీశారు. ‘‘అయ్య గారు వాగులో ఉత్తినే కొట్టుకుపోరు’’ అనే సామెతలాగా చర్చ లేవదీయడంలో పాలకకులాల వారికి వారి ప్రయోజనాలు ఉన్నాయి.గత 60ఏళ్ళుగా జాతీయత, సిద్ధాంతం, ప్రజాస్వామ్యం, శ్రే యోరాజ్యం పేరుతో వల్లించిన రాజ కీయ సూత్రాన్నీ ప్రభావం కోల్పోయాయి. 

ఆ మాటలు చెప్పి ప్రజలను ఇంకా మభ్యపెట్టలేమన్న విషయం పాలక వర్గాలు, కులాల వారికి అర్ధమయ్యింది కాబట్టి, వారు ఇప్పుడు కులం కార్డును వాడదలచు కున్నారు. అందుకే ఈ చర్చను మొదలు పెట్టారు. ఇం దులో మతలబు ఉంది, ఉంటుంది. ‘ఎక్ట్స్రీమ్‌ లెఫ్ట్‌, ఎక్ట్స్రీమ్‌ రైట్‌ ’ మొదలుకొని మధ్యస్థ పార్టీలన్నీ క్రింది ప్రజలకు మాటలు చెప్పి, మోసాలు చేసిచేసి చతికిలపడ్డాయి. పాత పదజాలం, భావజా లం, నినాదాలకు కాలం చెల్లిపోయింది. అందుకే ఇన్నాళ్ళు లేదు లేదు అని చెప్పిన కులాన్ని ఈసారి ప్రాధాన్యత గల అంశంగా పీఠం ఎక్కించ దలుచుకొన్నారు. అందుకే మీడియాలో బయట ‘కులాలు వారి జనాభా’ అనే అంశాలపై చర్చ మొదలైంది.

1931లో చివరిసారి ఈ పుణ్యభూమిలో కులాలవారి జనాభా లెక్కలను తీశారు. ఆ పనిచేసింది పరాయిపాలకులు స్వతంత్య్రం వచ్చాక కులాల వారీగా జనాభా లెక్కలను ‘ససేమీరా ’ వద్దంది. వద్దనడంలో పెద్ద మతలబే ఉంది. 2011 జనాభా లెక్కలను కులా ల వారీగా తీయాలని ప్రజలనుండి ముఖ్యంగా బిసి కులాల నుం డి ఒత్తిడి వచ్చింది. మసిపూసి మారేడు కాయచేసి మొత్తం మీద కేంద్రం తప్పించుకుంది. తూతూ మంత్రంగా ప్రయత్నాలు మొద లుపెట్టింది. దానివల్ల పెద్ద ఫలితం ఏమీరాలేదు, రాదు. ప్రభుత్వం ఎలాగు కులాల వారి జనాభా వివరాల సేకరణ చేయలేదు. 

కనీ సం ఆ అంచనాలు కూడా వారివద్ద లేవు. దీన్ని సాకుగా తీసు కొని కుల సంఘాల వారు ఎవరికి వారు తమ జనాభాను ఎక్కువ చేసి చెపుతుంటారు. పాలకవర్గాలు, పోటీదారులేమో తక్కువ చేసి చెప్తారు. కుల సంఘాల వారి లెక్కలు పట్టించుకుంటే రాష్ర్ట జనా భా 20 కోట్లు దాటుతుంది. కాని రాష్ర్ట జనాభా 2001 నాటికి 7.62 కోట్లు మాత్రమే ఉంది. 7.62 కోట్లలో ఒక శాతం అంటే 7 లక్షల 62 వేల మంది ఉండాలి.రాష్ర్టంలో షెడ్యూల్డు కులాల వారు 16.19 శాతం అనగా దాదాపు కోటి ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు. షెడ్యూల్డ్‌ తెగల వారు 6.59 శాతం అనగా దాదాపు యాభైలక్షలు ఉన్నారు. వీరిద్దరిని కలపగా 22.78 శాతం అవుతుంది. 

(కోటి డెభ్బై నాలు గు లక్షలు) వీరిని మొత్తం జనాభానుండి మినహాయించగా మిగి లేది 76.22 శాతం, ఇందులో ఇతర మతాల వారిని ఎస్సీ, ఎస్ట్టీ లను మినహాయించగా హిందువులు నాలుగు కోట్ల 94 లక్షల మంది ఉంటారు. ఈ నాలుగు కోట్ల 94 లక్షలు అనగా 66.23 శాతంమందిలో కేవలం ఓసి, బిసిలే ఉంటారు. మొత్తం జనభాలో ఏ కులం వారు ఎంతశాతం ఉంటారో అంచనా వేస్తే ఏ కులం వారు ఎందరున్నారో తేలుతుంది.

ఓసిల జనాభా : రెడ్డి, వెలమ, కమ్మ, రాజు (క్షత్రియ), వైశ్య, బ్రాహ్మణ, కులీన ముస్లింలు, (ఖాన్‌, పఠాన్‌, నవాబ్‌, షేక్‌ తది తరులు), మార్వాడి, గుజరాతి, పటేల్‌ తదితర కులాల వారంద రూ కలిసి ఎందరుంటారు. విడివిడిగా కులాల వారీగా ఎవరెవరు ఎందరుంటారన్నది తేలాల్సిన విషయం. ఈ విషయాన్ని తేల్చడా నికి పాలకవర్గాలు ఎప్పుడూ ప్రయత్నించవు. నిజానికి ఇది వారం రోజుల పని. శాంపిల్‌ సర్వే ద్వారా ఇంకా త్వరగానే ఒక అంచనా వేయవచ్చు. రాష్ర్టంలో ఓసి కులాల వారందరు కలిపి 12-18 శాతం మధ్యన ఉంటారన్నది ఒక అంచనా. 

వైశ్యులు, బ్రాహ్మణు ల విషయంలో ఒక అంచనా వేయవచ్చు. వైశ్యులు రాష్ర్టంలో మూడుశాతం అనగా ఇరవై రెండు లక్షల 86 వేల మంది, బ్రాహ్మ ణులు 1.75 శాతం అనగా దాదాపు 13 లక్షలు మం ది ఉంటా రు. వైశ్య సంఘాల వారిని అడిగితే మేం దాదాపు కోటి మందిమి అనిచెప్తారు. బ్రాహ్మణ సంఘాల వా రిని అడిగితే మేం 50 లక్షల మంది మి అనిచెప్తారు. పోని బ్రాహ్మణులు రెండుశాతం అనుకొంటే 15లక్షల 24 వేలమంది ఉంటారు. ఇలా కుల సం ఘాల వారు ఎవరికి వారు వారి జనాభాను ఎక్కువచేసి చెప్పుకోవ డం పరిపాటి అయ్యింది. వెలమలు 0.045-0.70 శాతం మధ్య ఉంటా రు.3లక్షల 81వేలమంది అని అంచ నా వేయవచ్చు.

రాష్ర్ట ప్రభుత్వాలు మల్టిపర్పస్‌ హౌస్‌హోల్డ్‌ సర్వే పేరుతో కు లాల వారీ జనాభా సేకరించే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ వివరాలను అధి కారికంగా వెల్లడించే ధైర్యం ప్రభు త్వాలు చేయ లేదు. 2006 స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామపంచా యితీ ఓటర్ల జాబితా ప్రకారం బిసిల ఓట్లను లెక్కించారు. దీని ప్రకారం 22 జిల్లా పరిషత్తుల పరిధిలో మొత్తం మీద 45.49 శాతం బీసి ఓటర్లున్నారు. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ప్రకారం బీసిలు జనాభా 45 శాతం ఉందని తేల్చిచెప్పారు. అయితే ఈ లెక్కలన్నీ మసిపూసినవే.
గ్రామ పంచాయితీలకు గ్రామ జనాభా లెక్కించే అధికారాన్ని, బాధ్య తను కేంద్రం ఇటీవల అప్పగించింది. నిజానికి వీరు ఈ పనిని వారంరోజుల్లో చేయగలరు. 

ఎవరికి వారుగా గ్రామ పం చాయితీలు లెక్కలు తీసి కంప్యూటర్‌కు ఎక్కిస్తే వారం రోజుల్లో ఏ కులం వారు ఎంతమందో లెక్కలు తేలిపోతాయి. కాని ఈ పనిని పాలక వర్గాలు, ప్రభుత్వం చేయనివ్వదు, ఎందుకంటే వారి జనా భా ఎంతో తేలిపోతుంది, వృత్తి కులాల వారు ఇంతమందిమి ఉ న్నాం, మాకు ఇంత వాటా కావాలి అనే డిమాండ్‌తో ముందుకు వస్తారు. కాబట్టి పాలకులు అయోమయాన్ని సృష్టించి తప్పుడు లెక్కలతో కాలం వెళ్ళదీయాలని చూస్తారు. మండల్‌ కమీషన్‌ భా రత్‌లో ఓసిల శాతంను 18గా నిర్ణయించింది. దీనికి ఎస్సీ, ఎస్ట్టీల జనాభా 30శాతంను కలిపి 48 శాతం జనభాను మినహా యిం చి మిగతా వారిని బీసిలుగా గుర్తిస్తూ వీరు 52 శాతం అని లెక్క తేల్చింది.

1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ర్టంలో ఎస్సీ, ఎస్ట్టీ, హిందుయేతరులు కలిపి 29.09 శాతం అని లెక్కించారు. ఇలాం టి గణాంకాల ఆధారంగా రాష్ర్టంలో బీసీల జనాభా 52 శాతం అని పలు వురు తేల్చారు. ఇతరులు కొందరు కాదు కాదు బీసిలు 48.32 శాతం అని అంటున్నారు. ఇంకొందరు 45.49శాతం అని అన్నారు. మరి కొందరు 44.29 శాతం అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా రాష్ర్టం లో బీసి జనాభా 45-52 శాతం మ ధ్యన ఉందని అత్యధికులు ఒప్పు కుంటున్నారు.
ఓసీలు రాష్ర్టంలో 24 శాతం అని చెబుతారు. తెలంగాణలో 15 శా తం, ఉత్తరాంధ్రలో 18 శాతం, ఆం ధ్ర ప్రాంతంలో 37శాతం, సీమలో 27శాతం అని వివరిస్తారు. 

ఈశాతా లు కూడా ఎక్కువ చేసి చెప్తున్నవే. ఓసీలు అందరూ కలిపితే 15 - 16.23 శాతం అనుకొన్నా ఎక్కువే. ఎందుకంటే వలసలు, కులాంతర వివాహాలు, కుటుంబ నియంత్రణ లు, లింగ నిర్ధారణానంతర గర్భస్రా వాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. మేమిద్దరం మాకొక్కరు అనేవారు ఓసీల్లో ఎక్కువమంది ఉంటారు. గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ సౌ కర్యం వచ్చాక ఆడశిశు వులను కనని దంపతుల శాతం ఓసిల్లో ఎక్కువే. ఓసీల్లో తగ్గిన అమ్మాయిల శాతం ఈ విషయాన్ని తెలి యపరుస్తుంది. పెళ్ళిసంబంధాలు చూసే ఓసి కులాల తల్లిదం డ్రులు మా కులంలో అమ్మాయిలు తగ్గిపోయారు అని వాపోయే సంఘటనలు ఈమధ్య తరచుగా వినిపిస్తున్నాయి. పాలకవర్గాలు వారే కాబట్టి తగ్గిన ఓసీజనాభాను ఎక్కువచేసి చూపించుకోవడా నికి పలురకాల ప్రకటనలను అధికారుల ద్వారా చేయిస్తున్నా రు. తప్పుడు వివరాలను పత్రికల ద్వారా వెల్లడిస్తున్నారు.

వారి భయానికి అసలు కారణం
‘మీరు’ నిండా 15శాతం లేరు 99 శాతం అధికారం దక్కిం చుకుంటే ఎలా అని బీసి, ఎస్సీ, ఎస్ట్టీ, మైనార్టీలు నిలదీస్తారన్న భయం ఓసిల్లో ఉంది. దీనికివారు చేసే తక్షణ మాయ ఏమిటంటే బీసిల జనాభాను తక్కువ చేసి చూపించడం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ల విషయంలో పక్కా లెక్కలు ఉన్నాయి కాబట్టి వాటిని ఏమీ చేయ లేరు. అందుకే బీసిల మీద పడిపోవడం, వారిని తక్కువచేసి చూ పడం తప్ప వారికి వేరే మార్గం లేదు.

2004 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసుల ద్వారా అనధికారి కంగా రాష్ర్టంలో నియోజక వర్గాల వారిగా కులాల జనాభాను అంచనా వేయించారు. అది జిల్లాల వారీగా ఆయా నియోజకవర్గా ల్లో అభ్యర్ధుల ఎంపికకు, ఓట్లను పొందడానికి వారికి ఉపకరిం చింది. లోపాయికారీగా ఆ వివరాలు ప్రచారంలోకి కూడా తెచ్చా రు. కొన్ని కులాల అభ్యర్ధులను నిలువరించడానికి కూడా అప్పు డు వారు ఆ వివరాలను ఎక్కువ తక్కువలు చేసి ఉపకరణంగా వినియోగించుకున్నారు. ఇందుకై వారు కొన్ని లెక్కలను తప్పుగా ప్రచారంలోకి తెచ్చారు. ఆనాటి వారి యత్నాలు, ప్రకటనలు ఏ ఫలితాలను ఇచ్చాయో అందరికీ తెలిసిందే. 

నియోజకవర్గం స్థాయి రాజకీయాలు చేసే వారికి కులాల వారిగా ఓటర్ల వివరాలపై ఓ మోస్తరు అవగాహన ఉంటుంది. ఏ ది ఏమయినా ఓట్లు డబ్బాలో పడేవేళ కులం ముఖ్యాంశం అవు తుంది అన్న విషయం అందరూ ఎరిగినదే. అయితే ఈ విషయా న్ని బహిరంగంగా మాట్లాడడానికి పాలక కులాల వారు ఇష్టపడ రు. కాని లేదు లేదు అంటూనే ఈ అంశంపై అందరూ దృష్టిసారి స్తారు. చర్చను బహిరంగంగా జరగనిస్తే మరి మీ కులస్థులెంద రున్నారు అనే ప్రశ్న సంధింపబడుతుందని వారికి తె లుసు అం దుకే పాలకవర్గాలు దీనిపై లోపాయికారీగా వ్యవహరిస్తారు. 

అటు జాతీయస్థాయిలో, ఇటు రాష్ర్ట స్థాయిలో ప్రజాస్వామ్యం పేరుతో రకరకాల మాటలు చెప్పి దాదాపు 10శాతం ఉన్న పాల కవర్గాలే ఆనాటినుండి అధికారాన్ని సాంతం అను భవిస్తున్నాయి. 1951లో వారు కు లాలవారీగా చేయాల్సిన జనాభా లెక్కలను చేయకపోవడంలోనే వారి కుట్ర అర్ధం అవుతున్నది. ఈ కుట్ర ను కొనసాగిస్తూ కొత్తచర్చలు లేవదీసి మరికొంత కాలం బీసి జనాలను భ్రమల్లోపెట్టి అధికారం నెరపవచ్చని పాలకవర్గాల ఉద్దే శ్యం. క్రింది వారికి అధికారాన్ని పంచి తేనే దేశం ప్రజాస్వామ్యం అవుతుంది.సార్వభౌమత్వం గట్టిపడు తుంది. 

అమెరికాలాంటి అగ్రదేశాలకు ఉడిగంచేస్తూ భయపడుతూ, సార్వభౌ మత్వాన్ని తాకట్టు పెడుతూ బ్రతకాల్సిన దురవస్థ తప్పుతుంది. ఏయే వృత్తుల వారు ఎందరున్నారు, వారివద్ద నైపుణ్యా లు ఏమున్నాయి, వారికి ఏ వనరుతో సంబంధం ఉంది, వారివద్ద ఉన్న జ్ఞాన భాండాగారం ఎంత ఇత్యాది విషయాల అంచనా ఉంటే దేశాభివృ ద్ధిని రచించే ప్రణాళిక మరింత అర్దవంతంగా ఉంటుంది. ఇవి మానవవనరు లు అభివృద్ధికి ఎంతో మేలు చేస్తాయి. 

మతాల వారీగా జనాభా వివరాలను సేకరించిన వారికి కులా ల వారిగా నాభా వివరాలు సేకరించడానికి అభ్యంతరం దేనికో ? సెక్యులర్‌ దేశం అని చెబుతూ కులాల వారిగా జనాభా దీసిన వా రు ప్రజాస్వామ్య విలువల కోసం కులాల వారీగా ఎందుకు తీయ రు. ఒక రకంగా మతం వారిగా జనాభా లెక్కలు తీయడ మే తిరో గమన చర్య. అందులో ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పైగా ఈ దేశంలో మత మార్పిడి క్రతువు గత వెయ్యి సంవత్సరాలుగా సాగుతూనే ఉన్నది.

ఈ దేశంలో షెడ్యూల్డ్‌ కులాల వారీ జనాభాను విడిగా లెక్కిస్తు న్నారు. అలాగే గిరిజనులను విడిగా లెక్కిస్తారు. మతాల వారిగా కూడా జనాభా వివరాలు సేకరిస్తారు. ఓ.సిలను, బీసీలను మా త్రమే విడిగా లెక్కించారు. ఇక్కడే కుట్రపూరిత యోచన ఉంది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ ఎలాగూ ఉంది. చాలా సందర్భాలల్లో గడసరులు కాని ఎస్సీ, ఎస్టీ నాయకులకు ప్రధాన పార్టీలవారు టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకుంటారు. డూడూ బసవన్నలను తమ పార్టీల అభ్యర్ధులుగా గెలిపించుకుంటారు. 

చివరికి సర్పంచ్‌ స్థా యిలో కూడా వారు కీలు బొమ్మలనే కోరుకుంటారు. ఇలా ఎస్సీ, ఎస్టీలకు అధికారంలో వాటా ఇచ్చాం అని అన్పించుకుంటున్నా రు. ఈ క్రమంలో సమర్ధులైన ఎస్సీ, ఎస్టీ నాయకులు వచ్చినప్పు డు మాత్రమే వారు తమ వారికి కొంత మేలు చేయగలుగుతు న్నారు. అదీ వీలుకానప్పుడు నాయకులు వారికి వారుగా మేలు చేసుకుంటున్నారు. ఇక మిగిలింది, వదిలి వేయబడింది బీసి కులాల వారే. ఇప్పుడు ఒ.సీ.లు అనే అనేవారు అనుభవిస్తున్న దంతా బీసిలకు దక్కాల్సిన స్థానాలే, బీసీలకు దక్కాల్సిన అధికారమే. 

durgam
ఓసీల జనాభా పెరుగుదల బీసీ, ఎస్సీల కన్నా తక్కువ బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా 2001లో కంటే ఇప్పుడు ఎక్కువ శాతం ఉంటుంది. వీరిలో అమెరికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా వం టి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్ళేవారి సంఖ్య చాలా తక్కువ. ఢిల్లీ, బొంబాయి లాంటి నగరాలకు వలస వెళ్ళే వారి సంఖ్య కూడా చాలాతక్కువ. ఓసిల్లో ఇలా వలస వెళ్ళేవారు చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉంటారు. 1950, 60ల్లో రాష్ర్టం నుండి అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్ళి నవారు. (ముఖ్యంగా బ్రాహ్మణులు) పలువురు అక్కడే సెటిల్‌ అయ్యారు. 1980, 90ల తర్వాత వలస వెళ్ళిన రెడ్డి, వెలమ, కమ్మవారు ఎక్కువగా విదేశాల్లోనే స్థిరపడ్డారు. ఇలా దేశాంత రాలకు, రాష్ట్రాంతరాలకు వెళ్ళినవారు వెళ్లగా, కుటుంబ నియం త్రణలు పాటించగా ఓసిలు జనాభా శాతం 2011 నాటికి చెప్పుకోదగిన శాతంలో తగ్గుతుందని సూత్రీకరించవచ్చు. 


dists
Durgam Ravindar , Surya News Paper Dated 25/1/2012 

No comments:

Post a Comment